Saturday, 16 September 2023

 ఒళ్ళు మండి వ్రాస్తున్న పోస్ట్... నన్నేం అనుకున్నా ఇంత కన్నా చేసేదేం లేదు...

***********************************************
ఎవడ్రా అసలు జగన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి... అలాగే బాబు, ఎన్.టి.ఆర్ వీళ్ళకు ముందు అసలు ఈ కులాల్లో నాయకులే లేరా...
దేశం అంతా ఒక గాలి వీస్తుంటే ఈ మంద కుల మదంతో రాష్ట్రాన్ని సగానికి పైగా క్రైస్తవమతం లోకి మార్చేశారు..
పాపం తెలిసో తెలియకో అప్పుడున్న పరిస్తితుల కారణంగా ఆర్దికంగా అణగారిన సోదరులు మతం మారారంటే అర్దం వుంది. దానిని ఆసరాగా చేసుకుని ఆ కులాలని అక్కడే ఉండే విధంగా గత 75 ఏళ్ళగా ఈ కాంగ్రెస్, కమ్యునిష్ట్ సన్నాసులు వాళ్ళని బానిసలని చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కమ్యునిష్ట్ లు, కాంగ్రెస్ అంతమయ్యింది అనుకున్న సమయంలో వాళ్ళంతా తెలుగుదేశం లో చేరారు... సరేలే మళ్ళా కాంగ్రెస్ అంతమయ్యింది అనుకునే లోగా ఈ పిల్ల‌ కాంగ్రెస్.
60:40 రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నాయి.. అసలు పేదవాడికి ఇల్లుకట్టుకునే పరిస్థితి లేదు నిజం చెప్పాలంటే.
మాయమాటలు చెప్పి ఆ కాలనీ, ఈ కాలనీ అని మభ్యపెట్టి అప్పుల్లో తోస్తారు.
ఇకపోతే మద్యం ఆంధ్రప్రదేశ్ అంతా విచ్చలవిడిగా బెల్ట్ షాప్ లు, డిజిటల్ మనీ చలామణి లేకుండా క్యాష్ ద్వారా వ్యాపారం కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దోపిడీ...
ఎదగాల్సిన యువతని, గంజాయ్, మద్యం బాట పట్టిస్తున్నారు. అసలు కొత్తగా కుర్రాళ్ళు తాగుడు మొదలయ్యేది డిసెంబర్ 31 ఎంత ప్రదానమైందో... ఈ ఎన్నికల సమయంలో అంతకు అంత మద్యం మత్తులో యువతని నాశనం చేస్తున్నారు.
ఇక బి.జె.పి విషయానికొస్తే పైన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండే కార్యకర్తల గణం వుంది కానీ... వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉండదు. ఒక కులం వాణ్ణి ఇంకో కులం వాడు చూస్తే జగన్ కోవర్టో, బాబు కోవర్టో, పవన్ కోవర్టో అనిపిస్తుంది చివరకు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోలేని దుస్తితి.
ఇక జాతీయవాదులు విషయానికొస్తే మా అంత జాతీయవాదులు లేర‌న్నట్లు ఉంటుంది వీళ్ళ ప్రవర్తన.
ఇక బి.సి లు ఇప్పుడిప్పుడే వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తున్నాయి. వాళ్ళు నాయకులైతే కాగలిగారు కానీ ఈ కులమంద క్రిందే ఉ‌డి పనిచేస్తున్నారు.
ఇక ఎస్.సి~ఎస్.టి లు వాళ్ళలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది కానీ ఈ దగుల్బాజీ రాజకీయ నాయకులు వాళ్ళని సంక్షేమ పథకాల పేరుతో బద్ధకస్తుల్ని చేస్తున్నారు. ఒకరి మీదకి ఇంకొకరిని ఈ రాకీలు ఉసిగొల్పుతున్నారు బానిసలుగానే ఉంచుతున్నారు.
మద్యలో ఈ కమ్యునిష్ట్ బఫూన్ లు ఏచూరి, నారయణ, రాఘవలు ఇలా కొంత మంది ఐటమ్ లు పేదల కోసమే అంటూ పేదవాడికి ఏమీ చేయని వందేళ్ళ చరిత్ర ఉన్న పార్టీ.
ఇంక మద్యలో తగుదునమ్మా అంటూ కొంతమంది బుడ్రాఖాన్ గాళ్ళు మా పి.వి. తెలుగువాడు, బహుబాషావేత్త, ఆర్దిక వేత్త అంటూ సొల్లు కబుర్లు, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మొదలుకొని ఇప్పటికీ ఇబ్బందులు పడే వక్ఫ్ బోర్డు వరకు అతడే కారణం.
అసలు ఇప్పుడున్న యువత ఎవర్ని ఆదర్శంగా తీసుకోవాలి... రాష్ట్రాభివృద్ది కైనా? దేశాభివృద్దికైనా?
ముఖ్యంగా పైన చెప్పిన రెండు కులాల యువత చరిత్ర చదవాలి చరిత్రలో వారి పూర్వీకుల స్థానమేంటో తెలుసుకోవాలి.
బాబు, జగన్ ల కన్నా ముందు, ఇంకా ముందుకెళ్ళి స్వాతంత్ర్య పోరాట చరిత్ర, దాన గుణం లో వారి చరిత్ర, పేదల పాలిట దేవుళ్ళగా ఎలా కీర్తింపబడ్డారు అనేది తెలుసుకోవాలి. ముస్లిం లని, బ్రిటిష్ రాజులని తరిమి కొట్టిన చరిత్ర ఈ కులాలది.
అలాంటి కులాల్లో దేశానికే వ్యతిరేకంగా మాట్లాడే నీచులుగా ఈ రాజకీయ నాయకులు యువతని పెడదోవ పట్టిస్తున్నారు.
ఇప్పుడున్న యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ క్రింద ఫోటో ల్లో ఇవ్వబడిన ఇద్దరు భరతమాత ప్రియసుతల గురించి.
ఒకరు చలసాని బలరామయ్య ప్రసాద్ గారు వారు NTR పార్టీ పెట్టే నాటికే కోళ్ళఫారమ్ బినినెస్ లో దేశం లోనే అగ్రగామిగా ఉన్నారు. వారు ఆరోజు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే మంత్రి కూడా అయ్యేవారు.
అలాగే మరొకరు జి.పుల్లారెడ్డి గారు పీచుమిటాయ్ అమ్ముకుని పైకొచ్చి ఇదే NTR పార్టీ పెట్టే సమయానికి రాష్ట్రం లోనే నెంబర్ వన్ గా ఉన్నారు. ఆ సమయంలో ఈ YSR జాడే లేదు వారు అనుకుంటే కాంగ్రెస్ లో ఆ టైమ్ లోనే మంత్రో లేక వారి నిబద్ధత కి ఇందిర గాందీ లాంటి వారు ముఖ్యమంత్రిని కూడా చేసేవారు.
కానీ వాళ్ళు అలా కావాలనుకోలేదు కేవలం ఈ దేశం, ధర్మం వీటిని కాపాడుకోవాలి ఇవే ముఖ్యం అనుకుని జీవించారు.
అలాగే పుల్లారెడ్డి గారు బ్రతికున్నంత వరకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు, అవసరం అన్నప్పుడు ఈ దేశ ఆదర్శపురుషుడు రాముడు గుడి అయోధ్య కోసం తన భార్య బంగారాన్ని కూడా తీసీయడానికి వెనుకాడని వ్యక్తి పుల్లారెడ్డి గారు.
అలాగే చలసాని బలరామయ్య గారు కూడా ఈ రాష్ట్రం లో పేద పిల్లలకి ఉచిత విద్యను అందించడానికి తన ఆస్తి మొత్తం రాసివ్వడానికి సిద్దంగా ఉన్నాడు... ఇప్పటికే కోట్లలో ఇచ్చేశారు... వారంటారు మంచి ప్రాజెక్ట్ లతో రండి ఉన్నదంతా ఇచ్చేస్తా అని.
ఈ రెండు కులాలే కాదు అనేక మంది అనేక కులాల్లో ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన గొప్పవారున్నారు వారిని కదా మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది...
ఇప్పటికైనా రెడ్లు నేను పుల్లారెడ్డి వారసుడ్ని అని సగౌరంవంగా తొడకొట్టి చెప్పాలి... ఇక కమ్మలు కూడా మేము చలసాని బలరామయ్య వారసులం అని రొమ్ము విరిచి చెప్పాలి...
సిగ్గిలేకుండా కేరింతలు కొడుతూ ఈ దగుల్బాజీ రాజకీయ నాయకుల ఎంగిలిమెతుకులకి ఆశపడి మీ జీవితాలు నాశనం చేసుకోకండి మేలుకోండి... పీచుమిటాయ్ అమ్మి వందల కోట్లు సంపాదించాడు చదువుకొని కాదు తెలివితేటలతో సంకల్పం తో... కోళ్ళ ఫారమ్ పెట్టి కోట్లలో సంపాదించారు చదువుకుని కాదు తెలివితేటలతో...
మీకు చదువుంది, వాళ్ళిచ్చిన ఆదర్శం వుంది అద్బుతాలు సాదించగలరు. మీమీద మీకు నమ్మకం ఉండాలి, ఆ పై భగవంతునిపై నమ్మకం ఉండాలి ఇక విజయం మీదే మీరే నాయకులు గొంతెత్తండి...
ఈ రెండు కుల కుంపట్ల కూకటివేళ్ళతో పెకిలించండి. కుటుంబ, వారసత్వ రాజకీయలకు చరమగీతం పాడండి లేచి నిలబడితే మనముందు నిలనడే ధైర్యం లేని పిరికిసన్నాసులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు.
ఈ తెలుగు సమాజానికి పుల్లారెడ్డి గారు అన్న అయితే చలసాని బలరామయ్య గారు తమ్ముడు...
మనం మనల్ని తెలుసుకోవాలి ఆత్మశక్తిని గుర్తించాలి. ఎవరో చంపి పడేసిన జంతువులను సింహాలు తినవు. మనం ఒక చేత సృష్టిని, ఒక చేత ప్రళయాన్ని ధరించి సాగుతాం. అందరూ కీర్తి జ్వాలలో వెలిగితే మనం చీకటిలో వెలుగుతాం. మన కళ్ళలో వైభవపుకలలుండాలి, అడుగుల్లో తుఫాను వేగాముండాలి. రాష్ట్ర సింధు ప్రవాహం ఆగదు, ఎవరెవరు అడ్డుకున్నాసరే. -జై హిందు రాష్ట. -రాజశేఖర్ నన్నపనేని.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...