Friday, 30 September 2022


*బ్రాహ్మణులుగా పూజించబడి .... ఈరోజుకీ పూజింపబడుతూ ........ యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతరులు* ..
( *వజ్రసూచికోపనిషత్తు ప్రకారం* ..)



1. *ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు*.
2. *కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు*.
3. *జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు*
4. *వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు*.
5. *వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమ పవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు*.
6. *గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు*.
7. *వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీ వశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తు న్నారు. ప్రతి పూజలోనూ హిందువుల చేత .. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందు కుంటున్నారు.*
*వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు*.
8. *అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.*
9. *మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి*.
*ఇంకా*.... ..
1. *ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు*
2. *ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)*
3. *సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు*.
*ఉన్నతవంశాలలో పుట్టిన వారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్క రించారు ... వారిలో కొందరు:*
1. *భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు*.
2. *బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు* ..
3. *రఘువంశ మూల పురుషుడైన రఘు మహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు*
4. *త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు*.
5. *విశ్వామిత్రుడు క్షత్రియుడు. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు*.
6. *నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణు పురాణం 4.1.14)*
7. *నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది ( విష్ణుపురాణం 4.1.13)*.
8. *క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశ బ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణు పురాణం 4.3.5)*.
9. *శౌనక మహర్షి కుమారులు .. 4 వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1)*.
10. *అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు*.
*వీరిలో చాలామంది .. వేదమంత్రాలు కూడా రచించినవారు ఉన్నారు*.
*హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నది కానీ, జన్మం మీద కాదు*.

No comments:

Post a Comment

show image

 Sardar Patel He had come out of the mosque and attacked Sardar Patel. We were taught that Mahatma Gandhi was assassinated by Nathuram Godse...