Friday, 14 November 2025

గాంధీ చెబుతాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చుపెట్టండని........



మన హిందువులు ఎంత అమాయకులు కదా.....నేటికీ మన అమాయక హిందువులు గాంధీ మాటలకూ ప్రేరేపితులై తు.చ. తప్పక ఇప్పటికి దానినే పాటిస్తున్నారు అని నాకనిపిస్తుంది......

ఒకడు ఒక చెంప మీద కొడితే ఎందుకు కొడుతున్నాడో కారణం తెలుసుకోవడం సమంజసమా లేక ఇంకో చెంప చుపెట్టండం ముఖ్యమా అని నేను మన అమాయక హిందువులను ప్రశ్నిస్తున్నాను.

గాంధీ ఆ మాట అన్న మరుక్షణమే వాడి చెంప మీద లాగి ఒక్కటిస్తే అప్పుడు వాడు ఏ విధంగా ప్రతిస్పందించేవాడో హిందువులకు అర్థమై ఉండేదని నా అభిప్రాయం. కానీ మన హిందువులు అమాయకులు.....

అవును ప్రపంచంలో ఇప్పటివరకు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి అని చరిత్ర చెబుతుంది.....నాకు చరిత్ర తెలువని కారణంగా మన తెలుగు కోరాలో అడగాలనుకుంటున్న విషయం ఏంటంటే ఈ రెండు ప్రపంచ యుద్ధాలు గాంధీ జన్మించక ముందు జరిగాయా లేక గాంధీ జీవించిన కాలంలో జరిగాయా?

ఒక వేళ గాంధీ జీవించిన కాలంలోనే జరిగితే గాంధీ అహింసా సిద్ధాంతం అనే ఆయుధాలను బ్రిటిష్ వారిపై ప్రయోగించి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చినట్లు ప్రపంచమంతా కోడై కూస్తుంది అని మన దేశంలో ఉన్న గాంధీ భజనపరులు సెలవిస్తుంటారు కదా.....

ఆ విధంగానే ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనికులందరికి గాంధీ గారి అహింసా సిద్ధాంతం అనే ఆయుధాలను సరఫరా చేస్తే ఆ యుద్ధాలే జరుగ పోయేటివి కదా.....పాపం అమెరికా దేశం జపాన్ దేశం పైన అణుబాంబు కు బదులు అహింసా బాంబును ప్రయోగించి ఉండేది కదా.....మీరేమంటారు మన అమాయక హిందువులారా........

అవును.....మీలో ఎంతమందికి తెలుసు గాంధీ అనబడు చిత్రాన్ని ఇండియా ప్రభుత్వం-బ్రిటిష్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించారని.......

ప్రపంచంలో ఏ...ఏ...దేశాల ప్రభుత్వాలు ఇలా సినిమాలు నిర్మిస్తాయి మీరే సెలెవియ్యగలరు.......

వందేమాతరం.....భారత్ మాతకు జై........

26/11 దాడులు ...........తుకారాం




 పాకిస్థాన్ నుండి వచ్చిన 10 మంది టెర్రరిస్ట్ ల పేర్లు మార్చి , హిందూ పేర్లు పెట్టి వారికి హిందువులకు సంబంధించిన చిహ్నాలు పెట్టి మారణహోమము అయ్యాక వారిని చంపేయమని , చంపేశాక మరణించిన వారొచ్చి నిజాలు చెప్పలేరు కాబట్టి వారిని హిందూ తీవ్రవాదులుగా చెప్పి ఈ మారణ హోమం అంత హిందువులే చేశారు , ముఖ్యముగా హిందువుల్లో అతివాద సంస్థలు చేసారు అని చెప్పటానికి పెద్ద ప్రయత్నమే జరిగింది .

కసబ్‌ను సజీవంగా పట్టుకోవడానికి తుకారాం తన ప్రాణాలను త్యాగం చేయడం చేత కాంగ్రెస్ ప్రణాళిక మొత్తం బయటపడింది. విచారణలో వీరంతా పాకిస్థాన్ నుండి వచ్చ్చారని , వారి ఎక్కడిక్కడ శిక్షణ ఎక్కడో తెలియము వల్ల ఈ పధకం పారలేదు ; ఆ తర్వాత జరిగిన విచారణలో, అజ్మల్ కసబ్‌ను 26/11 దాడుల ప్రణాళికలో ఉన్నత స్థాయిలో పాల్గొన్న మరో ఉగ్రవాది అబూ జుందాల్‌తో కలిపి విచారించగా ఈ దాడులకు హిందువులను నిందించడం తన ఆలోచన అని జుందాల్ దర్యాప్తు అధికారులకు చెప్పాడు.

2008 మాలేగావ్ పేలుళ్ల నిందితులైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ అరెస్టు తర్వాత, ప్రతీకార దాడిగా చిత్రీకరించాలని ఉగ్రవాద సంస్థ ప్రణాళిక వేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ మోసాన్ని అమలు చేయడానికి తీవ్రమైన ప్రణాళిక ఉందని వివరాలు చూపిస్తున్నాయి.. ఉగ్రవాదులకు ఉర్దూలో కాకుండా హిందీలో మాట్లాడగలిగేలా శిక్షణ ఇవ్వబడింది, తద్వారా వారు హిందువులనే భావనను కలిగించారు (బందీలుగా ఉన్నవారికి, వారిని విచారణ కోసం పట్టుకోకూడదు). హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉన్న జుందాల్ ఈ ఉద్యోగానికి అత్యంత అనుకూలమైనవాడు. ఉగ్రవాదులు కాషాయ నడుము పట్టీలు కూడా ధరించారు , "సమీర్ చౌదరి" వంటి హిందూ పేర్లతో కూడిన నకిలీ గుర్తింపు కార్డులను వారికి అందించారు. హిందూ పేర్లు , కాషాయ పట్టీలు ఉన్న గుర్తింపు కార్డులు దొరికిన తర్వాత, అనుమానం హిందువుల వైపు వెళుతుందని, దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి ఒక హిందూ సంస్థ లేఖ రాసి నకిలీ ముస్లిం సంస్థపై నిందలు వేయడానికి ప్రయత్నించిందని పోలీసులు నిర్ధారించుకుంటారని భావించారు. . ఫిదాయీన్ల మృతదేహాలను మాత్రమే - కాషాయ నడుము బ్యాండ్లు , గుర్తింపు కార్డులతో - స్వాధీనం చేసుకుంటామని , కేసు సాక్షులు దర్యాప్తుదారులకు ఉగ్రవాదులు ఉర్దూలో కాకుండా హిందీలో మాట్లాడారని చెబుతారని భావించి ఉగ్రవాద సూత్రధారులు సన్నాహాలు చేశారు. దాడికి హిందూ గ్రూపులను నిందించడం గురించి జుందాల్ ఇచ్చిన వివరాలను కసబ్ తన వాంగ్మూలంలో ధృవీకరించాడు. అజ్మల్ కసబ్‌ను పట్టుకోవడంతో ఈ ప్రణాళిక విఫలమైంది.

ఆ సమయంలో హోం మంత్రిత్వ శాఖలో అండర్ సెక్రటరీగా పనిచేసిన మాజీ సివిల్ సర్వెంట్ ఆర్‌విఎస్ మణి తన పుస్తకం హిందూ టెర్రర్: ఇన్‌సైడర్ అకౌంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ 2006-2010 లో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సత్యాన్ని పణంగా పెట్టి హిందూ టెర్రర్ కథనాన్ని ముందుకు తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేసిందని పేర్కొన్నారు.. 26/11 ముంబై దాడులు కాంగ్రెస్ మరియు ఐఎస్ఐ మధ్య జరిగిన FIXED మ్యాచ్ అని తాను ఇప్పటికీ చెబుతున్నప్పటికీ, దీనిపై ఎవరూ చర్చించడానికి సిద్ధంగా లేరని కూడా ఆయన అన్నారు.

ఇదే కాదు మాల్గావు బాంబ్ పేలుడులు , సంఝౌతా ఎక్ష్ప్రెస్స్ టెర్రరిస్ట్ సంఘఠనల్లో కూడా అసలు నిందితులను వదిలేసి లోకల్ హిందూ సంస్ధల వారిని నిందితులు చేసి వారిని చిత్ర హింసలు పెట్టారు ;

\హిందూ తీవ్రవాదం, RSS తీవ్రవాద సంస్థలు అంటూ దిగ్విజయ్ సింగ్ , మని శంకర్ అయ్యర్ , శివరాజ్ పాటిల్ లాంటి వారు పదే పదే మాట్లాడతము ద్వారా పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని వెనక్కి తీసుకెళ్లి హిందూ తీవ్రవాదాన్ని ముందుకు తేవటం ద్వారా వారి రాజకీయ ప్రయోజనాలను పెంచుకునే ప్రయత్నాలు చేశారు ;

ఇప్పుడు ఈ రానా ను భారత్ కు రప్పించటం ద్వారా అసలు ఈ పధకం వెనుక ఎవరెవరు ఉన్నారో , స్థానికముగా ఎవరెవరు వీరికి సహాయము చేశారో అనేది నిరూపితము అవుతుంది అనే కాంగ్రెస్ నాయకుల్లో భయము మొదలు అయ్యినది .

నిజాలు ఎప్పుడో ఒకప్పుడు బయటకు రావాల్సిందే . ............

భారత మాత కి జై ......

మాలతీ చందూర్



 ప్రముఖ భారతీయ రచయిత్రి, నవలా రచయిత్రి మరియు కాలమిస్ట్, అప్రతిహతంగా 47 సంవత్సరాలు "ఆంధ్రప్రభ" దినపత్రికలో ఆమె "ప్రమదావనం" అనే వారపు కాలమ్ రాసి ప్రసిద్ది చెందారు. నడిచే "విజ్ఞాన సర్వస్వంగా" కీర్తి గడించిన మాలతీ చందూర్ గారి వర్ధంతి జ్ఞాపకం!

🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

ఆమె 1949 లో నవలా రచయిత్రిగా తన వృత్తిని ప్రారంభించింది మరియు తెలుగు భాషలో 26 నవలలు రాసింది . ఆమె ఇతర భాషల నుండి 300 కి పైగా నవలలను తెలుగులోకి అనువదించారు. 1992లో ఆమె హృదయ నేత్రి నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది . 47 సంవత్సరాల పాటు నిరంతరంగా వెలువడే ఆంధ్రప్రభ దినపత్రికలో ఆమె "ప్రమదావనం" అనే వారపు కాలమ్ రాశారు .
.....
మాలతీ గారు ఆంధ్ర ప్రదేశ్ లోని నూజివీడ్‌లో తండ్రి వెంకటాచలం తల్లి జ్ఞానాంబ లకు 26 డిసెంబర్ 1928 న జన్మించారు. ఆమె తన తల్లిదండ్రులకు ఆరవ సంతానం. నూజివీడులో ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించిన ఆమె
ఉన్నత పాఠశాల విద్య కోసం ఏలూరు వెళ్లింది. ఏలూరులో మేనమామ నాగేశ్వర్‌రావు చెందూరు ఇంట్లో ఉంటోంది. 1947లో ఆమె, నాగేశ్వరరావు చెందూర్ ఇద్దరూ మద్రాసు వెళ్లారు . మాలతి మద్రాసులో సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అందుకుంది. 1947 చివరలో మాలతి నాగేశ్వరరావు చెందూర్‌ని వివాహం చేసుకున్నారు. మద్రాసులో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారి వివాహం మొదటి రిజిస్టర్డ్ వివాహంగా నివేదించబడింది.
.....
ఆంధ్రప్రభ పత్రికలో వచ్చే ‘ప్రమాదవనం' అనే ఫీచర్‌తో మాలతీ చందూర్ మంచి గుర్తింపు పొందారు. ఆమె అనేక పత్రికలకు వివిధ రకాల శీర్షికలను అందించారు. మాలతి చందూర్‌ దాదాపు ఆరు దశాబ్దాలుగా చెన్నైలో నివసిస్తునారు. కేవలం రచయిత్రిగానే కాకుండా ఆమె జగతి అనే మాసపత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. జర్నలిస్టుగా కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది.
......
నవలా రచయిత్రిగా, మహిళలకు సంబంధించిన అంశాలపై రచనలు చేసిన కాలమిస్టుగా అనేక పురస్కారాలు ఆమె అందుకున్నారు. 70వ దశకములో కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పని చేసిన మాలతీ చందూర్ తాను చూసే తమిళ సినిమాలను అర్థం చేసుకోవడానికి తమిళ భాష నేర్చుకున్నారు. అంతటితో ఆగకుండా అనేక తమిళ రచనలను తెలుగులోకి అనువదించారు. మాలతీ చందూర్ వినదగు విషయాలు, వంటలు పిండి వంటలు, శశిర వసంతం, ఆలోచించు, భూమిపుత్రి, హృదయనేత్రి, కలల వెలుగు, మనసులోని మనసు వంటి నవలలు రాశారు.
.....
1949లో చెందూర్ నవలా రచయిత్రిగా తన వృత్తిని ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆమె రేడియోలో తన నవలలు చెప్పేది. ఆమె ఆంధ్రప్రభ వార్తాపత్రికలో వారానికోసారి "ప్రమదావనం" అనే కాలమ్ రాసింది , అందులో ఆమె పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు మరియు సామాజిక మరియు వ్యక్తిగత సమస్యలపై సలహాలు ఇచ్చేవారు. అప్రతిహతంగా 47 సంవత్సరాలు నిరంతరంగా సాగింది.
.......
1953లో, చెందూర్ తెలుగులో "వంటలు-పిండివంటలు" అనే వంట పుస్తకాన్ని ప్రచురించారు , అది కనీసం 30 సార్లు పునర్ముద్రించబడింది. చెందూర్ అనేక ఆంగ్ల నవలలను తెలుగులోకి అనువదించారు మరియు స్వాతి పత్రికలో పాఠకెరతలు పేరుతో ప్రచురించారు. ఆమె మొదటి నవల చంపకం-చీడపురుగులు మరియు ఆమె మొదటి కథ "రవ్వలద్దులు". చంపకం-చీదపురుగులు , ఆలోచించు , సద్యోగం , హృదయ నేత్రి , సిసిర వసంతం , మనసులోని మనసు , మరియు భూమి పుత్రి వంటి కొన్ని ఆమె ప్రసిద్ధ నవలలు . ఆమె వారపత్రికలకు కూడా చిన్న కథలు రాసింది. ఆమె నవలలు రోజువారీ జీవితంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కలిగి ఉన్నాయి. ఆమె తెలుగు భాషలో 26 నవలలు రాశారు మరియు 300కి పైగా నవలలను ఇతర భాషల నుండి తెలుగులోకి అనువదించారు, వాటిని నవల పరిచయం పేరుతో ఐదు సంపుటాలుగా ప్రచురించారు. ఆమె 11 సంవత్సరాల పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో సభ్యురాలుగా కొనసాగారు.
......
1987లో, చెందూర్ తన హృదయ నేత్రి నవలకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును అందుకుంది . 1992లో ఇదే నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది . 1990లో ఆమెకు ప్రతిష్టాత్మకమైన భారతీయ భాషా పరిషత్ అవార్డు లభించింది . 1996లో, ఆమె రాజా-లక్ష్మీ అవార్డును అందుకుంది . తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు కూడా అందుకుంది. 2005లో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ మరియు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 2005లో, చెందూర్ మరియు ఆమె భర్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్థాపించిన మొదటి లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డును అందుకున్నారు.
.....
ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 21 ఆగస్టు 2013న చెన్నైలో మరణించారు . పరిశోధన ప్రయోజనాల కోసం ఆమె శరీరాన్ని శ్రీరామచంద్ర వైద్య కళాశాల మరియు పరిశోధనా సంస్థకు విరాళంగా ఇచ్చారు.

🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

పండిట్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ



ఇక్కడే పండిట్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారిని కిరాయి హంతకులు దారుణంగా హత్యచేసి ట్రాక్‌పై పడేసిపోయారు...

ఇది 11-02-1968 రోజున మొఘల్‌సరాయ్ జంక్షన్ సమీపంలోని పిల్లర్ నంబర్ 673/1276 దగ్గర జరిగింది. ఈ పిల్లర్ శ్రీ దీన్‌దయాళ్ గారి దారుణ హత్యకు ప్రత్యక్ష సాక్ష్యంగా నేటికీ అలాగే ఉంది...

ఇలాంటి ధీరుల దీనమైన గాథలను చరిత్ర లో వెలుగులోకి రాకుండా చేసి చరిత్రలు రాసిన కుసంస్కారులు ఆలోచనలు చీల్చుకుని వెలుగులోకి తీసుకురావల్సిన సమయం వచ్చేసింది ఆ బాధ్యత జాతీయ భావన కలిగి చురుకయిన అఖండ మేధో సంపత్తి కలిగిన యువరచయితలు నిమగ్నమై ఉన్నారు. త్వరలో చాలా విషయాలు బైటికి రానున్నాయ్

ఆశ్చర్యపోయిన విదేశీ జర్నలిస్టులు: 1968వ సం. శ్రీ దీనదయాల్ ఉపాధ్యాయ గారి మరణానంతరం వారి రచనలు, జీవితం అధ్యయనం చేయడానికి వచ్చిన విదేశీ జర్నలిస్టులు వారు నివసించిన ప్రాంతాలలో విషయ సేకరణలో భాగంగా ఢిల్లీలోని అప్పటి వారి గదిలోకి వెళ్లి వారు ఉపయోగించిన వస్తువులు, కళ్లద్దాలు, రిస్ట్ వాచ్, బట్టలు మొదలైనవి పరిశీలిస్తూ..., వారి బీరువా అందులో మిగతా బట్టలు ఏవి అని.., ముఖ్యంగా వారు ధరించే 'కోటు' ఏది అని అడిగారు...? అంతేకాకుండా వారు నిద్రించే మంచం ఏది అని కూడా అడిగారు....,

ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు సమాధానం ఇస్తూ దీనదయాల్ గారికి సంఘ గణవేష తో పాటు ఉన్న మూడు జతల బట్టలు (శరీరంపై ఒకటి , ఉతికి ఆరవేసినది రెండవది, రేపటి కోసం మడత పెట్టి ఉంచిన జత మూడవది.) తనతో పాటు తీసుకెళ్లారనీ చెప్పి వారు చనిపోయిన సమయంలో వారి చేతి బ్రీఫ్ కేసులో ఇవన్నీ ఉన్నాయని వివరించారు..., ఇక వారి కోటు అంటారా... ఈ గదిలో ఉండే ముగ్గురు అఖిల భారతీయ అధికారులలో ఎవరు ఉపన్యాసానికి వెళితే వారే ధరించి వెళ్లడం చేస్తుంటారని ఇప్పుడు అదే జరిగింది మరొక అఖిల భారతీయ అధికారి శ్రీ ధర్మవీర్ గారు ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తూ ధరించి వెళ్లారని చెప్పారు.

ముగ్గురు ఉన్న ఆ గదిలో రెండు చెక్క బల్లలు(పడకలాంటి టేబుల్స్) ఉండడాన్ని వాళ్లు ఆశ్చర్యంగా చూస్తుండగా ఈ రెండింటి పై ఎవరు ముందుగా గదికి చేరుకుంటే వాళ్లు నిద్రిస్తారని, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అదిగో ఆ మూలనున్న చాప వేసుకుని పడుకుంటారని చెప్పడంతోని విని.., అవాక్కయ్యారు.

అప్పటికే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉండీ మరికొన్ని రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షంగా, కేంద్రంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీ యొక్క అధ్యక్షుడు, కార్యదర్శి ఆ రకంగా సాధారణ జీవితాన్ని గడపడం చూసి ఆశ్చర్యపోవడం విలేకరుల వంతయ్యింది.

ఆ గదిలో చాయ్ చేసుకోవడానికి తప్ప భోజనానికై వంట చేసుకోవడానికి వస్తువులు లేని విషయాన్ని కూడా వాళ్ళు గమనించారు.

(కార్యకర్తల ఇళ్లలోనే భోజనం చేసే అలవాటున్న వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకులు అనే విషయం ఆలస్యంగా అర్థమైంది).

"ఏకాత్మ మానవతా దర్శనం" ప్రవక్త, (మానవులందరిలో ఒకే ఆత్మను దర్శించినవారు) భారతీయ జనసంఘ్ అధ్యక్షులు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారకులూ అయిన శ్రీ దీనదయాల్ ఉపాధ్యాయ గారు పరమపదించినది ఈరోజే. వారి దివ్యాత్మకు అంజలి ఘటిస్తున్నాను.

(తమ దుష్ట పరిపాలనకు అడ్డు తగులుతున్నారని రైలులో ప్రయాణం చేస్తున్న శ్రీ దీనదయాల్ ఉపాధ్యాయ గారిని ఉత్తరప్రదేశ్ లోని, మొగల్ సరాయ్ అనే చోటున దారుణంగా హత్య చేశారు.)

ఆ మహానుభావుని వర్ధంతి సందర్భంగా నివాళులు

 నరేంద్ర మోడీ



అంత తేలిగ్గా సంచి సర్దుకొని హిమాలయాలకు వెళ్ళిపోతాడని మాత్రం అపోహ పడకండి !

ప్రతిపక్షాలు మరియు అమెరికా కలిసి

నరేంద్ర మోడీని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాయని ఒక పోస్ట్ చేశాను. వారు ఇమ్రాన్ ఖాన్ మరియు షేక్ హసీనా విషయంలో చేసినట్లుగా, మోడీ విషయంలోనూ అదే చేస్తున్నారని నా అభిప్రాయం.

రాహుల్ గాంధీకి ఒక అపోహ ఉంది...

​రాహుల్ గాంధీ ఏదో ఒక సాకు చూపించి

సామాన్య ప్రజలను రోడ్ల మీదకు తీసుకొచ్చి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఒక ఉద్యమం సృష్టించవచ్చని, దానితో మోడీ గద్దె దిగి పారిపోవచ్చని అనుకుంటున్నారు.

ఒకవేళ అది సాధ్యమైతే,

పౌరసత్వ సవరణ చట్టం (CAA) వ్యతిరేక ఉద్యమం మరియు ఖలిస్తానీ రైతు ఉద్యమం నుంచే ఏదో ఒక ఫలితం వచ్చి ఉండేది. కానీ ఏం జరిగింది?

దీనికి విరుద్ధంగా,

హర్యానా బీజేపీ చేతిలోంచి జారిపోతూ మళ్ళీ దక్కింది, పంజాబ్‌లో అయితే బీజేపీ ఓట్ల శాతం అకాలీ దళ్‌ను కూడా దాటిపోయింది.

రాహుల్ గాంధీ ఒక విషయాన్ని గుర్తించాలి. ఆయన పోరాడుతున్నది తక్షణమే స్పందించే వ్యక్తితో కాదు. మోడీకి వ్యతిరేకంగా మొదలైన ఏ ఉద్యమంలోనైనా, ప్రతిస్పందించకపోవడమే ఆయన యొక్క బ్రహ్మాస్త్రం.

అందుకే,

ఆందోళనకారులు మోడీ స్పందన కోసం ఎదురుచూసి, చివరికి వారే హింసాత్మకంగా మారుతారు. ప్రభుత్వం ఒక్క లాఠీ కూడా ఛార్జ్ చేయదు. ఆందోళనకారులే చేతుల్లో లాఠీలు పట్టుకుని తిరుగుతారు.

దీని ఫలితం ఏమిటంటే,

ఆందోళనకారులు ప్రజల దృష్టిలో మంచివారుగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంతకాలం తర్వాత, ప్రజలే వారిని తిట్టడం మొదలుపెడతారు.

రాజకీయాల ఓనమాలు తెలియని కొందరు, ప్రభుత్వం చేతిలో అధికారం ఉన్నా ఎందుకు వారిని దండించడం లేదని రోజూ మోడీకి జ్ఞానబోధ చేస్తుంటారు.

రాహుల్ గాంధీ లాంటి మూర్ఖుడు ప్రధానితో అమర్యాదగా ప్రవర్తించినా, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తారు. రాజకీయాల్లో ఒక నాయకుడికి అసలైన శిక్ష లాఠీఛార్జ్ చేయడం, జైల్లో పెట్టడం లేదా ఇబ్బంది పెట్టడం కాదు.

రాజకీయాల్లో ఒక నాయకుడికి అతిపెద్ద శిక్ష ఏమిటంటే, ప్రజలు అతడిని పూర్తిగా మర్చిపోయేలా చేయడం లేదా అతడిని ద్వేషించేలా చేయడం. మోడీ తన అపారమైన సహనంతో సరిగ్గా ఇదే చేసి చూపిస్తున్నారు.

మీరు మోడీపై రాళ్లు విసిరితే,

ఆయన ఆ రాళ్లను పోగుచేసి తన ఇంటి పునాది వేసుకోవడానికి ఉపయోగిస్తారు. మోడీ మద్దతు ఇవ్వడానికో, విమర్శించడానికో ఒక అంశం కాదు, ఆయనను అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం.

ప్రపంచ ప్రజాస్వామ్య

చరిత్రలో ఇలాంటి వ్యక్తిని మనం చూసి ఉండం.

ఆయన దశాబ్ద కాలం సమాజంలో పనిచేశారు, దశాబ్ద కాలం ఒక సంస్థలో అనుభవం పొందారు, దాదాపు పదిహేనేళ్ళు రాష్ట్రంలో పాలనానుభవం ఉంది, మరియు ఒక దశాబ్దం నుండి జాతీయ రాజకీయాలలో ఉన్నారు.

ఇవన్నీ ఆయనకు

ఎటువంటి కుటుంబ నేపథ్యం, కుల సమీకరణాలు లేదా ఆర్థిక ఆరోపణలు లేకుండానే సాధ్యమయ్యాయి.

ప్రతిపక్షం, ముఖ్యంగా రాహుల్ గాంధీ,

మోడీని ఎప్పటికీ ఓడించలేమని గ్రహించారు. అందుకే వారి దృష్టి ఆటపై కాకుండా, ఆటను నిర్వహించే రిఫరీపై ఉంది. తాము గెలవలేమని భావించి, ఆటనే అపనమ్మకానికి గురిచేయాలని చూస్తున్నారు.

అయితే,

బహుసంఖ్యాక హిందూ సమాజంతో ఏర్పడిన ఈ దేశం ప్రధానంగా ప్రజాస్వామ్య దేశం అని వారికి తెలియదు. అందుకే, వీరు సృష్టించే చిన్నపాటి అలజడుల వల్ల నిజంగా ఏమీ మారదు.

ఈవీఎంల ట్యాంపరింగ్ అనే

అబద్ధపు అంశాన్ని తీసుకొచ్చిన వారికి కూడా అది అబద్ధమేనని తెలుసు. దీనిని సమర్థించేవారికి కూడా అది అబద్ధమని తెలుసు. దీనిని వ్యతిరేకించేవారికి అది అబద్ధం అని తెలియనిదేముంది?

ఆరంభం, మధ్యం, మరియు ముగింపు

అన్నీ అబద్ధాలతో నిండిన ఒక అంశం కేవలం చర్చను మాత్రమే సృష్టిస్తుంది, దాని వల్ల ఎలాంటి మార్పు రాదు.

నా ఖాతా రీచ్ తగ్గిపోయింది, ఎందుకంటే చాలామంది దీనిపై రిపోర్ట్ చేస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే,

సమస్య ఖాతా కాదు, వ్యాసానికి, విశ్లేషణకు, అభిప్రాయానికి తేడా తెలియకుండా, కామెంట్స్ చేసేవారు. అర్థం చేసుకుని స్పందించండి.

ఈ పోస్ట్‌ను వీలైనంత ఎక్కువగా లైక్ చేసి, రీపోస్ట్ చేసి, షేర్ చేయండి.

మిత్రులారా, మీకు ఏమనిపిస్తుంది?

ప్రతిపక్షాలు అమెరికాతో కలిసి మోడీ లాంటి నిష్ణాతుడైన ఆటగాడిని ఇలాంటి అల్లర్లతో తొలగించగలవా?

show image

గాంధీ చెబుతాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చుపెట్టండని........ మన హిందువులు ఎంత అమాయకులు కదా.....నేటికీ మన అమాయక హిందువులు గాంధీ మాటలకూ ప్ర...