Saturday, 24 September 2022

          


                                                

ఆపరేషన్ మిడ్‌నైట్

భారతదేశ చరిత్రలో అతిపెద్ద దాడి

22 సెప్టెంబర్ 2022, గురువారం, సమయం అర్ధరాత్రి ఒంటి గంట. PFI సభ్యులు తమ ఇళ్ళల్లో ఆదమరచి గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రకు మరికొద్ది సేపట్లో భంగం కలుగబోతోందని వారు కలలో కూడా ఊహించలా.

ప్రతి రాష్ట్రంలోనూ.. CAPF మరియు రాష్ట్ర పోలీసులతో జతకూడిన దాదాపు 200 మంది NIA అధికారులు.. నిర్దేశించిన రహస్య ప్రదేశంలో.. ప్రశాంతంగా నిలబడి తమ కమాండ్ సెంటర్ నుండి.. ఆపరేషన్ మొదలెట్టమనే ఆర్డర్ కోసం వేచి చూస్తున్నారు.

సాధారణంగా.. వేకువఝామున 4:00 గంటలకు ఎవరైనా గాఢ నిద్రలో ఉండే సమయం.. ఇదే సమయాన్ని ఎంచుకున్నారు తమ ఆపరేషన్  మొదలెట్టడానికి.

ఢిల్లీలో కూర్చున్న ఒక వ్యక్తి అందరినీ సమన్వయం చేస్తున్నాడు

ఉదయం 3:30 గంటలకు..

అనుకున్న సమయానికి అరగంట ముందు ఆ సమన్వయకర్త నుండి "గో" అనే సూచన ఒచ్చేసింది. అంతే ఒక్కుమ్మడిగా రేసుగుర్రాల్లా ముందుకు దూసుకెళ్లారు.

ఐతే ఈ దాడుల పూర్వాపరాలు ఏంటసలు..?

ఢిల్లీలోని ఆజాద్ మైదాన్ నుండి షాహీన్ బాగ్ వరకు, కేరళ హత్యల నుండి రాజస్థాన్ మరియు యూపీ అల్లర్ల వరకు, నిరంతరం వార్తల్లో వచ్చే ఒక పేరు PFI.. పూర్వ నామం సిమీ. 1990 ల్లోనూ ఆ తరువాత 2000 మొదట్లోనూ.. అనేక టెర్రర్ దాడులకు మూలకారణమైన వేర్పాటువాద సంస్థే సిమీ.

2001లో దీనిని వాజ్‌పేయి ప్రభుత్వం నిషేధిస్తే.. 2008లో సుప్రీంకోర్టు ఆ నిర్ణయం సరైందేనని సమర్థించింది.

PFI ఏర్పడింది 2006లో. అప్పటి నుండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకూ తన కోరలు చాచింది.

ఆర్నెల్ల క్రితం.. ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర హోమ్‌శాఖకు సిమీ అంటే PFI తిరిగి తన విషపు కోరల తలను బయట పెట్టబోతోందనే క్లాసిఫైడ్ సమాచారం అందించింది. 

2019 లో, మోడీ ప్రభుత్వం CAA చట్టాన్ని తెచ్చినప్పుడు.. ఆ  చట్టాన్ని అడ్డుపెట్టుకుని.. బీజేపీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌లు ముస్లింలను దేశం నుండి తరిమికొట్టాలనుకుంటున్నారని అందుకే CAA చట్టాన్ని ముందుకు తెచ్చారని ముస్లింల బ్రెయిన్‌వాష్ చేయడానికి ఒక సాధనంగా PFI వాడుకుంది.. ముస్లింలలో భయభ్రాంతులను సృష్టించి వారి విశ్వాసం చూరగొని వేగంగా విస్తరించింది.

ప్రస్తుత ఆపరేషన్‌కు 5 సంవత్సరాల ముందు..

ఘజ్వా ఏ హింద్ కోసం PFI పనిచేస్తోందని IB నుండి మోడీ ప్రభుత్వానికి ఇన్‌పుట్ అందింది.

- వారు ఆరెస్సెస్‌ను చూపించి ముస్లింలలో భయభ్రాంతులను సృష్టించి వారిని ర్యాడికలైజ్ చేయడం ప్రారంభించారు.

- ఆరెస్సెస్‌పై ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ లకు వ్యతిరేకిగా ముద్ర వేసి హిందువులను విభజించడానికి విశ్వప్రయత్నం చేశారు.. ఇంకా చేస్తున్నారు.

-విషయం సున్నితమైనది కావడంతో.. నేరుగా మోదీ, మోహన్ భగవత్ గార్ల మధ్య రహస్య సమావేశం జరిగింది. ఆరెస్సెస్, బీజేపీ లు రెండూ ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మరింత చేరువై.. వారిని విభజించాలని PFI వేసిన పన్నాగాన్ని చిత్తు చేశారు.

ఐక్యంగా ఉండే శత్రువర్గం మరింత శక్తివంతం అవుతుందని తెలిసిన యంత్రాంగం.. దాడికి ముందే ఆ వర్గాన్ని బలహీనపరచింది.

PFI అధ్యక్షుడు అష్రఫ్ కమ్యూనిటీకి చెందినవాడు మరియు అష్రఫ్ మరియు పాష్మాండ కమ్యూనిటీల మధ్య పోటీ ఉంది.

ముస్లింలందరికీ మార్గదర్శకత్వం చేసే ఏకైక సంస్థ/ నాయకుడిగా మారాలనే PFI ప్రణాళికను బలహీనపరిచేందుకు మోడీ పాష్మాండ వర్గాన్ని దగ్గరకు తీశారు.

ఆపరేషన్‌కు 6 నెలల ముందు..

MoHA లో ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబడింది.

అమిత్ షా, అజిత్ దోవల్, ఎన్ఐఏ, ఐబీ అధికారులు హాజరయ్యారు.

సమావేశంలో హాజరైన వారందరినీ ఉద్దేశించి.. మనం PFI ని నిషేధించాలా? అని అమిత్ షా గారు ఒకేఒక ప్రశ్న అడిగారు.

దానికి సగం మంది అధికారులు "అవును" అని మరియు సగం మంది "లేదు" అని అన్నారు.

దోవల్‌జీ మీరేమనుకుంటున్నారని అమిత్ షా గారు NSA దోవల్ గారిని ప్రశ్నించారు.

దోవల్ గారు వెంటనే జవాబివ్వకుండా తనకు కొంత సమయం కావాలని అడిగారు. ఇందులో వింతేమీ లేదు. సమావేశాల్లో దోవల్ గారిని మోదీ, షా లు ప్రశ్నలు అడిగేది కేవలం ఫార్మాలిటీ కోసమే. అసలు నిర్ణయం ఏంటి దాని అమలు ఎలా ఉంటుందనేది.. దేశంలోపలి వ్యవహారమైతే.. మోదీ దోవల్ షాలు.. విదేశీ వ్యవహారమైతే.. మోదీ దోవల్ జైశంకర్ లు.. ఆంతరంగికంగా సమావేశమై నిర్ణయం తీసుకోవడం.. వ్యూహం సిద్ధం చేసే పని దోవల్, జైశంకర్ లు తీసుకొంటారు.

ఆ తరువాత దోవల్ గారు.. IB, RAW ల్లో పనిచేసి.. తరువాత NSA లో చేరి తన ఆంతరంగిక బృందంలో పనిచేస్తున్న అధికారులతో సమావేశమై.. PFI ని అణచివేయడానికి పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేశారు.

- IB మరియు ED తో ఒక ఉమ్మడి బృందం తయారు చేయబడింది

- PFI పనితీరు మదింపు చేయమని IB ని నిర్దేశించడం జరిగింది.

- PFI కు నిధుల ప్రవాహాన్ని కనిపెట్టమని ఈడీని ఆదేశించడమైంది.

ఇరు సంస్థలు తమ పనిని వెంటనే మొదలెట్టి.. ఈ ఆపరేషన్‌కు రెండు నెలల ముందే.. పూర్తి సమాచారం సేకరించి ఉంచారు.

ఇదిలా కొనసాగుతుండగా.. బీహార్‌లోని PFI వ్యవహారాలను డేగకళ్ళతో గమనిస్తున్న NSA/IB/NIA సరైన సమయం చూసి అనూహ్యదాడితో.. వారివద్ద నుండి రహస్యమైన అత్యంత సున్నితమైన విజన్ 2047 డాక్యుమెంట్‌ను దొరకబుచ్చుకుంది. అసలా డాక్యుమెంట్ NSA చేతికి ఎప్పుడో అందింది.. కానీ ఈ దాడుల్లో భాగంగా బయటపెట్టారు. ఇది సాధారణంగా జరిగేదే. PFI కార్యకలాపాల గురించి అన్నీ తెలిసినా.. దాని కార్యకర్తలందరినీ ఒక్కుమ్మడిగా కుమ్మే సమయం సందర్భం కోసం వేచి చూస్తూ ఒచ్చారు.

ఆపరేషన్‌కు 53 రోజుల ముందు..

అజిత్ దోవల్ ఒక సర్వమత సమావేశంలో ముస్లిం మతగురువులను కలుసుకుని.. దేశ వ్యతిరేక, విభజన సంస్థలన్నిటినీ తప్పనిసరిగా నిషేధించాలని.. వారి చేత తీర్మానం చేయించారు.

PFI కి కూడా తెలుసు.. తమ సంస్థను ఏక్షణమైనా నిషేధించొచ్చని.. దానికనుగుణంగానే.. వారు ప్లాన్ B తయారు చేసుకుని ఉంచుకున్నారు. ఆ విషయాల గురించి కూడా NSA వద్ద పూర్తి సమాచారం ఉంది.

వారు అనేక ఇతర సంస్థలను.. SDPI, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, NWF, AILC ఆల్ ఇండియా లీగల్ కౌన్సిల్, HRDF, SDTU, రిహాబ్ ఇండియా ఫౌండేషన్ వంటి అనేక సంస్థలను సిద్ధం చేసుకున్నారు.

ప్రభుత్వం PFI ని నిషేధిస్తే, వారు వేరే పేరుతో వెంటనే తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు.

ఆపరేషన్‌కు 1 నెల ముందు..

దోవల్ తన ప్రణాళికను మోదీ షా లకు సమర్పించారు. దాని పేరు ఆపరేషన్ మిడ్‌నైట్.. దాని లక్ష్యం.. PFI ని బ్యాన్ చేసే ముందు.. కూకటి వ్రేళ్ళతో సమూలంగా నాశనం చెయ్. దాంతో.. PFI కీలక నేతలందరినీ ఒకేసారి అరెస్టు చేయడానికి.. భారతదేశ చరిత్రలో అతిపెద్ద దాడికి అంకురార్పణ జరిగింది.

OM కి 20 రోజుల ముందు..

ఐఎన్‌ఎస్ విక్రాంత్ ప్రారంభోత్సవానికి మోదీ గారు కొచ్చి వెళ్లగా, ఆయనతో పాటు దోవల్ గారు కూడా అక్కడికి వెళ్లారు. దోవల్ గారు కేరళ రాష్ట్ర పోలీసు డీజీపీతో రహస్యంగా మాట్లాడి ప్లాన్‌ గురించి చెప్పారు. అక్కడి నుంచి ముంబయి వెళ్లి గవర్నర్‌ హౌస్‌లో ఉండి కీలక ఎన్‌ఐఏ అధికారులను కలుసుకుని ప్రణాళిక వివరాలు చెప్పారు.

OM కి 3 రోజుల ముందు..

దోవల్ మరియు అమిత్ షా సమక్షంలో NIA, IB మరియు ED ల మధ్య సంయుక్త సమావేశం నిర్వహించబడింది. ఆ సమావేశంలో దోవల్ మొత్తం ప్రణాళికను వివరించారు.

సెప్టెంబర్ 22 అర్ధరాత్రి NIA మరియు ED యొక్క సంయుక్త బృందం.. దేశవ్యాప్తంగా PFI కున్న 93 స్థావరాలపై దాడి చేస్తుంది. కీలక నేతలందరినీ ఒకేసారి ఒకేసమయంలో అరెస్టు చేస్తారు. వారిని మూకుమ్మడిగా అరెస్టు చేయకపోతే.. PFI రెండవ అంచె నాయకులు దేశంలో అశాంతిని సృష్టిస్తారు మరియు సాక్ష్యాలను దాచిపెడతారు.. కాబట్టి వారందరినీ కలిసి అరెస్టు చేయడం అవశ్యం.

PFI నేతల అరెస్ట్ తర్వాత.. శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో ముందే విశ్లేషించారు. వాటిని అదుపులో ఉంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.. ముస్లిం సంస్థల నుండి ఎటువంటి సానుభూతి మరియు మద్దతు లభించని విధంగా ప్రణాళిక రచించారు.

OM 1 రోజు ముందు.. 

200 మంది NIA అధికారులు, ED అధికారులు, 4 IG లు, 1 ADG, 16 ఎస్పీలు, 1000 రాష్ట్ర పోలీసులతో ఒక బృందం సిద్ధమైంది. 

సమన్వయం కోసం 6 నియంత్రణ కేంద్రాలు మరియు న్యూఢిల్లీలో ఒక కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అజిత్ దోవల్ గారు అందరినీ సమన్వయం చేశారు.

ఆపరేషన్ అర్ధరాత్రి

PFI కి ఆపరేషన్ గురించి తెలియదు. తమనెవరూ ఏమీ పీకలేరనే భ్రమలో ఉన్నారు.. కాదుకాదు ఉంచబడ్డారు.

అర్ధరాత్రి ఒంటి గంటకు ఆపరేషన్ ప్రారంభమైంది. IB ఇన్‌పుట్‌ల ఆధారంగా 11 రాష్ట్రాల్లో గుర్తించబడ్డ 93 స్థావరాలకు NIA & ED బృందం చేరుకుని.. ఆదేశాల కోసం వేచి ఉంది.

ఆపరేషన్ జరుగుతున్న ప్రదేశం వద్ద PFI వాలంటీర్లు గుమిగూడకుండా చూడడానికి.. రాష్ట్ర పోలీసు బలగాన్ని సెకండ్ షీల్డ్‌గా ఉంచారు.

సరిగ్గా.. ఉదయం 4 గంటలకు ఆపరేషన్ షెడ్యూల్ చేయబడింది.

ఖచ్చితంగా సమయానికి అరగంట ముందు.. దోవల్ గారు ఢిల్లీ నుండి "గో" అనే ఆదేశం ఇచ్చారు.

అంతే.. జాయింట్ టీంస్ తమ దాడులను ప్రారంభించాయి. ఒక బృందం స్థావరాల్లో గాలింపు జరుపుతుండగా.. మరొక బృందం.. PFI నేతలను.. నిద్ర నుండి మేలుకునే అవకాశం ఇవ్వకుండానే.. అరెస్ట్ చేసి.. నిర్దేశిత ప్రాంతాలకు తోలుకెళ్ళారు.

PFI నెట్వర్క్ కూడా తక్కువేమీ కాదు.. క్షణాల్లో వార్త వ్యాప్తి చెంది.. PFI వాలంటీర్లు ఆయా స్థావరాలకు చేరుకోవడం ప్రారంభించారు. అయితే అప్పటికే నియమించబడిన పోలీసులు వారిని దూరంగా నిలిపివేశారు.

ఉదయం 5 గంటలకు దాడులు ముగిశాయి.

106 మంది PFI నాయకులను, కార్యదర్శులను మరియు రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లతో సహా అరెస్టు చేశారు. 150+ మొబైల్ ఫోన్‌లు, 50+ ల్యాప్‌టాప్‌లు, విజన్ డాక్యుమెంట్లు, నమోదు ఫారమ్‌లు, బ్యాంకు పత్రాలను NIA మరియు ED బృందం జప్తు చేసింది.

నిషేధానికి ముందే.. 23 గురువారం ఉదయం సూర్యుడు ఉదయించకుండానే..  PFI అస్తమించింది.

PFI మతం కార్డును ప్లే చేయడానికి ప్రయత్నించింది.. కానీ ముస్లిం మతపెద్దలతో ప్రభుత్వం ముందే జరిపిన చర్చలతో.. వారి నుండి మద్దతు లభించలేదు.

భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన వేర్పాటువాద సంస్థల్లో ఒకటి ఒక్క వేకువఝాములో అస్తవ్యస్తమైంది.. ధ్వంసమైంది.

ఇప్పుడీ కథ ఇంతటితో ముగియదు. NIA, ED లు.. వారు రికవరీ చేసిన సమాచారాన్ని మరింత తనిఖీ చేసి మరిన్ని చర్యలు తీసుకుంటారు.

PFI తమకు మద్దతుగా నిలిచే రాజకీయ పార్టీలు, NGO లు, న్యాయవాదులు, న్యాయవ్యవస్థలో చొరబడ్డ  తమ అనుయాయుల సహాయంతో కోర్టుల్లో పోరాడటానికి ప్రయత్నిస్తుంది.

పోరాటం చాలా కాలం సాగుతుంది కానీ బయటపడడం PFI కి అంత సులభం కాదు.

ఆపరేషన్ మిడ్‌నైట్ అనేది ప్రపంచంలోనే అత్యంత చాకచక్యంగా అమలు చేయబడిన అతిపెద్ద ఆపరేషన్ మరియు భారతదేశాన్ని PFI దుర్మార్గపు విజన్ 2047 నుండి రక్షించినది

నోట్:

మీ ఇంటి ముందు ఎప్పుడూ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉంటారు. ఒకరు మీకు హాని చేయాలనుకునే వ్యక్తి. మరొకరు మిమ్మల్ని రక్షించాలనుకునే వ్యక్తి. మీరు ఎవరితో నిలబడి ఉన్నారు అనేది నిర్ణయిస్తుంది మీ మనుగడను.

2004-14 మధ్య వందలాది బాంబు పేలుళ్లు జరిగాయి కానీ 2014 తర్వాత ఒక్కటి కూడా లేదు.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...