Friday 26 November 2021

 స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు ఆంధ్రుల ఘనకీర్తీ డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య గారి జయంతి సందర్భంగా

#స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, #ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. #డాక్టర్‌గా తెలుగు భాషాభిమానిగా, ఖద్దరు దారిగా, స్వాతంత్య్ర సమరశీలిగా, మహాత్మాగాంధీకి ఆప్తునిగా, రాజకీయ చతురునిగా, నిరంతర #ప్రజా సేవకునిగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకొన్నారు సీతారామయ్య. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పులకోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారాయన.

1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. #గాంధీజీ పిలుపు మేరకు 1916 లో ఆ వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఎటువంటి వృత్తిని చేపట్టకూడదనే ధ్యేయంతో ముందుకు నడిచారు. 1948లో జైపూర్‌ కాంగ్రెస్‌ సమావేశం నాటికి కాంగ్రెస్‌ అధ్యక్షుని స్థాయి కి ఎదిగారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు. నేడు దేశంలో ప్రముఖ బ్యాంకుగా చలామణి అవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను 1923లో స్థాపిం చాడు. అంతేకాకుండా ఈయన స్థాపించిన ఆంధ్ర ఇన్సూరెన్స్‌ కంపెని (1925), హిందు స్తాన్‌ ఐడియల్‌ ఇన్సూరెన్స్‌ కంపెని (1935) లు తరువాతి కాలంలో ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో #చిరస్మరణీయ సేవలను అందించారు.
నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో అవకాశం తలుపుతట్టినా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప #కులపతి పదవి గుమ్మం వరకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగిపోయిన మహనీయుడు డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య.
#బాల్యం:
పశ్చిమ గోదావరి జిల్లా గుండుకొలను గ్రామంలో 1880, నవంబర్ 24 న ఆరువేల నియోగి బ్రాహ్మణుల ఇంటిలో పట్టాభి జన్మించాడు. వారి ఇంట్లో ప్రతి సంవత్సరం రామపట్టాభిషేకం జరిపే ఆచారం ఉండేది. అందుకే తల్లిదండ్రులు పట్టాభీ సీతారామయ్య అనే పేరు పెట్టినారు. ప్రాథమిక విద్య స్థానికంగా బందరులోనే చదివి తరువాత బందరులోని నోబుల్ కాలేజీలో ఎఫ్.ఎ. పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అక్కడ #రఘుపతి వెంకటరత్నం నాయుడుకు ఇతడు ప్రియశిష్యుడు.
ఉన్నత విద్యకై మద్రాసు (నేటి చెన్నై) వెళ్ళి మద్రాసు క్రైస్తవ కళాశాల నుండి బి.ఏ. డిగ్రీ పొందిన పట్టాభి ఎం.బి.సి.ఎం. డిగ్రీ సాధించి డాక్టరు కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు.
#స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడిగా :
చదువు పూర్తైన తర్వాత మచిలీపట్నంలో డాక్టరుగా ప్రాక్టీసు పెట్టాడు కానీ లాభదాయకమైన సంపాదనను వదులుకొని గాంధీజీచే ప్రభావితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీలో పట్టాభీ గాంధీజీకి అతి సన్నిహితంగా ఉండేవాడు. 1939లో భారత జాతీయ కాంగ్రేసు పార్టీ అధ్యక్ష పదవికి అతివాద అభ్యర్ధి అయిన సుభాష్ చంద్రబోస్ కు వ్యతిరేకముగా, మహాత్మా గాంధీ అభిమతానికి దగ్గరైన వాడిగా పట్టాభిని పోటీలో నిలబెట్టారు. అయితే నేతాజీ పెరుగుతున్న ప్రాబల్యం మరియు పట్టాభి స్వాతంత్ర్యానంతరం, తమిళ ఆధిపత్యమున్న కొన్ని జిల్లాలను భావి తెలుగు రాష్ట్రములో కలపటానికి మద్దతునిస్తున్నాడన్న భావన ఈయన ఓటమికి కారణమయ్యింది. పట్టాభి ఓటమి తన ఓటమిగా గాంధీజీ భావించి బాధపడ్డాడు. ఆ తరువాత మళ్ళీ 1948లో జరిగిన కాంగ్రెస్ అద్యక్ష ఎన్నికలలో పురుషోత్తమ్‌దాస్ టాండన్ పై గెలిచి స్వతంత్ర
భారత తొలి కాంగ్రెస్ అద్యక్షుడిగా అవతరించినాడు.
1942లో #క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభములో కాంగ్రేసు పార్టీ కార్యాచరణ వర్గంలో పనిచేస్తూ ఉండగా మొత్తం కార్యాచరణ వర్గ సహితంగా పట్టాభిని అరెస్టు చేసి మూడేళ్లపాటు అహ్మద్ నగర్ కోటలో బయటి వ్యక్తులెవ్వరితో సంబంధాలు లేకుండా బంధించి చిత్రవధ చేశారు. బందీగా ఉన్న ఈ సమయంలో పట్టాభి తన దినచర్యను గూర్చి విస్తారమైన డైరీ నిర్వహించాడు. దీన్నే ఆ తదనంతరం ఫెదర్స్ అండ్ స్టోన్స్ (ఈకలు మరియు రాళ్ళు)గా ప్రచురించారు.
#ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి కృషి :
తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దాని కొరకు పట్టాభీ ఎంతగానో కృషిచేశాడు. పట్టాభీ చొరవతోనే ఆంద్ర రాష్ట్రోద్యమానికి అంకురార్పణ 1908లో బందరులో జరిగింది. బందరు సమావేశంలో తెలుగు జిల్లాల ప్రముఖులందరూ సమావేశమై ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం గురించి చర్చించినారు. ఆ తరువాతనే 1913లో బాపట్లలో తొలి ఆంద్రమహాసభ జరిగింది. ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర ఆవశ్యకత గురించి పట్టాభి ఆంగ్లంలో ఒక గ్రంథమే రచించినాడు. పట్టాభి కృషి వల్లనే 1920లో కాంగ్రెస్ పార్టీ ఆంద్ర రాష్ట్ర ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదించింది.
#వ్యాపారవేత్తగా#ఆంద్రా బ్యాంకు స్థాపన:
పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించాడు. ఆంద్రా బ్యాంకు (1923లో స్థాపన), ఆంద్రా ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి స్థాపించాడు. ఆంద్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించాడు.
#తెలుగు అభిమానిగా :
ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు జిల్లాలలో తెలుగు వాడకాన్ని పట్టాభి ఎంతగానో ప్రోత్సహించినాడు. తాను స్థాపించిన సంస్థలన్నింటిలోనూ తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీలు తెలుగులోనే జరగాలని నియమం పెట్టి ఆచరించాడు. ఆయన వేష, భాషల్లో ఎప్పుడూ తెలుతనం ఉట్టిపడుతూ ఉండేది. అఖిల భారత కాంగ్రెస్ అయిననూ, గవర్నర్‌గా మధ్య ప్రదేశ్ వెళ్ళిననూ వేష, భాషల్లో మార్పు రాలేదు.
#గ్రంథకర్తగా:
పట్టాభి రచించిన గ్రంథాలలో కాంగ్రెస్ చరిత్ర (History of Indian National Congress) అన్నింటికంటే ప్రధానమైనది. సుమారు 1600 పుటల కాంగ్రెస్ చరిత్రను కేవలం 2 మాసాలలో పూర్తిచేశాడు. అందులోనూ దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ. కేవలం తన జ్ఞాపక శక్తితో వ్రాసి సంచలనం సృష్టించాడు.
#స్వాతంత్ర్యానంతరం:
స్వాతంత్ర్యం తరువాత 1948లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీలో నెగ్గి పీఠాన్ని అధిష్టించాడు. ఆ తరువాత 1952లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంటులో ప్రవేశించినాడు. 1952 నుండి 1957 వరకు మధ్య ప్రదేశ్ గవర్నరుగా పని చేశాడు. తెలుగు ప్రజలకు ఎంతగానో తోడ్పాటు అందించిన పట్టాభీ 1957, డిసెంబర్ 17న స్వర్గస్థులయ్యాడు.

 యాదృచ్ఛికమా లేదా కుట్రా?

26/11 దాడుల సమయంలో భారతదేశ అంతర్గత భద్రతను స్తంభింపజేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించిందా? భారత ప్రభుత్వాన్ని, మన గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థను పాక్ కావాలని తప్పు దారి పట్టించి భారత ఉన్నత అధికారులను అందుబాటులో లెకుండా చేసిందా?

చదవండి...
నవంబర్ 26, 2008న, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సభ్యులు ముంబైలో బాంబు దాడులకు పాల్పడినప్పుడు భారతదేశం వరుస ఉగ్రవాద దాడులతో దద్దరిల్లింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో తొమ్మిది మంది ముష్కరులతో సహా మొత్తం 175 మంది మరణించారు మరియు 300 మందికి పైగా గాయపడ్డారు.
దాడి చేసిన 10 మందిలో తొమ్మిది మంది చనిపోయారు మరియు అజ్మల్ కసబ్ మాత్రమే పోలీసులు సజీవంగా అరెస్టు చేసి అన్ని చట్టపరంగా నవంబర్ 21, 2012న పూణేలోని ఎరవాడ జైలులో రహస్యంగా ఉరితీయబడ్డాడు.
అయితే ఈ ఘోరమైన దాడులపై ప్రభుత్వం ఆలస్యంగా ప్రతిస్పందించడం పై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు. 26/11 సంఘటన మీద నియమించిన నాటి ఉన్నత స్థాయి విచారణ కమిటీ (HLEC) కూడా చట్టాన్ని అమలు చేసే సంస్థలలో లోపాలను ఎత్తి చూపింది.
దాడులు జరిగిన వెంటనే ప్రభుత్వం ప్రతిస్పందించడంలో ఆలస్యమెందుకు అయింది?
దాడుల సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన తొమ్మిది మంది ఉన్నత స్థాయి అధికారుల సభ్యుల బృందం ఆ టైం లో పాకిస్థాన్‌లో ఉందని చాలామందికి తెలియదు. ఈ బృందంలో అప్పటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా నేతృత్వంలోని భారత హోం మంత్రిత్వ శాఖ మరియు ఇతర భద్రతా సంస్థల అధికారులు కూడా ఉన్నారు.
ఈ ఉన్నతాధికారుల బృందం నవంబర్ 24, 2008న అంటే బాంబు దాడులకు సరిగా 2 రోజులు ముందు ఇస్లామాబాద్‌కు చేరుకుంది. రెండు రోజుల తర్వాత, అంటే నవంబర్ 26న భారత్ తిరిగి రావాల్సి ఉంది. అయితే, పర్యటనను ఒక అదనపు రోజు పొడిగించారు.
దేనికోసం ? ఎక్కడికి?
ఇస్లామాబాద్‌కు ఈశాన్యంగా 60కిమీ దూరంలో ఉన్న హిల్ స్టేషన్ అయిన ముర్రేలో అదనపు రోజు బస ఏర్పాటు జరిగింది. ఆ ప్రదేశంలో బృందానికి కమ్యూనికేషన్ మార్గాలు అంటే టెలిఫోన్ కనెక్షన్లు కూడా లేవని నివేదికలు సూచించాయి.
కేంద్ర హోం కార్యదర్శి అంతర్గత భద్రత, అంతర్గత భద్రత డైరెక్టర్, అంతర్గత భద్రత సహా కీలక నిర్ణయాధికారులు బాంబు దాడులు సమయంలో ముర్రేలో ఉన్నట్లు తెలిసింది. భద్రత మరియు గోప్యత కారణాల వల్ల వారి హోదాలు మరియు గుర్తింపులు బహిర్గతం చేయబడలేదు.
ఆ బాంబు దాడులు సమయంలో మన అధికారులు పాకిస్థాన్ ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నారనే ఆరోపణలను మాజీ హోం సెక్రటరీ మధుకర్ గుప్తా 2016లో తిరస్కరించారు. పాకిస్థాన్ తమ అంతర్గత మంత్రిని కలవాలని పట్టుబట్టిందని, అందుకే తమ బసను పొడిగించారని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆయన చెప్పారు.
" మేము రెండు రోజులుగా ఇస్లామాబాద్‌లో ఉంటున్నప్పటికీ, ఆతిథ్య దేశం మమ్మల్ని ముర్రేలోని సమీపంలోని హిల్ రిసార్ట్‌కు తరలించడానికి ప్రత్యేక ప్రణాళికలు వేసింది. వెనక్కి తరచి చూస్తే, భారతీయుల ప్రతిస్పందనను ఆలస్యం చేయడం లేదా బలహీనపరచడం అసలు ఉద్దేశమా అనే అనుమానాన్ని ఇప్పుడు మాకు కలగచేస్తోంది " అని ఈ మాజీ బ్యూరోక్రాట్ 2016లో టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు.
అయితే, ముర్రేలో టెలివిజన్ సిగ్నల్ లేదనే వార్తలను మధుకర్ గుప్తా తోసిపుచ్చారు, ఎందుకంటే దాడుల గురించి భారతదేశం నుండి తనకు కాల్ వచ్చిందని, వెంటనే టీవీని ఆన్ చేసి చూసి భారతదేశంలోని సీనియర్ నాయకత్వాన్ని సంప్రదించానని చెప్పాడు.
ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు.
1. పర్యటన ఎందుకు పొడిగించబడింది?
2. బృందాన్ని హిల్ స్టేషన్‌కి ఎందుకు మార్చారు?
3. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారులకు దాడుల గురించి ముందే తెలుసా?
4. ఇది కుట్ర లేదా యాదృచ్చికమా?
ఆ రోజు దాడులు అప్పుడు తుకారాం ఒంబ్లే అనే సాధారణ పోలీసు ఆఫీసర్ AK 47 పట్టుకున్న కసబ్ ని తన ఒంట్లో గుళ్ళు దిగుతున్నా వదలకుండా సజీవంగా పట్టుకోవడం వల్లే హిందూ సంస్థల పేరుకు హాని జరగకుండా ఉంది.
లేకపోతే...
ఆ కసబ్ చేతికి కషాయి తాడు, జేబులో హిందూ చౌదరీ పేరుతో ఐడెంటిటీ కార్డుతో కసబ్ శవం దొరికి వుంటే ఆ బాంబు దాడులు హిందూ సంస్థల పనే అని ప్రచారం చేసి RSS సంస్థను, మిగిలిన హిందూ సంస్థలను శాశ్వతంగా బాన్ చేసి వుండేవారు UPA నాయక ప్రభుద్దులు.
అందుకే హిందువులూ, హిందూ సంస్థలు కీ.శే తుకారాం ఓంబ్లే కి ఎప్పటికీ రుణపడి ఉండాలి.

Thursday 25 November 2021

 వీరాంగన ఝల్కారీ బాయి..

1857లో భారత స్వాతంత్ర్య పోరాటంలో పురుషులతో పాటు స్త్రీలు భుజం భుజం కలిపి సమాన సహకారం అందించారు. కొన్ని చోట్ల, బ్రిటిష్ అధికారులు మరియు పోలీసులు వారి ధైర్యసాహసాలు చూసి ఆశ్చర్యపోయారు. అలాంటి వీరనారీమణుల్లో ఒకరు ఝల్కారీ బాయి ఆమె తన వీరోచిత చర్యలతో పురుషులను కూడా వెనుకకు నెట్టింది..

ఝల్కారీ బాయి 1830 నవంబర్ 22న భోజ్లా (ఝాన్సీ, ఉత్తరప్రదేశ్) గ్రామంలో జన్మించింది..తండ్రి మూలచంద్ర జీ ఆర్మీలో పనిచేసేవారు. దీంతో ఇంటి వాతావరణంలో శౌర్యం, దేశభక్తి ప్రభావం నెలకొంది. సభలో తరచూ యుద్ధాలు, సైనిక పోరాటాలు, సైన్యం సాధించిన విజయాల గురించి చర్చలు జరిగేవి. చిన్నప్పటి నుండి, మూలచంద్ర జీ ఝల్కారీకి ఆయుధాల ఆపరేషన్ నేర్పించారు. దీంతో పాటు చెట్లు ఎక్కడం..నదుల్లో ఈత కొట్టడం..ఎత్తు నుంచి దూకడం వంటి పనుల్లో కూడా ఝల్కారీ ప్రావీణ్యం సంపాదించింది.


ఒకసారి ఝల్కారీ అడవి నుండి కలపను తెస్తున్నప్పుడు భయంకరమైన చిరుతపులి నేరుగా దాడిచేసింది. ఝల్కారీ ఒక చిన్న బాకుతో చిరుతపులిని చంపేసి దాన్ని భుజంపై వేసుకెళ్లింది. ఒకసారి గ్రామ పెద్దని దారిలో బందిపోట్లు చుట్టుముట్టారు. యాదృచ్ఛికంగా ఝల్కారీ అక్కడికి వచ్చింది..బందిపోటు దొంగలమీద లంఘించి కేవలం చేతి కర్రతో బందిపోట్లను తరిమికొట్టి గ్రామపెద్దను కాపాడుకుంది..ఇలాంటి వీరోచిత సంఘటనల వల్ల ఝల్కారీ ఊరందరికీ ముద్దుల కూతురు అయింది.

ఝల్కారీ చిన్నతనంలో, ఆమె ఝాన్సీ సైన్యంలో గన్నర్ అయిన పురాన్ కోరిని వివాహం చేసుకుంది. ఝల్కారీ రాణి లక్ష్మీబాయి నుండి ఆశీర్వాదం కోసం వెళ్ళినప్పుడు, ఆమె వీరత్వాన్ని యుద్ధవిద్యా నైపుణ్యాన్ని చూసి ఆమెను దుర్గా దళంలోకి చేర్చుకుంది. 1857లో ఝాన్సీని పట్టుకోవడానికి ఆంగ్లేయ సైన్యం కోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఝల్కారీ రాణి రాజభవనానికి చేరుకొని రాణి ఝాన్సీ ఆమె దత్తపుత్రుడితో కలిసి కోట నుండి సురక్షితంగా బయటపడటానికి సహాయం చేసింది.

ఇందుకోసం ఝల్కారీ చేసిన పనిని ఊహిస్తేనే తనువు పులకించిపోతుంది.  స్వయంగా భర్తే రాణి లక్ష్మీబాయికి సంబంధించిన ఆభరణాలు వస్త్రాలు ఝల్కరీ భాయి కి  ధరింపచేశాడు..ఝాన్సీ రాణికి సాధారణ స్త్రీ దుస్తులు ధరించేలా చేశాడు. రాణి ఝాన్సీ మారువేషంలో కోట బయటకు వెళ్ళిపోయారు..మరోవైపు రాణి వేషం ధరించిన ఝల్కారీ బాయి రణచండీగా మారి బ్రిటిష్ వారిపై విరుచుకుపడింది..

చాలా సేపు బ్రిటిష్ సైన్యం అధికారులు గందరగోళంలో పడిపోయారు. వారు రాణి లక్ష్మీబాయిని చనిపోయిన లేదా సజీవంగా అరెస్టు చేయాలని కోరుకున్నారు కానీ రెండు చేతుల్లో కత్తులతో ఝల్కారీబాయిబ్రిటిష్  సైనికులను క్యారెట్లు, ముల్లంగిలా కోస్తున్నది.. శివతాండవం చేస్తున్న ఝల్కరీ బాయ్ మీద కనీసం కత్తి విసిరే సాహసం కూడా బ్రిటిష్ సైనికులు చేయలేకపోయారు..అప్పుడు ఒక దేశద్రోహి  జనరల్ హురోజ్‌తో తను రాణి లక్ష్మీబాయి కాదని దుర్గా దళ నాయకురాలు ఝల్కారీ బాయి అని చెప్పాడు..

ఈ విషయం తెలిసి తను మోసపోయానని హురోస్ ఆగ్రహంతో ఊగిపోయాడు.. తానే స్వయంగా సైనికులతో కలిసి దాడి చేసి ఝల్కారీని చుట్టుముట్టి తమ అదుపులోకి తీసుకున్నారు.. ఝల్కారీబాయి ఉరి బదులు వీరమరణాన్ని కోరుకున్నారు..తన భర్త వీర్బల్ కు ముందుగా అనుకున్నట్టు సైగ చేశారు.. సిగ్నల్ అందిన వెంటనే వీర్బల తనను తాను కాల్చుకునే ముందు తన భార్య ఝల్కరీ బాయి ని కాల్చివేసి జీవితాన్ని ముగించాడు..ఝల్కారీ బాయి తన జీవితం మరియు మరణం రెండింటినీ అర్ధవంతం చేసింది..

ఇలాంటి మహాతల్లుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం..

అడుక్కుంటే వేసేది బిక్ష..పోరాడితే వచ్చేది స్వతంత్రం..

వీరనారి ఝల్కర్ బాయి కి ఘన నివాళులు..

నేడు వారి జయంతి..

 గోదావరి బ్రిడ్జి 

సరిగ్గా 47సంవత్సరాల క్రితం, ఈ బ్రిడ్జి ని ఈ రోజున 23.11.1974 ఉదయం 11 గంటలకు, అప్పటి రాష్ట్రపతి శ్రీ ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు జాతికి అంకితం చేశారు 


మన గోదారమ్మకు మణిహారం 

కొవ్వూరు..రాజమండ్రి కి అపురూప బంధం 

ఉభయ గోదావరి జిల్లాలను కలిపిన ఆత్మీయ వారధి... ఈ అపురూప రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి 

ఈ బ్రిడ్జి కూడా ఒక ఇంజినీరింగ్ అద్భుతమే.. ముఖ్యం గా రాజమండ్రి దగ్గర ఈ మలుపు చాలా లెక్కలు వేసి నిర్మించారుట.. ఇండియాలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి లలో ఇది మూడవది.. మొదటిది అస్సాం లో బ్రహ్మపుత్ర నదిపైన, రెండవది సొన్ పూర్ బీహార్ లోనూ... మూడవది మన రాజమండ్రి..కొవ్వూరు మధ్య నిర్మించారు..1964లో మూడవ పంచవర్ష ప్రణాళికలో కొవ్వూరు - రాజమండ్రి మధ్య రెండు వరుసలు రైల్ మార్గాన్ని నదిపై బ్రిడ్జిని నిర్మించాలని తీర్మానించారు.

అప్పటికి ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలు లాంచీల పైనే జరిగేవి. రాజమండ్రి నుండి భద్రాచలం వరకూ సరుకు రవాణా కూడా లాంచీలే ఆధారం. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలని వినతిని కేంద్రానికి పంపడం, అది ఆమోదం పొందడం చకచకా సర్వే అనుమతులు జెసోప్ కంపెనీ నిర్మాణం మొదలు పెట్టి 1974 ఆగస్టుకి పూర్తి అయింది.

రైల్ మార్గం 2.8 కి.మీ రోడ్ మార్గం 4.1 కి.మీ. 

అప్పటి రాష్ట్ర పతి శ్రీ ప్రక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు ఈ బ్రిడ్జిని ఓపెన్ చేశారు. అన్నట్టు అప్పట్లో టివిలు లేవు  ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేసింది.. ఉషశ్రీ గారు ప్రతీ క్షణాన్నీ చక్కగా వర్ణిస్తూ.. అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించారు.. లాంచీల ప్రయాణం ఆగింది..

కొవ్వూరు..రాజమండ్రి షటిల్ బస్ లు వేశారు..

ఉభయగోదావరి జిల్లాలు ఒకటి అయ్యాయి..

అందుకే మన గోదారోళ్లకు ఈ బ్రిడ్జి అపురూపం!

  శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి వర్థంతి సందర్భంగా

【  స రి గ మ ప ద ని.....

సప్తస్వరాలు.

ఆ స్వరాలన్నిటికీ నైవేద్యం పెట్టిన బాలగంధర్వుడు...

స్వరస్వతీపుత్రుడు.......】

ఆయన జీవితమే... ఓ సంగీత ఝరి........

#ప్రపంచ ప్రజల భాష సంగీతం. మనసును కదిలించేది, మనిషిలో #చైతన్యాన్ని రగిలించేది సంగీతం. శిశుర్వేత్తి... పశుర్వేత్తి... వేత్తిగాన రసఃఫణిః అని పెద్దలు ఏనాడో చెప్పారు. అవధులెరుగనిది..ఎల్లలు ఒల్లనిది..భాషాభేదాలు లేనిది..ప్రాంతీయతలు తెలియనిది సంగీతం ఒక్కటే......

#మధుర మంగళ నాదమణులకు #తళుకులద్దిన స్వరజ్ఞాని మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు.

#పాటే ఆయన పరిమళం..  రాగాలే ఆయన అస్తిత్వం.. ఒక్క మాటలో  చెప్పాలంటే #సంగీతం ఆయనకు సర్వస్వం.ముదిమేది వయసేది నీ పదముల చెంతను ముదమారవించగా అంటూ తనకు తన గానానికి వయోభారం లేదని మంగళంపల్లి బాలమురళీ కృష్ణ నిరూపించారు.

సరిగమలు లోతులు సామాన్యులకు సైతం తెలిపే గానం ఆ గానగంధర్వుడు బాలమురళీ కృష్ణది. అనేక కీర్తలను తన గొంతు నుంచి అమృత ధారల రూపంలో శ్రోతలకు వీనుల విందులు చేసాడు.కర్నాటక సంగీతం అనగానే ఈ తరంలో వెంటనే స్పురణకు వచ్చే పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సంగీతాన్ని ఔపోసన పట్టిన #మహానుభావుడు బాలమురళి గారు.

#బాల్యం:

 బాలమురళీకృష్ణ 06 -07 -1930 న తూర్పు గోదావరి జిల్లాలోని,శంకరగుప్తంలో పుట్టారు.ఆయన తల్లి తండ్రులు సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య గార్లు.తల్లి వీణా విద్వాంసురాలు. మాతామహుడు అయిన శ్రీ ప్రయాగ రంగదాసు గారు సంగీత కోవిదుడు. వారు స్వయంగా కొన్ని కృతులను వ్రాసి స్వరపరిచారు. అవి ‘శ్రీ ప్రయాగ రంగదాసు కీర్తనలు’ గా ప్రసిద్ధి చెందాయి. శ్రీ బాలమురళీకృష్ణ వాటిని గానం చేసారు

ఈయన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. మంగళంపల్లి ఏడవ ఏటనుండే కచేరీలు చేయటం ప్రారంభించాడు. తొమ్మిదియేళ్ళ వయసులో వయోలిన్,మృదంగం,కంజీర లాంటి వాయిద్యాలలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. కుమారునికి ఉన్న సంగీత జ్ఞానాన్ని గుర్తించి తండ్రి గారైన పట్టాభిరామయ్య గారు ఆయనను గాయక బ్రహ్మ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య గారి వద్ద శిష్యరికానికి పంపారు. దీనితో శ్రీ మంగళంపల్లి జీవితానికి ఒక మార్గం లభించింది. 

#ఉద్యోగం:

విద్యాభ్యాసం పూర్తి చేసుకొన్న బాలమురళీకృష్ణ విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా కొంతకాలం పనిచేసారు. ఆ రోజుల్లో విజయవాడలో శ్రీ విశ్వనాధ వారి మన్నలను,ఆశీస్సులను పొందారు.

కాలక్రమంలో మద్రాస్‌లో స్థిరపడి, తమిళ , కర్ణాటక, మళయాళ భాషలపై కూడా పట్టు సాధించారు.

#విస్తారమైన పాండిత్యము:

సంగీతంలోని అన్ని విభాగాలలోను విస్తారమైన పాండిత్యము, మంత్రముగ్దులను చేసే గాత్రం, కంపోసింగ్ లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హిందుస్తానీ సంగీతంలోని సంగీతకారులతో కలిసి పనిచేశాడు. జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్ సేన్ జోషితో కలిసి ముంబయిలో నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరీ అమోన్కర్, మొదలగు వారితో కూడా జుగల్ బందీ కచేరీలు చేసాడు. ఈ కచేరీలు అతనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక, సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి. బాలమురళీకృష్ణ వయోలిన్, వయోలా, వీణ, మృదంగం మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నాడు. ఇతను తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు.

#కచేరీలు:

8 #సంవత్సరాల #అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా #బాలమేధావి అనిపించుకున్నారు.

సుమారు 30,000 కచేరీలకు పైగా ఇచ్చి ఉంటారు. అన్నమయ్య కీర్తనలు,రామదాసు కీర్తనలు,ఎంకిపాటలు,తత్వాలు,లలితగీతాలు ,ఎన్నో భక్తి గీతాలు…ఇలా చెప్పుకుంటూపోతే వారు పాడిన పాటలకు అంతే ఉండదు. ఆయన పాడింది పాట,ఆలపించింది రాగం అన్నట్లుగా ఉంటుంది. వేలాది కాసెట్లు, రికార్డ్లు రిలీజ్ అయ్యాయి! బాలమురళీ కేవలం గాయకుడే కాదు,వాగ్గేయకారుడు కూడా. 72 మేళకర్తల్లో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు ఈయన.

#రాగాలు సృష్టికర్త:

లవంగి,త్రిశక్తి,మహతి లాంటి పెక్కు రాగాలు సృష్టించిన సంగీత సరస్వతి  బాలమురళీ.

#సినిమాలలో:

సినిమా పాటలు కూడా అద్భుతంగా చాలా భాషల్లో పాడారు.భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడి వేషం వేసి మెప్పించారు. హంసగీతే కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించటమే కాకుండా ఉత్తమ గాయకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. మధ్వాచార్య చిత్రానికి కూడా జాతీయ స్థాయిలో సత్కారం.హంసగీతెలో ఆలపించిన గీతానికి 1975లో ఉత్తమ సినీ గాయకునిగా జాతీయ సినిమా పురస్కారాలు పొందారు.సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు అతను సంగీతాన్ని అందించారు.

#విదేశాల్లో వేల సంఖ్యలో కచేరీలు..

మంగళంపల్లి బాలమురళీకృష్ణ అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్ దేశాల్లో వేల సంఖ్యలో కచేరీలు నిర్వహించారు. తెలుగు, కన్నడం, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో పాటలు పాడారు.

#జగమంతా సంగీతమే!

సంగీతం అంటే కేవలం సరిగమపదనిసలే కావు. మన జీవితమే సంగీతం. మన మాటల్లో శ్రుతి ఉంటుంది. నడకలో లయ ఉంటుంది. ఇలా ఫలానాది సంగీతం... ఫలానాది కాదు అని చెప్పలేం. విశ్వమంతా సంగీతమే. అన్నిట్లో సంగీతం ఉంటుంది. దేన్నుంచీ దీన్ని విడదీయలేం అంటారు.

#సంగీతమే దివ్యౌషధం:

సంగీతం.. అన్నిటికీ దివ్యౌషధం.  ఒత్తిడి.. మానసిక వ్యాకులత వీటన్నిటికీ ఇది అద్భుత ఔషధం!ఎంతోమంది ఎన్నో సమస్యలునుమ్యూజిక్ థెరపీ తగ్గించవచ్ఛు అంటారు బాలమురళీ గారు.

#బిరుదులు:

గంధర్వగాన సామ్రాట్, జ్ఞానసాగర, సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణం, గానగంధర్వ, గాయక శిఖామణి, జ్ఞానశిఖామణి, జ్ఞాన చక్రవర్తి, జ్ఞానపద్మం, నాదజ్యోతి, సంగీత కళాసరస్వతి, నాద మహర్షి వంటి ఎన్నో బిరుదులు ఆయన సొంతం

బాలమురళీకృష్ణ ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవడాక్టరేట్లు అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ జాతీయ పురస్కారాలను అందుకున్నారు.మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతిమధ్యమావతి, గణపతి, సిద్దిరాగాలు, భద్రాద్రి శ్రీరామ చంద్రుని సుప్రభాతాన్ని ఆయన ఆలపించారు.

#ఫ్రెంచి ప్రభుత్వం నుండి:

అంతే కాకుండా ఫ్రెంచి ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన శేవేలియర్ అవార్డ్ అందుకున్న ఏకైక కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ బాలమురళీ.

#జీవితంపై పుస్తకం:

బాలమురళీకృష్ణ సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర అనదగ్గ పుస్తకం బందా వెంకయ్య రాసిన “మురళీమాధురి”. ఈ పుస్తకంలో బాలమురళి చిన్ననాటి సంగతులు, అతను అభిమానులకు ఆసక్తి కలిగించే ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి నూకల చినసత్యనారాయణ ఉపోద్ఘాతం రాశాడు.

నవంబర్ 22, 2016న

మధ్యాహ్న భోజనం తరువాత నిద్రించి నిద్రలోనే అనాయాస మరణం పొందాడు.

శతాబ్దానికో, రెండు శతాబ్దాలకో ఒకసారి ఆవిర్భవించే గొప్ప విద్వాంసుల్లో బాలమురళీకృష్ణ ఒకరు.

ఆ సుస్వర మహర్షి భౌతికంగా దూరమైనా తన కీర్తనలు, పాటలతో సంగీత ప్రియుల #హృదయసీమలో శాశ్వత స్థానం #సంపాదించుకున్నారు.

ఫిడెల్ కాస్ట్రో


క్యూబా విప్లవ యోధుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు, విప్లవ చిహ్నం ఫిడెల్ కాస్ట్రో వర్థంతి  సందర్భంగా♦️

#ఇనుప సంకెళ్ళతో ఎంతోకాలం ఏ దేశం మనలేదు. భుజబలంతో ఏ రాజ్యం దీర్ఘకాల సుఖసంతోషాలను కొని తీసుకురాలేదు. క్యూబా చిన్నదేశమైనా అమెరికాలాంటి అగ్రరాజ్యం కబళించ లేకపోవడానికి కారణం మనిషి అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చిన వికాసం. ప్రజల బాగో గులు పట్టించుకొని వాటికే పట్టంకడితే చీమంత దేశాన్నయినా గద్దలాంటి పెద్ద దేశం ఏమీ చేయలేదని క్యూబా నిరూ పించి చూపించింది. తమ యోగక్షేమాలు చూసిన నాయకుడిని పరాయిదేశం తుద ముట్టించాలని చూస్తే ప్రజలు రక్షక కవ చంగా నిలవడంతో చిన్న దేశాల ఆత్మవి శ్వాసానికి పెద్ద సంకేతంగా మిగిలిపోయింది.

ఫిడెల్ క్యాస్ట్రో చతురంగ బలంలోను, చతుర్విధ కుయుక్తులతో ఐదు దశాబ్దాల పాటు నెట్టుకురాలేదు. మనిషి ప్రాథమిక అవసరాలను గుర్తించి వాటిని కల్పించేం దుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. మానవ వికాసానికి ప్రాతిపదికగా నిలిచే ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి శత విధాలా పనిచేశారు. ఆరోగ్య పరిరక్షణ, విద్యారంగాలపై ధనం, సమయం వెచ్చించి లాటిన్ అమెరికా దేశాలలోనే గొప్ప విజయాలు సాధించారు. అవసరంలో ఉన్న దేశాలకు నిష్ణాతులైన వైద్యులను పంపే ప్రాణదాతగా క్యూబాను క్యాస్ట్రో నిలిపారు.

#ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే స్థానాన్ని సాధించుకున్న #కమ్యూనిస్టు #వీరుడు:

ఫిడెల్ కాస్ట్రో  (జననం:ఆగస్టు 13, 1926 - మరణం:నవంబరు 25, 2016) 

ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే స్థానాన్ని సాధించుకున్న కమ్యూనిస్టు వీరుడు క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో. ఆయన జీవితం, పోరాటం, విజయాలు భవిష్యత్ తరాలను ఉత్తేజపరుస్తూనే ఉంటాయి. అమెరికా తొత్తుగా వ్యవహరిస్తున్న బటిస్టా నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసి, విప్లవపతాకను ఎగురవేసినప్పటి నుంచి ప్రధా నమంత్రిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా క్యాస్ట్రో సాగించిన పాలన అమెరికాను ఎదిరించడానికే పరిమితం కాలేదు. అమెరికాకు వ్యతిరేకంగా క్యాస్ట్రో సాగించిన పోరాటం, సాధించిన విప్లవ విజయం క్యూబా ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధిపై చెరగని ముద్రవేశాయి. #దాదాపు 638 సార్లు అమెరికా జరిపిన #హత్యా యత్నాలను ఎదుర్కొని నిలబడ #గలిగారాయన. దేశ ప్రజానీకం మొత్తం క్యాస్ట్రోకు రక్షణ కవచంగా నిలిచిందనడానికి అమెరికా విఫలయత్నాలే నిదర్శనం. నిజానికి 1990వ దశకంలో జరిగిన సోవియట్ యూనియన్ పతనం క్యూబాకు పెద్ద విఘాతమే. అయినా క్యూబా ఆ సమస్యను అధిగ మించింది. ప్రపంచాన్ని అబ్బుర పరిచే ప్రగతిని సాధించగలిగింది.

#అమెరికా తన గుత్తాధిపత్యం:

క్యూబా పురాతన దేశం. 1492లో స్పెయిన్ నావికుడు క్రిస్టోఫర్ కొలం బస్ అప్పటి ఇటలీ ప్రభుత్వ సహకారంతో భారతదేశాన్ని కనుగొనాలని బయలు దేరి, దారి తప్పి అమెరికా సహా క్యూబాను కనిపెట్టాడు. అప్పటి నుంచి అక్కడికి స్పెయిన్ దేశీయుల వలస ప్రారంభమైంది. 1898 వరకు క్యూబా స్పెయిన్ వలస దేశమే. స్పానిష్ అమెరికన్ యుద్ధం తరువాత 1898లో క్యూబా అమెరికా వలసగా మారింది.  కొద్ది కాలంలోనే క్యూబాను అమెరికా స్వతంత్ర దేశంగా ప్రకటించినా, ఆ స్వతంత్రం నామమాత్రమే. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అమెరికా క్యూబాను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది. చెరుకు తోటల పెంపకం, చక్కెర ఉత్పత్తి అమెరికా తన గుత్తాధిపత్యంలో ఉంచుకుంది. దేశ ఆర్థిక రంగానికి మూలాధారమైన చక్కెర ఉత్పత్తి అమెరికా నియంత్రణలో ఉండడం వల్ల ప్రజల బతుకుతెరువు అగ్ర దేశం దయాదాక్షిణ్యాల మీద కొనసాగింది.

  #బటిస్టా ప్రభుత్వం:

బటిస్టా నాయకత్వంలోని నియంతృత్వ  ప్రభుత్వం కూడా అమెరికా కనుసన్నల్లో ఉండేది. చక్కెర పరిశ్రమలో, చెరుకు తోటలో పనిచేసేవారు కేవలం 30 శాతం. మిగిలిన 70 శాతం నిరు ద్యోగంలో లేదా అర్థ నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతుండేవారు.

ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, అమెరికా ఆర్థిక దోపిడీ లక్ష్యంగా నిర్మితమైన క్యూబా ఆర్థిక వ్యవస్థ ఆ దేశాన్ని పేదరికంలోకి నెట్టింది. నిత్యా వసరాలైన పాలు, గుడ్లు, మాంసాహారం కూడా కరువయ్యాయి. 89 శాతం మందికి కనీసం పాలు కూడా దొరకని స్థితి. 96 శాతం మంది మాంసాహారం తిని ఎరుగరు. 98 శాతం మందికి గుడ్లు కూడా లభించేవి కావు. ప్రభుత్వంతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. వివిధ రూపాల్లో కొన్ని తిరుగుబాట్లు చేశారు. ఆ క్రమంలోనే *క్యాస్ట్రో విద్యార్థి నేతగా ఉద్యమాల్లో అడుగుపెట్టారు.*

#ప్రప్రథమ ప్రధానమంత్రిగా:

బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1953 జులై 26వ తేదీన క్యాస్ట్రో నాయకత్వంలో శాంటియాగో డీక్యూబా లోని మంకోడా సైనిక స్థావరం మీద దాడి జరిగింది. ప్రభుత్వం 24 మందిని అరెస్టు చేసి, జైలుకి పంపింది. 60 మంది విప్లవకారులను హత్య చేసింది. ప్రజా ఉద్యమాల ఫలితంగా 1955 ఏప్రిల్‌లో క్యాస్ట్రో సహా విప్లవకారులంతా విడుదలయ్యారు. విప్లవ కార్య క్రమాల మీద నిర్బంధం పెరగడంతో క్యాస్ట్రో తన కార్యస్థానాన్ని మెక్సికోకి మార్చి, అక్కడి నుంచే సాయుధ గెరిల్లా పోరాటానికి సన్నాహాలు చేశారు. క్యాస్ట్రో సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రవుల్  క్యాస్ట్రో, యువ విప్లవ కెరటం చేగువేరా కూడా ఆయనను అనుసరించారు. చిట్టచివరిగా 1959 జన వరి 1వ తేదీన క్యాస్ట్రో నాయకత్వంలోని రెడ్‌ఆర్మీ బటిస్టా ప్రభుత్వాన్ని కూల దోసింది. ఆ ఫిబ్రవరి 10న క్యాస్ట్రో ప్రప్రథమ ప్రధానమంత్రిగా పదవిని చేప ట్టారు. బటిస్టా దేశం వీడి పారిపోయాడు.

#ఆరోగ్యరంగంలో అనన్యసా మాన్యమైన #విజయాలు:

ఆదిలో అల్లకల్లోలం

క్యాస్ట్రో ప్రభుత్వం మొదటి చర్యగా అమెరికా ఆస్తులను, పరిశ్రమలను జాతీ యం చేసింది. వేల కోట్ల డాలర్ల సంపదను కోల్పోయిన అమెరికా క్యూబా విప్లవ ప్రభుత్వాన్ని అడుగడుగునా దెబ్బతీయడానికి  యత్నించింది. విప్లవ ప్రభుత్వం ఏర్పడడంతో బటిస్టా మద్దతుదారులైన ధనికవర్గం అమెరికాకు పారిపోయింది. అందులో వివిధ రంగాల నిపుణులు, వైద్యులు, ఇతర మేధా వులు కూడా ఉన్నారు. దాదాపు 50 శాతం వైద్యులు క్యూబాను వీడారు. తీవ్ర స్థాయిలో వైద్యుల కొరత ఏర్పడింది. అయినా క్యాస్ట్రో ప్రభుత్వం చలించ కుండా పెద్ద మొత్తంలో వైద్యవిద్యను ప్రోత్సహించి, అవసరమైనంత మంది వైద్యులను తయారుచేసుకోగలిగింది. ఆరేళ్లలోనే అవసరమైన ఆరోగ్య వ్యవ స్థను స్థాపించుకోలిగింది. 1970 సంవత్సరానికి ఆరోగ్యరంగంలో అనన్యసా మాన్యమైన విజయాలను సాధించింది.

తమ బడ్జెట్‌లో సింహభాగాన్ని ఆరోగ్య అవసరాలకు, డాక్టర్ల శిక్షణకు వినియోగిం చడం వల్ల ఇది సాధ్య మైంది. 1970కి వచ్చే సరికి మలేరియా, పోలియో పూర్తిగా నిర్మూలించారు. క్షయ, జీర్ణకోశ వ్యాధులతో జరిగే మరణాలను చాలా పెద్దమొత్తంలో అరి కట్టగలిగారు. 1980లో ఈ కృషిని మరింత విస్తృత పరచగలిగారు. ఈరోజు ఆరోగ్యరంగంలో క్యూబా ప్రపంచ దేశాలన్నింటిలో అగ్రభాగాన ఉండడమే కాకుండా, ప్రజలు వైద్య సౌకర్యాల లేమితో బాధపడ కుండా చేయగలిగింది. ఆరోగ్యం ప్రజల హక్కుగానే కాకుండా ప్రభుత్వ బాధ్యతగా ప్రకటించుకు న్నది. ఆదర్శవంతమైన డాక్టర్- నర్స్ పథకాన్ని అమ లుచేసింది. చేస్తున్నది.

150 కుటుంబాలకు ఒక నర్స్, ఒక డాక్టర్ వంతున నియమించి వైద్య ఆరోగ్య విషయాలలో ప్రజలందరిని చైతన్యపరిచే అరుదైన వ్యవస్థను క్యూబాలో అద్భుతంగా అమలు పరిచారు. ఆ 150 కుటుంబాల ఆరోగ్య వివరాలన్నీ డాక్టర్ - నర్స్‌ల బృందం వద్ద ఉంటాయి. ప్రతి 30 వేల నుంచి 60 వేల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక పాలిక్లినిక్‌ను ఏర్పాటు చేస్తారు. క్యూబాలో ఇప్పుడు 498 పాలిక్లినిక్‌లున్నాయి. వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యా ర్థులు మొదటి ఏడాది నుంచే పాలిక్లినిక్‌లలో వైద్యసేవలందిస్తూ ఆచరణలో వైద్యవిద్యను నేర్చుకుంటారు. క్యూబాను దెబ్బతీసేందుకు అత్యవసరాలైన మందులు, వైద్య పరికరాలను సైతం అమెరికా నిలిపివేసింది. కానీ అవేవీ క్యూబా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. విప్లవం వచ్చేనాటికి క్యూబా శిశుమరణాల రేటు 80 అయితే ఈ రోజు అది 4.63 శాతం. మన దేశంలో 41.1 శాతం. అమెరికాలో 5.74శాతం. అంటే క్యూబా కంటే అధికమే. చిన్న దేశం క్యూబా సాధించిన వైద్య విజయాన్ని అర్థం చేసు కోవడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. అంతేకాక లాటిన్ అమెరికన్ మెడికల్ స్కూల్స్ స్థాపించి 72 దేశాలకు చెందిన దాదాపు 20,500 మంది వైద్యులను అందించింది. క్యూబాలో వైద్య ఆరోగ్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అలా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

#విజయ పరంపర:

విద్యారంగంలో క్యూబా సాధించిన విజయం కూడా ఘనమైనదే. నూటికి నూరు శాతం విద్యారంగం బాధ్యత ప్రభుత్వానిదే. మూడు దశాబ్దాల క్రితమే నూటికి నూరు శాతం అక్షరాస్యతను ఆ దేశం సాధించింది. ఇందుకు కారణం 1961లోనే 2 లక్షల మంది ఉపా ద్యాయులను సమీకరించి, ఒక ఉద్యమ స్ఫూర్తితో అక్షరాస్యతను అందించగలిగింది. అదే సమయంలో విద్యను ఉత్పత్తితో అను సంధానం చేస్తూ భవిష్యత్తు ఉపాధి నైపుణ్యాలను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మహిళల అక్షరాస్యతలో కూడా నూటికి నూరు శాతం ఫలితాలను సాధించగలిగింది క్యూబా. రాజకీయరంగంలో సైతం క్యూబా సాధించిన విజయం అనేక ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు వంటిది.

#మహిళల ప్రాతి నిధ్యం:

పార్లమెంటులో ఇప్పుడు దాదాపు 45 శాతంగా మహిళల ప్రాతి నిధ్యం ఉందంటే, స్త్రీల రాజకీయ భాగస్వామ్యంలో ఆ దేశం ఎంత ముందుందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అనే కమైన మార్పులను చేపట్టింది. భూమిని కొందరి చేతుల్లో కేంద్రీకృతం చేసే అసమాన వ్యవస్థగా కాకుండా ప్రభుత్వం మాత్రమే యావత్ భూమిపైన హక్కును కలిగి ఉంటుంది. రైతులు సహకార సంఘాలుగా ఏర్పాటై వ్యవ సాయాన్ని నిర్వహించే అవకాశాన్ని కలిగించారు. దానితో సహకార రంగం ద్వారా ఉత్పత్తి పెరగడం మాత్రమే కాకుండా క్యూబా ప్రభుత్వం ధరలను సైతం నియంత్రించగలిగింది.

 #చిరస్మరణీయుడు:

ప్రజల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎప్పటిక ప్పుడు తన విధానాలను సమీక్షించుకొని క్యూబా ముందుకు పోతున్నది. మొదట రష్యా తరహాలో కేంద్రీకృత ప్రణాళికలను రూపొందించుకున్నప్ప టికీ; ఆ తర్వాత చైనా, వియత్నాం పద్ధతుల్లో ఆర్థిక విధానాలను రూపొం దించు కున్నది. ఇటీవల మరికొన్ని నిర్ణయాలను తీసుకొని ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాలను విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి అంశాలు దెబ్బ తినకుండా సమయానుకూలంగా మార్చుకోవాలని ఆలోచి స్తున్నట్టు తెలుస్తున్నది. పారిశ్రామిక రంగంలో కొంత వెసులుబాటు కల్పించి త్వరితగతిన వృద్ధిని సాధించాలని చూస్తున్నారు.

గత అరవైయేళ్లుగా సామా జికార్థిక ప్రగతికి ప్రజలే కేంద్రబిందువుగా పాలనను అందిస్తూ అనేక దేశాల్లో సోషలిస్టు విధానాలు విఫలమైనప్పటికీ, తమ గడ్డమీద మాత్రం సోషలిజం నిజమని రుజువు చేసింది.

#విప్లవోద్యమాలకు స్ఫూర్తిప్రదాత:

అగ్రరాజ్యం #అమెరికాకు సమీపం నుంచే ఎదు రొడ్డి నిలబడిన క్యాస్ట్రో లాటిన్ అమెరికా, మధ్య అమెరికా ఆఫ్రికా దేశాల్లోని విప్లవ, జాతీయ విముక్తి పోరాటాలకు ఎనలేని స్ఫూర్తినం దించారు. క్యాస్ట్రో తన అభిమాన యోధుడని దక్షిణా ఫ్రికా నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా కొనియాడారు. మధ్య అమెరికాలోని నికరగువా, గ్వాటమాల ప్రజాపోరాటాలకు క్యాస్ట్రో మద్దతునందించారు. ముఖ్యంగా గ్వాటమాల నేత డేనియల్ ఆర్టెగాకు కీలకమైన మద్దతు అందించారు. అలాగే మరో లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాలో హ్యూగో చావెజ్ నేతృత్వంలో వచ్చిన ప్రజాతంత్ర ప్రభుత్వం నిలబడడానికి క్యాస్ట్రో నుంచి అన్ని విధాలా నైతిక మద్దతు లభించింది. ఇంత సాయం అందించినందుకు బదులుగా క్యూబాకు కారుచౌకగా చావెజ్ ముడి చమురు సరఫరా చేశారు. అలాగే ఐరోపా వలస పాలన నుంచి విముక్తి కోసం ఆఫ్రికా దేశాల్లో వచ్చిన తిరుగుబాటు ఉద్యమాలకు కూడా క్యాస్ట్రో చేతనైనంత సాయం చేశారు. తన సుదీర్ఘ పాలనా కాలంలో పది మంది అమెరికా అధ్యక్షులను క్యాస్ట్రో చూడడమే కాదు వారి విధానాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అమెరికా ఆధిపత్యానికి, దాని కీలుబొమ్మ సర్కార్లకు వ్యతిరేకంగా జరిగిన అన్ని ప్రజాపోరాటాలకు అండగా నిలిచారు

 #క్యూబా  కమ్యూనిజం శాశ్వత సత్యమని చాటి చెప్పి  తొమ్మిది పదుల నిండు జీవితంలో సామ్రాజ్యవాదంపై అలు పెరు గని యుద్ధం చేసి, #జనక్యూబాను నిర్మించిన #ఫిడెల్ క్యాస్ట్రోను  నిరంతరం స్మరించు కుందాం.


Tuesday 9 November 2021

 Padam Shri awarded as ' Encyclopedia of the Jungle ' #Tulsigowda's story tells that even big changes can be made without education and resources.














Tulsi Gowda is being discussed the most among many Vibhutis awarded with Padam Shri. When the living encyclopedia of the jungle without slippers and the same cloth wrapped around its body appeared before the President for the award, its simplicity and vibrant taunts attracted everyone's attention. If the life struggles of Tulsi Gowda are imitated, without education and resources, radical changes can be brought in the world.

Actually Tulsi was born in a family of Halkki tribe of Karnataka... in childhood her father walked and started working with mother and sisters from young age... because of this they never school I could go and could not learn to read and write... She got married at the age of 11 but her husband also did not live long...

Tulsi started taking care of trees and plants only to remove the sorrow and loneliness of her life... Her interest in #Vanaspati conservation increased and she joined as activists in the state's forestry scheme... In the year 2006, he got a job as a #treeplanter in the forest department and after fourteen years he is retired today... During this time he has planted countless trees and played a vital role in the conservation of biodiversity...

72 years old basil can't count and tell how many trees they planted in their entire life... Basil which estimates 40 thousand has planted more than one lakh trees.... Dedicating its whole life to trees Vali Tulsi has amazing knowledge about trees and plants... because of which they are also known as the #InasCyclopedia of the forest...

Despite not being educated in school, the knowledge of basil on forests and trees is no less than an #environmentalist or scientist... They know the benefits of all types of plants... How much water to which plant What kind of soil do the trees grow, it's all at their fingers....

Tulsi is still active in planting trees.. also they teach children how important trees are for our lives.. without them this earth will not be worth living...

Courtesy: Nandkishore Prajapati Kanwan

 సాహిత్యం : 

ఆనందలహరి 

– కర్లపాలెం హనుమంతలావు 

( ఈనాడు - ఆదివారం - సంపాదకీయం ) 

మనుచరిత్ర వరూధిని నుంచీ సముఖం కృష్ణప్ప అహల్యా సంక్రందనం కథానాయిక చెలికత్తె దాకా... అందరికీ ఆనందమంటే - అదేదో వంటి నుంచీ పుట్టే పరబ్రహ్మ స్వరూపం! ' ఎందే డెందము  కందళించు  రహిచే - అందే ఆనందో బ్రహ్మం ' వరూధినికి. అహల్య సహేలికీ  'ఎందును సంచరింపక అఖిలేంద్రియముల్ సుఖమొందు* అట్టి బుద్ధి కగోచరమైన ఆనందమే పరమానందం. తార అతి చొరవతో మనసు చెదిరిన శశాంకుడూ ప్రారంభంలో పరకాంత అని కొంత, అధర్మమని కొంత చింత పడ్డా చివరికి దేహరుచికే దాసోహమన్నాడు. అడిదం  సూరపరాజు' కవిజనరంజనం' కథానాయకి చంద్రమతి శోభనం గదిలో కడుగు పెట్టే వేళ చెలికత్తెలకు బహుపరాకులు చెప్పవలసిన పరిస్థితి. మొగుడు మునిపంట నొక్కగానే మొగమలు అప్పుకునే  అంతటి లజ్జావతీ ఆరు మాసాలు  ముగియ కుండానే అతగాడు అడిగీ  అడగక ముందే తియ్యని  మోవి నందించే గడసరితనానికలవాటు పడింది! ఇదంతా పడుచుతనపు పరవళ్ళ ఉరవళ్లు అని  సరిపుచ్చు కుంటే సరిపోతుందా? మరి రఘునాథ నాయకుడి 'శృంగార సావిత్రి' విశ్వామిత్రుడి వ్యధో? మద్ర దేశాధిపతి ఉగ్రదీక్షను భంగం చేయాలని బదరికావనానికి బయలుదేరిన మేనక వెనుక  ' అకట ! నీవు నన్ను విడవాడి చనం బదమెట్టు లాడు? ' నంటూ అంతటి  జితేంద్రియుడు గోడు గోడు మంటూ వెంట బడ్డాడే! ఆనందం ఒక అర్థవమయితే అందులో ఒక్కొక్కరిది ఒక్కో తరహా మునక. రసరమ్య కావ్యం రాయమని రాయలడిగినప్పుడు పెద్దనామాత్యుడి వంటి పెద్ద మనిషే 'నిరుపహతిస్థలం, రమణీయ ప్రియదూతిక చేతి కప్పుర విడెం, ఆత్మకింపయిన భోజనం, ఊయల  మంచం వంటి భోగాలు  లేనిదే ఊరక కృతులు రాయడం అశక్యమనేశాడు. మరి మామూలు మనిషికి ఆనందమంటే భౌతిక సుఖాలభోగమని మాత్రమే అనిపించదా?!

నిజానికి ఆనందానికీ భౌతిక సుఖాలకీ అసలు సంబంధమనేది ఉందా?

ఆనంద కానన   కాశీనాథుడు ఒక బికారి. సిలువ మేకులకు వేలాడే క్రీస్తు పెదవుల మీద చలువ నవ్వులు ఏ ఆనందానికి ప్రతీకలు?! ఆనందమంటే  కేవలం భౌతిక భోగానుభవం అనే భావన బలంగా ఉన్నంత కాలం  భిక్షాపాత్ర ధరించిన బుద్ధభగవానుని వదనంలోని ఆ ప్రశాంత చింతన అర్థం కాదు. చిదానంద స్వరూపంగా సదా మనం సంభావించే ఏ భగవదవతారమూ భూమి పై సుఖపడిన దాఖాలాలు లేవు - అంటున్నారు స్వామి సుఖబోధానంద. లోకాదర్శం కోసం చివరికి జానికినయినా సంతో షంగా పరిత్యజిస్తానని ఆచరించి చూపిన పత్నీ వ్రతుడు అందరి మన్ననలు పొందిన మర్యాదరాముడు. రాజసూయయాగ వేళ అతిథి అభ్యాగతుల  ఎంగిలి విస్తరాకులను గోవర్ధనోద్ధరణమంత సంబరంగా ఎత్తి పారవేసిన ప్రక్షాళకుడు  గోవిందుడు. అన్నమయ్యని బాలాజీ ఎవరి బలవంతాన పల్లకీలో మోసుకెళ్ళాడు?! తామరాకు మీది  నీటి బొట్టు తత్త్వం నాకత్యంత ప్రియపాత్రం - అనిగీతలో భగవానునువాచ. ఆనందం... భౌతిక సుఖాలు పాలూ నీరూ  వంటివి. నీటిలో  నేరుగా కలిస్తే పలుచనయే  పాలు  పెరుగయి మధనకు గురయి వెన్న ముద్దగా మారితే  ఏ నీరూ ఏమీ చేయలేదు. పెరుగుగా మారటానికి పాలకు పెట్టే 'తోడే' ఆనందం అంటారు మాతా అమృతానందమయి. ఒక కొత్త ముఖాన్ని చూడకుండా | ఒక కొత్త సుఖాన్ని చవి చూడకుండా | నారోజుమరణిస్తే | నేను బ్రతికి వున్నట్లా ? ' అని ఓ ఆధునిక కవి అంతర్మధనం.  మనసుతో పాటు మన పరిసరాలకూ  సరిసమానంగా సంతోషాన్ని పంచేదే అసలైన ఆనందం. అది ఉండేది  పైనో, పక్కనో, పక్కలోనో కాదు. కస్తూరి మృగం దేహ పరిమళంలాగా అది పుట్టు కొచ్చేది మనలోని మంచి భావనలలో నుంచే! మనిషి ఆ పరిమళమృగంగా అనందిమనే చందనం  కోసం మూల మూలలా  వెదుకులాడుకోవడమే ఈనాటి అన్ని అశాంతులకు మూలకారణం.

వేసారిన మోహము దేనిపై ? - క్షీర జలనిధి నీలోనే ఉండగ, అరవి దీపము లోన  ఉండగ' అని మన భావకవి కృష్ణశాస్త్రిలా కులాసాగా పాడుకునే ఆ తాతల తరం నుంచి  అనందానికి అసలైన  అర్థం ఆధునికులూ తెలుసుకుంటే అదే బ్రహ్మాండంలో  లభించే అసలుసిసలు ఆనందో బ్రహ్మం .

 తెలుగు కథకు మాస్టారు!!!

"అనగనగా ఓ యజ్ఞం"....
సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయుడు
శ్రీ కాళీపట్నం రామారావు గారి జయంతి సందర్భంగా


















【'భగవంతుడికి జనం నమస్కరిస్తారు. ఆ భగవంతుడు మనిషిగా మారితే అప్పుడు కూడా అందరూ అతనికి నమస్కరిస్తారని, మనందరికీ తెలిసిన విషయమే. అయితే, దేముడు మానవుడైతే అప్పుడు అతనైనా సరే శ్రీ కాళీపట్నం రామారావుగారికి నమస్కరించి తీరవలసిందే! పురుషులలోన పుణ్యపురుషులు వేరయా అని వేమన గారు రామారావుగార్లాంటి వారిని చూసే చెప్పి ఉంటారు. రామారావు గారి వంటి సజ్జనుడి సాంగత్యం లభించడం నా అదృష్టం. ఆయన లాంటి గొప్ప కథకులుండటం మన జనం అదృష్టం.'
- రాచకొండ విశ్వనాధ శాస్త్రి, యజ్ఞం కథాసంపుటి ముందు మాట, 1971】

తెలుగు కథా #సాహిత్యంలో ఆయనదో ఓ ఒరవడి.. గ్రామీణ భూస్వామ్య వ్యవస్థను చిత్రిక పట్టి తన రచనల ద్వారా దాని నిజస్వరూపాన్ని తేటతెల్లం చేశారు. ‘#కథల మాస్టారు’ అన్న పేరుకు పర్యాయపదంగా నిలిచారు. ఆయన కథలు ప్రపంచ సాహిత్యంలో సముచిత స్థానాన్ని సంపాదించాయి. కారా మాస్టారుకు సాహిత్యం అంటే ప్రాణపదం. ఆయన మానస పుత్రిక కథా నిలయాన్ని వందేళ్ల తెలుగు కథా #సాహిత్యానికి చిరునామాగా నిలిపారు.
#కారా మాస్టారు గా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు #సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా #ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్య జ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావ ప్రాధాన్య రచనలు చేసాడు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంద్రనాధ్ రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా అత్యంత సుప్రసిద్ధమైన రచనలు చేసారు.
కారా మాస్టారుగా సుపరిచితులైన కథా రచయితే #కాళీపట్నం రామారావు. రెండోతరం తెలుగు కథా సాహిత్యంలో తనదైన ప్రత్యేక ముద్రవేశాడు. కథాసేవే తన జీవిత మార్గంగా ఎన్నుకుని జీవిస్తున్న సాహిత్య సృజనశీలి. నిత్యం కథ గురించి మాట్లాడుతూ, కథ గురించి రాస్తూ, కథల్ని భద్రపరుస్తూ కథే జీవితమైన వ్యక్తి కాళీపట్నం రామారావు. గురజాడ బాటను కథల్లో మరింత ముందుకు తీసుకెళ్లి, దానికి అభ్యుదయ వాసనలు పూయించిన ఘనుల్లో కారా మాస్టారు ముఖ్యులు.
#బాల్యం-తొలి జీవితం:
కారా మాస్టారు శ్రీకాకుళం జిల్లా మురపాకలోనవంబరు 9, 1924లో జన్మించారు. వీరి నాన్న కరణం పేర్రాజు. అక్కడే ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదువుకున్నారు. విశాఖ జిల్లా భీమిలీలో టీచర్ ట్రైనింగ్ శిక్షణ తీసుకున్నారు. 1948లో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి 31 ఏళ్లపాటు ఎందరో విద్యార్థులకు పాఠాలు బోధించాడు. 1979లో ఉద్యోగ విరమణ చేశారు. మార్చి 19, 1946లో సీతామహాలక్ష్మిని వివాహం చేసుకున్నారు. జీవితంలో అనేక సాధక బాధకాలు పడ్డారు.
#సాహిత్యం:
కారా మాస్టారు తన 19వ ఏట తొలికథ 'ప్లాటు ఫారమో...' రాశారు. ఇది 1943లో 'చిత్రగుప్త' పత్రికలో వచ్చింది. ఆ తర్వాత 'వీసంలో... అయితే గియితే' పేరుతో రెండో రాశారు. రామారావు మొదట స్వాతంత్ర్య పోరాటం, గాంధీ భావాలు, నెహ్రూ సోషలిస్టు భావాల ప్రభావంతో కథలు రాసినట్లు కనిపిస్తుంది. రాగమయి, అభిమానాలు, అభిశప్తులు, పలాయితడు... లాంటి కథలు ఇలాంటివే. 1967లో నక్సల్బరీ ఉద్యమం తర్వాత వీరి చూపులో మార్పు వచ్చింది. కారా గారికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన కథ 'యజ్ఞం' 1966లోనే వెలువడింది. తర్వాత ఈ భావాలతోనే హింస, నో రూమ్, ఆర్తి, భయం, చావు, కుట్ర, ఆయన చావు... లాంటి ఎన్నో కథలు వీరి నుంచి వచ్చాయి. ఇవన్నీ తెలుగులో శాశ్వతంగా నిలిచిపోయే రచనలు.
#పలు సంపుటాలుగా:
వీరి రచనలు పలు సంపుటాలుగా ముద్రితమయ్యాయి. రాగమయి (1957), యజ్ఞం (1971), కాళీపట్నం రామారావు కథలు (1972), అభిమానాలు (1974), జీవధార-ఇతర కథలు (1974), కాళీపట్నం రామారావు కథలు (1986), యజ్ఞంతో తొమ్మిది (1993), కాళీపట్నం రామారావు కథలు( 1999). 2008లో వీరి రచనలు అన్నీ 567 పేజీల గ్రంథంగా వెలుగులోకి వచ్చింది.
'#యజ్ఞం' కథ తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథ. ఈ కథలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించారు. అందులో నిగూఢంగా కనిపించే ధనికవర్గం పక్షపాతాన్ని సూటిగా చెప్పారు. కథా లోతుకు, విస్తృతమైన పరిదికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ.
'#జీవధార' కథలో పేదవాళ్లు నీళ్లు దొరక్క నానా యాతన పడుతుంటే... శ్రీమంతులు విలాసం కోసం పెంచుకునే క్రోటను మొక్కలకు నీళ్లు వృధా చేస్తూ ఉంటారు. పేదవాళ్లందరూ కలిసి నీళ్లకోసం శ్రీమంతుల ఇంటికి వెళ్తారు. వాళ్లు జనశక్తికి బెదిరి అనుగ్రహించే దేవుళ్లలా పట్టుకోమంటారు. ఇలా సాగుతుంది కథ. ఈ కథలో లోతుగా వర్గ దృక్పథమే ఉంటుంది. కానీ రచయిత ఎక్కడా ప్రవేశించడు. తన భావాలను చెప్పడు. శిల్పం దృష్ట్యా కూడా ఇదో గొప్పకథ.
కాళీపట్నం రామారావు ప్రత్యేకతే ఇది. రచయిత చెప్పదలచుకున్న భావం అంతర్లీనంగా పాఠకుడికి చేరుతుంది. భాష సరళంగా ఉంటుంది. జీవితంలో అనుభవించి, పరిశీలించి, కష్టాలను, సంఘర్షణలను కథల్లో రాశారు కారా. అట్టడగు వర్గాల జీవన సమరాన్ని పాత్రల్లో ప్రవేశపెట్టాడు. ఆరు దశాబ్దాలు తెలుగు కథను సుసంపన్నం చేసిన కారా మాస్టారి కథలు రష్యన్, ఇంగ్లీషు, ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదాలయ్యాయి. ఆంధ్రభూమి దినపత్రికలో 'నేటి కథ' శీర్షికను నిర్వహించి ఎంతో మంది కొత్త రచయితలను ప్రోత్సహించారు.
#గురువుగా, మార్గదర్శకునిగా.....
కారా మాస్టారు తన కథా రచనకు కొడవటిగంటి కుటుంబరావును గురువుగా, రా.వి.శాస్త్రిని మార్గదర్శకునిగా భావిస్తారు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటిస్తే ప్రభుత్వ విధనాలు నచ్చక తిరస్కరించారు.
#కథానిలయం:
1995లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును స్నేహితుల కోరిక ప్రకారం అందుకుని ఆ డబ్బుతో ఫిబ్రవరి 22, 1977లో శ్రీకాకుళంలో 'కథానిలయా'న్ని స్థాపించారు. ఇక్కడ సుమారు ప్రముఖ తెలుగు పత్రికలన్నీ దొరుకుతాయి. 600ల మంది కథా రచయితల కథలు లభ్యమవుతాయి. రామారావు నేడు కథా రచయతల జీవిత విశేషాలను, ఛాయాచిత్రాలను భద్రపరిచే పనిలో ఉన్నారు. ఇదొక అపూర్వమైన కథా ప్రపంచం. తెలుగులో సుమారు 3000ల మంది కథా రచయితలు ఉన్నారని వీరి అంచనా.
#జీవితానికి చాలా ముఖాలున్నాయి. ఆంతరంగిక జీవితం మనకొక్కడికి మాత్రమే. అది అందరికీ కాదు, కొందరికే తెలుస్తుంది. మన వ్యక్తిగత జీవితం చుట్టూ ఉండే వాళ్లకు కూడా కనిపిస్తుంటుంది. కౌటంబిక జీవితం చుట్టూ ఉండే కుటుంబ సభ్యులకూ, బంధుమిత్రులకూ తెలుస్తుంది. సామాజాకి జీవితం ప్రపంచానికి తెలిసేదైతే, వ్యవస్థాగత జీవితం స్పష్టమైన ప్రపంచ దృక్పథం ఉన్న వాళ్లకు మాత్రమే తెలిసేది' అని కథా రచన చేస్తున్న వారికి, కథా లోతుల్ని పసిగట్టే వారికి చెప్తారు కారా మాస్టారు.తెలుగు సాహిత్యం పై ఏమాత్రం అభిమానమున్న వారు ఒక్కసారైనా ఈ కథా నిలయాన్ని దర్శించాలి.
#కాళీపట్నం "#యజ్ఞం":
గోపన్న కొన్నాళ్ళక్రితం అప్పల్రాముడనే మాల కుల పెద్దకు రెండువేలు అప్పు ఇస్తాడు.అప్పల్రాముడు అప్పు తీర్చడు.అది వడ్డీతో సహా రెండువేల అయిదొందలవుతుంది.అప్పుతీర్చాలని గోపన్న తగవుకొస్తే,శ్రీశ్రీరాములు నాయుడు పంచాయితీ వద్దని మధ్యస్థంగా తీర్పు చెప్తాడు.మూడేళ్ళ గడువు అడుగుతాడు అప్పల్రాముడు.అతడికి రెండెకరాల ముప్పై సెంట్ల మడిచెక్క వుంటుంది.అది అమ్మితేకానీ అప్పు తీర్చలేడు.అది అమ్మటం అతనికి ఇష్టం లేదు.అందుకే మూడేళ్ళ గడువు కోరతాడు.
మూడేళ్ళవుతుంది.అప్పల్రాముడు అప్పు తీర్చడు.దాంతో విషయం పంచాయితీకి వస్తుంది.ఇక్కడి నుంచీ కథ ఆరంభమవుతుంది.
అప్పు తీర్చలేనంటాడు అప్పల్రాముడు.తీర్చాలంటారు పెద్దలు.భూమి అమ్మితే తనకేమీ మిగలదంటాడు అప్పల్రాముడు.తీర్చక తప్పదంటారు పెద్దలు.చివరికి శ్రీరాములు కూడా తీర్చాలనటంతో అప్పల్రాముడు అందుకు ఒప్పుకుంటాడు.అయితే,అప్పల్రాముడి పెద్ద కొడుకు ఆవేశపరుడు.భూమి అమ్మటం అతనికి ఇష్టం వుండదు.అతడు వూరి పెద్దలను ఖాతరు చెయ్యడు.తండ్రి భూమి అమ్మి అప్పు తీరుస్తాననగానే ఇంటికి పరుగెత్తుతాడు.తన సంతానాన్ని నరికేస్తాడు.తన కొడుకు బానిస బ్రతుకు బ్రతకటం ఇష్టం లేక ఆపని చేస్తాడు.
ధర్మాన్నాలేంతవరకూ?అంతా నువ్వు చెప్పినట్టు వినేవరకూ.ఆ తరువాత!అని కథ ముగుస్తుంది.
మొదటీ నుంచీ కథ చదువుతూంటే ముగుంపు గురించిన ఒక ఊహ కలుగుతుంది.కానీ తన కొడుకునే,అతడు చంపేసుకోవటం(అప్పల్రాముడి పెద్దకొడుకు తన కొడుకుని చంపుకుంటాడు.)అనూహ్యమయిన ముగింపు.అది చదవగానే వొళ్ళు గగుర్పొడుస్తుంది.ఒక మనిషి,ఎంతగా అణచివేయబడితే,ఎంత దుర్భరమయిన నిరాషా నిస్పృహలకు గురయితే అంత ఘోరమయిన పని చేస్తాడో అన్న ఊహ కలుగుతుంది.ముఖ్యంగా తనలాగే తన సంతానం బానిసలా బ్రతకటం నచ్చని తండ్రి కొడుకును అలా చంపుకోవటం తీవ్ర మయిన అలజడిని మదిలో కలిగిస్తుంది.
ఆ అలజడి,ఆ వేశం తగ్గిన తరువాత ఆలోచన వస్తుంది.అప్పుడు కథను మళ్ళీ చదివితే,కథను ఒక్కొక్క అంశంగా విడతీసి విశ్లేషిస్తే యజ్ఞం అసలు రూపు తెలుస్తుంది.ఒక భావావేశ తీవ్ర కలిగించి రచయిత మన కళ్ళముందు నిలిపిన మాయా ప్రపంచం అర్ధమవుతుంది.
#యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు.
#తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేష కృషి చేసి
సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసిన కాళీపట్నం రామారావు గారు 4 జూన్ 2021 మరణించారు.

Sunday 7 November 2021

 బ్రాహ్మణ వ్యతిరేక వాదం వెనుక ఉన్న కుట్ర .




























పరాయి మత చాందస వాద పాలకులచే మన మెదళ్లలో నాటబడ్డ బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం అర్ధం చేసుకోవడానికి బుర్ర ఉంటే చాలు ఎవరికైనా . అపారమైన తెలివితేటలూ అవసరం లేదు . మన దేశాన్ని తుష్కర మూకలు 800 సంవత్సరాలు , క్రైస్తవ మూకలు 200 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించారు . మరి ఈ దేశంలో కొన్ని వర్గాల వారు అభివృద్ధి చెందలేకపోవడానికి పూర్తిగా బ్రాహ్మణులే కారణం అంటుంటే మన బుర్ర ఎప్పుడైనా ఆలోచించిందా?
మన దేశాన్ని పాలించిన చక్రవర్తులలో అధిక శాతం బ్రహ్మణేతరులు కాదా ? ఉదాహరణకు చంద్రగుప్త మౌర్య , శ్రీ కృష్ణ దేవరాయ , ఛత్రపతి శివాజీ , చోళులు , పాండ్యులు వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదే . బ్రాహ్మణుడైన చాణక్యుడు లేకుంటే చరిత్రలో చంద్ర గుప్తుని స్థానం ఏంటి అసలు . మన పురాణాల్లో గాని , కధల్లో గాని మనం ఏం చదువుకున్నాం ? " అనగనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు . అతని కుటుంబానికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు . ఒకరోజు అతను అడవిలో వెళ్తుండగా.... " ఇటువంటి కధలే కదా మనం చదువుకుంది . మరి అంత పేద బ్రాహ్మణుడు వేరే వారిపై వివక్ష ఎలా చూపించాడంటారు చెప్పండి ?
నేడు హరిజనులుగా పేర్కొనబడుతున్న కొన్ని కులాల వారిని నిజానికి అణచివేసింది భూస్వాములు , జమిందారులు , క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే . మొత్తం బ్రాహ్మణులలో అర్చక వృత్తి చేప్పట్టే వారూ కేవలం 20% మాత్రమే ఉంటారు . ఒకసారి ఆలోచించండి . మన స్నేహితుల్లో ఉన్న బ్రాహ్మణుల్లో ఎంతమంది అర్చక వృత్తి చెప్పట్టారో. నా స్నేహితుల్లో అర్చక వృత్తిని చేపట్టిన వారు 2 ,3 ముగ్గురు తప్పించి ఎవరూ లేరు.
మేధావులు చెప్పినట్టు బ్రాహ్మణులకు మాత్రమే వేద విద్య అనుకుంటే నేడు మనకు ఆది కావ్యమైన రామాయణం ఉండేది కాదు . హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీత , పురాణాలు , మహా భారతాలే ఉండేవి కాదు . వీటిని రచించింది బ్రాహ్మణులు కాదు . ఎప్పటి సంగతో ఎందుకు హిందూ ధర్మ రక్షకుడు అయిన స్వామీ వివేకానంద బ్రాహ్మణుడు కాదు.
చరిత్రలో బ్రాహ్మణులపై దాడి :
హిందువుల మహా పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున మతం మారాడానికి నిరాకరించారు అన్న కారణంతో వేల మంది బ్రాహ్మణులను , వారి పిల్లలను నరికి చంపి దూరంగా కనపడే ఒక పెద్ద గుట్టగా వేసాడు ముష్కర చక్రవర్తి ఔరంగజేబు . ఆ బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు ఆ క్రూరుడు .
క్రైస్తవ సన్యాసి సెయింట్ జేవియర్ పోర్చుగల్ రాజుకి ఒక ఉత్తరం రాసాడు . దాని సారాశం ఏమంటే " బ్రాహ్మణులను లేకుండా చేస్తే భారతీయులందరూ తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు " అని . అర్ధం అయ్యింది కదా . బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం వెనుక ఉన్న అసలు కుట్ర ఇదీ . వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణులను కిరాతకంగా చంపించాడు నేర విచారణ పేరుతో . దీనినే మనం "Goa Inquisition" పేరుతో చరిత్రలో చదువుకుంటాం .
మైసూరు ప్రాంతం మేల్కొటేలో దీపావళి రోజున 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు టిప్పు సుల్తాన్ . అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు .
ఇక కాశ్మీరీ పండిట్ల సంగతి తెలియనిది ఎవరికీ . మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్లాటుఫారంల పైకి చేరి దిక్కు లేని జీవితం గడుపుతున్నారు వేలాది మంది కాశ్మీరీ పండిట్లు . ముష్కర జీహాదీల చేతుల్లో దాదాపుగా హత్య చేయబడ్డ వారూ 500000 మంది.
మీకు తెలుసా కాశీలో రిక్షా తొక్కుకుని జీవించే వారిలో అధిక శాతం బ్రాహ్మణులే . ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూలీలుగా పని చేసేవారిలో 50% బ్రాహ్మణులే . ఆంధ్ర ప్రదేశ్లో వంట పని వారుగా పని చేసేవారిలో 75% బ్రాహ్మణులే . ఈ బాధలు పడలేకే చదువుకున్న బ్రాహ్మణులు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడుతూ అక్కడ మన సంప్రదాయాలను ప్రచారం చేస్తున్నారు.
బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల , మత మార్పిడి మాఫియాలు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది . వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు . కాని ఒక అబద్దాన్ని పదే పదే చెబితే దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం . ఇదే వారి సిద్ధాంతం . నేటికి కూడా ఇలా వ్యతిరేక సిద్ధాంత్తాన్ని కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ మొదలైన చాలా పార్టీ వాళ్ళు వెనుక ఉండి నడిపిస్తున్నారు . దయచేసి ఎవరు వారి ఉచ్చు లో పడకండి , మీ ధర్మాన్ని చరిత్ర ని తెలుసుకోండి , ధర్మంగా జీవించండి .

 తెలుగు భాషను చంపేసే తరమా మనది..

💞 తెలుగు 💞 ..క్రీస్తుపూర్వం to క్రీస్తుశకం..
1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి వుంది.
2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.
మొదటి లిపిగ కొరియన్ భాష.
3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.
4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.
5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.

6. ఇటాలియన్ భాష లాగానే తెలుగు భాష లో కూడా పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి చెందిన నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .
7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు.
ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.
8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.
9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.
10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.
11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.
12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.
13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.
14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.
కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.
15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.
16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే.
తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.
ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన.
ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం.
ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు.

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...