Friday, 29 September 2023

 ఎడిటర్ బి. లెనిన్

వీరి పేరు ఎడిటర్ బి. లెనిన్..  పేరు చూసి ఆ కమ్యూనిష్టుడో, క్రిష్టియన్ నో అనుకోకండి.. ఈతను సినిమా రంగంలో ఎన్నో  అవార్డ్స్ తన అపార ప్రతిభకు అందుకున్నారు.. 

బి .లెనిన్ ప్రఖ్యాత దర్శకుడు A. భీమ్ సింగ్ కుమారుడు. వీళ్ళ పూర్వీకులు తొలుత రాజస్థాన్ నుండి కొంత సైన్యం తిరుమల మీద ముస్లిమ్ దండయాత్రలు జరుగుతాయని విని ఆ సమయంలో రక్షణ చేయడానికి వచ్చిన కొంతమంది రాజపుత్ర వీరుల వంశీకులు.

అలా రక్షణ చేయడానికి స్వయంగా వచ్చిన కొందరు వీరులు అలా చిత్తూరు జిల్లాలో ఉండిపోయారు.. తర్వాత వీళ్ళు కాలక్రమంలో చెన్నపట్టణములో స్థిరపడ్డారు.

భీమ్ సింగ్ లెనిన్  ఇతని పూర్తి పేరు..శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు. తనకు డబ్బూ  ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నా స్వామి వారి దర్శనం కోసం ఆయన ఓ సెలబ్రెటీ లాగా వెళ్లనే వెళ్లరు.. ఓ జతబట్టల సంచీతో, తలకు రుమాలు చుట్టుకుని చెన్నపట్టణం లో ఉన్న తన ఇంటి నుండి నడచుకుంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ బయలుదేరి వెళ్లి పోతారు.

తిండీ నీరు ఎలా అండీ అంటే అన్నీ సృష్టించిన స్వామి, ప్రకృతి ఎవరికీ ఎపుడూ ఏ కొరతా చేయరండీ అంటారాయన. నడచి వెళ్లే దారిలో ఎక్కడ ఏ చెట్టుకో కాసిన కాయో ఏవో..దారిలో ఏ అమ్మో అయ్యో ఇచ్చిన పండు,నీళ్లు పెట్టిన అన్నము మొహమాటం లేకుండా పెట్టించుకుని తినేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు.. ఎక్కడా తన ఊరు , పేరు, గొప్పలు ఏవీ ఎపుడూ చెప్పుకోరు.. 

అలా సంవత్సరం లో మూడు సార్లు తిరుమల చేరుకునే ఆయన  సామాన్యుల క్యూ లోనే  వెళ్లి స్వామి వారి దివ్యమంగళ స్వరూప దర్శనం చేసుకొని అక్కడే సత్రాల్లో తిని అక్కడే ఎక్కడో చోటు తన తుండుగుడ్డ పరచుకుని నిద్రపోతారు తప్ప ఏ హోటళ్ల కు వెళ్లరు.ఎక్కడా గదులు తీసుకుని ఉండరు. కుటుంబం తో వెళ్లరా అంటే ..స్వామి దర్శనం భక్తితో చేసుకోక ఈ సంసార లంపటాలు అక్కడ కు కూడా ఎందుకు అండీ అంటారు ఆయన.

పవిత్ర మానవ జన్మ ఎత్తినందుకు మనం కనీసం ఊర్లో ఉన్న గుడి కి వెళ్లినవుడు అయినా భక్తి శ్రద్ధలతో  వెళ్ళి దర్శనం చేసుకుని జన్మ సార్థకము చేసుకోలేమా

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...