Wednesday 19 January 2022

ఒక ప్రయాణీకుల రైలు మొత్తం మాయం అయిపోయిన అరుదైన వివరాలు

కొన్నేళ్ల క్రితం భారతీయ రైల్వేకు సంబంధించిన ఒక ప్రయాణీకుల రైలు మొత్తం మాయం అయిపోయిన అరుదైన వివరాలు తెలుసుకోండి.
ఈ రైలు పోయిన నెల 18న (18 డిసెంబర్2019)ఒక చిన్న రైల్వే స్టేషన్లలో చాలా ఊహించని విధముగా బయటపడింది. టిన్ సుకియా
అనే ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో దొరికింది. ఈ టిన్ సుకియా చైనాకు అనుకోనివున్న అరుణాచల ప్రదేశ్ కు దగ్గరగా అంటే ఎనభై కిలోమీటర్లు దగ్గరలో ఉంటుంది.గౌహతి నుంచి 480 కిలోమీటర్లు.
ఎప్పుడో 1976లో ఆ పల్లెటూరులో మెయిన్ ట్రాక్ మీద నిలపడనికి స్థలం లేక , వాడకం లేని , రైల్వే పరిభాషలో చెప్పాలంటే disused sliding , కొద్దిగా దూరంలో , రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రాక్ మీద వుండమన్నారు.


రైల్వే రికార్డ్స్ ప్రకారం ఆ రైలు
16 జూన్ 1976 ఉదయం 11.08 నిముషాలకు ఆ స్టేషన్ చేరుకొంది. రైలు ఇంజిన్ ను విడదీసి, స్టేషన్కు తెప్పించి ట్రాక్ మీద వున్న గూడ్స్ బండి లాగడానికి వాడినట్టు ఉంది.
అదే రోజు 11.31 నిముషాలకు కుంభవృష్టిగా వర్షం కురిసింది
రైల్వే బోర్డు వారు నియమించిన కమిటీ తేల్చినదేమిటంటే, రైల్వే ట్రాక్ నిర్వహణ సిబ్బంది ఆ సమయంలో ట్రాక్ రిపైర్లు, వర్షం ముంపు వుండే ప్రాంతాల్లో పర్యవేక్షణ, విపరీతంగా కురిసిన వర్షాలవల్ల వొచ్చేపోయే రైళ్ల క్రమబద్ధీకరణ నిర్వహణలో మునిగిపోయారు. ఆ చిన్న రైల్వేస్టేషన్ అతిగా కురిసిన వర్షాలకు ఐదు ఆరు అడుగుల నీటిలో మునిగిపోయివుంది.
ఆ రైలులో ఉన్న ప్రయాణీకులు అందరూ దిగి వారి వారి గమ్యాలకు చేరుకొన్నారు, సహజంగానే చాలా ఇబ్బందులు పడుతూ, అక్కడ ఉన్న గ్రామీణుల సహకారంతో కొద్దిమంది లబ్ది పొందారు.
ఇదే సమయంలో ఆ రైల్వేస్టేషన్ మాస్టారు, కొద్దిమంది సిబ్బంది బదలీలమీద వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు.
ఈ లోపల మిగిలిన సిబ్బంది , అధికారులు, మెయిన్ స్టేషన్ నుంచి అసలు వాడకం లేని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రాక్ మీద వున్న ఈ రైల్ పెట్టెల గురించి పూర్తిగా మర్చిపోయారు.పైగా అటువైపు జనసంచారం ఉండదు.నెమ్మది నెమ్మదిగా ప్రకృతి తనపని తాను చేసుకుపోయింది. ఆ రైలు చుట్టూ పొదలు , చెట్లు పెరిగాయి.
మిగిలిన ట్రాక్ మీద రైళ్ల రాకపోకలు, మనుష సంచారం లేకపోయేసరికి , ఆ రైలు పెట్టెలు, ట్రాక్ మొత్తం చిన్నాపెద్దా పొదలతో చెట్లు వృక్షాలుగా ఎదిగాయి. సముద్రంలో మునిగిపోయిన ఓడల్లో ఎలాగైతే సముద్రజీవులు ఆవాసం ఏర్పరుచుకుంటాయో అలా ఆ రైలు బండిలో పక్షులు, పాములు, జంతువులు , క్రూరమృగాలు నివాసం ఏర్పరుచుకున్నాయి.
కాలం గడుస్తోంది, ఆ సెక్షన్లలో ఉన్న సిబ్బంది రిటైర్మెంట్ పొందారు, కొద్దిమంది స్వర్గస్థులయ్యారు. ఆ రైల్ గురించి అందరూ మర్చిపోయారు. ఆ ట్రైన్ ను అక్కడికి తెచ్చిన డ్రైవర్ డేనియల్ స్మిత్ సెప్టెంబర్1976లో ఆస్ట్రేలియాకు వలస వెళ్ళిపోయాడు.
పోయిన సంవత్సరం(2019) డిసెంబర్ ఇదో తారీఖు నాడు, నాసావారి ఉపగ్రహం ఆ ప్రాంతాన్ని మ్యాప్పింగ్ చేస్తున్నప్పుడు (ఆసియ ఆఫ్రికా ప్రాంతాలను)తీసిన ఫోటోలలో ఈ రైలుబండి కనిపించి కనిపించకుండా అనుమానాస్పదంగా కనిపించింది దట్టంగా పెరిగిన వన సంపదవలన.
ఘనత వహించిన నాసా వారు ఇదేదో భారత ప్రభుత్వ రహస్య ప్రాజెక్ట్ అని అనుమానించారు. సరే ఇది మన పనికాదు అని పెంటగన్ వారికి సమాచారం అందించారు.
నాలుగైదు రోజుల్లోనే ఆ ప్రాంతంలో అనూహ్యమైన ఉపగ్రహ సంచారం భారత దేశ ఇస్రో వారు గమనించారు.
ఇస్రో వారికి అర్ధంకాలేదు ఎందుకు ఇన్ని దేశాల ఉపగ్రహాలు ఆ ప్రదేశంలో సంచరిస్తున్నాయి ఆని? విషయమేమిటో తెలుసుకోవడాని కోసం ఆ ప్రాంతంలో అని వారు కూడా ఫోటోలు తీశారు మన ఉపగ్రహంతో.
ఈ లోపల మనం రహస్యంగా పోషిస్తున్న చైనా , రష్యాలో ఉన్న గుఢచారులు RAWకు (మన దేశ గూఢచారి వ్యవస్థ) ఈ వింతైన , అనూహ్యమైన , భారతదేశ ఉపరితలంపై వివిధదేశాల ఉపగ్రహ సంచారాన్ని అది కూడా చైనా సరిహద్దుల్లో సంచరిస్తున్న విషయాన్ని తెలియచేసారు.
ఇహ వెంటనే ప్రమాధఘంటికలు మొగసాగాయి, ఇదేమైనా భారతదేశ సివిలియన్ కానీ మిలట్రీ వ్యవహారం అవ్వొచ్చ? అని వివిధ దేశాలకు అనుమానం వొచ్చింది.
భారత దేశం తరఫు నుంచి విషయం ఏమిటి అని పరిశోధన మొదలైంది.PMO ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు,, DIA, డిఫెన్స్ గూఢచార సంస్థ,NIA, జాతీయ పరిశోధక సంస్థ, CCS, కేబినెట్ భద్రతా కమిటీ, MoD, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్,
అందరూ కలిశారు.
అంతర్గత మెమో ఒకటి సంబంధిత శాఖలకు పంపించారు. అందుకు జవాబుగా IHQ, ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ వారు,Space Command and SFC (Strategic Forces Command) వారు మేము ఆటువంటి రైలును మెమోలో చెప్పబడిన ప్రదేశంలో ఉంచలేదు అని బదులిచ్చారు.
ఆ తరువాత జరిపిన ఆకాశ రెక్కీలోనూ ( యుద్ధ విమానాలతో), మన ఉపగ్రహ ఫోటోల వల్లను మన భారత దేశ వైమానిక దళం మరియు (ARC) ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ వారు ఆప్రదేశంలో కనిపించీ కనిపించనట్టు ఒక రైలుబండి ఆ అడవిలాంటి ప్రాంతంలో పూర్తిగా కప్పబడి ఉంది అని నిర్ధారించారు.
మొత్తానికి ఒక నిజనిర్ధారణ పార్టీ ఏర్పడింది విషయం ఏమిటి అని తెలుసుకోవడానికి.
ఆ పార్టీలో ఉన్నవారి వివరాలు మనము సాధారణంగా వినివుండం కూడా.
ఆ సెర్చ్ పార్టీలో MARCOS అంటే మెరికల్లాంటి మెరైన్ కమాండోస్ మరియు GARUD's దేశ వైమానిక దళానికి సంబంధించిన గరుడా కమండోస్ వున్నారు. వారితో పాటు ఒక ఉన్నత స్థాయికి చెందిన గూఢచారి అధికారి కలిసి ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా విషయం తెలుసుకోవడానికి వెళ్లారు.
అదండి నలభై మూడేళ్ళ క్రితం మాయమైపోయిన రైలు బండి కధ.
నమ్మకశక్యం కాకపోయినా ఎన్నో దేశాలు, ఎన్నో దేశాల వివిధ పరిశోధనా సంస్థలు
ఉత్సాహం చూపిన,
భారతదేశ భూభాగంలో చైనా సరిహద్దుల్లో జరిగిన సంఘటన.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...