Sunday, 16 January 2022

ఇండియన్ హెర్క్యులెస్'  కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్,వీరకంఠీరవ, ప్రముఖ మల్లయోధుడు, బలశాలి కోడి రామ్మూర్తి నాయుడు గారి వర్థంతి సందర్భంగా


గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోపితే చిరునవ్వుతో మోసేవారు. ఉక్కు సంకెళ్లతో ఒంటిని బంధిస్తే ఊపిరితిత్తుల నిండా గాలి బిగించి రెండు క్షణాల్లో తెంపేసేవారు. ఏనుగు ఛాతీ మీదకు ఎక్కితే ఐదు నిమిషాల పాటు ఆ బరువును మోయగలిగేవారు. ఆయన పేరు కోడి రామ్మూర్తి నాయుడు. సిక్కోలు తొలితరం నిజమైన కథానాయకుడు. వెండితెరపై వెలిగిపోయిన బాహుబలికి బాబు లాంటి వారు. వందేళ్ల కిందట ఆయన చేసిన విన్యాసాలను ఈ తరం దాదాపు మర్చి పోయింది. సిక్కోలు కీర్తి బావుటాను దేశవిదేశాల్లో సగర్వంగా ఎగురవేశారు.

మన పురాణాలలో బలానికి మారుపేరు శ్రీ ఆంజనేయాడు,మరియు భీముడు అలాగే గ్రీక్ పురాణాలలో బలానికి పేరుగాంచినవాడు హెర్క్యులస్ కాబట్టి పాశ్చాత్యులు అప్పట్లో ఇండియన్ హెర్క్యులెస్ గా బ్రిటన్ పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీ ల చే బకింగ్ హమ్  ప్యాలెస్  లో వారితో విందు తీసుకొని బిరుదు పొందిన మహానుభావుడు శ్రీ కోడి రామ్మూర్తి గారు ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు. కోడి రామ్మూర్తి నాయుడు గారు ఈపేరు నేటి యువతకు అంతగా పరిచయము లేని  పేరు ఈయన ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మల్ల యోధులు పురాణాలలో భీముడి గురించి విన్నాము గాని చూసే అదృష్టము లేదు కానీ కలియుగ భీముడిగా ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు.రామ్మూర్తి నాయుడు గారు. 

కోడి రామ్మూర్తినాయుడు 1883 నవంబరు 8న జిల్లాలోని వీరఘట్టంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అప్పలకొండమ్మ, వెంకన్ననాయుడు.

కోడిరామ్మూర్తి తండ్రి పోలీస్‌శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేసేవారు.

 రామ్మూర్తినాయుడు వీరఘట్టంలోని కూరాకుల వీధి పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆయనకు చిన్న వయస్సు నుంచి వ్యాయాంపై ఎక్కువ మక్కువ చూపేవారు. రోజూ వేకువజామున వీరఘట్టం రాతి చెరువు సమీపాన వ్యాయామం చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ రహదారిలో వెళ్తున్న ఒక వ్యక్తి కోడి రామ్మూర్తినాయుడు చేస్తున్న వ్యాయామ సాధన చూసి ముగ్ధుడై ఆయనకు యోగా నేర్పించే వారు. అప్పటి నుంచి మరింత సాధన చేసి ప్రావీణ్యం సంపాదించారు. విజయనగరంలో ఎస్‌ఐగా పనిచేస్తున్న కోడి వెంకట్రావునాయుడు అనే తన బంధువు ఇంట్లో విద్య అభ్యాసం కొనసాగిస్తూ తనకు ప్రీతిపాత్రమైన వ్యాయామ విద్యలో అసాధారణ ప్రతిభ చూపించారు. మరింత మందికి అందించాలని భావించిన రామ్మూర్తి నాయుడు వ్యాయామ ఉపాధ్యాయునిగా విజయనగరంలోని సేవలను అందించారు.

విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సలహా, సహకారంతో రామ్మూర్తి సర్కస్ కంపెనీ నెలకొల్పారు. రామ్మూర్తి సర్కస్ కంపెనీ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకుంది. 1912లో మద్రాసులో సర్కస్‌ను ఏర్పాటు చేశారు. పులులు, ఏనుగులు, గుర్రాలతో రామ్మూర్తి చేసే బల ప్రదర్శనలు అందరినీ ఆకర్షించేవి'' అని ఆయన వివరించారు.

''శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును ముక్కలు చేయడం, రెండు కార్లను భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని... వాటిని కదలకుండా చేయడం, ఛాతీపై ఏనుగును ఎక్కించుని 5 నిమిషాల పాటు అలాగే ఉండటం వంటి ప్రదర్శనలు చూసేందుకు రామ్మూర్తి సర్కస్ ఎక్కడుంటే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చేవారు. సర్కస్ కంపెనీ ద్వారా రామ్మూర్తి నాయుడు కోట్ల రూపాయలు సంపాదించారు". 

*అప్పట పూనాలో లోకమాన్య తిలక్‌ కోరిక మేరకు ప్రదర్శనలిచ్చారు. దీంతో తిలక్‌ రామ్మూర్తికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్‌ బిరుదులిచ్చారు. విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వాలని ప్రోత్సహించారు. 

*హైదరాబాద్‌లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదునిచ్చారు. 

*అప్పటి వైస్రాయి లార్డ్‌ మింటో రామ్మూర్తి ప్రదర్శనలు చూ డాలని వచ్చి తనే కారును నడుపుతూ ఆ కారును రామ్మూర్తి ఆపేయడం చూసి ముగ్ధుడైపోయాడు. 

*అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్‌ సభ జరిగింది. రామ్మూర్తి సర్కస్‌ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూసి అభినందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు.   

*లండన్‌లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి రామ్మూర్తి ప్రదర్శనలకు అభిమానులైపోయారు. వారే తమ రాజభవనానికి ఆహ్వానించి ‘ఇండియన్‌ హెర్క్యులస్‌’ బిరుదునిచ్చారు. 

*స్పెయిన్‌లోని బుల్‌ ఫైట్‌లో రామ్మూర్తి పంతులు పాల్గొన్న తీరును వేలాది మంది ప్రేక్షకులు మెచ్చుకున్నారు.  

*జపాన్, చైనా, బర్మాలలో రామ్మూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి. 

ఓ పుస్తక కథనం ప్రకారం కోడి రామ్మూర్తిలో ప్రతి భాపాటవాలు బయటపడడానికి ఓ సంఘటన దోహదపడింది. అప్పట్లో ఆయన విజయనగరంలో ఉండేటప్పుడు.. అదే నగరానికి చెందిన పేర్ల రామ్మూర్తి శెట్టి ఇంటి ముందట కాలువలో ఓ ఎద్దు పడిపోయింది. ఆ జమిందారు 20 మంది బలవంతులను రప్పించి ఎద్దును బయటకు లాగడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సరిగ్గా అదే సమయానికి అటుగా వస్తున్న రామ్మూర్తిని చూసి జమిందారు హాస్యంగా ‘అదిగో మన శాండోగారు వస్తున్నారు. మీరంతా తప్పుకోండి. తను ఒక్కరే ఆ ఎద్దును బయటపడేయగలడు’ అని అన్నారు. దీంతో రామ్మూర్తి ఆ ఎద్దు పరిస్థితిని గమనించి దాని వద్దకు వెళ్లి మెడను, వెనుక కాళ్లను, తోకను గట్టిగా పట్టుకుని ఒకే ఉదుటన బయ ట పడేశారు. దీంతో రామ్మూర్తిలోని అసలు బలం అందరికీ ఆ ఘటనతోనే తెలియవచ్చింది.  

పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.

లండన్లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్ హెర్కులస్' బిరుదంతో సత్కరించారు.

జపాన్, చైనా, బర్మాలలో రామ్మూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి.

ఒకప్పుడు 1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పా ఠ్యాంశం ఉండేది. కాలక్రమేణా సిలబస్‌ మారడంతో ఆ పాఠ్యాంశాన్ని తొలగించారు. ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి సముచిత స్థానం కల్పించాలి.

ఒకసారి బర్మాలో హత్యాయత్నం జరిగాక ఆయన ప్రదర్శనలకు అడ్డు పడింది. 

 ఎంత డబ్బు గడించారో అంత కంటే గొప్పగా దానాలు కూడా చేశారాయన. ఆఖరి రోజుల్లో ఆయన కాలిపై రాచపుండు వచ్చి కాలే తీసేయాల్సి వచ్చింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎలాటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదని ఓ పుస్తకంలో పేర్కొని ఉంది. ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉండిపోయారట. చివరిరోజులు బలంఘర్, పాటా్నలో కలహండి (ఒడిశా) పరగణా ప్రభువు పోషణలో ఉంటూ 1942 జనవరి 16న కన్ను మూశారు.

కోడి రామ్మూర్తినాయుడు పుట్టిన వీరఘట్టంలో, విశాఖ, శ్రీకాకుళం పట్టణాల్లో ఆయన విగ్రహాలు పెట్టారు. ఏయూలో జిమ్‌కు, శ్రీకాకుళంలో స్టేడియానికి ఆయన పేరు పెట్టారు.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...