భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడు, కాశ్మీర్ ముద్దు బిడ్డ పద్మవిభూషణ్ "సతీష్ ధావన్". టర్బులెన్స్, బౌండరీ లేయర్స్ రంగాల్లో అత్యున్నత స్థాయి పరిజ్ఞానం వలన ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్, పిఎస్‌ఎల్‌విలు రూపొందాయి.
ధావన్ నేతృత్వంలో ఐఐఎస్‌సి లో భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్ నిర్మాణ ఫలితమే నేడు అగ్ని, బ్రహ్మోస్...... క్షిపణులు
భారత తొలి ఉపగ్రహ వాహక నౌక ఎస్‌ఎల్‌వి అభివృద్ధి కార్యక్రమానికి 1975 లో ఎం పి జే అబ్దుల్ కలాం ని నాయకుడు గా నియమించారు.తొలి ప్రయోగం విఫలమైనప్పుడు, వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆనాటి పత్రికా సమావేశంలో పాల్గొని వైఫల్యాన్ని స్వీకరించాడు. రెండవ ప్రయోగం విజయవంతమైనపుడు ఆనాటి పత్రికా సమావేశాన్ని అబ్దుల్ కలాం చేత చేయించాడు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ఆయన పేరుతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా పేరు పెట్టారు.
No comments:
Post a Comment