Wednesday, 2 June 2021

 NLP .. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం అంటే ?

కంప్యూటర్ కు ఒక ప్రోగ్రాం ఉంటుంది . అది ప్రోగ్రాం బట్టే నడుచుకొంటుంది . మనిషి మెదడు కూడా కంప్యూటర్ లాంటిదే . దానికి ప్రోగ్రాం ఉంటుందా ?
ఉంటుంది . ఎవరు రాసారు ? ఎవరి ప్రోగ్రాం ను వారే రాసుకొంటారు .
"అయ్యో .. నా మెదడు ప్రోగ్రాం ను నేను ఎప్పుడు రాయలేదే ?!" అనుకొంటున్నారా ?
మీకు తెలియకుండానే, చిన్నపటినుంచి మీ ప్రోగ్రాం ను మీరే రాసేసుకుని వుంటారు .
చిన్నపటినుంచి మీ గురించి మిగతా వారు అంటే మీ తల్లితండ్రులు మీ గురువులు మీ స్నేహితులు చెప్పింది మీ మెదడులో నిక్షిప్తం అయ్యి ఉంటుంది . అదే మీ ప్రోగ్రాం .
"ఆబ్బె .. మా వాడు డల్ అండి" అని మీ నాన్న అనివుంటే అది రికార్డు అయిపోయివుంటుంది . "ఏరా మొద్దు వెధవా.. నీ బుర్ర నిండా మట్టి వుందేమిట్రా?" అని మీ టీచర్ అని ఉంటే అది కూడా రికార్డు అయివుంటుంది .
"నువ్వు డల్ .. నువ్వు మొద్దు" .. అని పదేపదే అది నీకు గుర్తు చేస్తూ ఉంటుంది . నిజంగానే మీరు డల్ అయిపోయివుంటారు .
వ్యక్తి వాస్తవిక లక్షణాలతో సంబంధం లేదు . మీరు వాస్తవంగా చురుకైన వారు . ఆ మాటకొస్తే డల్ అంటూ ఎవరూ వుండరు . { పాపం బుద్ధి మాంద్యంతో పుట్టిన పిల్లలు మినహాయిస్తే } . అందరూ తేలితేటలు కలిగిన వారే .. కానీ సమస్య ఏమిటంటే "నేను డల్ .. నాకు ఆత్మ విశ్వాసం తక్కువ .. నేను ఏ పని చెయ్యలేను .. నాకు పట్టుదల తక్కువ" అని మీ మైండ్ లో రికార్డు అయివున్నది ఎప్పుడూ ప్లే అవుతూ మిమ్మల్ని వెనక్కు లాగేస్తూ వుంటుంది .
"కర్ణా! .. నీ మొఖం .. నువ్వు ఏమి గెలుస్తావు? .. ఓడి పోవడం గ్యారెంటీ అంటూ నెగటివ్ SUGGESTIONS ఇచ్చాడు శల్యుడు . కర్ణుడి ఓటమికి అది ఒక కారణం .
మరి ఈ ప్రోగ్రాం ను మార్చుకోలేమా ?
ఎందుకు మార్చలేము . చాలా సింపుల్ గా మార్చుకోవచ్చు . మీలోని శల్యుడి ప్రోగ్రాం ను డిలీట్ చేసి కృషుడి program గా మార్చుకోవచ్చు . మీరు అందుకు సిద్ధమా ?
మీ వయస్సు ఎంతైనా పరవాలేదు .
ఇలా చెయ్యండి .
ముందుగా మీలో ఏ విషయం లో మార్పు కోరుకొంటున్నారో డిసైడ్ చెయ్యండి . నెగటివ్ పాయింట్స్ ను రాసారు కదా ? ఇప్పుడు వాటిని పాజిటివ్ సూచనలుగా మార్చండి . ఎక్కడ నెగటివ్ మాటలు రాకూడదు .
ఉదాహరణకు మీరు సిగరెట్ లు తాగుతున్నారు . దీన్ని మానెయ్యాలి అనుకొంటున్నారు . సిగరెట్ లు తాగను అని రాయకండి . నెగటివ్ మాటల్ని మెదడు ముందు గ్రహిస్తుంది . అవునంటే కాదనిలే అని అర్థం చేసుకొంటుంది . కాబట్టి మీరు రాసిన మీ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం లో పాజిటివ్ మాటలే ఉండాలి .
నేను sad గా ఉండను అని రాయొద్దు . ఉండను అనే మాట కన్నా ముందు sad వుంది . అదే మైండ్ కు ఎక్కుతుంది . "
నేను రోజంతా సంతోషంగా వుంటాను . నాకు ఆత్మ సంకల్పము ఎక్కువ . ఒక పని చెయ్యాలి అనుకొంటే తప్పకుండా దాన్ని చేస్తాను . నాకు పట్టుదల ఎక్కువ . ఆత్మ విశ్వాసం మెండుగా వుంది . ఆరోగ్యంగా వుంటాను . నా లక్ష్యాలను చేరుకొంటాను .. ఇలా .. అర్థం అయ్యింది కదా ?
paper పై రాశారా ? దాన్ని దిండు కింద పెట్టుకోండి . పొద్దునే లేచిన వెంటనే దాన్ని తీసి నెమ్మదిగా గట్టిగా చదవండి . చదివినప్పుడు అందులోని దాన్ని ఫీల్ కావాలి . నేను రోజంతా హ్యాపీ గా వుంటాను .. జీవితాంతం హ్యాపీ గా వుంటాను అని చదివినప్పుడు మీరు హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకోండి . నేను అనుకొన్న పని సాదిస్తాను అని చదివినప్పుడు ఆ పని చేసినట్టు ఊహించుకోండి . ఆ పని అయినప్పుడు { అది పరీక్ష పాస్ కావడం కావొచ్చు . స్లిమ్ కావడం కావొచ్చు . లేదా మద్యం మానడం కావొచ్చు } మీరు ఆనందం ఉండడాన్ని ఊహించుకోండి . ఇలా రోజూ అయిదారు నెలల పాటు చెయ్యండి .
మీరు ఇచ్చిన సూచనలు నెమ్మదిగా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డు అయిపోతాయి . అంటే మీ program చేంజ్ అవుతోంది . మీకు తెలియకుండా మీలో మార్పు వస్తుంది . మీలో ఒక కొత్త మీరు వస్తారు . కొత్త లోకానికి స్వాగతం ."
నాకు మాస్క్ అంటే చిరాకు . సమస్య మాస్క్ తో కాదు . రద్దీ ప్రాంతాల్లో అది అవసరం అని చెప్పాను.
మాస్క్ పెట్టుకొనే వారి ఆలోచనలు ఎలా ఉంటాయి ? ఆమ్మో మాస్క్ పెట్టుకోకపోతే చస్తాము. కరోనా ప్రాణాంతక వ్యాధి . సోకితే ఇక చావే . బతికిబట్టకట్టాలి అంటే మాస్క్ తప్పదు .
వ్యాధి బాగా విస్తరిస్తునప్పుడు కొన్ని రోజులు అనవసరంగా బయటకు పోకపోవడం మంచిది అని మే మొదటి వారం లో నేనే చెప్పాను . కొంత మంది స్టే హోమ్ స్టే సేఫ్ జపం చేస్తుంటారు . అలంటి వారంటే నాకు జాలి . ఇంట్లో కూర్చోవడం .. ఆమ్మో బయటకు పొతే ఇక చావే .. చావే .. బతకాలంటే ఇంట్లోనే ఉండాలి అని పదేపదే అనుకొంటారు .
corona సోకితే చావే చావే అని సంవత్సరం రోజులుగా వందల సార్లు చెప్పుకొంటే అది మైండ్ లో స్ట్రాంగ్ గా కూర్చొని ఉంటుంది . కరోనా అందరిని సమంగా చూస్తుంది . నువ్వు ఇంట్లో వున్నా వెతుక్కొంటూ వస్తుంది . ఇలాంటివారికి ...
ఒక్క సారి సోకగానే ఇక సబ్ కాన్షియస్ మైండ్ ఆక్టివేట్ అవుతుంది . వామ్మో నేను చచ్చిపోతాను కెచ్చి పోతాను అని పదేపదే అనుకోవడం తో శరీరం లో అనేక మార్పులు వస్తాయి . అనేక ద్రవాలు stress వల్ల ఉత్పన్నం అవుతాయి . అప్పుడు మిమ్మల్ని అప్పుల ఆసుపత్రి డాక్టర్ లు కాదు కదా అమెరికా లోని వారి బాబు లాంటి డాక్టర్ లు కూడా కాపాడ లేరు .
రోజూ నా ఫేస్బుక్ ఫాలో కావడం వల్ల మీ మైండ్ ఈ విధంగా పాజిటివ్ సూచనలతో నిండిపోతుందో .. కరోనా సోకినా" చల్... ఫట్" అంటూ మీరు దాన్ని ఎందుకు ఊదేస్తున్నారో అర్థం అయ్యిందా ? మా స్లేట్ ఉద్యోగులు కరోనా తో ఎందుకు ఫుట్ బాల్ ఆడుకొంటున్నారో తెలిసిందా ? ఇది science బాబు . మాయలు లేవు .. మంత్రాలూ లేవు . pure సైన్స్ . proven సైన్స్
అర్థం అయ్యిందా ?
అయితే ఒకటి చెప్పండి . ఒకటో వేవ్ లో కన్నా second వేవ్ లో మరణాల శాతం ఎక్కువ ఎందుకో చెప్పండి . అందుకు ఎవరు కారణమో చెప్పండి .
మీకు సమాధానం తట్టిందో లేదో నాకు తెలియదు { మీరు అడిగినా నేను పోస్ట్ చెయ్యను . పోస్ట్ చేస్తే అది శాడిజం లాగా కనిపిస్తుంది } సారీ ..
చివరిగా ఒక మాట ! కరోనా ను సృష్టించిన వాడే .. కాదు వారే .. చాల రోజులు బాగా అలోచించి .. ఇది బాగా పని చెయ్యాలి అంటే ఇదో ఈ విధంగా చెయ్యాలి .... ఇలా ప్రచారం చెయ్యాలి అని డిసైడ్ చేసివుంటాడు అని నాకు అనిపిస్తుంది . ఈ విషయం పై నేను గత సంవత్సరం ఏప్రిల్ లోనే ఎన్నో పోస్ట్ లు పెట్టాను . అది చాల మందికి అర్థం కాలేదు . నేనేదో మాస్క్ ల కు వ్యతిరేకం .. స్టే హోమ్ సూత్రానికి వ్యతిరేకం అనుకొన్నారు . అర్థం కాని జనాలకు చెప్పడం ఎందుకు అని మానేసాను . జనాలకు బాగా అర్థం అయ్యే విషయాలే చెబుతున్నాను .

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...