కోరంగి వైభవం
బ్రిటీషు చీకటి కోణం అట్టడుగున పడి కన్పించని కథ.!
అడుగడుగున దోపీడీ నిత్యం.! దాచేస్తే దాగని సత్యం.!!
ఒక జాతిని వేరొక జాతి, పీడించే సాంఘిక ధర్మం, ఇంకానా? ఇకపై సాగదు.!
తూర్పుగోదావరి జిల్లా కోరంగి వైభవం - నౌకానిర్మాణంపై బ్రిటన్ రాచరిక మహాదారుణ కుట్ర!!
నేను కూడా తూగో జిల్లావాడినే. చిన్నప్పటినుంచీ మాకు ఒక విషయాన్ని మీడియా మరియూ మా పెద్దవాళ్ళూ నూరిపోసారు. అదేమిటంటే, భూమి పుట్టినప్పటినుంచీ 1850 వ సంవత్సరములో కాటన్ దొర రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేంతవరకూ, మా ప్రాంత ప్రజలందరూ అడుక్కుతింటూ బ్రతికేవాళ్ళమంట. ఈ సొల్లు కథని మనస్పూర్థిగా నమ్ముతున్న మనవారికోసం నేను చెప్తూన్న వాస్తవ గాధ ఇది. నమ్మని మేధావులకోసం ఇస్తున్న పిచ్చి సలహా ఇది.
ఒక్కసారి గూగుల్ లోకి వెళ్ళి "20,000 Ships Destroyed in 1839" "20,000 షిప్స్ డిస్ట్రోయెడ్ ఇన్ 1839 సైక్లోన్" అని టైప్ చెయ్యండి.
అప్పుడు మీ ముందొక అద్భుత ప్రపంచం గోచరిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి (కొరింగ) ఓడరేవు దగ్గర 1839 లో వచ్చిన అతి భయంకరమైన 40 అడుగుల ఉప్పెనలో మరణించినవారి సంఖ్య మూడు లక్షల మంది, ధ్వంసం అయిపోయిన మరియూ కొట్టుకుపోయిన నౌకల సంఖ్య అక్షరాలా ఇరవై వేలు. యావత్ ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ ఇప్పటి తూర్పు గోదావరి జిల్లాలోనే వుండేది. కేవలం ఒక్క నౌకాశ్రయ ప్రాంతం లోనే 20 వేల నౌకలు ధ్వంసం అయ్యాయంటే, అది ఎంత పెద్ద పరిశ్రమో అర్ధం అవుతుంది.
కొంతమంది చరిత్రకారుల కథనం ప్రకారం, ధ్వంసమైన 20 వేలూ మొత్తం నౌకలు కావనీ, ఇందులో కొన్ని వేల బోట్లు కూడా వున్నాయనీ చెప్తారు. ఏది ఏమైనా సరే, 1839, అంటే సరిగ్గా కాటన్ దొర బ్యారేజ్ నిర్మించటానికి కేవలం 11 సంవత్సరాల ముందు వరకూ, తూర్పు గోదావరి ప్రాంతములో ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ వుండేది అన్న విషయములో అందరిదీ ఏకాభిప్రాయమే.
కేవలం అప్పటికి 40 సంవత్సరాల క్రితమే పురుడుపోసుకున్న లండన్ నౌకాశ్రయం లో కోరంగి నౌకల ముందు బ్రిటన్ నౌకలు దిగదుడుపుగా వుండేవి. అందుకే 1839 కోరంగి ఉప్పెనను బ్రిటన్ పండగ చేసుకుంది.
మన సొంత చరిత్ర మనకు తెలియకుండా దాచేసి, బ్రిటీషువాడు లేకపోతే భారతీయుల బతుకు కుక్క బతుకే అని చెప్పే చరిత్రకారులను మన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ తయారుచేస్తుంది.
ఎందుకంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న భారతీయ చరిత్ర పుస్తకాన్ని రచించిన నెహ్రూ, అందులో బ్రిటీషువారిని గొప్ప సాహసికులుగా, భారతీయులను సన్నాసిగాళ్ళుగా అభివర్ణిస్తాడు. భూమి పుట్టినప్పటినుంచీ భారతీయులు అనాగరీకులుగానే బ్రతికారని మనస్పూర్తిగా నమ్మే మన రాజ్యాంగకర్త అంబేడ్కర్ కూడా, ఆ కారణముతోనే రాజ్యాంగ రచనకోసం భారతీయ సంస్కృతినీ, గ్రంధాలనూ చూడనైనా చూడకుండా, నిన్న గాక మొన్న నాగరీకతను మన నుంచి నేర్చుకుని, మోసాలతో, దోపిడీలతో డబ్బు సంపాదించిన పశ్చిమ దేశాల నుంచి రాజ్యాంగ సూత్రాలను అరువు తెచ్చుకుని రాసుకున్నాం. ఎన్నో చోట్ల అంబేడ్కర్ గారు ఒక్కరే రాజ్యాంగాన్ని కూర్చుని రాసేశారు అని మనం అనుకుంటాం. రాజ్యాంగం లో ఉన్న లోపాలను చూసి స్వయంగా అంబేడ్కర్ గారే మొత్తుకుంటూ "ఈ రాజ్యాంగంలో ఎన్నో పొరపాట్లు వున్నాయి. ఈ రాజ్యాంగాన్ని తగలబెడదామని ప్రతి పాదన వస్తే అలా తగలబెట్టే వాళ్ళల్లో ముందు నేనే వుంటా అని ఆయన బహిరంగంగా చట్ట సభలో అన్నమాటల్ని నెహౄ గారు బయటకు రానివ్వలేదు. అలాగే వాటిని చట్టసభల రికార్డులో కూడా తొలగించి వుండాల్సింది.
పోనీ ఇప్పటికైనా రాజ్యాంగములో మార్పులు చేద్దామన్నా, బ్రిటీషువాడు మార్చి వ్రాసిన మన చరిత్రను తిరిగి వాస్తవాలతో వ్రాద్దామన్నా, భారతీయులమని చెప్పుకుతిరిగే మన సొంత దేశస్తులే పరమ మూర్ఖత్వంతో తిరగబడతారు. కులాలపిచ్చితో కుమ్ములాటలు మొదలు పెడతారు. బ్రిటీషువాడి హిప్నాటిక్ బానిసత్వ ట్రాన్సులోనుంచి మనం ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు బయటపడతామో ఎప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడతామో కదా?
సరే, అసలు కథలోకి వస్తే, ఆ బ్రిటీషువాడు కూడా మన కోరంగి నౌకా పరిశ్రమను చూసి మూర్చపోయి, దానిని అణగదొక్కటానికి విపరీతమైన పన్నులు విధించాడు. ఐనా మనం నిలదొక్కుకున్నాం. కానీ, విధి వక్రిస్తే మనం మాత్రం ఏమి చేయగలం? ఉప్పెనకు తలవంచాము.
ప్రపంచములోని వివిధ దేశాలవారు కోరంగి ప్రజలను తమ తమ దేశాలలో కూడా నౌకా పరిశ్రమలను స్థాపించటానికీ, గొప్ప గొప్ప నౌకలను నిర్మించటానికీ రప్పించుకొనేవారు. అలా వలస వెళ్ళిన వారిని కోరంగి వారు అని పిలిచే వారు. ఇప్పటికీ చాలా దేశాలలో తెలుగు వారిని కోరంగి వారు అనే పిలుస్తారు. ఐతే అలా వలస వెళ్ళిన వారిలో నౌకా పరిశ్రమతో ఏమాత్రం సంబంధములేని వారు కూడా చాలామంది వున్నారు.
ఈ నవంబరు 25 వ తేదీకి ఈ ప్రకృతి విలయతాండవం సంభవించి 180 సంవత్సరాలు పూర్తి అయ్యింది.
*ఆఖరి ముక్క:*
మన ఇల్లు గాలీ వానకు పడిపోతే వెంటనే కట్ఠుకుంటాం మన బతుకుల్ని నిలబెట్టుకుంటాం. అలాంటి ప్రకృతి విపత్తులు ఎంతో సహజం కనక. కానీ బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశంలొ 1839 ఉప్పెన తరువాత తిరిగి కోరంగి నౌకాశ్రయాన్ని పునర్నిర్మిద్దాం అన్న ఆలోచన చెయ్యలేదు. భారతదేశంలో ఎందరో ప్రజలు డిమాండ్ చేసినా అసలు బ్రిటీషు ప్రభుత్వం ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేదు.
ఎందుకంటే, కోరంగిలో తయారయ్యే నౌకల ముందు బ్రిటన్ లో తయారయ్యే నౌకలు నాశిరకముగా వుండేవి. గోదావరి ప్రజలకు గుప్పెడన్నం పెట్టాలనే ఒక గొప్ప ఆశయముతో బ్రిటీషువారు కాటన్ బ్యారేజుని నిర్మించారన్న కట్టుకథని మాత్రం మీడియా బాగా ప్రచారం చేసింది. ఆ కథ చెప్పడమే కాదు ఆయనకు ఒక పెద్ద విగ్రహం పెట్టి ఏకంగా తెలుగు వాళ్ళందరూ భగత్ సింగ్ నీ సుభాష చంద్రబోస్ ని మహాత్మాగాంధీని తలుచుకోకపోయినా అతన్ని బ్రిటీష్ వారి దాతృత్వాన్ని గొప్పగా చెప్పేసుకుంటాం.
సదరు, కాటన్ అనే బ్రిటీషు ఇంజనీరును దొరా అని సంబోధించకపోతే మా తూగో జిల్లా వారికి తెగ కోపం వచ్చేస్తుంది. అందుకే వారు ఈ మెస్సేజును ఫార్వార్డు చేయరేమో అన్న భయముతో నేను కూడా కాటన్ దొరా అనే సంబోధించాను. ఎంతైనా బానిస మనస్తత్వం అంత తొందరగా మారదు కదా?
Contribution by - గమనిక - ఇది నాకు ఎవరో షేర్ చేస్తే చదివాను దీనిని చదివి గూగుల్ చేశాను ఈ విషయం మీద చాలా సమాచారమే వుంది . దీనిలో సత్యం ఉంది అని నిర్ధారించుకుని నేను షేర్ చేశాను. బ్రిటీషు ప్రభుత్వం వారి అరాచకాలు అకృత్యాలు బాగా తెలిసిన వారికి ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. బ్రిటీషు వారిని అమాయకంగా సమర్ధించే వారికి తప్ప.
విచిత్రం ఏమిటంటే ప్రతి నిముషం వాళ్ళు ఈ దేశాన్ని దోపిడీ దొంగల్లా దోచేస్తూ ఎదిరించిన వాళ్ళని పరమ నిర్ధాక్షిణ్యాంగా చంపేశారన్నది మనందరికీ తెలిసిన, అసలు నిరూపించాల్సిన అవసరమేలేని పచ్చినిజం. ఇలా మన దేశాన్నే కాదు అమెరికాలోని రెడ్ ఇండియన్స్ నీ, దక్షిణాఫ్రికాలోని నల్లజాతి వారినీ... ఇలా కనిపించిన ప్రతి దేశాన్ని అడ్డంగా దోచుకునీ దోచుకునీ దోచుకునీ అంతులేనన్ని హత్యలు చేసిన ఆ బ్రిటీష్ రాచరికం అంటేనే అసహ్యం వేస్తుంది రక్త మాంసాలతో మానవత్వం వున్న ఏ మనిషికైనా.!
ఇన్ని చేసినా మన దేశంలో కొంత మంది ఆ పరమ దుర్మార్గ కిరాతక కీచక రాచరిక ప్రభుత్వాల చర్యలలో గొప్పగా వరదలై ప్రవహించేంత అద్భుతమైన మానవత్వం కూడా వున్నదని మనకు వివరిస్తూ వాళ్ళ గొప్పలు మనకు చెప్తూ వుంటారు. - మీ అభిప్రాయలను ఈ విషయంలో కానీ నా వ్యక్తీకరణలో కానీ లోపాలు ఏమైనా వుంటే వాటినీ తప్పక తెలియ చేయవచ్చు లేదా సమర్ధించనూ వచ్చు ఏది ఏమైనా బూతు పదజాలం వాడకుండా మంచి భాషలో వ్యక్తం చేయవచ్చు. - డా. గౌతమ్ కశ్యప్