Friday, 30 September 2022


*బ్రాహ్మణులుగా పూజించబడి .... ఈరోజుకీ పూజింపబడుతూ ........ యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతరులు* ..
( *వజ్రసూచికోపనిషత్తు ప్రకారం* ..)



1. *ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు*.
2. *కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు*.
3. *జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు*
4. *వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు*.
5. *వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమ పవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు*.
6. *గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు*.
7. *వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీ వశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తు న్నారు. ప్రతి పూజలోనూ హిందువుల చేత .. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందు కుంటున్నారు.*
*వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు*.
8. *అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.*
9. *మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి*.
*ఇంకా*.... ..
1. *ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు*
2. *ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)*
3. *సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు*.
*ఉన్నతవంశాలలో పుట్టిన వారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్క రించారు ... వారిలో కొందరు:*
1. *భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు*.
2. *బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు* ..
3. *రఘువంశ మూల పురుషుడైన రఘు మహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు*
4. *త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు*.
5. *విశ్వామిత్రుడు క్షత్రియుడు. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు*.
6. *నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణు పురాణం 4.1.14)*
7. *నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది ( విష్ణుపురాణం 4.1.13)*.
8. *క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశ బ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణు పురాణం 4.3.5)*.
9. *శౌనక మహర్షి కుమారులు .. 4 వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1)*.
10. *అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు*.
*వీరిలో చాలామంది .. వేదమంత్రాలు కూడా రచించినవారు ఉన్నారు*.
*హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నది కానీ, జన్మం మీద కాదు*.

Thursday, 29 September 2022

                                     దేశ వ్యాపార,పారిశ్రామిక రంగం✊






స్వదేశీ వ్యాపారుల పై ఎందుకు ఇంతలా కుల కమ్మీలు విషప్రచారం చేస్తున్నారు? స్వదేశీ వ్యాపారులను, అందులో ప్రత్యేకంగా గుజరాతీ వ్యాపారులను పనిగట్టుకుని మరీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?

2014 లో ప్రధానిగా మోడీ ఎన్నికయిన నాటి నుండి ఈ కుల కమ్మీలు ప్రధాని పై ఎన్నో రకాల ఆరోపణలు చేయడం చూసాం.. అందులో ప్రముఖంగా కార్పొరేట్ లకు మోడీ దేశాన్ని అమ్మేస్తున్నాడు అంటూ వారి అప్పులను కూడా మాఫీ చేసేసాడు అంటూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం చూస్తూనే ఉన్నాము. అయితే ఇవి ఏవో కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే అని అనుకుంటున్నారేమో .. కాదు అంత కంటే ఎక్కువ.. దేశ వ్యాపార రంగాన్ని నీరు గార్చే ప్రయత్నం లో భాగంగా ఇలా చేస్తున్నారు అనే విషయం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి.

అసలు కార్పొరేట్ వ్యాపారులు అంటే ఎవరో తెలుసుకుందాం.. ఒక వ్యక్తి ఒక చిన్న వ్యాపారాన్ని ఆరంభించి తనతో బాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పించి ఆ వ్యాపారం ద్వారా నెమ్మదిగా లాభాలను అర్జిస్తూ అలా వందల వేల మందికి ఉపాధి కల్పించేంత ఎత్తుకు ఎదిగి తన వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేస్కుంటూ వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసి తన సంస్థను స్టాక్ మార్కెట్ జాబితా లో చేర్చే స్థాయికి తీసుకొస్తే వారిని కార్పొరేట్ వ్యాపారస్తులుగా పిలుస్తారు. నిజానికి కార్పొరేట్ వ్యాపారులను ఇండస్ట్రియలిస్టులు అంటారు లేదా ఉద్యోగాల కల్పన ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పాటుని ఇస్తున్న 'ఉద్యోగపతులు' అని కూడా అంటారు.

అయితే కార్పొరేట్ వ్యాపారవేత్తల వల్ల దేశానికి ఎంత లాభం చేకూరుతుందో ప్రతీ భారతీయుడు తెలుసుకుని తీరాలి..

ఉదాహరణకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అనే కార్పొరేట్ కంపెనీని తీసుకుందాం.. నేషనల్ స్టాక్ ఎక్సచెంజ్ మరియు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో లిస్ట్ అయినా కంపెనీ ఇది.. వీరు రైతు ఉత్పత్తులను తమ సూపర్ మార్కెట్ ల ద్వారా విక్రయిస్తూ లాభాలు అర్జిస్తుంటారు. సాధారణంగా ఎవరైనా ఈ కంపెనీ ఓనర్ ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆస్థిపరుడు వంటి అంశాలనే ఆలోచిస్తారు కానీ వీరి వళ్ళ ఎంతమందికి లాభం చేకూరుతుందో ఆలోచించరు.. ఈ హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో ప్రస్తుతం 3500 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.. వీరి ఉత్పత్తులు తమ దుకాణాల ద్వారా విక్రయిస్తూ, లేదా రవాణా చేస్తూ ఇలా కూడా మరో 10,000 మంది దాకా పరోక్షంగా ఉపాధి పొందడమో లేదా లాభాలను అర్జించడమో చేస్తుంటారు. మరో వైపు రైతుల ఉత్పత్తులను వీరు కొనడం వల్ల రైతులకూ లాభం చేకూరుస్తున్నారు. అదీ కాక కార్పొరేట్ కంపెనీ లు సంపాదించే ఆదాయం నుండి సుమారు 25 నుండి 30 శాతం దేశానికి పన్నుల రూపం లో కట్టాల్సి ఉంటుంది.. ఉదాహరణకు హెరిటేజ్ సంస్థ సంవత్సర నికర ఆదాయం 1000 కోట్లు (టాక్స్ ఫైల్ చేసే ఆధారంగా) ఉంటే అందులో కనీసం 250 కోట్లు దాకా పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇలా ప్రభుత్వ ఖజానాకు డైరెక్ట్ గా పన్నులు కట్టడమే కాకుండా, ఉద్యోగులకు ఇచ్చే జీతాల ద్వారా వారికి ఉపాధి, ఉద్యోగుల ఆదాయం నుంచి ప్రభుత్వానికి కట్టే పన్నులు, ఉద్యగులకు ESI ఆరోగ్య భీమా సదుపాయం, పరోక్షంగా వేలమందికి ఉపాధి కల్పన , అంతే కాకుండా వారి వ్యాపార ఉత్పత్తులను బట్టి GST వంటి పరోక్ష వస్తు సేవల పన్నులకు కంపెనీ సేవల కారణం ప్రభుత్వ ఖజానాకు చేరడం.. ఇలా ఎన్నో రకాలుగా ఒక్క వ్యక్తి స్థాపించిన ఒక సంస్థ దేశ సమాజ శ్రేయస్సుకి ఇంతలా సహాయ పడుతుంది. ఇలా వేలమంది కార్పొరేట్ వ్యాపారస్తులు ఉన్న ఈ దేశం లో ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది, ఎంత పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నాయి, ఎంత డబ్బు దేశానికి మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతున్నాయి వంటివి ప్రముఖంగా ఆలోచించాలి మనం. ఒక పెద్ద కార్పొరేట్ వ్యాపార సంస్థ కట్టే సంవత్సరం పన్నుల ద్వారా ఏకంగా ఒక రాష్ట్రము లో లక్షల మందికి 'ప్రజా సంక్షేమ పథకానిక' ఖర్చు చేసేంత డబ్బు వస్తుంది తెలుసా? అయితే ఇవ్వన్నీ వదిలేసి అంబానీ ఇంత సంపాదించాడు, ఆదాని అంత సంపాదించాడు అని మాత్రమే ప్రచారం చేస్తూ అదేదో వారి సంపాదన అంతా దొంగ సంపాదన అనేలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కుల కుటుంబ కమ్మీ పార్టీలు.

నిజానికి అంబానీ అదానీ అంటూ నిత్య ఏడుపు స్వరాన్ని వినిపించే వారి అసలు టార్గెట్ ప్రధాని మోడీనే అనేది సుస్పష్టం. అంబానీ అదానీ లు గుజరాతీలు కావున అదే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రధానిని గుజరాతీ వ్యాపారస్థులకు లింక్ పెట్టి ఇక వారి వ్యాపార ఎదుగుదలకు ప్రధాని అండగా ఉంటున్నాడు అనే పుకార్లను సృష్టిస్తే ప్రజల్లో కార్పొరేట్ వ్యాపారస్థుల పై అలాగే ప్రధాని పై ఒక వ్యతిరేక భావన కలుగుతుంది అనేది కుల కమ్మీల ఆలోచన. 

గుజరాతీ ప్రజల్లో ప్రతీ 10 మందిలో 7గురు వ్యాపారం చేస్తారు.. గుజరాతీలు తరతరాలుగా వ్యాపారం చేయడం లో ఆరితేరిన వారు. గుజరాత్ రాష్ట్రం అరేబియా సముద్రం అంచున ఉండడంతో భారతీయ వస్తువులను గుజరాతీ వ్యాపారులు సముద్ర మార్గము ద్వారా వెళ్లి గత 6 వందల సంవత్సరాలుగా అరబ్ మరియు ఆఫ్రికా దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండడం మూలానా వాణిజ్యం, వ్యాపారం వంటి వాటి పై మంచి పట్టు వచ్చింది వారికి. వందల సంవత్సరాలుగా అతిపెద్ద ఓడరేవులు కలిగి అతిపెద్ద ఓడలు నిర్మించి అందులో ప్రయాణిస్తూ వ్యాపారాలు చేసేవారని చరిత్ర కారులు గుజరాతీల గురించి గొప్పగా రాశారు. ఇలా వ్యాపారం చేయడమనేది గుజరాతీ లకు వారసత్వంగా వచ్చిన ఒక ట్యాలెంట్ అనే చెప్పుకోవాలి అంతేకానీ అదేదో మోడీ వచ్చాక గుజరాతీలు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టారు అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం హాస్యాస్పదం.

అయితే అంబానీల రిలయన్స్ సంస్థ ఇందిరా గాంధీల సమయం లోనే కార్పొరేట్ స్థాయి కంపెనీ గా పేరు పొందింది అనేది తెలుసా?

1950ల్లో ధీరుభాయి అంబానీ తన 20 ఏళ్ల వయసు లోనే అరబ్ దేశాల్లో నివసించి అక్కడ వ్యాపార అనుభవం సంపాదించి భారత్ లో ఒక చిన్న వస్త్ర వ్యాపారం మొదలుపెట్టి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తూ అలా వచ్చిన లాభాలతో వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి కష్ట నష్టాలు అన్ని చూసి 20 ఏళ్ల తరువాత తన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ని కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లాడు. Reliance Industries అనే సంస్థ 1973లోనే రిజిష్టర్ అయ్యింది. ధీరుభాయి అంబానీ పేరుకి గుజరాతి అయినా తన వ్యాపార సామ్రాజ్యాన్ని మొదలు పెట్టింది ముంబై లోనే అలాగే అక్కడే స్థిరపడిపోయారు కూడా. అలా తండ్రి నుంచి వచ్చిన రిలయన్స్ గ్రూప్ వ్యాపార సంస్థలను ముకేశ్, అనిల్ లు పంచుకుని ఆ వ్యాపార సముదాయాలకు ఓనర్ లు గా చెలామణి అవుతూ వస్తున్నారు. మోడీ 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రి గా పదవి చేపట్టే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్క సంవత్సర నికర ఆదాయం 28,000 కోట్లు, వారు 2000-01 సంవత్సరం ప్రభుత్వానికి కట్టిన పన్నులు 4000 కోట్ల పై మాటే. ఆనాడే వారి కంపెనీ ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 15,000. 2004 సంవత్సరం లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచం లో మేటి సంస్థల జాబితా అయిన 'ఫార్చ్యూన్ 500' లో స్థానం సంపాదించింది. మరి అప్పటి మార్కెట్ కి ఈనాటికి తేడాను గమనిస్తే వారి వ్యాపారం ఎన్నో రేట్లు ఎదుగుతుంది అనేది సుస్పష్టం కదా..!! ఇప్పుడు కేవలం ముకేశ్ అంబానీ చైర్మన్ గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 2020-21 సంవత్సరం దేశానికి కట్టిన పరోక్ష పన్నులు 1,35,000+ కోట్లు. వారి సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,30,000 పైనే. వీరి వ్యాపారానికి అనుబంధంగా 10,000 చిన్న మధ్య తరహా కంపెనీ లు నడుస్తున్నాయి. ఇదంతా దేశ అభివృద్ధి లో భాగం కాదా? రిలయన్స్ సంస్థ మొదటి నుండి పెట్రోకెమికల్స్, గ్యాస్ నిక్షేపాల వెలికితీత దాని విక్రయం, రిటైల్ రంగం, టెలి కమ్యూనికేషన్స్ ఇలా విపరీతమయిన ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగాల్లో వ్యాపారం చేయడం అనేది వారికి కలిసి వచ్చింది. ఇదంతా ప్రధానిగా మోడీ ఎన్నికయ్యాకే వారు ఇంత ఆదాయాన్ని సృష్టించుకున్నారు అనేది సత్య దూరం. ప్రాకృతికంగా ఒక సంస్థ తన లక్ష్యాల వైపు కష్టించి వెళ్తూ ఉంటె దాని ప్రతిఫలం తప్పనిసరిగా అనుభవిస్తారు.

రిలయన్స్ సంస్థకు 4జి టెలికాం లైసెన్స్ వచ్చింది కాంగ్రెస్ హయాం లోనే అనేది తెలుసా? .. అలా జియో సంస్థను 2016 లో స్థాపించి దేశంలో మొదట 4జి సేవలు అందించడం వల్ల తక్కువ ధరకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ అందుబాటులోకి వచ్చింది దాని మూలంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వంటివి ఈ రోజు ఏంతో సులువుగా చేయగలుగుతున్నాం. ఇదంతా మనకు సౌకర్యంగా లేవా ఆలోచించండి? డిజిటల్ కనెక్టివిటీ అవసరాన్ని తీర్చిన సంస్థగా గుర్తించకుండా కేవలం అంబానీ అంత సంపాదించాడు, ప్రధాని మోడీ నే సహాయం చేసాడు వంటి నెగటివ్ కామెంట్ లు చేయడం నీతి మాలిన పనిగా చెప్పుకోవాలి.

మరో వైపు అదానీ.. అదానీ 1980ల్లోనే ముంబై లో ఒక చిన్న ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ లో వ్యాపార అనుభవాల్ని నేర్చుకుని తాను సొంతంగా 1988లో వాణిజ్య సంస్థను నెలకొల్పి 1994 లోనే గుజరాత్ లో షిప్పింగ్ పోర్ట్ కాంట్రాక్టు దక్కించుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పని ప్రారంభించారు. అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్ పోర్ట్ అయిన 'ముంద్రా పోర్ట్' మేనేజింగ్ అనుభవం వల్ల లాజిస్టిక్స్ రంగం లో తన కంపెనీ నేర్పరి ఆధారంగా ఈ రోజు ఎయిర్పోర్ట్ ల ఆధునీకరణ, వాటి నిర్వహణ కాంట్రాక్టులు కూడా ఓపెన్ టెండర్ ద్వారా దక్కించుకున్నాడు. దీన్ని అడ్డం పెట్టుకుని ప్రధాని ఎయిర్పోర్ట్ లను అదానీ కి అమ్మేశాడు అంటూ అర్ధంపర్ధం లేని రాతలు రాయడం ప్రారంభించారు. ఓపెన్ టెండర్ ద్వారా కాంట్రాక్టు దక్కించుకుంటే దాన్ని విక్రయించడం అంటారని కుల కమ్మీలు ప్రచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనం. ముంబై ఎయిర్ పోర్టులో జీవీకే వారి షేర్లు కొనడం ద్వారా అదానీ గ్రూప్ చేతిలోకి వచ్చింది. అయితే తాను మొదలు పెట్టిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ లో విద్యుత్ మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన వస్తువులను రవాణా చేయడం మూలాన పవర్ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు, ఇది 1996 లోనే. అలాగే వ్యవసాయ రంగానికి అనుబంధంగా నడిచే రిటైల్ రంగం లో 1999 లోనే అడుగుపెట్టాడు. అలాగే కాంగ్రెస్ పరిపాలన సమయం 2009 లోనే ఆస్ట్రేలియా లో ఒక షిప్పింగ్ పోర్ట్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. అదీ కాకుండా అదే సమయంలో 2010 లో ఆస్ట్రేలియా లో అతి పెద్ద మైనింగ్ కంపెనీ 'కార్మైఖేల్ బొగ్గు మైనింగ్' టెండర్ వేసి కాంట్రాక్టు దక్కించుకుని తన షిప్పింగ్ పోర్ట్ ద్వారా వివిధ దేశాలకు బొగ్గు ఎగుమతులు చేయడం ప్రారంభించాడు.. అక్కడ 2016 లో మైనింగ్ తవ్వకాలు పార్రంభం అయ్యి 2020 తన మైనింగ్ కంపెనీ వెలికితీసిన బొగ్గు విక్రయం ద్వారా తన సంస్థ ఆదాయం పెరగడం ప్రారంభం అయ్యింది.  ఈ రోజు అతని నికర ఆదాయం పెరగడానికి ముఖ్య కారణం ఇలా పలురకాల వ్యాపారాల్లో తలమునకలై పనిచేయడమే అంతే కానీ ప్రధాని మోడీ వచ్చాక అదానీకి ఎదో దేశ సంపదను దోచిపెట్టాడు అంటూ అందుకే అతని ఆదాయం పెరిగింది అనేది అసలు బేసిక్ సెన్స్ లేనోడు మాట్లాడే పనికిమాలిన మాటలు. ఇవే కాకుండా సిమెంట్ రంగం, పెట్రో కెమికల్స్, సోలార్ పవర్ ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు.  

ముఖ్యంగా ఏ కార్పొరేట్ సంస్థ అయినా బ్యాంకుల ద్వారా రుణాలు పొందే వ్యాపారాల్ని విస్తరించుకుంటాయి.. ఎందుకంటే విస్తరణకు అవసరమయ్యే అంత పెట్టుబడి ఒక కంపెనీ నికరంగా భరించలేదు కాబట్టి. అయితే ఇలా తన కంపెనీ ఆస్ట్రేలియా లో మైనింగ్ కోసం తీసుకున్న రుణాన్ని అడ్డుపెట్టుకుని అదాని కంపెనీ కి ప్రధాని మోదీ రుణాలు మాఫీ చేసారంటూ అలాగే వారు రుణాలను కూడా ఎగ్గొట్టారంటూ కుల కమ్మీలు చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. అదానీ గ్రూప్ కి సంబంధించిన ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు బ్యాంకులకు చెల్లించాల్సిన నెలవారీ EMI డిఫాల్ట్ అవ్వలేదు. ఆ గ్రూప్ కంపెనీ లు ఇప్పటివరకు ఆర్ధిక క్రమశిక్షణను ఎప్పుడూ తప్పలేదు.

అదానీ అత్యంత సంపన్నుల జాబితాలో ప్రస్తుతం రెండవ స్థానానికి చేరుకునే సరికి ఈ కుల కుటుంబ కమ్మీ పార్టీల ఏడుపులు రెట్టింపు అయ్యాయి. పెద్దలు చెప్పేవారు కదా మనల్ని చూసి ఏడ్చే వారే మన ఎదుగుదలకి సహాయపడుతారు అని అందుకే అదానీ ఆ స్థాయికి వెళ్లాడు.

గుజరాత్ లో ఎవరైనా సరే ఒక సక్సెస్ ఫుల్ వ్యాపారి ని చూసి వారిలా అలా అవ్వాలని కోరుకుంటారు కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎదుగుతున్న వాడిని చూసి వాడిలా మనమూ కష్టించి పైకి రావాలి అనే ఆలోచన కన్నా ఎదుగుతున్న వాడిని ఎలా కిందకు దించాలి అనే ప్రయత్నమే ఎక్కువ ఉంటుంది.. అందుకే మన వద్ద ఉన్న కార్పొరేటు వ్యాపారుల శాతం ఇతర రాష్ట్రాల వారితో పోల్చుకుంటే అతి తక్కువ ఉంటుంది.

మరి భారత్లోని వ్యాపారులు ప్రపంచ కుబేరులతో ఎలా పోటీ పడగలుగుతున్నారు అని కొంతమంది సందేహపడొచ్చు.. దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే ప్రపంచం లో అత్యంత జనాభా కలిగిన దేశం భారత్. ఈ దేశ మార్కెట్ ఇతర ఏ దేశ మార్కెట్ తో పోల్చి చూసినా ఇక్కడ ఆదాయాన్ని సృష్టించే మార్గం వ్యాపారులకు సులువుగా దొరుకుతుంది. గుజరాతీలు మొదటి నుంచి వ్యాపారాల్లో ఆరితేరిన వారు అలా గుజరాతీలు అయిన అంబానీ, అదానీ, టాటా, అజీమ్ ప్రేమ్ జీ వంటి వారు ఆల్రెడీ వివిధ కంపెనీలు స్థాపించి వాటి ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతూ ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతున్న వారే. నిజానికి అంబానీ అదనీలే కాదు దేశంలో ఉన్న చాలా స్వదేశీ వ్యాపారులు Oyo, Zomato, Ola వంటి స్టార్టప్ లు సైతం వారు చేసే వ్యాపారాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.. కానీ మోడీ ని నిందించాలంటే గుజరాతీలు అయిన అదాని అంబానీలను టార్గెట్ చెయ్యాలి కాబట్టే అలా విషం చిమ్ముతూ వస్తున్నారు.

మన దేశ వ్యాపార మార్కెట్ ని ఇది వరకు కేవలం విదేశీ వ్యాపారులు మాత్రమే శాసించేవారు కానీ ఇప్పుడు మోదీ వచ్చాక స్వదేశీ వ్యాపారులు వివిధ వ్యాపార రంగాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సమయాన్ని చూసి కొన్ని శక్తులు ఎలాగైనా భారత్ ని నిరోధించాలంటే అక్కడి ప్రజల ప్రతిభ కు పట్టం కడుతున్న స్వదేశీ వ్యాపారులపై విష ప్రచారం చేసి తద్వారా భారత ఆర్ధిక మూలలను దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులోని భాగంగానే ప్రధాని 'ఆత్మనిర్భర్' లక్ష్యాలకు తోడుగా నిలుస్తున్న స్వదేశీ వ్యాపార రంగాన్ని నీరుగార్చే ప్రయత్నం బలంగా జరుగుతోంది. మన దేశం ఆత్మ నిర్భర్ అవ్వడమే కాదు ఈ దేశం పై ప్రపంచ దేశాలు ఆధారపడేలా చెయ్యాలంటే మన దేశ వ్యాపారాలను దేశ విదేశాల్లో నెకొల్పే స్థాయికి తీసుకు వెళ్ళాలి. అప్పుడే భారత్ ప్రపంచం లోనే అత్యంత బలమైన ఆర్ధిక శక్తి గా నిలదొక్కుకుంటుంది.🙏


జైశ్రీరామ్🚩

జైభారత్🇮🇳 

భారత్ మాతాకీ జై🙏

జైహింద్✊

Sunday, 25 September 2022

 

                    ఆరెస్సెస్‌తో పోటీ పడటానికి,జమాత్ ఉలామా హింద్

ఆరెస్సెస్‌తో పోటీ పడటానికి,జమాత్ ఉలామా హింద్ జనరల్ సెక్రటరీ మెహమూద్ మదానీ ఒక సైన్యాన్ని సిద్ధం చేసారు. దీని లక్ష్యం 1.25 కోట్ల ముస్లింలను సమీకరించి,భారతదేశంలో ఎవరూ వారిని ఢీకొనకుండా,ముస్లింల అతిపెద్ద సైన్యాన్ని సిద్ధం చేయడం. ఈ సంస్థ విదేశీ ఇస్లామిక్ దేశాల నుండి నిధులు పొందుతోంది. వారంతా ఆయుధాలలో శిక్షణ పొందుతున్నారు. తద్వారా వారు అంతర్యుద్ధం సమయంలో హిందువులతో పోరాడుతూ,అణచివేయవచ్చు. ఇంతటి ప్రమాదం పెరుగుతోన్నా, సత్యాన్ని విస్మరించిన తెలివితక్కువ హిందువులు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. దేశంలో అంతర్యుద్ధం జరిగినప్పుడు ఏ సంపదా పనిచేయదు. అప్పుడు హిందువులు ఏమి చేస్తారు. ఈ సంస్థ యొక్క నిజమైన లక్ష్యం 10 కోట్ల మంది ముస్లింల సైన్యాన్ని సిద్ధం చేయడం. వచ్చే ప్రమాదాలను గుర్తించని నిద్దరలో హిందువులున్నారు. హిందువులు తలదాచుకోటానికి ఇంకో హిందూ దేశంబకూడా లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. హిందువుల పతనానికి హిందువులే కారణం అవుతున్నారు. ఇప్పుడు హిందువులు ఏకం కావాల్సిన సమయం వచ్చింది  ఐక్యంగా ఉండి హిందూ దేశాన్ని నిర్మించాలి,లేకుంటే... వారు మిమ్మల్ని తీసేయటానికి తమ సైన్యం సిద్ధం చేసుకుంటున్నారు,జాగ్రత్త !!!

ఇమామ్ తౌహిదీ, ఇమామ్ ఆఫ్ పీస్ అని పిలుస్తారు: "పశ్చిమ దేశాలు పని చేయకూడదనుకునే ముస్లిం ప్రపంచంలోని చెత్తను దిగుమతి చేసుకున్నాయి మరియు వారు మిమ్మల్ని నాశనం చేస్తున్నారు."

इमाम तौहीदी, जिन्हें शांति के इमाम के रूप में जाना जाता है: "पश्चिम ने मुस्लिम दुनिया का कचरा आयात किया है जो काम नहीं करना चाहते हैं, और वे आपको नष्ट कर रहे हैं।"

Imam Tawhidi, better known as the Imam of Peace: “The West have imported the garbage of the Muslim world who don’t want to work, and they are destroying you.”

Saturday, 24 September 2022

          


                                                

ఆపరేషన్ మిడ్‌నైట్

భారతదేశ చరిత్రలో అతిపెద్ద దాడి

22 సెప్టెంబర్ 2022, గురువారం, సమయం అర్ధరాత్రి ఒంటి గంట. PFI సభ్యులు తమ ఇళ్ళల్లో ఆదమరచి గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రకు మరికొద్ది సేపట్లో భంగం కలుగబోతోందని వారు కలలో కూడా ఊహించలా.

ప్రతి రాష్ట్రంలోనూ.. CAPF మరియు రాష్ట్ర పోలీసులతో జతకూడిన దాదాపు 200 మంది NIA అధికారులు.. నిర్దేశించిన రహస్య ప్రదేశంలో.. ప్రశాంతంగా నిలబడి తమ కమాండ్ సెంటర్ నుండి.. ఆపరేషన్ మొదలెట్టమనే ఆర్డర్ కోసం వేచి చూస్తున్నారు.

సాధారణంగా.. వేకువఝామున 4:00 గంటలకు ఎవరైనా గాఢ నిద్రలో ఉండే సమయం.. ఇదే సమయాన్ని ఎంచుకున్నారు తమ ఆపరేషన్  మొదలెట్టడానికి.

ఢిల్లీలో కూర్చున్న ఒక వ్యక్తి అందరినీ సమన్వయం చేస్తున్నాడు

ఉదయం 3:30 గంటలకు..

అనుకున్న సమయానికి అరగంట ముందు ఆ సమన్వయకర్త నుండి "గో" అనే సూచన ఒచ్చేసింది. అంతే ఒక్కుమ్మడిగా రేసుగుర్రాల్లా ముందుకు దూసుకెళ్లారు.

ఐతే ఈ దాడుల పూర్వాపరాలు ఏంటసలు..?

ఢిల్లీలోని ఆజాద్ మైదాన్ నుండి షాహీన్ బాగ్ వరకు, కేరళ హత్యల నుండి రాజస్థాన్ మరియు యూపీ అల్లర్ల వరకు, నిరంతరం వార్తల్లో వచ్చే ఒక పేరు PFI.. పూర్వ నామం సిమీ. 1990 ల్లోనూ ఆ తరువాత 2000 మొదట్లోనూ.. అనేక టెర్రర్ దాడులకు మూలకారణమైన వేర్పాటువాద సంస్థే సిమీ.

2001లో దీనిని వాజ్‌పేయి ప్రభుత్వం నిషేధిస్తే.. 2008లో సుప్రీంకోర్టు ఆ నిర్ణయం సరైందేనని సమర్థించింది.

PFI ఏర్పడింది 2006లో. అప్పటి నుండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకూ తన కోరలు చాచింది.

ఆర్నెల్ల క్రితం.. ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర హోమ్‌శాఖకు సిమీ అంటే PFI తిరిగి తన విషపు కోరల తలను బయట పెట్టబోతోందనే క్లాసిఫైడ్ సమాచారం అందించింది. 

2019 లో, మోడీ ప్రభుత్వం CAA చట్టాన్ని తెచ్చినప్పుడు.. ఆ  చట్టాన్ని అడ్డుపెట్టుకుని.. బీజేపీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌లు ముస్లింలను దేశం నుండి తరిమికొట్టాలనుకుంటున్నారని అందుకే CAA చట్టాన్ని ముందుకు తెచ్చారని ముస్లింల బ్రెయిన్‌వాష్ చేయడానికి ఒక సాధనంగా PFI వాడుకుంది.. ముస్లింలలో భయభ్రాంతులను సృష్టించి వారి విశ్వాసం చూరగొని వేగంగా విస్తరించింది.

ప్రస్తుత ఆపరేషన్‌కు 5 సంవత్సరాల ముందు..

ఘజ్వా ఏ హింద్ కోసం PFI పనిచేస్తోందని IB నుండి మోడీ ప్రభుత్వానికి ఇన్‌పుట్ అందింది.

- వారు ఆరెస్సెస్‌ను చూపించి ముస్లింలలో భయభ్రాంతులను సృష్టించి వారిని ర్యాడికలైజ్ చేయడం ప్రారంభించారు.

- ఆరెస్సెస్‌పై ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ లకు వ్యతిరేకిగా ముద్ర వేసి హిందువులను విభజించడానికి విశ్వప్రయత్నం చేశారు.. ఇంకా చేస్తున్నారు.

-విషయం సున్నితమైనది కావడంతో.. నేరుగా మోదీ, మోహన్ భగవత్ గార్ల మధ్య రహస్య సమావేశం జరిగింది. ఆరెస్సెస్, బీజేపీ లు రెండూ ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మరింత చేరువై.. వారిని విభజించాలని PFI వేసిన పన్నాగాన్ని చిత్తు చేశారు.

ఐక్యంగా ఉండే శత్రువర్గం మరింత శక్తివంతం అవుతుందని తెలిసిన యంత్రాంగం.. దాడికి ముందే ఆ వర్గాన్ని బలహీనపరచింది.

PFI అధ్యక్షుడు అష్రఫ్ కమ్యూనిటీకి చెందినవాడు మరియు అష్రఫ్ మరియు పాష్మాండ కమ్యూనిటీల మధ్య పోటీ ఉంది.

ముస్లింలందరికీ మార్గదర్శకత్వం చేసే ఏకైక సంస్థ/ నాయకుడిగా మారాలనే PFI ప్రణాళికను బలహీనపరిచేందుకు మోడీ పాష్మాండ వర్గాన్ని దగ్గరకు తీశారు.

ఆపరేషన్‌కు 6 నెలల ముందు..

MoHA లో ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబడింది.

అమిత్ షా, అజిత్ దోవల్, ఎన్ఐఏ, ఐబీ అధికారులు హాజరయ్యారు.

సమావేశంలో హాజరైన వారందరినీ ఉద్దేశించి.. మనం PFI ని నిషేధించాలా? అని అమిత్ షా గారు ఒకేఒక ప్రశ్న అడిగారు.

దానికి సగం మంది అధికారులు "అవును" అని మరియు సగం మంది "లేదు" అని అన్నారు.

దోవల్‌జీ మీరేమనుకుంటున్నారని అమిత్ షా గారు NSA దోవల్ గారిని ప్రశ్నించారు.

దోవల్ గారు వెంటనే జవాబివ్వకుండా తనకు కొంత సమయం కావాలని అడిగారు. ఇందులో వింతేమీ లేదు. సమావేశాల్లో దోవల్ గారిని మోదీ, షా లు ప్రశ్నలు అడిగేది కేవలం ఫార్మాలిటీ కోసమే. అసలు నిర్ణయం ఏంటి దాని అమలు ఎలా ఉంటుందనేది.. దేశంలోపలి వ్యవహారమైతే.. మోదీ దోవల్ షాలు.. విదేశీ వ్యవహారమైతే.. మోదీ దోవల్ జైశంకర్ లు.. ఆంతరంగికంగా సమావేశమై నిర్ణయం తీసుకోవడం.. వ్యూహం సిద్ధం చేసే పని దోవల్, జైశంకర్ లు తీసుకొంటారు.

ఆ తరువాత దోవల్ గారు.. IB, RAW ల్లో పనిచేసి.. తరువాత NSA లో చేరి తన ఆంతరంగిక బృందంలో పనిచేస్తున్న అధికారులతో సమావేశమై.. PFI ని అణచివేయడానికి పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేశారు.

- IB మరియు ED తో ఒక ఉమ్మడి బృందం తయారు చేయబడింది

- PFI పనితీరు మదింపు చేయమని IB ని నిర్దేశించడం జరిగింది.

- PFI కు నిధుల ప్రవాహాన్ని కనిపెట్టమని ఈడీని ఆదేశించడమైంది.

ఇరు సంస్థలు తమ పనిని వెంటనే మొదలెట్టి.. ఈ ఆపరేషన్‌కు రెండు నెలల ముందే.. పూర్తి సమాచారం సేకరించి ఉంచారు.

ఇదిలా కొనసాగుతుండగా.. బీహార్‌లోని PFI వ్యవహారాలను డేగకళ్ళతో గమనిస్తున్న NSA/IB/NIA సరైన సమయం చూసి అనూహ్యదాడితో.. వారివద్ద నుండి రహస్యమైన అత్యంత సున్నితమైన విజన్ 2047 డాక్యుమెంట్‌ను దొరకబుచ్చుకుంది. అసలా డాక్యుమెంట్ NSA చేతికి ఎప్పుడో అందింది.. కానీ ఈ దాడుల్లో భాగంగా బయటపెట్టారు. ఇది సాధారణంగా జరిగేదే. PFI కార్యకలాపాల గురించి అన్నీ తెలిసినా.. దాని కార్యకర్తలందరినీ ఒక్కుమ్మడిగా కుమ్మే సమయం సందర్భం కోసం వేచి చూస్తూ ఒచ్చారు.

ఆపరేషన్‌కు 53 రోజుల ముందు..

అజిత్ దోవల్ ఒక సర్వమత సమావేశంలో ముస్లిం మతగురువులను కలుసుకుని.. దేశ వ్యతిరేక, విభజన సంస్థలన్నిటినీ తప్పనిసరిగా నిషేధించాలని.. వారి చేత తీర్మానం చేయించారు.

PFI కి కూడా తెలుసు.. తమ సంస్థను ఏక్షణమైనా నిషేధించొచ్చని.. దానికనుగుణంగానే.. వారు ప్లాన్ B తయారు చేసుకుని ఉంచుకున్నారు. ఆ విషయాల గురించి కూడా NSA వద్ద పూర్తి సమాచారం ఉంది.

వారు అనేక ఇతర సంస్థలను.. SDPI, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, NWF, AILC ఆల్ ఇండియా లీగల్ కౌన్సిల్, HRDF, SDTU, రిహాబ్ ఇండియా ఫౌండేషన్ వంటి అనేక సంస్థలను సిద్ధం చేసుకున్నారు.

ప్రభుత్వం PFI ని నిషేధిస్తే, వారు వేరే పేరుతో వెంటనే తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు.

ఆపరేషన్‌కు 1 నెల ముందు..

దోవల్ తన ప్రణాళికను మోదీ షా లకు సమర్పించారు. దాని పేరు ఆపరేషన్ మిడ్‌నైట్.. దాని లక్ష్యం.. PFI ని బ్యాన్ చేసే ముందు.. కూకటి వ్రేళ్ళతో సమూలంగా నాశనం చెయ్. దాంతో.. PFI కీలక నేతలందరినీ ఒకేసారి అరెస్టు చేయడానికి.. భారతదేశ చరిత్రలో అతిపెద్ద దాడికి అంకురార్పణ జరిగింది.

OM కి 20 రోజుల ముందు..

ఐఎన్‌ఎస్ విక్రాంత్ ప్రారంభోత్సవానికి మోదీ గారు కొచ్చి వెళ్లగా, ఆయనతో పాటు దోవల్ గారు కూడా అక్కడికి వెళ్లారు. దోవల్ గారు కేరళ రాష్ట్ర పోలీసు డీజీపీతో రహస్యంగా మాట్లాడి ప్లాన్‌ గురించి చెప్పారు. అక్కడి నుంచి ముంబయి వెళ్లి గవర్నర్‌ హౌస్‌లో ఉండి కీలక ఎన్‌ఐఏ అధికారులను కలుసుకుని ప్రణాళిక వివరాలు చెప్పారు.

OM కి 3 రోజుల ముందు..

దోవల్ మరియు అమిత్ షా సమక్షంలో NIA, IB మరియు ED ల మధ్య సంయుక్త సమావేశం నిర్వహించబడింది. ఆ సమావేశంలో దోవల్ మొత్తం ప్రణాళికను వివరించారు.

సెప్టెంబర్ 22 అర్ధరాత్రి NIA మరియు ED యొక్క సంయుక్త బృందం.. దేశవ్యాప్తంగా PFI కున్న 93 స్థావరాలపై దాడి చేస్తుంది. కీలక నేతలందరినీ ఒకేసారి ఒకేసమయంలో అరెస్టు చేస్తారు. వారిని మూకుమ్మడిగా అరెస్టు చేయకపోతే.. PFI రెండవ అంచె నాయకులు దేశంలో అశాంతిని సృష్టిస్తారు మరియు సాక్ష్యాలను దాచిపెడతారు.. కాబట్టి వారందరినీ కలిసి అరెస్టు చేయడం అవశ్యం.

PFI నేతల అరెస్ట్ తర్వాత.. శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో ముందే విశ్లేషించారు. వాటిని అదుపులో ఉంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.. ముస్లిం సంస్థల నుండి ఎటువంటి సానుభూతి మరియు మద్దతు లభించని విధంగా ప్రణాళిక రచించారు.

OM 1 రోజు ముందు.. 

200 మంది NIA అధికారులు, ED అధికారులు, 4 IG లు, 1 ADG, 16 ఎస్పీలు, 1000 రాష్ట్ర పోలీసులతో ఒక బృందం సిద్ధమైంది. 

సమన్వయం కోసం 6 నియంత్రణ కేంద్రాలు మరియు న్యూఢిల్లీలో ఒక కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అజిత్ దోవల్ గారు అందరినీ సమన్వయం చేశారు.

ఆపరేషన్ అర్ధరాత్రి

PFI కి ఆపరేషన్ గురించి తెలియదు. తమనెవరూ ఏమీ పీకలేరనే భ్రమలో ఉన్నారు.. కాదుకాదు ఉంచబడ్డారు.

అర్ధరాత్రి ఒంటి గంటకు ఆపరేషన్ ప్రారంభమైంది. IB ఇన్‌పుట్‌ల ఆధారంగా 11 రాష్ట్రాల్లో గుర్తించబడ్డ 93 స్థావరాలకు NIA & ED బృందం చేరుకుని.. ఆదేశాల కోసం వేచి ఉంది.

ఆపరేషన్ జరుగుతున్న ప్రదేశం వద్ద PFI వాలంటీర్లు గుమిగూడకుండా చూడడానికి.. రాష్ట్ర పోలీసు బలగాన్ని సెకండ్ షీల్డ్‌గా ఉంచారు.

సరిగ్గా.. ఉదయం 4 గంటలకు ఆపరేషన్ షెడ్యూల్ చేయబడింది.

ఖచ్చితంగా సమయానికి అరగంట ముందు.. దోవల్ గారు ఢిల్లీ నుండి "గో" అనే ఆదేశం ఇచ్చారు.

అంతే.. జాయింట్ టీంస్ తమ దాడులను ప్రారంభించాయి. ఒక బృందం స్థావరాల్లో గాలింపు జరుపుతుండగా.. మరొక బృందం.. PFI నేతలను.. నిద్ర నుండి మేలుకునే అవకాశం ఇవ్వకుండానే.. అరెస్ట్ చేసి.. నిర్దేశిత ప్రాంతాలకు తోలుకెళ్ళారు.

PFI నెట్వర్క్ కూడా తక్కువేమీ కాదు.. క్షణాల్లో వార్త వ్యాప్తి చెంది.. PFI వాలంటీర్లు ఆయా స్థావరాలకు చేరుకోవడం ప్రారంభించారు. అయితే అప్పటికే నియమించబడిన పోలీసులు వారిని దూరంగా నిలిపివేశారు.

ఉదయం 5 గంటలకు దాడులు ముగిశాయి.

106 మంది PFI నాయకులను, కార్యదర్శులను మరియు రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లతో సహా అరెస్టు చేశారు. 150+ మొబైల్ ఫోన్‌లు, 50+ ల్యాప్‌టాప్‌లు, విజన్ డాక్యుమెంట్లు, నమోదు ఫారమ్‌లు, బ్యాంకు పత్రాలను NIA మరియు ED బృందం జప్తు చేసింది.

నిషేధానికి ముందే.. 23 గురువారం ఉదయం సూర్యుడు ఉదయించకుండానే..  PFI అస్తమించింది.

PFI మతం కార్డును ప్లే చేయడానికి ప్రయత్నించింది.. కానీ ముస్లిం మతపెద్దలతో ప్రభుత్వం ముందే జరిపిన చర్చలతో.. వారి నుండి మద్దతు లభించలేదు.

భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన వేర్పాటువాద సంస్థల్లో ఒకటి ఒక్క వేకువఝాములో అస్తవ్యస్తమైంది.. ధ్వంసమైంది.

ఇప్పుడీ కథ ఇంతటితో ముగియదు. NIA, ED లు.. వారు రికవరీ చేసిన సమాచారాన్ని మరింత తనిఖీ చేసి మరిన్ని చర్యలు తీసుకుంటారు.

PFI తమకు మద్దతుగా నిలిచే రాజకీయ పార్టీలు, NGO లు, న్యాయవాదులు, న్యాయవ్యవస్థలో చొరబడ్డ  తమ అనుయాయుల సహాయంతో కోర్టుల్లో పోరాడటానికి ప్రయత్నిస్తుంది.

పోరాటం చాలా కాలం సాగుతుంది కానీ బయటపడడం PFI కి అంత సులభం కాదు.

ఆపరేషన్ మిడ్‌నైట్ అనేది ప్రపంచంలోనే అత్యంత చాకచక్యంగా అమలు చేయబడిన అతిపెద్ద ఆపరేషన్ మరియు భారతదేశాన్ని PFI దుర్మార్గపు విజన్ 2047 నుండి రక్షించినది

నోట్:

మీ ఇంటి ముందు ఎప్పుడూ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉంటారు. ఒకరు మీకు హాని చేయాలనుకునే వ్యక్తి. మరొకరు మిమ్మల్ని రక్షించాలనుకునే వ్యక్తి. మీరు ఎవరితో నిలబడి ఉన్నారు అనేది నిర్ణయిస్తుంది మీ మనుగడను.

2004-14 మధ్య వందలాది బాంబు పేలుళ్లు జరిగాయి కానీ 2014 తర్వాత ఒక్కటి కూడా లేదు.

Wednesday, 21 September 2022

 డయాబెటిస్ { చక్కర వ్యాధి } ను జయించడం ఎలా ?:

కడుపునిండా అన్నం ! ఒళ్ళంతా రోగం !
డయాబెటిస్- వ్యాధి కాని వ్యాధి . వ్యక్తి జీవన శైలి సరైన మార్గం లో లేనప్పుడు వచ్చేది .
సరైన జీవన శైలిని అనుసరించడం ద్వారా దీన్ని సులభంగా జయించొచ్చు . మందులు వాడాల్సిన అవసరం లేకుండా హాయిగా జీవించొచ్చు .
మన తీసుకొనే ఆహారం లో 1 . కార్బోహైడ్రేట్లు { పిండి పదార్థాలు } 2 . ప్రోటీన్ లు { మాంసకృత్తులు } ౩. ఫ్యాట్స్ { కొవ్వు పదార్థాలు } 4 . విటమిన్లు , 5 మినరల్స్ 6 . పీచు ఉంటాయి .
మనిషి పుట్టి నలబై లక్షల సంవత్సరాలయ్యింది . మన పూర్వీకులు ఎలాంటి ఆహారం తీసుకొన్నారు అనే దానిపై ఆధార పడి, సూక్ష్మ పరిణామ క్రమం లో మన శరీరం అందుకు అనుగుణంగా తయారయ్యింది . మానవ జాతి 99 శాతం సమయం ప్రకృతిలో సహజంగా దొరికే ఆహారం { దుంపలు , కాయలు , పళ్ళు , వేటాడి చంపిన జంతువుల మాసం } పై ఆధార పడింది . వ్యవసాయం అంటే పంటలు పండించడం, కేవలం అయిదు వేల సంవత్సరాల క్రితం మొదలయింది . అందులో మొన్నటి దాక పండించిన పంటలు వేరు . వాటిని పండించిన విధానం , వాటిలో పోషక విలువలు వేరు . అదీ కాకుండా పండించిన ధాన్యాలే తో పాటు కాయలు, పళ్ళు లాంటివి బాగా తినే వారు .
మీరున్నారు . మా నాన్న గారు . తాతగారు . ఆలా వెనక్కు వెళితే మీకు కోటి ఇరవై లక్షల పూర్వీకులున్నారు . వారిలో మీది మీ నాన్న గారిది ఒక దారి . మిగతా కోటి ఇరవై లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై ఎనిమిది మందిది ఒక దారి . మీ పూర్వీకుల ఆహారపు అలవాట్లు మీ శరీరాన్ని ఏర్పరిచాయి . వారి దారిలో కాకుండా మీరు కొత్త దారిలో వెళుతున్నారు . దారితప్పిన మీకొచ్చేదే చక్కర వ్యాధి .
అంటే ఏంటిప్పుడు ? పూర్వీకులు గుహల్లో నివసించేవారు . ఆకులూ అలములు కట్టుకొనే వారు . కాబట్టి ఇప్పుడు మన కూడా అడవి మనుషులు అయిపోవాలా? బతికేది కొంతకాలం . హ్యాపీ గా తినకుండా ఈ సోది ఏంటి ? అనుకొంటున్నారా ? అయితే ఈ మెసేజ్ చదవడం ఇక్కడితో ఆపేయండి . మీ శరీరం .. మీ ఇష్టం .. ఇడ్లీ లు .. బిర్యానీలు .. కోక్ లు... పిజ్జా లు .. పరోఠా లు .. రెచ్చిపోండి . ఆపేదెవ్వడు . అడీగేదెవ్వడు . గాంగ్రీన్ .. ఈ ఒక్క మాట గుర్తు పెట్టుకోండి . జీవితం ముప్పావు వంతు నాశనం అయిపోయినప్పుడు ఈ మాట ఒక సారి వినిపిస్తుంది . అప్పుడైనా వినదగు నెవ్వరు చెప్పిన .. వినంతనే వేగపడక .. అనే ఆర్యోక్తి గుర్తుకు తెచ్చుకోండి . bye ...
చక్కర వ్యాధి ని జయించడం ఎలా ?
అసలు ఇదొక వ్యాధే కాదు . శృతి తప్పిన జీవన రాగం .. దారి తప్పిన జీవనం .
తిండి తిన్నాక తొంబై నిముషాలకు మీ రక్తం లో గ్లూకోస్ శాతం చెక్ చేసుకోండి . ఇలాంటి మెషిన్ లు మెడికల్ షాప్ లో దొరుకుతాయి . మీ రీడింగ్ 140 లోపు అయితే మీకు ఎలాంటి సమస్య లేదు . 140 - 180 మధ్యలో అయితే మీరు ప్రారంభ దశలో ఉన్నారు. 250 లోపు ఉన్నా ఫరవా లేదు . నేను చెప్పిన పద్ధతిలో ఈ సమస్య ను జయించొచ్చు . మూడు వందలు దాటితే మీకు ఇన్సులిన్ లోపం ఎక్కువ గా వుంది . బహుశా ఇప్పటికే మీరు ఇన్సులిన్ తీసుకొంటూ వుండొచ్చు . అప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వైద్యుడి సూచన మేరకు చెయ్యాలి . వీర మాచినేని గారు తనదైన డైట్ ను సూచిస్తూ ఎంతో మందికి ఉచిత సేవలు అందిస్తున్నారు . ఇలాంటి వారు ఆయన సూచనలు పాటించొచ్చు .
నాకు 2011 లో ఈ సమస్య ఉన్నట్టు అర్థం అయ్యింది . లోతుగా అధ్యయనం చేసి నాకు నేను రూపొందించుకున్న విధానం ఇది . దీనితో నేను ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడడమే కాకుండా ఆరోగ్యం పట్ల మరింత శ్రద్హ పెట్టి వ్యాయాయం చేసి సిక్స్ ప్యాక్ పొందాను . సిక్స్ ప్యాక్ అంటే షో కాదు . శరీరం లో అధిక కొవ్వు ను తొలగించడం .
నేను చెప్పిన విధానం లో కొవ్వు తగ్గించుకోవచ్చు . బిపి ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు . రక్తం లో క్లోట్స్ రాకుండా చూసుకోవచ్చు . అంటే మెదడుపోటు, గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు .
డయాబెటిస్ కు ప్రధాన కారణం ఒత్తిడి .. స్ట్రెస్ . మీకు తెలిసిన పదిమంది వివరాలు సేకరించండి . జనాలను స్థూలంగా రెండు రకాలుగా విభజించొచ్చు . స్ట్రెస్ పార్టీ . కూల్ పార్టీ . మొదటి రకం .. గాబరా మనుషులు . ప్రతి చిన్నదానికీ హైరానా పడిపోతుంటారు . ఇలాంటి వారిలో నూటికి తొంబై మంది నలబై దాటితే డయాబెటిస్ తెచ్చుకొంటారు . కొంతమంది నిమ్మకు నీరెత్తినట్టు వుంటారు . ఏముందిలే అంటూ ముందుకు సాగిపోతారు . వీరు పొద్దున్న పది ఇడ్లీ లు తిన్న వెంటనే అయిదు అరటి పళ్ళు తిన్నా షుగర్ కంట్రోల్ లోనే ఉంటుంది .ఆధునిక జీవనం అంటే పోటీ . పోటీ పడితినే విజయం . నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే సక్సెస్ రాదు . పోటీ పడుతూనే ఒత్తిడి ని జయించడం ఒక కళ. ఇది అందరూ నేర్చుకోవాలి . అదొక ప్రత్యేక పాఠం . మరో మెసేజ్ లో చెబుతాను .
మీకు జ్వరం ఉన్నప్పుడు షుగర్ చెక్ చేసుకోండి . మామూలుగా ఉన్నదానితో పోలిస్తే ఎక్కువ రీడింగ్ వస్తుంది . కారణం జ్వరం వల్ల బాడీ లో స్ట్రెస్ . ఇది తాత్కాలికం . మనం తెచ్చిపెట్టుకున్న ఒత్తిడిని జయించాలి . లేకపోతె షుగర్ సమస్య ఖాయం .
షుగర్ సమస్య కు, అధిక బరువుకు మరో ప్రధాన కారణం నిచ్చలమైన జీవన శైలి . అదేదో సినిమా లో బ్రహ్మానందం అన్నట్టు మా తాతే ఇలా చెయ్యకుండా ఉండివుంటే .. మన పూర్వికులు రోజంతా నడుస్తూ గడిపేశారు . వేట ఆహార సేకరణ .. పోడు వ్యవసాయం .. సాంద్ర వ్యవసాయం, చేతి వృత్తులు .. రోజంతా పనే .. నడకే . మనిషి శరీరం కూర్చోవడానికి అనుగుణంగా లేదు . ఇది కఠోర వాస్తవం . సరే .. అడవులకు పోలేము . వేటాడలేము .. నిజమే . కనీసం రోజుకు ఒక గంట కూడా నడవకుండా సోఫా సెట్- ముందు టీవీ -చేతిలో సొల్లు ఫోన్ -మరో చేతిలో చిరు తిళ్ళు . ఇదేనా బతుకు ? బతకడం కోసం తినాలి . తినడం కోసమే బతుకుతాము అంటే ఎలా ? గాంగ్రీన్ లు గుండెపోట్లు , కీళ్లనొప్పులు రావా మరి ? రోజుకు కనీసం 45 నిముషాలు వేగం గా నడవడం అవసరం .
పిల్లలు ఆటలు ఆడుతారు . ఆటలు ఆడడం ఆగిన వయసులో నడక మొదలవ్వాలి . మరో విషయం.. నేను చెప్పబోతున్న ఆహార నియమాలు ఎవరో ముసలి ముతకకు మాత్రమే కాదు . చిన్న పిలల్లతో మొదలెట్టి ప్రతిఒక్కరికి ....
ఉప్పు చంపేస్తుంది .
రెండు గ్రాముల ఉప్పు రోజుకు సరిపోతుంది . మనలో అధిక శాతం ఇంతకు పది రెట్లు ఉప్పును శరీరంలోకి తోసేస్తున్నారు . అది వెళ్లి కీళ్లను తినేస్తుంది . బిపి ను పెంచేస్తుంది . ఉప్పులేని సాంబార్ ను తినమని చెప్పడం లేదు . జామ కాయ .. మామిడి కాయ కు కూడా ఉప్పు కావాలా ? ఉప్పు లేకుండా పెరుగన్నం తినగలరా ? వాక్ అనిపిస్తుంది కదా . ఒక రోజు ట్రై చెయ్యండి . అన్నాన్ని బాగా నమలండి . అందులోని కమ్మదనాన్ని రుచి చూస్తారు . ఆలా వారం పాటు బలవంతంగా నైనా ఉప్పులేకుండా పెరుగన్నం తినండి . అటు పైన మీరు ఉప్పు వేసుకోవడం వల్ల పెరుగన్నం రుచిని ఎంతగా కోల్పోతున్నారోగ్రహిస్తారు . లక్ష రూపాయిలు ఇస్తామన్నా పెరుగన్నం లో ఉప్పేసుకోరు .
ప్రతి రోజు ఖీర తినండి . శరీరం లోకి వెళ్లే ఉప్పు తగ్గిపోతుంది . పొద్దున్న ఉరికించిన గుడ్డు . పన్నీర్. మొలకెత్తిన విత్తనాలు , నాలుగు కొబ్బరి ముక్కలు , బాదాం , .. ఇందులో ఉప్పెక్కడుంది ?
పెద్దలు రోజుకు నాలుగు లీటర్ ల నీరు తాగాలి . పిల్లలు వారి వయసును బట్టి ఒకటి నుండి రెండు లీటర్ లు . ఉప్పేమో పది రెట్లు.. నీళ్ళేమో తాగాల్సిన దాంట్లో పదోవంతు కూడా తాగరు . మరి రోగాలు వస్తాయంటే రావా ? అధిక బరువు, స్ట్రెస్, నిద్ర లేమి, నీరసం ... . నీరు తాగక పోవడం వల్ల వచ్చే సమస్యల లిస్ట్ కొండవీటి చేంతాడు.
ఇక ఫుడ్ విషయం . డైట్ ప్లాన్ ఇవ్వండి అని చాల మంది అడుగుతున్నారు . ప్లాన్ లేదు .. పాడు లేదండీ .. చాలా సింపుల్ .
పైన చెప్పిన ఆరు పోషకాల్లో మనకు కొవ్వు పదార్థాల లోటు లేదు . కొవ్వు పదార్థాలు కాస్త ఎక్కువ తీసుకొన్నా సమస్య లేదు . అందరూ అనుకున్నట్టు రక్తం లో కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడానికి, అధిక బరువు కు కారణం కొవ్వు కాదు . అసలు కారణం పిండి పదార్థాలే .
మీరు టిఫనీలు చేసారా ? ఏమి తిన్నారేంటి ? నాలుగు ఇడ్లీ లు సాంబార్ చట్నీ . లేదా నాలుగు దోశలు చట్నీ . లేదా పూరి, చపాతీ, బ్రెడ్ .. పొంగల్ .
స్థూలంగా చెప్పాలంటే మీరు మీ శరీరం లోకి తోస్తున్న ఆహారం లో 85 శాతం పిండి పదార్థాలే. ప్రతి దానికీ ఓ లెక్కుంటుంది . లెక్క తప్పితే చిక్కు . తీసుకోవలసిన ఆహారం లో పిండి పదార్తాలు యాభై శాతం మించకూడదు . అది ముప్పై శాతానికి తగ్గించినా సమస్య లేదు .
ఒక పక్క అధిక మొత్తం లో పిండి పదార్థాలు కడుపులోకి తోసేస్తూ మరో పక్క శరీర దృఢత్వానికి అవసరం అయిన మాంసకృత్తులు అందకుండా చేస్తున్నారు . ఇక కండెక్కడ ? చర్మం . దానికి కింద కొవ్వు .. అన్నట్టు మీరు తిన్న ఇడ్లీ దోస లాంటి పిండి పదార్తాలే కొవ్వు గా మారి పోతాయి . ముప్పై వస్తే ఫ్యామిలీ ప్యాక్ . నన్ను అంకుల్ అంటారేంటని ఫేస్బుక్ పై పోస్ట్లు . నలబై దాటితే కళ్ళ కింద క్యారీ బాగ్ లు .. రావా మరి ?
తీసుకొనే ఆహారం లో ప్రోటీన్ అదే మాంసకృత్తులు 25 శాతానికి తగ్గకుండా చూసుకోవాలి . మన దేశం లో నూటికి ఎనభై మంది ప్రోటీన్ లోపం తో బాధ పడుతున్నారు . కనీసం పది శాతం ప్రోటీన్ కూడా శరీరం లోకి పంపడం లేదు . ప్రోటీన్ తింటే కిడ్నీ లు పోతాయట . వామ్మో .. ఏమి జ్ఞానం అండీ బాబోయ్ . మడిసి వేట ఆహార సేకరణ దశలో ప్రధానంగా తిన్నది ప్రోటీన్ లు. కిడ్నీ లో పొయ్యే పనైతే మానవ జాతి అంతరించిపోయి ఉండాలి . ఇతరత్రా కారణాల వల్ల ఇది వరకే కిడ్నీ సమస్యలు వున్నవారికి మిహాహాయింపు . మిగతా వారు శుభ్రంగా ప్రోటీన్ లు తీసుకోవచ్చు .
ఇలా చెబితే పోస్ట్ లెంగ్త్ ఎక్కువవుతుంది . మీరు ఏమి తింటున్నారో అదే తినండి . కానీ అందులో పిండి పదార్థాలు బాగా తగ్గించండి . నాలుగు ఇడ్లీ ల కు బదులు ఒక ఇడ్లీ . ముప్పై ఏళ్ళు లోపు ఉండి బాధిక బరువు లేనివారు నాలుగు ఇడ్లీ ల కు బదులు రెండు . ఇడ్లీ దోస పూరి పొంగల్ . పేరు ఏదైనా పండించిన ధాన్యాల్లో అంటే బియ్యం, గోధుమ, జొన్నలు , రాగులు, సజ్జలు, కొర్రలు లాంటి వాటిలో ఉండేది పిండి పధార్థాలు . వీటిని బాగా తగ్గించాలి . సగానికి సగం తగ్గించాలి . అంటే కడుపు మాడ్చుకోమని కాదు . నాలుగు ఇడ్లీ లు కడుపులోకి తోయడానికి మీరు వాడిన పదార్థం సాంబార్ , చట్నీ . చట్నీ అంటే ఒక మాదిరి . సాంబార్ అంటే నీళ్ళే కదా ? అందులో ఏముంది ? ఈ రోజు ఒక ఇడ్లీ దానితో బాటు సాంబార్ . కానీ సాంబార్ లో ఇడ్లీ తో పోలిస్తే అంతకు నాలుగు రెట్లు కాయగూరలు ఉండాలి . పచ్చి ఖీర కూడా తినొచ్చు . కాయగూరల్లో పీచు ఉంటుంది . విటమిన్ లు మినరల్స్ ఉంటాయి . కాన్సర్ నుంచి రక్షించే అంటి యాక్సిడెంట్ లు ఉంటాయి .
చికెన్ , మటన్ , చేపలు , గుడ్డు .. మాంసాహారులకు ; పన్నీర్ , జామ కాయ , బ్రోకలీ , పప్పు .. శాఖాహారులకు ఇవే ప్రధానంగా ప్రోటీన్ లు ఇచ్చే ఆహారం . ఇవి బాగా తినాలి .సొయా లో ప్రోటీన్ లు సమృద్ధి . కానీ తినొద్దు . సొయా మంచిది కాదు . థైరాయిడ్ లాంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు వస్తాయి . అన్నట్టు ఆటో ఇమ్యూన్ అంటే గుర్తొచ్చింది . టైపు వన్ దియాబెటిస్ ఆటో ఇమ్యూన్ సమస్య . నేను చెబుతున్నది పెద్దల్లో వచ్చే దియాబెటిస్ గురించి . అంటే టైపు 2
ఇదే ఫార్ములా లంచ్ కి డిన్నర్ కి. మీరు తినేదే తినండి . కానీ పిండి పదార్థాలు బాగా తగ్గించాలి . అధిక బరువు, చక్కర వ్యాధి తీవ్రంగా ఉన్న వారు పిండి పదార్థాలను ముప్పై శాతానికి తగ్గించాలి .
ఒకటి చెప్పనా ? మనం తినే కాయగూరల్లో కూడా పిండి పదార్థాలుంటాయి . అవి చాలు .
ప్రోటీన్ లు బాగా పెంచాలి . చికెన్ బిర్యానీ తింటున్నారు . అందులో రైస్ మూడో వంతు కు తగ్గించండి . ఒక ఖీర . చికెన్, రైస్ కు రెండు రెట్లు వీలయితే మూడు రెట్లు . అన్నం - పప్పు తింటున్నారు . అన్నం ఒక కప్పు . పప్పు ఒక కప్పు .. వీలైతే రెండు కప్పులు పప్పు . ఖీర లాంటి పచ్చి కూరలు . ఆకుకూరలు కూడా తినండి . సాంబార్ అన్నం తింటున్నారు . అన్నం ఒక కప్పు . సాంబార్ లో ముక్కలు అన్నానికి నాలుగు రెట్లు . బంగాళాదుంప అన్నం లాంటిదే . ఇది వద్దు బెండ కాయ బీర కాయ సొర కాయ . వంకాయ మీ ఇష్టం .. మీ టేస్ట్ . ఎలా వండుకొంటారు .. ఎలా తింటారు అనేది మీ ఇష్టం .
తెల్లన్నం అధమం . దానికంటే బిర్యాని రైస్ కాస్త బెటర్ . దానికంటే బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం బెటర్ . దానికంటే జొన్నలు సజ్జలు రాగులు బెటర్ . దానికంటే కొర్రలు లాంటివి బెటర్ . మీ ఇష్టం .. మీ బడ్జెట్ .. మీ టేస్ట్ . కానీ ఇలాంటివి బేసిక్ గా పిండి పదార్తాలు . యాభై శాతానికి దాటకూడదు . బరువు తగ్గాలి అనుకొనే వారికిస్ షుగర్ కంట్రోల్ చెయ్యాలి అనుకొనే వారికి ముప్పై శాతం చాలు.
ఇక గోధుమలు . గోధుమ రొట్టి తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది అనేది పచ్చి బూతు . పిండమరకు వెళ్లి గోధుమలను మర పట్టిస్తే అదొక రకం . అది కూడా పిండి రూపం లో ఉండడం తో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ . గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత తక్కువ ఉంటే కాలేయం పై అంత తక్కువ ఒత్తిడి .
ఈ రోజుల్లో గోధుమ పిండి లో మైదా కలుపుతున్నారు . అందుకే అవి మెత్తగా ఉంటాయి . నాన్ .. చుక్క రోటి .. తొక్క రోటి .. అన్నీ మైదాలే . తింటే కోలన్ కాన్సర్ ఖాయం . పరాటాలు ఎక్కువ తినే తమిళుల్లో ఈ రకం కాన్సర్ అధికమవుతోంది . రాత్రి పరోటా నో తొక్క రోటి { అదే లెండి చుక్క రోటి } నో తింటే ఆరోగ్యం అని అమాయకులు రోగాలను కొని తెచ్చుకొంటున్నారు .
పైన చెప్పిన ప్రోటీన్ లు .. వాటితో పాటు ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తినాలి . వీటిలో పీచు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి . బరువు తగ్గాలి అంటే కొంతమంది కడుపు మాడ్చుకొంటారు . ఇది అజ్ఞానం . బరువు తగ్గాలి అని మందులు మాకులు తింటే కిడ్నీ లు పోతాయి . లో కెలొరీ ఫుడ్ తినడం ఒకటే బరువు తగ్గడానికి సరైన మార్గం . ఆకుకూరలు కాయగూరలు లో కెలొరీస్ ఆహారం . దుంప కూరలు వదిలెయ్యండి . వాటిలో పిండి పదార్థాలు అధికం .
కడుపు నిండా అన్నం .. ఇదొక పెద్ద అజ్ఞానపు మాట . అన్నం అంటే రైస్ అనే అర్థం లో తీసుకొంటే అది పిండి పదార్థాలు భోజనము అవుతుంది . పోనీ ఆకుకూరలు కాయగూరలు కూడా అన్నం అనే పదం లోకి వస్తాయి అనుకొంటే అసలు కడుపు నిండా ఎపుడూ తినకూడదు . కాస్త ఖాళీ పెట్టాలి . వంద తింటే కడుపు నిండుతుంది అంటే ఎనబై చాలు .
ఇక పళ్ళు .. పళ్ళు తింటే షుగర్ సమస్య రాదు . షుగర్ సమస్య ఉన్న వారికి పళ్ళు మంచివి కావు . ఈ రెండు వాక్యాల్లో మొదటిది పూర్తిగా కరెక్ట్ . చిన్నపటినుంచి పిలల్లకు పళ్ళు ఆహారంగా ఇస్తే వారికి పెద్దయ్యాక కాన్సర్, షుగర్, బిపి లాంటి రోగాలు రావు . ఆనం తిన్నాక పళ్ళు తినకూడదు . పళ్ళని ఖాళీ కడుపులో తినాలి . పళ్ళు తిన్నాక కనీసం రెండు గంటలు అన్నం తినక పొతే మంచిది . షుగర్ సమస్య వున్నవారు నేను చెప్పినట్టు గా పిండి పదార్తాలు బాగా తగ్గిస్తే సాయంకాలం వాకింగ్ ముందు ఒక పండు తినొచ్చు .
మీ షుగర్ లెవెల్ ను తరచూ చెక్ చేసుకోండి . పిండి పధార్థాలు ఎంత మేర తగ్గించాలి ?.. పండు తినొచ్చా ?.. తింటే బాగా తియ్యటి, మామిడి అరటి లాంటివి కూడా తినొచ్చా? అనేది మీ షుగర్ లెవెల్ బట్టి ఉంటుంది . 180 దాక ఉంటే ఏమీ కాదు . తిండి తిన్నాక తొంబై నిమషాలకు వచ్చే రీడింగ్ . ఒక నెల పాటు రెగ్యులర్ గా చెక్ చేసుకొంటే మీ శరీర తత్త్వం మీకే అర్థం అయిపోతుంది . దాన్ని బట్టి ప్రొసీడ్ అయిపోవచ్చు . అటు పైన నెలకో ఒక సారి షుగర్ లెవెల్ చెక్ చేసుకొంటే చాలు .
షుగర్ సమస్య లేని వారు మాకేంటి ఎంతైనా పిండి పదార్థాలు హ్యాపీ గా తినేయొచ్చు అనుకొంటున్నారా ? సమస్య ఒక్క షుగర్ తోనే కాదు . పిండి పదార్తాలు ఎక్కువైతే కొవ్వు .. ఫామిలీ ప్యాక్ .. కెళ్లనొప్పులు .. రక్తం లో క్లోట్స్ .. ఇలా చాలా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి . బెనిఫిట్స్ మీకు కాదులెండి . ఫార్మసురులకు .
ఇవి కాకుండాప్రకృతి లో దొరికే ఆహారం .. తాటి నుంజెలు .. రేగు పళ్ళు , కొబ్బరి , గేగులు ఇలాంటి వాటిని బాగా తినండి . ప్యాకెట్ లో వచ్చే ఆహారం లో అధిక శాతం విషమే . పొలాల్లో, అడవుల్లో , బండ్ల పైన దొరికే ఆహారం అమృతం .
వాల్ నట్స్ చాలా అవసరం . రోజుకు రెండు మూడు తినాలి . షుగర్ సమస్యలేని వారికి, నేను చెప్పిన పద్ధతిలో దాన్ని జయించిన వారికి డ్రై ఫ్రూప్ట్స్ మంచి ఫుడ్ . వేరుశనిగెలు లాంటి నట్స్ మంచివి
పోస్ట్ ను కనీసం రెండు సార్లు చదవండి . బాగా అర్థం చేసుకోండి .
సరైన జీవన విధానమే ఆరోగ్యం .
ఆరోగ్యమే అసలు భోగం .. మహా సంపద !
సర్వే జనా సుఖినోభవంతు !

Monday, 19 September 2022

                                                     నిజాం చరిత్ర వాస్తవికత.

                                                       -------------------------------

స్వాతంత్ర్యం సిద్దించడానికి పూర్వం భారతదేశంలో ఆంగ్లేయులు నేరుగా పాలించిన ప్రాంతాలే కాక, దాదాపు 500 పైచిలుకు సంస్థానాలుండేవి.  అన్నింటికంటే పెద్ద సంస్థానం  హైదరాబాద్. దీని విస్తీర్ణము 82,698 చ.మై. అతి చిన్న సంస్థానము గుజరాత్ లోని "బిల్బరి." అప్పటి నిజాం సంస్థానంలో 88% హిందువులు బానిసలే.

నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ 1911లో పట్టాభిషిక్తుడు అయినాడు. ఈయనకు 42 మంది ఉంపుడుగత్తెలు, 7గురు భార్యలు, మొత్తం 149 మంది సంతానం. పెద్ద భార్య కొడుకు AZAM ZA మీర్ హిమాయత్ అలీఖాన్. ఈయనకు 1931లో ఖలీఫా కూతురుతో పెళ్ళైంది. రెండో కొడుకు మీర్ షుజాత్ అలీఖాన్ కు ఖలీఫా దగ్గరి బంధువు కూతురుతో  పెళ్ళి జరిగింది.

నిజాం తన రాజ్యాన్ని పూర్తి స్థాయి ముస్లిం రాజ్యంగా మార్చే ప్రక్రియ మొదలెట్టాడు. అందుకు ఆయన మొదట విద్యారంగాన్ని ఎంచుకొన్నాడు. హిందువులు స్వయంగా నడుపుకునే ఖాన్గీ బడులను నియంత్రించటం మొదలెట్టాడు. 4053 పాఠశాలల నుండి 776 కు తగ్గిపోయాయి. విద్యార్థుల సంఖ్య 76,654 మంది నుండి 27,506 కు తగ్గింది. "సుల్తాన్-ఉల్-ఉలూమ్" అంటే విద్యలరాజుగా బిరుదు తగిలించుకొన్న ఈయన 1929లో నారాయణగూడాలో ఒక బాలికోన్నత పాఠశాల స్థాపిస్తే అది హిందువులదనే మిషతో అనుమతి నిరాకరించాడు. గత్యంతరం లేక నిర్వాహకులు కార్వే విశ్వవిద్యాలయం నుండి అనుమతి తెచ్చుకొన్నారు.1917లోనే తెలుగు మీడియం నిషేదించాడు. 1918లో అక్బర్ హైదరీ ప్రోద్భలంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించాడు. కానీ అందులో FACULTY OF THEOLOGY  అనే ముస్లిం మత విద్య ప్రవేశపెట్టాడు. 1938లో వందేమాతర ఉద్యమాన్ని నిషేధించాడు.......

ఇస్లాం సిద్ధాంతం ప్రకారం అల్లా ఒక్కడే దేవుడు. సృష్టిని కాదు, సృష్టికర్తను ప్రార్దించాలనేది వారి విశ్వాసం. విగ్రహారాధన, ప్రకృతి ఆరాధన, వ్యక్తి పూజకు ఇస్లాం వ్యతిరేకం. కాని నిజాం ప్రభువు స్థుతింపుతోనే విద్యా సంస్థలు ప్రారంభమయ్యేవి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయలకు శుక్రవారం సెలవుండేది. ముస్లిం పండుగలకు సెలవుండేది. ఇక హిందువులు పండుగలు జరుపుకోవడం చాల కష్టతరమైనది. ప్రభుత్వోద్యాగాలు 90% పైచిలుకు ముస్లింలకే దక్కేవి. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంగ్లోపన్యాసాకులు "అబ్దుల్ లతీఫ్" EXCHANGE OF POPULATION జనాభా మార్పిడి అనే సిద్ధాంతం ప్రతిపాదించాడు. దీని ప్రకారము హిందువులు హింసకు గురికాకుండా వుండాలంటే ఈ ప్రాంతాన్ని వదిలి పోవాలి. ఇక్కడ ముస్లిం జనాలతో నింపేయాలి. ఈ సిద్ధాంతం ప్రభావము వల్ల 1948 వరకు 8 లక్షల ముస్లిం జనాభా వచ్చి చేరారంటే హిందువులు ఎంత హింసకు గురైనారో తెల్సుకోవచ్చు.

అంజుమనే తబ్లిగ్ ఇస్లామ్ అనే సంస్థ మతమార్పిడులు చేసేది. దీనికి విరుగుడుగా ఆర్యసమాజం శుద్ది ఉద్యమం ద్వారా మతం మారిన వారిని తిరిగి హిందూమతంలోకి పునరాగమనం చేయించేవారు. ఆర్యసమాజం 1892లో సుల్తాన్ బజారులో ప్రారంభమైంది. అంజుమనే తబ్లిగ్ ఇస్లాం పీసర వీరన్న అనే దళితున్ని సర్దార్ అలీ గాను, దొడ్డి కొమురయ్య సొంత అన్న దొడ్డి మల్లయ్య ను ఖాదర్ అలీ గా మార్చింది. నిజాం తను సెక్యులర్ అనిపించుకోవాలని ఆర్యసమాజం మరియు అంజుమనే తబ్లిగ్ ఇస్లాం సంస్థలను నిషేధించాడు. కానీ మరోవైపు 1920లో బహాదూర్ యార్ జంగ్ ఆధ్వర్యంలో MIM మజ్లీస్ ఇత్తే హాదూల్ ముస్లిం అనే సంస్థ నిజాం ఆశీస్సులతో ప్రారంభం అయ్యింది..................

MIMమొదట ఒక సాంస్కృతిక సంస్థగా ప్రారంభమయ్యింది. కాని అనతి కాలంలోనే పూర్తి మతోన్మాద సంస్థగా అవతరించింది.

బహాదూర్ యార్ జంగ్ ఆకస్మిక మరణం తరువాత అబుల్ హసన్, తరువాత మజహర్ అలీ కమాల్, తదుపరి ఖాసీం రజ్వీ, ఆ తరువాత సలావుద్దిన్ ఒవైసి, అసదుద్దిన్ ఒవైసి అధ్యక్షులయ్యారు. MIM ముఖ్య లక్ష్యం మతమార్పిడులు మాత్రమే కాదు ఇతర ప్రాంతాలనుండి పెద్ద మొత్తంలో ముస్లింలను దిగుమతి చేయటం. MIM హిందువులపై చేసిన దురాగతాలు చరిత్రలో మాయని మచ్చలని ప్రముఖ తెలంగాణా పోరాట యోధుడు "రఘువీర్ నారాయన్ లక్ష్మికాంత్ శ్రీనివాస్ రామ్ రాజా కాళోజి " పేర్కొన్నాడు.

నిజాం పాలనలో వ్యక్తి స్వేచ్ఛ, భావప్రకటన అనేదే లేదు. తెలుగులో ఒక పత్రిక స్థాపించడానికి నానా యాతన పడాల్సి వచ్చింది. చివరకు "గోలకొండ " అనే పేరు పెడితే గాని అనుమతి లభించలేదు.

కాళోజి నారాయన్ రావుగారు, పెండ్యాల రాఘవరావుగారు మరికొందరు ఆర్యసమాజం సభ్యులు వరంగల్ తాలూకా పల్లగుట్ట, రాజారాం గ్రామాలలో పర్యటించి, MIM చేత బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డ దళితులను తిరిగి "శుద్ధి " కార్యక్రమం ద్వారా  హిందూధర్మంలోకి పునరాగమనం చేయించారు.

-------------------------------------

హిందూధర్మం పై కుట్ర - 1

-------------------------------------

నిజాం ప్రభుత్వంలో "ఉమూర్ మజహార్" అనే దేవాదయ శాఖా ద్వారా "దీన్ దార్" అనే సంస్థకు నిధులందేవి. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని "ఆసీఫ్ నగర్ "లో వుంది. దీన్ దార్ నాయకుడు "సిద్దీఖీ దీన్ దార్". ఈయన తనకుతాను చెన్న బసవేశ్వరుడి అవతారుడుగా చెప్పుకొన్నాడు. 1929 లో లింగాయత్ సాంప్రదాయానికి ఆధునిక రూపమే ఇస్లాం అనే వాదన చేశాడు. హిందూదేవతలను అవమాన పరుస్తూ, హిందువులంతా ఇస్లామ్ లోకి మారాలని ప్రచారం చేసేవాడు. మతమార్పిడులు చేసేవాడు. తను కల్కి అవతారమాని, వీరభోగవసంత రాయడనని, నిజాం అవతార పురుషుడని, అతని ప్రస్తావన వేదాలు, ఖురాన్ లో వుందని వంచించే ప్రయత్నం చేశాడు. హిందూ దేవాలయాలు ద్వంసం అవుతాయని, గాంధీ ఇస్లామ్ స్వీకరిస్తాడని, నెహ్రూ మానసికంగా ముస్లిం అవుతాడని జోస్యం చెప్పాడు. హుబ్లీ, ధార్వాడ్, గుల్బర్గా, బీదర్ లలో అనేక మంది మతమార్పిడి గావింపబడ్డారు. కాని చాలామందిని తిరిగి హిందూధర్మం లోకి ఆర్యసమాజం తీసుకొని వచ్చింది. అందువల్ల ఆర్యసమాజం నాయకుడు అయిన స్వామి శ్రద్దానందను 1926 డిసెంబరు 23 న నిజాం హత్య చేయించాడు............

-----------------------------------

హిందూ మతం పై కుట్ర--2

------------------------------------

బీహార్ నుండి సర్ అలీ ఇమాం, సర్ హసన్  ఇమాం అను ఇరువురు నిజాం సంస్థానానికి వచ్చారు. సర్ అలీ ఇమాంను తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు నిజాం. వీరు మంచి విద్యావంతులు, కాని ఒక కొత్త కుట్రకు తెర లేపాడు సర్ అలీ ఇమాం. అదేమిటంటే గోదావరి లోయ, రామగుండం, గోదావరి ఖని, పాల్వంచ, చెన్నూరు, ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో అఫ్ఘనిస్తాన్ లోని వజీరిస్తాన్ నుండి వేలాది పఠాన్ కుటుంబాలను తరలించి, స్థానిక హిందువులను తరిమేయాలని చూశాడు. కాని ఈ కుట్ర మధ్యలో ఆగిపోయింది. హసన్ ఇమాం తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

-------------------------------------

హిందూమతం పై కుట్ర----3

-------------------------------------

అల్లా మమష్రకి అనే వాడి పర్యవేక్షణలో "ఖాక్సర్"పార్టీ ని స్థాపించారు. ఇందులోని సభ్యులను "బేల్ఫా ఫౌజ్" అనే వారు. "బేల్ఫా"అంటే గొడ్డలి. గొడ్డలి ద్వారా హిందువులను అంతం చేయడమే ఈ పార్టీ ముఖ్యోద్దేశం.

-----------------------------------

హిందు మతం  పై  కుట్ర - 4

------------------------------------

హిందూ నగరాల పేరు మార్పు. 1.భాగ్యనగర్ -హైదరాబాద్. 2.వీరపట్టణం-ఇబ్రహిం పట్నం. 3.ఇందూరు -నిజామబాద్. 4.పాలమూరు-మహాబూబ్ నగర్. 5.మానుకోట-మహబూబా బాద్. 6.ఎదులాపురం-ఆదిలాబాద్.. ఇలా ఎన్నో ఉన్నాయి.

-------------------------------------

హిందూమతం పై కుట్ర - 5

-------------------------------------

హిందువులను ఆర్థికంగా అణిచివేసి తద్వారా మతమార్పిడి చేయాలని నిజాం భావించాడు. అందుకోసం MIM/రజాకర్లను వాడుకొన్నాడు.

1.హిందువుల పై పన్నులు పెంచడం.

2.రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని రజాకర్లచే ధ్వంసం చేయించటం లేదా దొంగిలించటం. 

3.విద్యా, ఉపాధి అవకాశాలు దెబ్బతీయటం.

4.దాదాపు 88% ఉన్న తెలుగు ప్రజలకు విరుద్ధంగా ఉర్దూ ను ప్రవేశపెట్టడం. నిజానికి పాకిస్తాన్ పిత అయిన "మహ్మద్ అలి జిన్నా" కు ఉర్దూ రాదు. ఆయన మాతృభాష గుజరాతి.

5.మిల్లు కార్మికుల సంఖ్య 20 వేలు అయితే అందులో 15 వేలమంది ముస్లింలే.

6.ప్రభుత్వోద్యోగులు 60 వేలయితే 46 వేల మంది ముస్లింలే.

7.పోలీసుల సంఖ్య 52000 అందులో 46000 పైచిలుకు ముస్లింలే.

నిజాం రాజు మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటిష్ వారికి ఆర్థిక సహాయం అందించాడు. అందుకుగాను "HIS EXALTED HIGHNESS" అనే బిరుదు పొందాడు. నిజాం క్రైస్తవుల యెడ ఉదారంగా వుండేవారు. కాని 1914లో ప్రారంభమైన మెదక్ పాస్నెంట్ చర్చ్ 1924 లో పూర్తి అయ్యింది. ఈ చర్చ్ చార్మినార్ కంటే ఎత్తుండకూడదని 173 అడుగుల కే అనుమతించాడు. చార్మినార్ ఎత్తు 175 అడుగులు.

-----------------------------------------------------

నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఒక ధన పిశాచి

------------------------------------------------------

1.సర్ఫే ఖాస్ నుండి వచ్చే ఆదాయం కాకుండా సంవత్సరానికి 70 లక్షాల ప్రజాధనం వాడుకునేవాడు.

2.కోఠీలో కమాల్ ఖాన్ అనే పెద్ద జాగీర్ధార్ అద్భుతమైన భవనం  నిర్మించుకొన్నాడు. అది చూడడానికి వచ్చిన నిజాం దాని అందానికి ముగ్దుడై, ఆ భవనాన్ని తనకు బహుమతిగా ఇవ్వాలని ఆదేశించాడు. దాంతో చేసేది లేక కమాల్ ఖాన్ ఆ భవనాన్ని ఇచ్చాడు. అదే కాలక్రమంలో కింగ్ కోఠి గా పిలువబడుతోంది.

3.ఎవరైనా రెండు అష్రఫీలు (తులం బంగారం ) నజరాన ఇస్తే, జంగ్, నవాబ్ జంగ్, యార్ జంగ్ బిరుదులు ఇచ్చేవాడు. 

4.భూమిశిస్తుతో పాటు ప్రతీ రూపాయికి ఒక అణా లోకల్ ఫండ్, అర అణ బంచ్ రాయ్, ఒక అణా నిజాంకు నజరాన ఇచ్చేవారు.

5."సాల్ గిరా"అనే రాజు పుట్టిన రోజు పండగకు కానుకలు సమర్పించటం ఆనవాయితీ.

6.జాగిర్దార్లు చనిపోతే వారసుల నుంచి నజరాన స్వీకరించి ఆస్తి మార్పిడి చేయటం, వారసులు కనుక లేకపోతే ఆస్తి జప్తు చేయటం జరిగేది.

7.నిజాం ప్రతిరోజూ కొత్త బట్టలు ధరించే వాడు. బట్టలు కుట్టడానికి ఆస్థాన దర్జీలు ఉండేవారు.

8.నగరంలో ఎవరైనా కొత్తకారు కొంటే, అది గనుక నిజాం కు నచ్చితే చాలు, అది దక్కించుకొనేవాడు. ఇలా వందకార్ల పై చిలుకు దక్కించుకొని, ప్రపంచంలోనే అత్యధిక కార్లు వున్న రాజుగా పేరుగాంచాడు.

9.నిజాం పర్యటనకు వెళుతున్నప్పుడు మధ్యలో పెళ్ళిళ్ళు జరుగుతుంటే, ఆ పెళ్ళి కూతుళ్ళు గనుక నిజాంకు నచ్చితే వెంట తీసుకెళ్ళేవాడు.

----------------------------------

రజాకర్ల/MIM ల నరమేధం

------------------------------------

1.నవంబర్ 2,1946లో పాత సూర్యాపేట పై అర్థరాత్రి దాడిచేసి అమాయక జనాలను ఊచకోత కోయడం.

2.డిసెంబర్ 1,1946 నాడు మల్లారెడ్డిగూడెంపై దాడిచేసి చింద్రాల గురవమ్మ, బొండమ్మ, అంకాలమ్మ అనే దళిత మహిళలను అవమానకర పద్దతులలో చంపారు.

3.ఆగస్ట్ 11 1946లో ఆదివారం రోజున వరంగల్ తూర్పు కోట ముస్లిం లు మరియు 200 మంది రజాకర్లు ఖాసీం షరీప్ నాయకత్వంలో మొగిలయ్య గౌడ్ ఇంటిపై దాడిచేసి, అతని పొట్టలో బర్సిని దింపి పేగులు  లాగి చంపాడు షరీఫ్. మొగిలయ్యగౌడ్ అన్న అయిన రామస్వామి గౌడ్ ను కూడా కిరాతకంగా చంపి వారి రక్తాన్ని షరీఫ్ తన ముఖానికి రాసుకొని వారి తల్లిని కొట్టి, విజయగర్వంతో బర్సిని పైకెగరేసుకుంటూ వరంగల్ నగరంలో ఊరేగాడు.

4.ఆగస్టు 14, 1946లో ప్రముఖ డాక్టర్ నారాయణ రెడ్డిగారు పేదల వైద్యుడు గా పేరొందాడు. ఆయన వద్ద ముస్లింలు కూడా ఉండేవారు. అందులో వరంగల్ నగర MIM అధ్యక్షులుకూడా వున్నారు. కాని ఆ డాక్టరు ను చంపిన వారిలో MIM అధ్యక్షుడు ప్రధాన సూత్రదారి అని కాళోజి నారాయణరావు ఆరోపించారు.

5.మార్చ్ 14.1948 లో హుస్నాబాద్ కు సమీపంలో మంగాపురం కొండలవద్ద కరినగర్ సింహాం, అనభేరి ప్రభాకర్ రావును మరియు మరో 9 మందిని అతి కిరాతకంగా చంపారు.

6.మార్చ్ 14 1948 లో బసిరెడ్డి పల్లెలో సిరిసిల్లా తాలూకా ముద్దుబిడ్డ సింగిరెడ్డి భూపతి రెడ్డిగారిని దారుణంగా చంపారు.

7.మిట్టా యాదవ రెడ్డి సహా తాటికొండ పోరాటంలో 30 మంది యువకులను రకరకాలుగా హింసించి జీవచ్ఛవాల్లాగా మార్చారు.

8.సెప్టెంబర్-1 1948 లో జోడేన్ ఘాట్ లో కొమురం భీం సహ 12 మంది గిరిజనులను అమానుషంగా హత్య చేయటం.

9.పాలకుర్తిలో చాకలి ఐలవ్వ పోరాట తీరు మరువ లేనిది.

10.వేంకటేశ్వర పల్లే మక్తేదార్ మొఘల్ మియా అలియాస్ సలావుద్దిన్. ఈయన ఆకృత్యాలు చెప్పనలవి కానివి. అందమైన స్త్రీలు కనిపిస్తే చాలు, వారిని వారి కుటుంబ సభ్యుల ముందే రేప్ చేసేవాడు. ఎదురుతిరిగితే వారి ఇండ్లు, గడ్డివాములు ధ్వంసం చేసేవాడు.

11.హిందూ స్త్రీలను ముస్లింలు అపహరించుకు పోవటం పరిపాటి. "ఓడపల్లి సత్తెయ్య అనే దర్జీ కూతురును మహ్మద్ ఖాసీం ఎత్తుకెళ్ళాడు. ఇంకా కొత్తగట్టు జనార్దన్ కూతురును, మొగళ్ళపల్లెలో ఒక విశ్వబ్రాహ్మణ స్త్రీని, రాజుపేటకు చెందిన ఒక మూగ స్త్రీ ని ముస్లింల చెరనుండి ఆర్యసమాజం కాపాడింది. ఇలాంటి సంఘటనలు వేలాదిగా జరిగాయి. ఇవి మచ్చుకు కొన్నిమాత్రమే.

12. 1947 ఫిబ్రవరి లో హుజూరాబాద్ తాలూకా మల్లంపల్లి కి చెందిన గోనే కొమురయ్యను పశువుల కొట్టంలో కట్టివేసి నిప్పంటించి సజీవ దహనం చేశారు.

13.ఆగస్టు 21 1948 న రాత్రి 10 గంటలకు ఇమ్రోజ్ పత్రికా స్థాపకులు షోయబుల్లాఖాన్ ను చంపి శరీరాన్ని ముక్కలు చేసి తలను ఖాసీం రజ్వీ కి బహుమతి గా పంపాడు"అబ్దుల్ మునీం ఖాన్".

14.చింతలగూడెం నివాసి, చింతపట్ల మల్లయ్యను పట్టుకొని ఆయన కొండనాలుకకు, పెద్దనాలుకకు సూదితో కుట్టు వేసి హింసించి, ప్రతి ఇంటినుండి ఒక కట్టెను అడుక్కోమని చెప్పి, ఆ కట్టెలపై అతన్ని సజీవ దహనం చేశారు.

15. 1947లో గాండ్లాపూర్ లో హిందూ స్త్రీల చే నగ్నంగా బతుకమ్మ ఆడించారు.

16.నేరడ గ్రామంలో 70 మంది స్త్రీలకు ఫైజామాలు తొడిగించి అందులోకి తొండలను వదిలారు.

17.మిర్యాలగూడ లోని నడిగడ్డ గ్రామంలో చాకలి లచ్చమ్మను తలకిందులుగా చెట్టుకు వేళాడదీసి చిత్రహింసలు పెట్టారు.

18. ఏప్రిల్ 10, 1948 న పాలమూరుజిల్లాలోని బోర్ పల్లి పై దాడిచేసి దళిత యువకుల పురుషాంగాలకు కిరోసిన్ తో తడిపిన గుడ్డలు కట్టి నిప్పంటించారు. వారు హాహాకారాలు చేస్తుంటే వారి భార్యలను మానభంగం చేశారు. ఆ అవమానం తట్టుకోలేక దళిత యువతులంతా ఆత్మహత్య చేసుకొన్నారు.

19.హిందూ స్త్రీల రొమ్ములను పట్టుకారుతో లాగడం, పిరుదులపై గిల్లటం, తల్లుల యెదుటే కూతుళ్ళను మానభంగం చేయటం సర్వసాధారణం.

20.జూలై 5 1948 న గుల్బర్గా లోని సైదాబాద్ లో 15 మందిని, హుజూర్ నగర్, మిర్యారగూడలోని నీలాయగూడెంలో 21మందిని, మానుకోట తాలూకా బలుపాలో 15 మందిని, ఇల్లందు తాలూకా సీమలపాడులో 70 మందిని, జనగామా తాలూకా నర్మెట, నంగునూరులో 80 మందిని చెరిచారు. నగరంలో ఒక స్త్రీని చెరిచి, చంపి రోడ్డు ప్రక్కన పడేసి పోయారు. భువనగిరి తాలూకా నారిగూడెంలో పచ్చిబాలింత పై, ఎనుపాడులో నిండుగర్భిణి పై అత్యాచారం చేశారు రజాకర్లు.

21. ఆగస్టు 27 1948 న 400 మంది నిజాం సైనికులు బైరాన్ పల్లి పై దాడిచేసి 118 మందిని వరుసగా నిలబెట్టి కాల్చిచంపారు. ఈ దాడిలో నల్గొండ జిల్లా కలెక్టరు మొహాజ్జం హూసేన్, డిప్యూటి కలెక్టరు ఇక్బాల్ హాసీం స్వయంగా కాల్పులు జరిపారు. శవాలన్నింటిని ఊరి బయట పాడుపడిన బావిలో పడేశారు. అందులో ఒక సజీవ శిశువు కూడా వున్నారు.

ఈ దాడితో ప్రభుత్వం కూడా ఇస్లాం రాజ్యస్థాపన కోసం ప్రయత్నించినట్లు ప్రపంచం గుర్తించింది. హిందువులను హింసించటం, వారి శరీర భాగాలను నరికి వారితోనే తినిపించటం అనేది MIM/రజాకర్లకు సంతోషాన్నిచ్చే ఒక పైశాచిక క్రీడ.

విడ్డూరమైన విషయం ఏమిటంటే సెప్టెంబరు 17ను మహారాష్ట్ర లో "మరాఠ్వాడా సంగ్రామ్ ముక్తి దివస్" పేరున, కర్ణాటకలో "హైదరాబాద్-కర్ణాటక విభజన దినం"  పేరున ప్రతి సంవత్సరం అధికారికంగా, నిర్వహిస్తూ, జాతీయ జండా ఎగురవేస్తారు. పోరాటయోధుల కుటుంభ సభ్యులను/వారసులను సత్కరిస్తారు.

సంప్రదించిన పుస్తకాలు 

1.తెలంగాణా సాయుధ పోరాటం 

2.హైదరాబాద్ జీవిత చరిత్ర

3.FREEDOM AT MIDNIGHT

 

ఏడ్చే వాళ్ళు 



స్వచ్ఛ భారత్ అంటే ఏడ్చావు 

గంగానది ప్రక్షాళన కి ఏడ్చావు 

రామ మందిరానికి ఏడ్చావు 

రాఫెల్ వస్తే ఏడ్చావు 

ఆర్టికల్ 370 రద్దుకి ఏడ్చావు 

అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కి ఏడ్చావు 

బూట్లు చూసి ఏడ్చావు 

నోట్లు రద్దు కీ ఏడ్చావు 

జేబులో పెన్ను కి ఏడ్చావు 

GST పన్నుకీ ఏడ్చావు 

గెడ్డం చూసి ఏడ్చావు 

కట్టుకున్న గుడ్డని చూసీ ఏడ్చావు

ప్లాట్ ఫాం టికెట్టు కి ఏడ్చావు 

పటేల్ విగ్రహాని కీ  ఏడ్చావు 

తిరంగా ఎగిరితే ఏడ్చావు 

త్రిబుల్ తలాక్ కీ ఏడ్చావు 

నెమలిని ముట్టుకుంటే ఏడ్చావు 

కెమెరా పట్టుకున్నా ఏడ్చావు 

అంబానీ పై ఏడ్చావు 

అమ్మకి దణ్ణం పెట్టినా ఏడ్చావు

అద్వానీ పై ఏడ్చావు 

అదానీ పై కూడా ఏడ్చావు 

కాశీ కారిడార్ కి ఏడ్చావు 

కాశ్మీర్ లో ఇంటెర్నెట్ ఆపినా ఏడ్చావు..

చప్పట్లు అంటే ఏడ్చావు 

దీపం వెలిగించినా ఏడ్చావు

రెండు వ్యాక్సిన్లు వేసుకున్నావు

రెండేళ్లు రెండు రేషన్లు మాత్రం తిన్నావు..

ఎనిమిదేళ్లుగా ఏడుస్తున్న నీ ఏడ్పుల్లో ...

బాంబు గానీ , స్కామ్ గానీ వుందేమో ఒక్కసారి వెతుక్కో...

  వారణాశి (కాశీ) ఆలయాలు
















త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల సంకల్పంతో కాశీకి విశిష్టస్థానం ఏర్పడింది. శివకేశవులు ఒకేచోట నివాసమున్న క్షేత్రం వారణాశి (కాశీ). మహావిష్ణువు బిందుమాధవునిగా, శివుడు విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వెలుగొందుతున్న పవిత్రప్రదేశం వారణాశి. పుణ్యక్షేత్రములు ఆన్నిటిలోనూ వారణాశికి ప్రత్యేక స్థానం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9 వది వారణాశిలోని విశ్వనాధ జ్యోతిర్లింగం. ముక్కోటి దేవతలు ప్రతిరోజూ సూర్యోదయం ముందు హిమాలయాల్లోని మానససరోవర్ నందు స్నానంచేసి కైలాసపర్వంతంపై పార్వతీ సమేతుడై కొలువున్న శివుని పూజిస్తారని పురాణాల్లో వ్రాయబడింది. ఆవిధంగానే దేవతలు వారణాశినందు గంగానదికికల 84 స్నాన ఘట్టములందు ముఖ్యమైన మణికర్ణిక ఘాట్ నందు అదృశ్యరూపులై ఇప్పటికినీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్నానంచేసి విశ్వనాధుని సేవిస్తారని చెప్పబడినది. ముక్కోటి దేవతలు వివిధరూపాల్లో నివసించు క్షేత్రం వారణాశి. మానససరోవరం, కైలాసపర్వతం దర్శించడానికి శారీరక మరియు ఆర్ధికస్థోమత అవసరం. కానీ వారణాశి (కాశీ) నందు విశ్వనాధుని దర్శించడానికి అనేక ప్రయాణ సాధనాలు కలిగి సులువుగా చేరుకోడానికి వెసులుబాటు ఉన్నది. ఎయిర్ పోర్టు నుండి వారణాశి పట్టణం 20 కి.మీ దూరంలో ఉంది.వారణాశి దేశంలోని అన్నినగరాలనుండి రైళ్లతో కలుపబడి ఉంది. బసకు, భోజనమునకు యాత్రికులకు మద్యతరహా మరియు ఉన్నతశ్రేణి హోటళ్లు, ఆశ్రమాలు మరియు సత్రములు ఉన్నాయి. వారణాశి విశ్వనాధ దేవాలయంవద్ద శ్రీ అన్నపూర్ణ మఠ మందిరంనందు కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ నిర్వహణలో యాత్రికులకు అన్నదానం మరియు పరిమిత వసతి కేటాయింపు సౌకర్యం కలదు. కాశీలో అధికాబాగం ఆశ్రమములు మరియు సత్రములందు ఉచిత వసతి సదుపాయంలేదు. వారణాశిలో బస మరియు భోజనము లభ్యమగు సత్రములు మరియు ఆశ్రమముల వివరములు కాశీవాసం అను ప్రత్యేక కధనంలో వివరిస్తాం.
కాశీ అనేది సృష్టి ప్రారంభంలో శివుడు స్వయంగా నిర్మించిన నగరం మరియు కైలాస పర్వతం తర్వాత అత్యంత ప్రియమైన నివాసం. వారణాశి (కాశీ). సప్తమోక్షద్వారాలలో ఒకటి. ప్రళయకాలంలో పరమేశ్వరుడు త్రిశూలంపైన వారణాశినగరం కాపాడుతాడని గ్రంధాలు చెపుతున్నాయి. పుణ్యకార్యాలు చేసినవారికి కాశీప్రవేశం లభిస్తుందని, కాశీదర్శిస్తే పునర్జన్మనుండి విముక్తి కలిగుతుందని పురాణాల్లో చెప్పబడింది. కాశీలో మరణించిన జీవి కుడిచెవిపైకి లేచిఉంటుంది. శివుడు జీవికుడిచెవిలో తారకమంత్రం ఉపదేశించి ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాశీవాసంతో సమస్త యాగాలు, తపస్సులు చేసినపుణ్యం సంప్రాప్తిస్తుందని స్థలపురాణం. చనిపోయినవారి చితాభస్మం గంగానదిలో నిమజ్జనం చేస్తే, వారు కాశీలో జన్మించి, పరమశివుని వల్ల మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. కాశీలో ఆవులు పొడవవు. శవాలుకాలుతున్నా వాసన రావు, విశ్వేశ్వరునికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. కాశీక్షేత్రంలోచేసిన పాపపుణ్యములు కోటిరెట్లఫలితం ఇస్తాయని నానుడి. విశ్వనాథుణ్ణి అభిషేకించిన పిమ్మట చేతిరేఖలు మారతాయిఅని భక్తులనమ్మకం.
దేవతలండరు అలంకారప్రియులు. ఎటువంటి ఆభరణములు ధరించక మెడచుట్టూ నాగరాజు, సిగపై చంద్రవంకతోపాటు నడుముకు ఏనుగు చర్మంధరించి శరీరంపై బూడిద పులుముకొని ఎందుకు నివసిస్తున్నారని పార్వతి శివుడిని అడిగింది. శ్మశాన వాటికలో నివసించే ప్రేతాత్మలవల్ల పుణ్యకార్యాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు బ్రహ్మదేవుడు తనను శ్మశాన వాటికలో నివసించాలని కోరుకున్నందున తాను శ్మశానంలో నివసిస్తున్నానని శివుడు చెప్పాడు. ధనవంతుడు,నిరుపేద తారతమ్యం లేకుండా మరణించిన పిమ్మట ప్రతిమనిషి శ్మశానానికే చేరుతారనే విషయం ప్రజలు గుర్తించడానికే తాను శ్మశానంలో ఉంటున్నానని తెపిపాడు. అంతేకాక ప్రతివారు జీవించి వున్నంతకాలం అందరూ నావాళ్ళు అనుకుంటారు., మరణించిన పిమ్మట బంధువులు శవాన్ని శ్మశానంలో ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారని మరణించిన వారికి తాను తోడుగా ఉన్నానని చెప్పేందుకే అక్కడ నివశిస్తున్నట్టు శివుడు పార్వతికి తెలిపాడు. చనిపోయినవారి ఆత్మలు అనంతంలో కలిసిపోయే శ్మశాన వాటిక అని, కాశీ ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక అని, భూలోకంలో మృత్యుభయం లేకుండా మరణించే ప్రదేశం కాశీఅని, కాశీలో మరణించిన వ్యక్తి చెవిలో తాను తారక మంత్రం ఉపదేశించి పునర్జన్మ లేకుండా మోక్షం ప్రసాదిస్తానని శివుడు పార్వతికి వివరించాడు.
విశాలాక్షిశక్తిపీఠం కొలువైఉండి జగత్తుకి ఆహారంపెట్టే అన్నపూర్ణ నివాసస్థలం వారణాశి. విశ్వనాథ దేవాలయం గతంలో రాజులచే నిర్మించబడిన ఇతర ఆలయాలతో వైభవంగా ఉండేది. మహమ్మదీయులు కాశీని లక్ష్యంగాచేసుకొని జరిపిన దండయాత్ర లందు విశ్వనాధ ఆలయం ధ్వంసం చేయబడగా తరవాత కాలంలో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ పాలనలో ఆలయం పునరుద్ధరణ చేయబడింది. విశ్వనాధ ఆలయం ఇటీవల పునరుద్ధరించబడి గోపురంతోపాటుగా గర్భాలయం బంగారురేకు తాపడంతో రూపుదిద్దుకొంది. విశ్వేశ్వరుని నామస్మరణ, కాశీ క్షేత్ర దర్శనం వలన మోక్షం లభిస్తుంది. కాశీలో కల ప్రముఖమైన ఆలయాలు ఉదహరిస్తున్నాం.
విశ్వనాధ ఆలయం
సానందమానందవనే వసంతం
ఆనందకందం హతపాపవృందమ్
వారాణశీనాథ మనాథనాథం
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
కాశీవిశ్వనాథ్ ఆలయము ద్వాదశ జ్యోతిర్లింగములలో 9వ జ్యోతిర్లింగం. ఆలయం గంగానది పశ్చిమ ఒడ్డుపై ఉన్నది. విశ్వనాధుడు అనగా విశ్వము లేదా ప్రపంచమునకు నాధుడు లేదా దైవం. విశ్వనాధఆలయం మొఘల్ రాజూ ఔరంగజీబు పాలనలో ధ్వంశం చేయబడి అందులో వారిచే మసీదు నిర్మాణం చేయబడి, పిమ్మట మరాఠారాణి అహల్యాభాయిచే మసీదుకుచేర్చి ఆలయం పునర్నిర్మాణం చేయబడినది. దర్మిలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వము ఆధీనములోనికి వచ్చినది. ఇటీవలనే ఆలయం కొత్తసొగసులతో నవీకరించబడి గర్భాలయం బంగారురేకు తాపడంతో రూపుదిద్దుకొంది. దేశములో అధికఆధాయము
కలిగిన 5 ఆలయములలో విశ్వేశ్వరఆలయము ఒకటి. ధనస్సురాశికి చెందిన స్త్రీ పురుషులు వారణాశినందు విశ్వనాధ్ జ్యోతిర్లింగం దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది. విశ్వనాధ జ్యోతిర్లింగం పూర్తి సమాచారం ద్వాదశ జ్యోతిర్లింగాలు నందు ipltours.in web site లో తెలుసుకోవచ్చును.
దుండి గణపతి మందిరం కాశీవిశ్వనాధ మందిరమునకు ముందుగా అన్నపూర్ణ ఆలయమునకు చేరువలో సాక్షివినాయకమందిరం కలదు. యాత్రనందు ఎటువంటి ఆటంకములు కలుగకుండా గణపతి దర్శనము చేసుకొనెదరు. మరియు కాశీయాత్ర చేసినట్లు సాక్షిగా గణపతికి నమస్కరింతురు. దారి మార్గమునకు కొంచెముపైన ఈగణేశప్రతిమ ఉన్నది. ఈప్రతిమ వెండిచేతులు, దంతము, పాదములు, చెవులు కలిగి మిక్కిలి రమ్యము మరియు ఆకర్షణీయముగాను ఉంటుంది. ఈఆలయము మరాట
పేష్వాచే 18 వ శతాబ్ధాములో నిర్మించబడినది.
అన్నపూర్ణ ఆలయం
వినాయక ఆలయం తరువాత అన్నపూర్ణ ఆలయం కలదు.
వరుస క్రమములో వినాయకుని దర్శనం పిమ్మట విశ్వేశ్వర దర్శనం చేసుకొనెదరు. పిమ్మట అన్నపూర్ణ దర్శనం చేసుకొనెదరు. మతపరంగా ఈఆలయమునకు గుర్తింపుఉన్నది. పార్వతీదేవి మరోరూపంఅయిన అన్నపూర్ణ ఆకలితీర్చు దేవత. పేష్వా బాజీరావుచే ఈఆలయము నిర్మించబడింది. ఆలయంలో అర్చనకు ఉపయోగించు ముడిబియ్యం ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేసెదరు. భక్తులు ప్రసాదమును తమఇండ్లలో ఉంచుకొనిన అన్నపూర్ణాదేవి దయవలన గృహంలో భుక్తికిలోటు ఉండదని భక్తుల విశ్వాసం. పార్వతి అన్నపూర్ణాదేవిగా కాశీలో అవతరించ డానికి ఒకకధనం ఉంది.
బ్రహ్మ అయిదవ శిరస్సును ఖండించిన శివునికి కలిగిన బ్రహ్మహత్యా దోషంవల్ల శివుడు యాచకునిగా మారి బిక్షాటన చేయడం ప్రారంభించాడు. శివుడు భిక్షాటనయందు లీనమై మానవాళికి జీవనాధారమైన ఆహారం ప్రాముఖ్యత మరఛాడు. ఆహార ప్రాముఖ్యత శివునికి తెలియ జేయడానికి పార్వతీదేవి ప్రపంచంనుండి ఆహారాన్ని ఉపసంహరించి కాశీకి వచ్చింది. శివుడు భక్తులఆకలి బాధచూడలేక కాశీకివచ్చాడు. కాశీలో పార్వతి భక్తులకు అన్నపూర్ణేశ్వరి రూపంలో ఆహారం అందిస్తూ సేవ చేయడం చూశాడు. శివుడు ఆహారంకోసం పుర్రె గిన్నెగా చేసుకొని నిలబడ్డాడు. అన్నపూర్ణాదేవి శివుని గిన్నెలోకి ఒకగరిటె ఆహారాన్ని అందించింది. ఆఆహారంతో శివుని ఆకలితీరింది శివుని బ్రహ్మహత్యా దోషం సమసిపోయింది. శివునికోరికపై పార్వతి అన్నపూర్ణాదేవి అవతారంలో కాశీలో స్తిరపడింది. ప్రతి సంవత్సరం దీపావళి ముందురోజున, తరువాతిరోజున మొత్తము మూడు రోజులు బంగారు అన్నపూర్ణ ప్రతిమను ఆలయంలో భక్తుల దర్శనార్ధము ఉంచెదరు. బంగారుఅన్నపూర్ణాదేవిని లక్షలకొలదీ భక్తులు దర్శించెదరు.
చక్రేశ్వర్ లేదా యంత్రేశ్వర్ శివలింగం కాశీఖండంలో తెలిపిన ప్రకారం పార్వతీదేవి కాశీలో ఉన్న పవిత్ర తీర్ధముల వివరములు శివుని నుండి తెలుసుకొనవలెనని తలచినది. శివుడు చక్రేశ్వర్ శివలింగం గురించి తెలియచేస్తూ శివలింగంపై శ్రీ చక్రం ఉండటం వలన శక్తివంతము మరియు శుభప్రదమైనదని నిష్టగల గురువు పర్యవేక్షణయందు చక్రేశ్వరుని స్వచ్చమైన మరియు దీక్షతో పూజించవలసి ఉన్నదని తెలిపాడు. చక్రేశ్వర లేదా యంత్రేశ్వర శివలింగం అన్నపూర్ణాదేవి ఆలయం నందు ప్రవేశించగానే కుడివైపున ఉన్నది. ఆలయం అన్నివేళల తెరచిఉండును కావున భక్తులు ఎప్పుడైననూ చక్రేశ్వరుని దర్శించవచ్చును. ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా ఆలయంలో స్థానికంగా లభ్యమగు పూజారితో చేయించుకొవచ్చును.
విశాలాక్షి ఆలయం
దేశములోని అష్టాదశ శక్తి పీఠములుగా చెప్పబడు 18 శక్తి పీఠములలో విశాలాక్షి శక్తిపీఠం 17వ శక్తిపీఠం.. విశాలాక్షి శక్తిపీఠం గంగానది ఒడ్డున మీర్ ఘాట్ (మణిiకర్ణిక ఘాట్) వద్ద కాశీవిశ్వనాధుని ఆలయమునకు సమీపంలోఉన్నది. విశాలాక్షీదేవి ఆలయమునందు రెండువిగ్రహాలు ఉంటాయి. ఉత్సవమూర్తి పెద్దది, వెనుకభాగంలో చిన్నగాకనిపించే విగ్రహము శక్తిపీఠము. దేవిని ఆదివిశాలాక్షిగా భక్తులు అర్చిస్తారు. విశ్వనాధుని వైభవాన్ని కనులు పెద్దవిచేసి ఆశ్చర్యంగా చూసినదేవికావున విశాలాక్షి అనిపేరువచ్చిందని ప్రతీతి. వారణాశికి పూర్వనామము కాశీ అందువలన దేవి కాశీవిశాలాక్షిగా ప్రసిద్ధము. దేవీపురాణమునందు విశాలాక్షీదేవి ఆలయమును గురించి చెప్పబడినది.
మణికర్ణికా ఘాట్
వారణాశిలో గంగానదిఒడ్డునకల 64 ఘాట్లయందు ముఖ్యమైనది మణికర్ణికాఘాట్. కైలాసశిఖరం వద్ద మానససరోవర్ నందు ప్రతిరోజూ ప్రాతః కాలమున ముక్కోటిదేవతలు స్నానముఆచరించి శివపార్వతులను పూజించేదరని పురాణములందు తెలుప బడినది. ఆవిధముగానే వారణాశి మనికర్ణికా ఘాట్ నందు ప్రతిరోజూ అపరాహ్ణము అనగా మధ్యాహ్నం 12 గంటలకు దేవతలు మణికర్ణికాఘాట్ నందు స్నానము ఆచరించి విశ్వేశ్వరుని అర్చించేదరని తెలుపబడినది. అందువలన భక్తులు అదే సమయంలో మణికర్ణికాఘాట్ నందు స్నానంచేసేదరు. మరణించిన పూర్వీకులకు సద్గతులు ప్రాప్తించుటకు ఇచ్చటనే పిండప్రదానము చేసేదరు.
రత్నేశ్వర్‌మందిరం
మణికర్ణికా ఘాట్ నందు 1825-30 మధ్య నిర్మితమై ప్రస్తుతం శిధిలావస్థలోనున్న రత్నేశ్వర్‌ఆలయం లేదా మాతృకృష్ణమందిరం ఉన్నది. ఈఆలయం ప్రపంచంలో ఎనిమిదవ వింత అనిచెప్పుకునే ఇటలీ నందు 1372 సంలో నిర్మితమైయన లీనింగ్ టవర్‌ ఆఫ్ పిసా కంటే ఎత్తైనది. మణికర్ణిక ఘాట్‌ వద్ద వున్న ఈమందిరం 9 డిగ్రీల కోణంతో వంగివుండి 74 మీటర్లు ఎత్తు కలిగిఉంది. పీసాటవర్‌ కేవలం 4 డిగ్రీల కోణంతో 54 మీ ఎత్తు వుంటుంది. సుమారు 500 ఏండ్ల క్రిందట రాజా మాన్‌సింగ్‌ పాలనలో నిర్మితమైనదని 1825-30 మధ్య నిర్మితమైనదని నిర్మాణంపై విభిన్న కధనములు ఉన్ననూ ప్రపంచవింత అయిన దీనిగురించి పాఠ్యాంశాలలోకానీ చరిత్రలోకానీ ఎక్కడనూ ప్రస్తావించబడలేదు. ఆలయంలో మణికర్ణేశ్వరుడు లింగరూపంలో దర్శనంఇస్తాడు. ఆలయం అన్నివేళలా తెరచి ఉంటుంది.
కాలభైరవ మందిరం వారణాసిలోని దేవాలయాలలో కాలభైరవ దేవాలయం ముఖ్యమైనది. కాల భైరవుడు విశాలాక్షీదేవికి మరియు వారణాసికి రక్షకుడు. కాశీపట్టణమునకు క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాశీ సందర్శించినవారు ప్రతిసారి తప్పనిసరిగా కాలభైరవుని దర్శించవలసియున్నది. వారణాశి నందు బారోనాథ్ విశ్వేశ్వరగంజ్ సమీపంలో ఉన్న కాలభైరవ ఆలయమునకు హిందూమతంలో చారిత్రకంగా మరియు సాంస్కృతికపరంగా ప్రాముఖ్యత ఉంది. కాశీ విశ్వేశ్వరునికి భక్తుల ఆగమనముపై కాలభైరవుడు నివేదింస్తాడని ప్రసిద్ధి.
వ్యాసకాశీ లేదా సారనాధ్
గంగానదికి మరోవైపున వారణాశికి ఎదురుగా నందు సారనాధ్ రామ్ నగర్ కోట నందు వ్యాసమందిరంలో మహర్షి వేదవ్యాస స్థాపిత శివలింగం కలదు. కోటలోని మ్యూజియం నందు పూర్వపు రాజులువాడిన అనేకఖడ్గములు, పల్లకీలు, తుపాకులు బధ్రపరచారు. ఈఆలయము మహాభారత గ్రంధమును వ్రాసిన వేదవ్యాసమహర్షి పేరున పిలువబడుచున్నది. వ్యాసమందిరము తప్పనిసరిగా చూడవలసినప్రదేశము మరియు సంవత్సరం అంతయు మందిరము సందర్శకులతో నిండిఉంటుంది. వ్యాసమహర్షికికల అధికఅహంకారమునకు కోపగించి శివుడు వారణాశినుండి వ్యాసుని గంగకు ఆవలివైపున నివశించమని ఆదేశించినట్లు వ్యాసుడు కాశీ ప్రవేశం లేనందున రాంనగర్ నందు ఆలయం నిర్మించి ఇచట నివసించినట్లు తెలియుచున్నది. కాలభైరవునితోపాటు వ్యాసకాశీ దర్శించనిదే కాశీయాత్ర పూర్తి కాదు అనినానుడి
వారాహిదేవి ఆలయం
వారాహిదేవి మహాశివునిసోదరి అనిచెప్పబడినది. దశాశ్వమేధ ఘాట్ నకు 150 గ దూరంలో ఈఆలయమున్నది. ఆలయము ఉ 4-30 నుండి 10-00 వరకు మాత్రమే తెరచియుండి తరువాత మూసివేయబడుతుంది. స్థానికప్రజల సహకారముతో రోడ్డులోపల ఉన్నఆలయం చేరవచ్చును. వారాహిదేవి చాలా శక్తివంతమైనది మరియు భీకరమైనది. అందువలన నేరుగా చూచుట నిషిద్దము. వారాహి మాత నేలమాగళినందు ప్రతిస్టించబడినది. నేలపై రెండు గ్రానైట్ పలకలు తొలగించబడి ఉండును. ఒక రంద్రము నుండి పాదములు ఇంకొక రంద్రమునుండి లీలగా ముఖభాగము గోచరించును. పూజారితప్ప ఎవరికి నేలమాగళి ప్రవేశములేదు. పూజారి భక్తులతో అమ్మవార్ల యందు శాంతకళ, ఉగ్రకళ అని రెండు ఉండునని శాంతకళతో ఉన్నఅమ్మవారిని ఎదురుగావెళ్లి దర్శనంచేసుకోవచ్చు. ఉగ్రకళ అనగా దుష్టసంహరార్థం ఎత్తిన అవతారంఅని అందువలన ఆకలలోఉన్న వారాహి అమ్మవారిని సామాన్యులు చూసి తట్టుకోలేరని అందువలననే పైన పలకల ఖాళీనుండి చూడమని తెలుపుతారు. కాశీఖండంనందు వారాహిదేవిని దర్శించినవార్కి ఎటువంటిఆపదలు కలుగవని చెప్పబడినది.
వారాహిదేవి వరాహ అవతారం మరియు శక్తిస్వరూపమని ఈశక్తి వారణాశిని దుష్ట గ్రహములనుండి కాపాడునని, వారాహిదేవి రాత్రి సమయంలో కాశీపట్టణమును కావలికాసి సూర్యోదయమునకు పూర్వము ఆలయప్రవేశము చేయునని తెలియుచున్నది. అమ్మవారి ఉగ్రరూపం ఉపాసనచేయువారుతప్ప ఆన్యులు ఎవరూచూసి తట్టుకొనలేరని, పూర్వము పోతన మహాభాగవతం నందు యజ్ణవరాహము వ్రాయుసమయములో ఒకరాజు భాగవతమును అంకిత మివ్వమనిఅడిగి, పోతన ఆగ్రంధం శ్రీరామునికితప్ప ఇతరులకు అంకితమిచ్చుటకు నిరాకరించుట వలన అప్పటివరకూ పోతనవ్రాసిన భాగగతమును బలవంతంగా పొందుటకు సైన్యముతోరాగా అతిపెద్ద వరాహాము నిరోధించినది. అప్పుడు రాజు పోతనను క్షమింపకోరినాడు. పోతన వారాహిశక్తి కాపాడింది ఆని తెలిపినాడు.వారాహిదేవత వారణాశి పట్టణముకు గ్రామదేవత. వారణాశి నందు వారాహిని దర్శించిన వారు జీవితంలో అన్నిఆటంకముల నుండి మరియు ఇబ్బందులనుండి రక్షణ పొండేదరని స్థానికులనమ్మకం.

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...