Tuesday, 16 September 2025

వెలుగులోకి రాని నిజమైన హీరో నీరజ బానోత్

 1986, సెప్టెంబరు 5... తెల్లవారుజామున ముంబై నుంచి బయలుదేరిన విమానం పాకిస్తాన్ లోని కరాచీలో దిగింది. ఈ విమానంలో కేవలం భారతీయులే కాదు, అమెరికన్లు, జర్మన్లు, పాకిస్తానీలు... ఇలా వివిధ దేశాలకు చెందిన పౌరులున్నారు. ఆ ఫ్లైట్ లోనే పనిచేస్తోంది భారత్ కు చెందిన నీరజా బానోత్. చండీఘడ్ లో పుట్టింది. ఆమె తండ్రి ఓ జర్నలిస్టు. 1985లో 21 ఏళ్ల వయసులో పెళ్లయినా... భర్త ప్రవర్తన నచ్చక రెండు నెలలకే పుట్టింటికి వచ్చేసింది. ఆ తరువాతే ఎయిర్ హోస్టెస్ జాబ్ లో చేరింది. ఇది ఆమె నేపథ్యం.




ఇక అసలు విషయంలోకి వస్తే.... సెప్టెంబరు 5న కరాచీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయినా కొన్ని క్షణాల్లోనే విమానం హైజాక్ అయినట్టు తెలిసింది నీరజకు. నలుగురు సాయుధ ఉగ్రవాదులు విమానాన్ని తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. వారు ఎయిర్ పోర్టు సెక్యూరిటీ ఆఫీసర్ల డ్రెస్సులు వేసుకుని విమానంలోకి చొరబడ్డారు. వెంటనే నీరజ కాక్ పిట్ లో ఉన్న పైలట్లను అలర్ట్ చేసింది. ఆ పిరికి పైలట్లు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం కాక్ పిట్ నుంచి విమానం దిగి పారిపోయారు. కానీ నీరజ అలా చేయలేదు. ప్రయాణికులు ఎలాగైనా కాపాడాలన్న ఉద్దేశంతో... లోపలే ఉంది. ఉగ్రవాదుల్లో ఒకడు అందరి పాస్ పోర్టులు కావాలని అడిగాడు. అలా ఎందుకు అడిగాడో నీరజకు తెలుసు. ఉగ్రవాదుల మొదటి టార్గెట్ అమెరికన్లు. పాస్ పోర్టుల ద్వారా అమెరికన్లెవరో తెలుసుకుని, చంపేందుకే అడిగారు. అందుకే అమెరికన్ల పాస్ పోర్టులు కనిపించకుండా దాచేసింది. మొత్తం 41 అమెరికన్లను కాపాడగలిగింది. కానీ ఓ ఇద్దరు మాత్రం అమెరికాకు చెందిన వారని తెలిసి చంపేశారు ఉగ్రవాదులు.

17 గంటల పాటూ విమానాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్న ఉగ్రవాదులు... ప్రయణికులను ఒక్కొక్కరిగా చంపడానికి యత్నించారు. అప్పుడే నీరజ ఎమెర్జన్సీ డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను పారిపోమని చెప్పింది. నిజానికి డోర్ ఓపెన్ చేయగానే తానే దూకేయాలి. కానీ తాను అలా చేయలేదు. అప్పటికే పారిపోతున్న ప్రయాణికులపై ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపిస్తుంటే... ఓ ముగ్గురి పిల్లలకి తాను రక్షణ కవచంలా నిలుచుని ఆ తూటా దెబ్బలు తాను తింది. ఉగ్రవాదులు మొత్తం 20 మందిని చంపేశారు. కానీ నీరజ త్యాగం, ధైర్యం వల్ల 360 మంది ప్రయాణికులు పారిపోయి... బతికి బట్టకట్టారు. ఆ ఉగ్రవాదులు కూడా పోలీసులకి దొరికిపోయారు.. తన పుట్టినరోజుకి ఇంకా పాతిక గంటలే సమయం ఉందనగా ... ప్రాణత్యాగం చేసింది 23 ఏళ్ల నీరజ బానోత్. కళ్ల ముందే మృత్యువు కనిపిస్తున్నా... వేరే వారి ప్రాణాలు కాపాడటానికి ఎవరు ప్రయత్నిస్తారు.

అందుకే నీరజ ‘గ్రేట్’. ఆమె మరణానంతరం భారత ప్రభుత్వం ‘అశోక చక్ర’ ఇచ్చి సత్కరించింది. కానీ నీరజ తల్లిదండ్రులు మాత్రం ఒక్కగానొక్క బిడ్డ మరణంతో నిలువునా కుంగిపోయారు. నీరజ మరణానంతరం ప్రభుత్వం ఇచ్చిన భారీ పారితోషికంతో కూతురి పేరుతో ఓ ట్రస్టును ఏర్పాటు చేసి సేవ కార్యక్రమాలు చేశారు.

వెలుగులోకి రాని నిజమైన హీరో నీరజ బానోత్.. ఈరోజు ఆమె జయంతి స్మరించుకుందాం

Neerja Bhanot was an Indian flight purser who died heroically on September 5, 1986, saving over 350 passengers during the hijacking of Pan Am Flight 73. At just 22 years old, her quick thinking prevented the Abu Nidal Organization terrorists from taking control of the plane, and she sacrificed her life by shielding children from gunfire. She is the first and youngest woman to receive India's highest peacetime gallantry award, the Ashoka Chakra, posthumously.  
Her Actions During the Hijacking
  • Preventing Cockpit Crew Escape: 
    Bhanot's swift actions allowed the cockpit crew to escape, which prevented the hijackers from gaining full control of the plane. 
  • Shielding Passengers: 
    As gunfire erupted, she used her own body to shield three children from the bullets, ultimately sacrificing her life to save others. 
  • Hiding Passports: 
    She also helped to hide the passports of the passengers from the hijackers, which prevented them from identifying and targeting Americans on board. 
Awards and Legacy
  • She was posthumously awarded the Ashoka Chakra, India's highest peacetime award for gallantry. 
  • Other Accolades: 
    She also received the United States Special Courage Award and two awards from Pakistan, the Tamgha-e-Pakistan and Nishan-e-Pakistan. 
  • Inspiration: 
    Her bravery and selflessness continue to inspire people, especially young women in aviation, and she is remembered as a symbol of courage and a model for devotion to duty. 
  • Film: 
    Her story was the subject of the 2016 Bollywood film Neerja, starring actress Sonam Kapoor. 

No comments:

Post a Comment

show image

  ఎం.ఎస్.సుబ్బులక్ష్మి (మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి) 1916 .సెప్టెంబర్ .16 – 2004 .డిసెంబర్ .11 పోతపోసిన భారతీయత సంగీతానికే పరిపూర్ణత.. ఆ...