అబ్దుల్ కలాం, వ్యక్తిత్వం ఒక ఉన్నత శిఖరం
అవి డాక్టర్ అబ్దుల్ కలాం గారు శాస్త్రవేత్తగా దేశ రాజధాని న్యూఢిల్లీలో పనిచేస్తున్న రోజులు!
ఒకరోజు ఆయన కార్యాలయంలోని జూనియర్ సైంటిస్ట్
శ్రీనివాసన్ స్వీట్లు తీసుకుని వచ్చి ఆఫీసులో అందరికీ పంచుతూ కలాంజీ వద్దకు స్వీటు ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడు...
కలాంజీ : ఏమోయ్ శ్రీనూ! ఏంటి విశేషం!
శ్రీనివాసన్: సర్!ఈ రోజు నా కుమారుని పుట్టినరోజు.
కలాంజీ : ఓహ్ అవునా...బాబుకు నా ఆశీస్సులు!.
శ్రీనివాసన్: సర్..సర్..! అదీ..అదీ
కలాంజీ : ఏంటోయ్ ! అదీ అదీ.. అదేదో చెప్పు మరీ!
శ్రీనివాసన్: సర్! బర్త్ డే కదా! మా వాడిని
5గంటలకు పార్కుకు తీసుకు వెల్తానని
చెప్పాను. ఈ రోజు కొద్దిగా తొందరగా
వెల్తాను సర్!
కలాంజీ : ఓ...తప్పకుండా వెళ్లు శ్రీనూ!
శ్రీనివాసన్ : థ్యాంక్యూ సర్ థ్యాంక్యూ...
అయితే ఆ రోజు పని ఒత్తిడి వల్ల శ్రీనివాసన్
ఆ విషయమే మరచిపోయి రెండు గంటలు ఆలస్యంగా 7 గంటలకు హడావుడిగా ఇంటికి చేరాడు. ఇల్లు చేరగానే భార్యతో " బాబు అలిగాడా!? వాడు ఎక్కడ ఉన్నాడు".అన్నాడు.
అప్పుడు ఆమె సంతోషంగా " అదేటండీ! మీకు తెలీదా!? మీరు పనిలో బిజీగా ఉన్నారని అబ్దుల్ కలాం గారు సరిగ్గా 5 గంటలకు కారులో వచ్చి మన బాబుని పార్క్ కి తీసుకెళ్లారు. 7 గంటలకంతా బాబుని తీసుకొస్తానమ్మా అని చెప్పారు. తిరిగొస్తుంటారేమో " అని చెప్పింది.
భార్య చెప్పింది విని శ్రీనివాసన్ ఒక్క క్షణం సంభ్రమాశ్చర్యాలతో బిర్రబిగుసుకు పోయాడు. అతనికి వెంటనే నోట మాట రాలేదు. తాను పనిలో బిజీగా ఉన్నందువలన తన ఇంటికి వచ్చి తన కుమారున్ని కలాం గారు పార్క్ కు తీసుకువెళ్లారని తెలియగానే అతనికి కళ్లవెంట నీళ్ళొచ్చాయి.
ఆహా! ఎంత అద్భుతమో కదా!
తన కింది స్థాయి ఉద్యోగులతో కలాం గారు వ్యవహరించే పద్ధతి అది.చిన్న పెద్ద అనే భేషజాలు ఆయన దగ్గర ఉండేవి కాదు. హోదాల కంటే మనిషికి విలువ ఇచ్చే మహనీయుడు ఆయన !.
ఆయన రాష్ట్రపతిగా పదవీవిరమణ చెందే చివరి రోజున కూడా రాష్ట్రపతి భవన్ లోని ప్రతి ఉద్యోగి గేటు బయట వరకు వచ్చి కన్నీళ్ళతో ఆయనకు వీడ్కోలు చెప్పారట!
అందుకే కదా ఆయన 'భారతరత్న' అయినారు!.
అందుకే కదా యావద్భారతావనితో 'మన కలాంజీ'
అనిపించుకున్నారు.
ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ 🙏🙏🙏
అబ్దుల్ కలాం అమర్ రహే!!
No comments:
Post a Comment