Sunday, 14 January 2024

 సంక్రాంతి

🙏వీళ్లంతా కనుమరుగు అయ్యారా?🙏

,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

సంక్రాంతి వచ్చిదంటే చాలు.. ధాన్యరాశులతో పాటే రకరకాల కళాత్మక జానపదులతో ఊరంతా కళకళలాడిపోతుంటుంది. ఒకప్పుడు రకరకరాల జానపదులు మనవైన సాంస్కృతిక కళా రూపాల్ని ఊరిలో ప్రదర్శించి.. తృణమోపణమో తీసుకుని సంతోషంగా జీవించేవారు. కానీ ఆధునిక వినోదాల తాకిడికి ఇప్పుడు చిక్కిశల్యమై.. రెపరెపలాడుతున్న ఈ కళాకారులను అక్కున జేర్చుకుని.. మన పిల్లలకు పరిచయం చేసి, మనవైన మూలాలను పొదివి పట్టుకోవటాన్ని మించిన పండగేముంటుంది?
🌷🌷🌷🌷🌷
* మెడలో దండ, చేతిలో చిడతలు, తంబూరాతో శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ... ‘హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి’ అంటూ ఇల్లిల్లూ తిరుగుతూ ఈ నెల రోజులూ పల్లెలో వీధివీధినా సందడి చేసే హరిదాసులు.
,🌷🌷🌷🌷🌷
* రంగురంగుల పట్టు వస్త్రాలతో కాళ్ల నుంచి కొమ్ముల వరకూ బసవన్నలను అందంగా ఆలంకరించుకుని.. గుడ్డిబూరలూ, కోణంగి బుడ్డాళ్లతో సహా.. ఇంటింటికీ వచ్చి.. అయ్యవారికీ దండం పెట్టూ....అంటూ.. తమకు చిల్లర పైసలూ, ఎద్దుకు బుట్టెడు వడ్లూ అడుగుతూ.. పండగకే కళ తెచ్చే గంగిరెద్దుల వాళ్లు
🌷🌷🌷🌷🌷🌷

* పాత గొడుగు వేసుకుని.. బుస్కోటు తొడుక్కుని.. బుడబుడక్‌ అంటూ డమరుకం వాయిస్తూ.. అంబ పలుకులతో ఇంటింటి భవిష్యవాణిని వినిపించే బుడబుక్కల స్వాములు...
,🌷🌷🌷🌷🌷🌷🌷

* నీళ్లు నింపిన కడవ మూతిలో కత్తిగుచ్చి, దాన్ని ఓ కావిడికి కట్టి ఊరంతా ఊరేగించి కనికట్టుతో అందర్నీ ఆకట్టుకునే మాసాబత్తినవాళ్లు...
🌷🌷🌷🌷🌷👏🏼

* చిన్న సంచికట్టుతో, విభూతి నామాలతో గడపలో తిష్టవేసి కనికట్టు, హస్తలాఘవం వంటి విద్యలతో అందర్నీ అచ్చెరువందించే విప్రవినోదులు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* రోజుకో వేషం వేసుకుని, హాస్యం, భయంతో సహా సకల రసాలనూ పలికిస్తూ.. ఆఖరి రోజు శక్తివేషంతో ఊరంతటినీ ఉరికించి, వినోదం అందించే పగటి భాగవతులు...
,,🌷🌷🌷🌷🌷🌷

* ఎత్తైన చెట్టు కొమ్మ మీద కూచుని.. కనిపించిన మేర దృశ్యాలను తన దైన వ్యంగ్య ధోరణిలో ప్రత్యక్ష వ్యాఖ్యానం చెప్పే కొమ్మదాసరిలు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* ఇంటింటికీ తిరిగి సకల కులాల వారికీ తాతముత్తాల నుంచి గోత్రాల వరకూ.. పాటల రూపంలోనే వంశ మూలాలన్నీ విప్పి చెప్పే పిచ్చికుంట్లవారు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* తలపై పెద్ద కిరీటం, చేతిలో గంట, నుదిటిపై విభూది పట్టీలు, మెడలో శంఖంతో వచ్చి.. గంట నిండా ధాన్యం పెట్టమంటూ శుభోదయం పలికే జంగం దేవర...
🌷🌷🌷🌷🌷🌷

* భుజాన కావిడి, కావిడి బద్ద పొడుగునా గొట్టంతో వచ్చి, గొట్టం విప్పితే ఏయే తప్పులకు నరకంలో ఏయే శిక్షలో కళ్లకు కట్టిచెప్పే.. జనం ఇచ్చే సంభావనలు స్వీకరించే కాశీ బ్రాహ్మడు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* నెమలీకలు తలకు కట్టుకుని.. గంభీరమైన వేషధారణలో పాట పాడుతూ.. కంచు శిబ్బెని మోగిస్తూ, శివయ్యను స్మరించే చెంచు దొరలు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* ఒకప్పుడు ఊళ్లోకి ప్రవేశం లేక.. ఊరి పొలిమేర నుంచే ప్రత్యేక వాద్యం వాయిస్తూ పాటలు పాడే డొక్కల వారు...
🌷🌷🌷🌷🌷🌷

* కోసిన కోత కొయ్యకుండా వసపిట్టలా బడాయి కబుర్లు చెబుతూ ఆబాల గోపాలాన్నీ ఆనందపరిచే పిట్టల దొరలు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* గవ్వలతో కుట్టిన గొంగడి టోపీ ధరించి.. ఒంటికి గొంగడి వస్త్రాన్ని కప్పుకుని, పిల్లన గ్రోవి వాయిస్తూ భిక్షమెత్తుకునే గొరవయ్యలు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* కనకదుర్గమ్మ పెట్టెతో, కొరఢా ఝళిపిస్తూ, ఒంటిని కొరఢాతో బాదుకుంటూ, వీధి మధ్యలో డోలు వాయిస్తూ సందడి చేసే పోతరాజులు...

కాటికాపర్లు.. కోతులు ఆడించేవారు.. ఎలుగును తెచ్చేవారు... ఇలా అనేకానేక వృత్తుల వారు, జానపదులు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి పల్లెలోనూ సందడి చేసేవారు.

ఇవన్నీ ఒకనాటి ముచ్చట్లు. గ్రామాల్ని పట్టణాలు కబళించాక.. పల్లెజీవి పట్టణ వాతావరణానికి అలవాటు పడ్డాక.. ఈ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు కనుమరుగై పోతున్నాయి. సంక్రాంతి అంటే ఇవన్నీ ఉంటాయని తెలిస్తే మన పిల్లలు మాత్రం గంతులేస్తూ పల్లెలకు పరుగెత్తుకురారూ? మరి వీరందర్నీ కాపాడుకునే పని మనది కాదూ??.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సేకరణ..

కొన్ని సంక్రాంతి చిత్రాలతో....
మీ ముందుకు...
ఈ సంస్కృతి..నిలుపుకోవాలని
ఆశిస్తూ....తపిస్తూ.....

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...