గోదావరి బ్రిడ్జి
సరిగ్గా 47సంవత్సరాల క్రితం, ఈ బ్రిడ్జి ని ఈ రోజున 23.11.1974 ఉదయం 11 గంటలకు, అప్పటి రాష్ట్రపతి శ్రీ ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు జాతికి అంకితం చేశారు
మన గోదారమ్మకు మణిహారం
కొవ్వూరు..రాజమండ్రి కి అపురూప బంధం
ఉభయ గోదావరి జిల్లాలను కలిపిన ఆత్మీయ వారధి... ఈ అపురూప రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి
ఈ బ్రిడ్జి కూడా ఒక ఇంజినీరింగ్ అద్భుతమే.. ముఖ్యం గా రాజమండ్రి దగ్గర ఈ మలుపు చాలా లెక్కలు వేసి నిర్మించారుట.. ఇండియాలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి లలో ఇది మూడవది.. మొదటిది అస్సాం లో బ్రహ్మపుత్ర నదిపైన, రెండవది సొన్ పూర్ బీహార్ లోనూ... మూడవది మన రాజమండ్రి..కొవ్వూరు మధ్య నిర్మించారు..1964లో మూడవ పంచవర్ష ప్రణాళికలో కొవ్వూరు - రాజమండ్రి మధ్య రెండు వరుసలు రైల్ మార్గాన్ని నదిపై బ్రిడ్జిని నిర్మించాలని తీర్మానించారు.
అప్పటికి ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలు లాంచీల పైనే జరిగేవి. రాజమండ్రి నుండి భద్రాచలం వరకూ సరుకు రవాణా కూడా లాంచీలే ఆధారం. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలని వినతిని కేంద్రానికి పంపడం, అది ఆమోదం పొందడం చకచకా సర్వే అనుమతులు జెసోప్ కంపెనీ నిర్మాణం మొదలు పెట్టి 1974 ఆగస్టుకి పూర్తి అయింది.
రైల్ మార్గం 2.8 కి.మీ రోడ్ మార్గం 4.1 కి.మీ.
అప్పటి రాష్ట్ర పతి శ్రీ ప్రక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు ఈ బ్రిడ్జిని ఓపెన్ చేశారు. అన్నట్టు అప్పట్లో టివిలు లేవు ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేసింది.. ఉషశ్రీ గారు ప్రతీ క్షణాన్నీ చక్కగా వర్ణిస్తూ.. అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించారు.. లాంచీల ప్రయాణం ఆగింది..
కొవ్వూరు..రాజమండ్రి షటిల్ బస్ లు వేశారు..
ఉభయగోదావరి జిల్లాలు ఒకటి అయ్యాయి..
అందుకే మన గోదారోళ్లకు ఈ బ్రిడ్జి అపురూపం!
No comments:
Post a Comment