Friday, 14 November 2025

పండిట్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ



ఇక్కడే పండిట్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారిని కిరాయి హంతకులు దారుణంగా హత్యచేసి ట్రాక్‌పై పడేసిపోయారు...

ఇది 11-02-1968 రోజున మొఘల్‌సరాయ్ జంక్షన్ సమీపంలోని పిల్లర్ నంబర్ 673/1276 దగ్గర జరిగింది. ఈ పిల్లర్ శ్రీ దీన్‌దయాళ్ గారి దారుణ హత్యకు ప్రత్యక్ష సాక్ష్యంగా నేటికీ అలాగే ఉంది...

ఇలాంటి ధీరుల దీనమైన గాథలను చరిత్ర లో వెలుగులోకి రాకుండా చేసి చరిత్రలు రాసిన కుసంస్కారులు ఆలోచనలు చీల్చుకుని వెలుగులోకి తీసుకురావల్సిన సమయం వచ్చేసింది ఆ బాధ్యత జాతీయ భావన కలిగి చురుకయిన అఖండ మేధో సంపత్తి కలిగిన యువరచయితలు నిమగ్నమై ఉన్నారు. త్వరలో చాలా విషయాలు బైటికి రానున్నాయ్

ఆశ్చర్యపోయిన విదేశీ జర్నలిస్టులు: 1968వ సం. శ్రీ దీనదయాల్ ఉపాధ్యాయ గారి మరణానంతరం వారి రచనలు, జీవితం అధ్యయనం చేయడానికి వచ్చిన విదేశీ జర్నలిస్టులు వారు నివసించిన ప్రాంతాలలో విషయ సేకరణలో భాగంగా ఢిల్లీలోని అప్పటి వారి గదిలోకి వెళ్లి వారు ఉపయోగించిన వస్తువులు, కళ్లద్దాలు, రిస్ట్ వాచ్, బట్టలు మొదలైనవి పరిశీలిస్తూ..., వారి బీరువా అందులో మిగతా బట్టలు ఏవి అని.., ముఖ్యంగా వారు ధరించే 'కోటు' ఏది అని అడిగారు...? అంతేకాకుండా వారు నిద్రించే మంచం ఏది అని కూడా అడిగారు....,

ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు సమాధానం ఇస్తూ దీనదయాల్ గారికి సంఘ గణవేష తో పాటు ఉన్న మూడు జతల బట్టలు (శరీరంపై ఒకటి , ఉతికి ఆరవేసినది రెండవది, రేపటి కోసం మడత పెట్టి ఉంచిన జత మూడవది.) తనతో పాటు తీసుకెళ్లారనీ చెప్పి వారు చనిపోయిన సమయంలో వారి చేతి బ్రీఫ్ కేసులో ఇవన్నీ ఉన్నాయని వివరించారు..., ఇక వారి కోటు అంటారా... ఈ గదిలో ఉండే ముగ్గురు అఖిల భారతీయ అధికారులలో ఎవరు ఉపన్యాసానికి వెళితే వారే ధరించి వెళ్లడం చేస్తుంటారని ఇప్పుడు అదే జరిగింది మరొక అఖిల భారతీయ అధికారి శ్రీ ధర్మవీర్ గారు ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తూ ధరించి వెళ్లారని చెప్పారు.

ముగ్గురు ఉన్న ఆ గదిలో రెండు చెక్క బల్లలు(పడకలాంటి టేబుల్స్) ఉండడాన్ని వాళ్లు ఆశ్చర్యంగా చూస్తుండగా ఈ రెండింటి పై ఎవరు ముందుగా గదికి చేరుకుంటే వాళ్లు నిద్రిస్తారని, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అదిగో ఆ మూలనున్న చాప వేసుకుని పడుకుంటారని చెప్పడంతోని విని.., అవాక్కయ్యారు.

అప్పటికే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉండీ మరికొన్ని రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షంగా, కేంద్రంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీ యొక్క అధ్యక్షుడు, కార్యదర్శి ఆ రకంగా సాధారణ జీవితాన్ని గడపడం చూసి ఆశ్చర్యపోవడం విలేకరుల వంతయ్యింది.

ఆ గదిలో చాయ్ చేసుకోవడానికి తప్ప భోజనానికై వంట చేసుకోవడానికి వస్తువులు లేని విషయాన్ని కూడా వాళ్ళు గమనించారు.

(కార్యకర్తల ఇళ్లలోనే భోజనం చేసే అలవాటున్న వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకులు అనే విషయం ఆలస్యంగా అర్థమైంది).

"ఏకాత్మ మానవతా దర్శనం" ప్రవక్త, (మానవులందరిలో ఒకే ఆత్మను దర్శించినవారు) భారతీయ జనసంఘ్ అధ్యక్షులు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారకులూ అయిన శ్రీ దీనదయాల్ ఉపాధ్యాయ గారు పరమపదించినది ఈరోజే. వారి దివ్యాత్మకు అంజలి ఘటిస్తున్నాను.

(తమ దుష్ట పరిపాలనకు అడ్డు తగులుతున్నారని రైలులో ప్రయాణం చేస్తున్న శ్రీ దీనదయాల్ ఉపాధ్యాయ గారిని ఉత్తరప్రదేశ్ లోని, మొగల్ సరాయ్ అనే చోటున దారుణంగా హత్య చేశారు.)

ఆ మహానుభావుని వర్ధంతి సందర్భంగా నివాళులు

No comments:

Post a Comment

show image

  varalakshmi wife of poolabala felicitation at vuyyur, Sarasabharati. varalakshmi wife of poolabala driving luna at late 20s varalakshmi fi...