Thursday, 10 August 2023

 ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవమా? మూల నివాసి దినోత్సవమా? హిందూ/ఆర్య వ్యతిరేక ప్రచార వేడుకనా? ఐక్య రాజ్య సమితి ఏ ఉద్దేశ్యం తో ప్రకటించింది? ఆ ఉద్దేశ్యంను తప్పు దారి పట్టించి, దేశ విభజన శక్తులు ఆగస్టు 9 న చేస్తున్న ప్రచారం ఏమిటి?

  అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లలో  వేల సంవత్సరాల నుండి జీవిస్తూ 7,50,000పైగా జనాభా వున్న మూలనివాసులైన ప్రజలపై యూరోపియన్లు 1788 నుండి 1930 వరకు భౌతికంగా దాడి చేసి 7,00,000 మంది మూలనివాసులను చంపివేశారు. రూపస్ నది వద్ద ఉచకోత కోశారు.

ఆస్ట్రేలియా లో 7 సార్లు సామూహిక విషప్రయోగాలు జరిపి, మూల నివాసులను చంపివేశారు1902 ఆస్ట్రేలియా విందామ్ జైలు లో ఉంచి చంపేశారు.

బ్రిటిష్ సెటిలర్స్, మూల నివాస పిల్లల్ని కిడ్నాప్ చేసి నది లోకి విసిరేస్తూ కాల్చి చంపారు.వృద్ధ దంపతులను, గర్భిణీ స్త్రీలను కూడా కాల్చి చంపారు

 1788 లో వలస వచ్చిన యూరోపియాన్లు ఆస్ట్రేలియా లోని స్థానిక ప్రజలను కాల్చి చంపి, జనాభా 2,50,000 నుండి 60,000 తగ్గించి వేశారు

స్థానిక ప్రజలపై మారణహోమం జరిపి, భీభత్స కాండ సృష్టించారు. మొత్తం జనాభా తగ్గే వరకు ఈ దారుణాలు కొనసాగాయి. స్థానిక ప్రజల్లో వెనుక బాటు తనం ఉందని, తాము నాగరికత అందిస్తామని భ్రమలు కల్పించారు.వారి నివాసాల్లోకి బలవంతంగా ప్రవేశించి, కనబడ్డ వారిని చంపి వేసి, మరికొందరి మణి కట్టు బాగాన్ని కత్తి తో నరికి, దాగి వున్న ఇతర స్టానియ ప్రజలను హెచ్చరించే వారు.పిల్లలు, ఆడవాళ్లను కిడ్నాప్ చేసి బానిసలుగా వెట్టి చాకిరి చేయించారు

ఆధునికత, క్రైస్తవం, వాణిజ్యం పేరుతో మూల నివాసుల నిర్మూలన లో యూరోప్ పెట్టు బడి దారులు దారుణ మారణ హోమం కొనసాగించి, నేటి అమెరికా, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా లను ఆక్రమించారు. మూల నివాసుల భూములను ఆక్రమించి, యూరోపియన్ శ్వేత జాతీయులు నేటికీ పరిపాలన చేస్తున్నారు.

ఈ మూల నివాసుల  హక్కుల సంరక్షణ కోసం ఐక్య రాజ్య సమితి ఆలస్యంగానైనా గుర్తించి,ఆగస్ట్ 9 న మూలనివాసుల దినోత్సవం గా జరపాలని ప్రకటించింది. ఐతే ప్రపంచంలోని అడవుల్లో, పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల భాషా,సంస్కృతి, జీవన విధానాల రక్షణకు ఈ మూలనివాసుల దినోత్సవాన్ని జరుపుకోవటం ఒక ఆనవాయితీగా ఏర్పడింది.

 అంతేగాని మన దేశంలో ఈ వేడుకను ఆదివాసీ దినోత్సవం గా పేర్కొంటూ ఆర్యులు, హిందువులు బయట నుండి యూరోపియన్ వాసులవలేనే ఇక్కడికి వచ్చి ఆదివాసులను, దళితులను హింసించారని కట్టు కథలు అల్లి, తమ రాజకీయ స్వార్థం కోసం ఈ దినోత్సవాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

డా బి ఆర్ అంబేద్కర్ ఆర్యుల వలస, ఆక్రమణ సిద్ధాంతపు కథ అబద్దం అని "శూద్రులు ఎవరు" అను పుస్తకంలో తేల్చి చెప్పారు. అయినప్పటికీ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని దళితులు, వనాల్లో నివసించే వారిని హిందువుల నుండి వేరు చేయడానికి మిషనీరిల నుండి, జిహాదిల నుండి వస్తున్న నిధులతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం గావిస్తున్నారు.

ఇక్కడి భారతీయులంతా మూలనివాసులే. ఆదివాసులే. మొదట్లో అడవుల్లో నివసించి, కొందరు గ్రామాలు నిర్మించుకొని, మరికొందరు నగరాల్లోకి వచ్చి వసతి ఏర్పరచుకుని జీవిస్తున్నవారే.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...