Thursday 3 June 2021

 బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా

మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది.
కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.
అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.
బాగా చదువుకున్న వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.
ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు.
కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo. అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం.
కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...
ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.
ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.
నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.
మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు. ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు. 2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.
మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం వాడుకునే అన్ని స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.
అదే ఆ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది. ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!
ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.
రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.
అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు
చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.
అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.
ఇలా ప్రతీ దానికి అడ్డు పడి వామపక్షాలు బెంగాల్ నాశనం చేశాయి. యూనియన్స్ కి కొమ్ములు ఇచ్చి సమ్మెలు బందులు చేసి ఒక నాడు దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా పెరు పొందిన కలకత్తా పేరు నాశనం చేశారు.
CPM దగ్గర నేర్చుకున్న విద్య తో మమతా టాటా నానో ప్రాజెక్ట్ అడ్డుకుంది. సింగూర్ రైతులు అలా బీద వాళ్లుగానే ఉండిపోయారు.
అదే టాటా నానో పరిశ్రమ మోడీ సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకుపోయి సానంద్ లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇప్పుడు సానంద్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్. అక్కడ అన్ని కంపెనీలు అంటే టాటా, మారుతి, హుందాయి, ఫోర్డ్, హోండా మొ. కంపెనీలు కార్లు స్కూటర్లు, మోటారు సైకిల్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. అక్కడ రైతులు కోటీశ్వరులు అయిపోయారు. స్థానికులకు ఉద్యోగాలు దొరికాయి.
మీరే ఆలోచించుకోండి మన దేశ కంపెనీల మీదే మనమే ద్వేషం పెంచి ఎదగకుండా చేసే ఇటువంటి ఆలోచనలు పెంచడం వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని. అందుకే స్వదేశీ వస్తువులు వాడుకుందాం.... మనదేశ ఆర్థికవ్యవస్థను పెంచుకుందాం..
మల్టీనేషన్ కంపెనీల ఉత్పత్తులు వాడకండి స్వదేశీ కంపెనీల వస్తువులు వినియోగించండి
మన దేశ సంపద మన దేశంలోనే ఉంటుంది.
*భారత్ మాతా కీ జయ్* 🇮🇳

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...