Sunday 25 December 2022

చందా కొచర్ 

ఒకప్పుడు ఇండియాలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఊమెన్ లిస్టులో పేరు సంపాదించుకున్న చందా కొచ్చర్,  ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ.

నిన్న ఈవిడను, ఈవిడ భర్త దీపక్ కొచ్చర్ ను మనీ లాండరింగ్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టుకు కారణం ఏమిటంటే.. బ్యాంకు నిబంధనలు పాటించకుండా తన భర్తకు వాటాలు ఉన్న వీడియోకాన్ అనే సంస్థకు 3000 కోట్ల రూపాయలను అప్పుగా ఇవ్వగా అది కాస్త NPA గా మారింది. 

ఈ లోన్ వ్యవహారంలో conflict of interest (లోన్ ద్వారా చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లబ్ది పొందారు) అనే ఆరోపణలు రావడంతో చందా కొచ్చర్ అక్టోబర్, 2018లో ఐసీఐసీఐ బ్యాంకు CEO పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

ఇంతకు లోన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా? ఆగస్టు 2009 లో & అక్టోబర్ 2011లో.. కేంద్రంలో అప్పుడేవరు అధికారంలో ఉన్నారు..? కాంగ్రెస్.. 

ex-ICICI CMD, Mrs.Chanda Kochar receiving in 2011, the very coveted Padma Bhushan from HH Pratibha Patil, the then President of nation.   - She is possibly the first woman to be the CEO of an Private Indian Bank and strange enough,   - She will possibly be the first person to be stripped off from her Padma Bhushan award soon. 😥😥  - Besides, ICICI Bank has decided to call back all the ESOPs and bonuses given to Chanda Kochhar during April 2009–March 2018. This totals to a whopping Rs 350 crore.  She has been: - A member of the Prime Minister’s Council on Trade & Industry, the Board of Trade, and the High-Level Committee on Financing Infrastructure. -  Co-chairperson of the World Economic Forum’s Annual Meeting in 2011.  Having been accused of criminal conspiracy in loans to Videocon group, she has now been arrested.  No one knows when the tide of time slaps so vigorously that one is pulled down from zenith to nadir (अर्श से फर्श पर). But quite often, it's due to one's own misdeeds. 😥😥😥😥😥

ఎప్పుడో 2009, 2011లో లోన్ ఇవ్వడం ఏమిటి? అది NPA అవడం ఏమిటి? ఆవిడ 2018లో బలవంతంగా రాజీనామా చేయాల్సి రావడం ఏమిటి? డిసెంబర్ 2022లో అరెస్టు చేయడం ఏమిటి అనేది అర్థం కావాలంటే ఒక రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ కి, ఆడిటర్ కు మధ్య జరిగిన సంభాషణ చదవండి. 

***

నిన్న రాత్రి ఒక ఆడిటర్ గారితో మాటా మంతీ ఆడుతూ బ్యాంకుల్లో జరిగే ఫ్రాడ్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది.

"మీ మోడీగారు సామాన్యుడు కాడండి" అన్నాడాయన.

"ఆయన ఈ దేశానికి ప్రధాని. కాబట్టి మీ, మా అనేమాట రాకూడదు" అంటిని.

"అదేలెండి. ప్రధాని అయితే మనందరకు. మోడీ అయితే మీకు" అన్నాడు.

"సరే, విషయం చెప్పండి" అని అడిగాను.

"మీవాడు మహా కాలాంతకుడు"

"ఎంచేతంటారు?"

"ఆయన 2014లో అధికారంలోకి రాగానే బ్యాంకు డిఫాల్టర్ల పని పడతాడని ఆడిటర్లు అందరం ఊహించాం. కానీ వెంటనే ఏమీ జరగలేదు. 'వదిలేసుంటాడు. వాళ్ళ వాళ్ళు కూడా ఉండే ఉంటారు' అనుకున్నాము. కానీ, మీవాడు కాలాంతకుడండి" అన్నాడు మళ్ళీ.

"విషయం చెప్పు స్వామీ" అంటిని.

"2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు బ్యాంకుల్లో, ఆర్బీఐ, సెబీ, సిబిడిటి, కస్టమ్స్, ఎక్సైజ్, సిబిఐ.... ఇలా అన్ని చోట్లా కాంగ్రెస్ ఎకో సిస్టమ్ వేళ్ళూనుకుపోయింది. వాళ్ళందరినీ ఒకేసారి మారిస్తే ఇబ్బందులొస్తాయని ఆగాడు. కాలక్రమేణా వాళ్ళందరూ రిటైరైపోయారు. వాళ్ళ స్థానాల్లో తన వాళ్ళను పెట్టేసాడు. ఒకటొకటి బైటకు లాగుతున్నాడు. లాయర్లు అడ్డం పడకపోతే రెండు, మూడేళ్ళలో దొరికిన వాళ్ళకు శిక్షలు పడతాయి" అన్నాడు.

"లాయర్ల సంగతి అలా ఉంచండి. ఫ్రాడ్ ఎలా చెయ్యాలో మార్గాలు చూపించేది మీరే కదా?"

"అబ్బో, మా మీదనే పెడుతున్నారే?"

"ముందు మీరు చేయిస్తారు. ఆ తరువాత మా దగ్గరకొస్తారు".

"నిజమే కానీ, 2024లో కూడా మీ మోడీయే ఫుల్ మెజారిటీతో వస్తే మాత్రం పెద్ద తలకాయలకు ఇబ్బందే".

"ఏం? మీ అక్కాయ్ ఇరుక్కుందనా?"

"ఇదేముందండీ... చాలా చిన్న ఎమౌంటు. యూనియన్ బ్యాంకు లెండింగ్ లీడర్ గా 2006 లో ఇచ్చిన ఒక లోను 2013 లోనే ఎన్పీఏ అయితే, 2016 లో ఫ్రాడ్ గా ఐడెంటిఫై చేసారు. ఆరేళ్ళ తరువాత నిన్న సిబిఐ కేసు ఫైల్ చేసింది".

"ఫ్రాడ్ అని ఐడెంటిఫై చెయ్యడానికి మూడేళ్ళు పట్టిందా? ఐనా ఎఫ్ఫైయార్ ఫైల్ చెయ్యడానికి ఆరేళ్ళ సమయం ఎందుకు పట్టిందంటారు?"

"సార్, ఒక్క విషయం. మీరు రిటైరైనాక కూడా మీ బ్యాంకులో స్నేహితులు ఉన్నారు కదా?"

"ఉంటే .... ?"

"మీకు సంబంధించిన ఫైలు ఏదైనా  కదిలితే మీకు తెలుస్తుందా, లేదా?"

(నిజమే కదా!)

"మరి మీస్థాయికే అలా ఉంటే పైస్థాయి వాళ్ళకు ఇంకెంత నెట్వర్క్ ఉంటుంది మాష్టారు? అందుకే ఆ ఎకో సిస్టమ్ ను తొలగిస్తూ నెమ్మది నెమ్మదిగా కుమ్మరి పురుగులా తొలిచేస్తున్నాడు" అన్నాడు.

"కుమ్మరి పురుగైనా చెద పురుగును చంపితే మంచిదే కదా?"

**

మోడీ ఏం చేస్తున్నాడు అని అడిగే వాళ్లకు సమాధానం ఏమిటంటే దేశంలో పెరిగిన కలుపు మొక్కలు పీకేస్తు, వ్యవసాయం చేస్తున్నాడు అని చెప్పండి.!

💥వై రాఘవేంద్రరావు.

ఏలూరుజిల్లాBJP.

తూర్పుమండలకార్యదర్శి,

 సోషల్మీడియాకన్వీనర్.

స్వచ్చంద సామాజిక కార్యకర్త.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...