Sunday 14 January 2024

 రామజన్మ ఒక వివాదాస్పద  వ్యాఖ్యలకు వివరణ 

ప్రియ హిందూ బందువులార, నేను ఎం.వి.ఆర్ శాస్త్రి గారిని కుక్క కరిచింది అని సంబోదించాను దానికి నన్ను మన్నించమని కోరుకుంటూ.. వారు చేసిన వీడియో లకి ఈ నా వివరణ.

**************************************

శాస్త్రి గారి గత 65+ జీవితంలో తన వ్యక్తిగత జీవితం లో తను చేసిన సాహిత్య సేవ గొప్ప జీవితం అయితే తను జనవరి 8 నుండి తను చేసిన మూడు వీడియోలు తన జీవితానికి తీరని మచ్చ అలాగే సిగ్గుచేటు.

మొదటి వీడియో

https://youtu.be/yZfgzRHyaGM?si=br_bCg4mW4wFD2Da

శాస్త్రి గారి పుస్తకాల కోసం ఎదురుచూసే వాడిలో నేనూ ఒకడిని. కానీ తను మాట్లాడిన మొదటి వీడియో నన్ను చాలా బాదించింది. ఎందుకంటే తను ఎంతో గొప్ప సాహితీవేత్త అయి ఉండి. వివాదాస్పద కట్టడాన్ని బాబ్రి మసీదు అని సంభోదించడం. ఎందుకంటే మసీదు అనాలంటే కనీసం ఐదుసార్లు నమాజు జరగాలి, కుళాయిలు ఉండాలి అవన్నీ వారికీ తెలుసు, ముస్లిం లు కూడా దానిని మసీద్ గా భావించలేదు. కోర్ట్ కూడా అలాగే పరిగణించింది.

అయోధ్య కరసేవకు సంబంధించి ఆర్.ఎస్.ఎస్., వి.హెచ్.పి కార్యకర్తలు ఉన్న ప్రతి గ్రామం నుండి ఐదు గురుచొప్పున పదివేల గ్రామాల నుండి 20 రాష్ట్రాల నుండి తక్కువలో తక్కువగా ఆరోజు అయోధ్యలో ఒక లక్షా 20 వేల మంది కరసేవ చేశారు. మరి ఈ కరసేవకు సంబంధించి శాస్త్రిగారి పాత్ర ఏమిటి వీరు కనీసం 1990-1992 ల మద్య ఎన్ని వ్యాసాలు రామజన్మ భూమి కి అనుకూలంగా వ్రాశారో ఉంటే చూపగలరు.

వారు పదే పదే నాకు బాబ్రి మసిదు అనడం నన్ను తీవ్రంగా బాధించింది. హిందూ సంస్థలకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అయ్యోయో బాబ్రి కట్టడం కూల్చేసేరా అనడంలో చాణక్యుడు గురించి తెలిసిన శాస్త్రిగారికి చాణక్య నీతి కనపడకపోవడం దురదృష్టకరం. తను కూల్చడాన్ని మద్దతిచ్చానని గొప్పగా చెప్పుకున్నారు కానీ అసలు అప్పుడు వారి సమర్ధనని పట్టించుకోనేవారే లేరు...

అవును నిజంగానే 500 ఏళ్ళ హిందువులు చేసిన పోరాటానికి ప్రతిఫలం ఈరోజు రామ మందిర ప్రాణ ప్రతిష్ట దానిని హాయిగా దేశం అంతా రామ అక్షతల పేరుతో ఇంటింటికీ తిరుగుతూ ఎంతో సంబరంగా పండుగగా జరుపుకొంటోంది, దానిని రామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్వహిస్తున్నది.

అవును నిజంగా దేశం అంతా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం వేచి చూస్తుంది. వి.హెచ్.పి ఆద్వర్యలో దేశ వ్యాప్తంగా ర్యాలీలు, దేవాలయల కేంద్రంగా సభలూ నిర్వహిస్తూ ఒక పండుగ వాతావారణం మొదలయ్యింది. శాస్త్రి గారు కూడా చూడవచ్చు లేదా వారికి అత్యంత సన్నిహితులుగా చాలామంది కార్యకర్తలు ఉన్నారు వారినడిగినా చెప్తారు.

రెండవ వీడియో

https://youtu.be/HtrQeO-_7tY?si=SPG9Q6zYkmj7m7xS

ఇక రెండవ వీడియో లో వారు ముస్లిం లు గంట, తలుపులు వగైరాలు తయారుచేశారు అంటూ మొదలు పెట్టారు అది నన్ను చాలా బాధించింది. పత్రికా క్లిప్పింగ్ లన్నీ అవాస్తవాలు వాటినన్నిటినీ హిందువులే తయారుచేశారు కావాలంటె వారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారి దగ్గర సమాచారం అడగవలసింది. అలా తెలుసుకోకుండా తప్పుగా ప్రచారం చేయడం వలన నేను తీవ్ర మనోవేధనకు గురయ్యాను.

ఎవరు తయారుచేశారో ఆధారాలు కావాలంటే ఈ వీడియో చూడండి...

https://www.facebook.com/vutukur.sreenivasarao/posts/10159991016748177

మీరు సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదం ను ఉటంకిస్తూ మీరు సెక్యులరిజం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే మీరు సుభాష్, నేతాజీ పుస్తకాలు వ్రాయడాన్ని మేము ఎంతగానో సంతోషించాము కానీ ఒక మసీదు కూల్చడాన్ని కాశీలో గోవును చంపినంత పాపం అన్న అలాగే అరబిక్ ని 3ర్ద్ లాంగ్వేజ్ తీసుకొస్తానన్న పవన్ కళ్యాణ్ చేత సుమారు పదిలక్షల రూపాయల ఖర్చుతో మీరు వారితో కలిసి వేధికపంచుకోవడం ఏ రకమైన సెక్యులరిజమో మీరే చెప్పాలి మరి.

హిందూ జాతికి ద్రోహం ఎవరు చేశారు అనేది మీరు చెబితే తెలుసుకునేంత పరిస్థితులలో ఈనాడు హిందూ సమాజం లేదు. ఎందుకంటే ఆనాడు హిందూ సమాజంలో అంటరానితనం పేర జరిగిన ద్రోహం కన్నా మీరు చెప్పేది పెద్ద ద్రోహమే కాదు గత వెయ్యేళ్ళ కాలమానంలో భయంతోనే, తెలిసో తెలియక మతం మారిన ముస్లిం సోదరులని వాళ్ళకి మనకి ఒకడే పూర్వీకుడైన రాముణ్ణి మనం దూరంచేయాలనుకోవడం అతిపెద్దద్రోహం అసలు ప్రపంచ వ్యాప్తంగా రాముని కీర్తి పెంచడం అన్ని మతాల వారిని పిలిచి చేయడం మహదానంద దాయకమైన విషయం పిలిచినందుకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం ఇది. ఇంకో మాట అన్నారు రామజన్మ భూమిలో ముస్లిం లకి పెద్దపీట వేశారని నిజంగా ముస్లింలకు పెద్దపీట వేశారు అని నిరూపిస్తే మీ రెండుకాళ్ళ మద్యలో నుండి దూరతాను.

శాస్త్రి గారు  ఈ వీడియోలు పెట్టి ఎలా తప్పు చేసారో అలాగే తన అధికారం కోసం ఆనాడు ములాయం సింగ్ తప్పుచేశాడు కాని దానిని కళ్యాణ్ సింగ్ సరిదిద్దాడు అయినా ములాయం సింగ్ దానికి మూల్యం చెల్లించుకున్నాడు. ఒక తప్పు చేశాడని అతనికి ఒక్ అవార్డ్ ఇవ్వడం తప్పంటే ఇక మీకు జీవితంలో మీరు చేసిన ఈ వీడియో వలన మీకు ఎటువంటి అవార్డ్ లు అలగే నామినేటెడ్ బాధ్యతలలో అనర్హులు అనే చెప్పాలి.

ముఖ్యంగా నేను ఈ బిందువులు అన్నీ వ్రాయడానికి ఒకే ఒక్క కారణం ఈ విషయంలో సంబంధంలేని ఇంద్రేష్ కుమార్ గారిని లాగడం. నా మనస్సు తీవ్రమనోవేదనకు గురయ్యింది. అసలు శాస్త్రిగారికి ఏమి తెలుసని ఇంద్రేష్ గారిని తూలనాడాడొ నాకైతే కించిత్ కూడా అర్దంకాలేదు దీనిని బట్టి వీరు కావాలనే ఈ వీడియో కుట్రపూరితంగా వ్రాశారని తెలుస్తుంది.

ఆర్టికల్ 370 అధికరణ కు సంబంధించి వీరు వ్రాసిన ఉర్దూ, అరబిక్ వ్యాసాలను చూసి ముస్లిం లు చలించిపోయి ఆర్టికల్ 370 ని రద్దుచేసినా లేక రామజన్మభూమి కోర్ట్ తీర్పు ఇచ్చిన, లేదా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ని బ్యాన్ చేసి కనీసం వంద మంది తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసినా సైలెంట్ గా ఉన్నారు అనే బ్రమలో బ్రతుకుతున్నారా ఏంటి శాస్త్రిగారు. ముస్లిం లు ఈ మూడు సంఘటనలు జరిగినప్పుడు ఏ ఒక్క ప్రదేశంలో అల్లర్లు కాని గొడవలు గాని జరగలేదంటె దానికి ముఖ్య కారణం ముస్లిం రాష్ట్రీయ మంచ్ దానిని చూస్తున్న ఇంద్రేష్ కుమార్ గారు ఆ విషయం తెలియని వారు కాదు శాస్త్రి గారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ దేశ భక్తులైన ముస్లిం లలో చతన్యం తీసుకువచ్చి కొన్ని చోట్ల అయితే వందలాదిగా తిరిగి పునరాగమనం అవుతున్నారంటే దానికి కారణం ఇంద్రేష్ కుమార్ గారు. అలాగే దేశంలో ఎక్స్ ముస్లిం మూమెంట్ కి కారకులు ఇలా ఎన్నో విషయాలలో ముస్లిం కుటుంబాలో దేశభక్తి నింపుతున్న వారు ఇంద్రేష్ గారు వారిని విమర్శ చేసే స్థాయి మీది కాదు అసలు ఆయన జ్ఞానం ముందు శాస్త్రి గడ్డి పరకతో సమానం.

సూర్యనమస్కారాలు, యోగ, దీపావళి పండుగలు సెక్యులర్ చేస్తే తప్పేంటి అసలు మీ బాదేంటి ప్రపంచం మొత్తం చేసుకోవద్దా ఈ పండుగలు మనమే సెక్యులర్లుగా మారి జనవరి ఒకటి, క్రిస్మస్, డిసెంబర్ 31, రంజాన్ జరుపుకోవాలా వాళ్ళని కూడా సెక్యులరిజం పేరుతో జరుపుకుంటే వచ్చే నష్టం ఏమిటి వాళ్ళు కూడా గుడికి వస్తారు, ఆశ్రమాలకి వెళ్ళి యోగా, సూర్యనమస్కారాలు చేసుకుంటారు మంచిదేగా కేవలం హిందువులే సూర్యనమస్కారాలు చేయాలని చెప్పలేదు గా మన గ్రంధాలు, దానికి సంబంధిత మంత్రాలు కూడా ప్రపంచ ప్రజలంతా చదివితే మనకు నష్టం ఏమి వచ్చిందో అసలే అర్దం కాని మాటలు శాస్త్రి గారివి.

అవును శాస్త్రి గారు నిజమే చెప్పారు ప్రపంచంలో ఏదన్న గొప్ప జాతి ఉంది అంటే అది హిందూ జాతే కాని మీకు ముస్లిం లని కేసు వేసిన అన్సార్ ని పిలిస్తే అంత ఉలికి పాటు ఎందుకు వస్తే మంచిది రాకపోతే మరీ మంచిది మీరు అంతా ఒకరోజులో అయిపోతుందేమో అన్న బాధ ఎందుకు మీలో నాకు స్వచ్చమైన శాస్త్రిగారు కనపడట్లేదు, శాస్త్రి గారు ఎక్కడొ అసంతృప్తిగా ఉన్నారనిపిస్తోంది.

దేశంలోని ఎన్నో అంశాలపై చర్చ చేసి రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రముఖులందరికీ ఆహ్వానాలు పపుతుంది. అలా కొంతమంది కరసేవ చేసిన కుటుంబాలను, పీఠాధిపతులను, మఠాదిపతులను, రాజకీయ నాయకులను, సినిమా వారిని పలు రంగాల్లో పనిచేస్తున్న ప్రతిష్టిత వ్యక్తులను ముఖ్యమైన భారత శాస్త్రజ్ఞులతో సహా ఆహ్వానం పలుకుతోంది. ఈ క్రమంలో సినిమా వాళ్ళకి ఆహ్వానం పలకడం ఏ విధంగా నేరం అవుతుందో మరి శాస్త్రి గారికే వదిలేస్తున్నాను.

మన దేశంలో ఎన్నో మఠాలు, పీఠాలు అనేక సంస్కృతి, సాంప్రదాయాలను కలిగి ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కో శైలి ఒకరిది ఇంకొకరికి సంబంధం ఉండదు దానిలో భాగంగా కొంతమంది ఆహ్వానాన్ని స్వాగతించి వస్తామన్నారు, కొంతమంది మేము తరువాత దర్శనం చేసుకుంటామన్నారు దానిలో కూడా శాస్తి గారు తప్పుబడితే ఎలా? రామ జన్మభూమి తీర్థ క్షేత్రం తప్పు నాకేం కనిపించలేదు. పిలవడం వారి వంతు రావడం రాకపోవడ వారిష్టం, మనం మన ఇంట్లొ పెళ్ళికి ఎందరినో పిలుస్తాం అందరూ రారు వచ్చినప్పటికి ఏదో కాదనలేకో, లేక విమర్శలు చేయడానికో కూడా వస్తూ ఉంటారు అది మీకు తెలుసు.. కాదంటారా!

సుప్రింకోర్ట్ ఇచ్చిన తీర్పుని గౌరవించి రామ జన్మ భూమి తీర్థ క్షేత్రం ఏర్పడింది అనేది శాస్త్రి గారికి తెలియకపోవడం సోచనీయం. శాస్త్రి గారిని ఎవరో పక్క దోవ పట్టించారనే అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు, కమ్యునిష్ట్ లు సారోస్ బ్యాచ్ లు, టూల్ కిట్ లు దేశ ప్రజలు ఇళ్ళు లేవు, హాస్పిటల్స్ లేవు గుడి కడుతున్నారు అన్న సందర్బంలో ఇన్ని లక్షల మందికి ఇళ్ళు కట్టాం, ఆస్పిటల్స్ కట్టాం అలాగే రాముడి కి కూడా ఒక గుడి కడుతున్నాం అంటే శాస్త్రి గారు తప్పుగా వక్రీకరించి పత్రికా భాషలో గౌరవం లేకుండా మోడి గారిని మాట్లాడటం తనకు మోడి గారిపై ప్రేమను కాక ద్వేషాన్ని వెలిబుచ్చారనిపిస్తుంది, శాస్త్రి గారి అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది.

మూడో వీడియో

https://youtu.be/KKiMk-8rwE4?si=5L9kGlFM1uRrqwKL

ఇక మూడో వీడియో లో దైవానికి అపచారం, ధర్మానికి అవమానం అంటూ తన అసహనన్ని వ్యక్తపరిచారు ఇదైతే ఏకంగా బానిసలగా బ్రతకాలా హిందువులంతా అనే భావనను నాకు కలిగించి హృదయం ద్రవించింది.

ఈ వీడియో లో ముఖ్యంగా రామ జన్మభూమి మందిర ప్రాణ ప్రతిష్ట వైదిక ఆచార పద్ధతుల్లో జరగడం లేదని చెప్పడం వారి యొక్క తీవ్ర అసహానికి ఇదొక మచ్చుతునక. పూర్తి వైదిక సాంప్రదాయానికి అనుగుణంగా జరుగుతుంది. శాస్త్రి గారికి వచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అని స్పష్టమవుతుంది ఎందుకంటే తీర్థక్షేత్ర వెబ్ సైట్ లో నాలుగు వేదాలను ఇప్పటికే రోజూ పారాయణం జరుగుతుంది. చంపత్ రాయ్ గారు ప్రెస్ మీట్లు చూడకపోవడం మన తప్పు, జపాలు, హోమాలు, కుండాలు జరుగుతున్నాయి ఇంకా వారికి వచ్చిన కష్టం ఏమిటో అర్దంకాని పరిస్థితి.

శక్తిపాతం జరుగుతుంది ఆ శక్తిపాతాన్ని మోడి గారు, యోగి గారు, యశొదా బెన్  గారు, మోహన్ భాగవత్ గారు తట్టుకోలేరు వారికి నష్టం జరుగుతుంది అనే మీ బాధ వర్ణనాతీతంగా ఉంది.  ఎందుకంటే రాముడు జీవించి ఉండగానే గుహుణ్ణి తాకాడు, శబరి ఎంగిలి తిన్నాడు అలాంటి రాముడి గుడిలోకి వీళ్ళ నలుగురు వెళ్ళడానికి అనర్హులు అపచారం, ధర్మానికి అవమానం అంటూ మీరు వెలిబుచ్చిన వాటిని చూస్తుంటే మీరు జర్నలిజం కాకుండా ఎర్నలిజం చేసారనే సందేహం కలగమానలేదు.

అసలు నాకు అర్దమయ్యింది ఏంటంటే శాస్తి గారు కంప్లీట్ గా పక్కదోవ పట్టారనిపిస్తుంది. ఈ ఆధునిక యుగం లో కలి పెగురుగుతున్న ఈ సమస్యంలో ఇంకా మీరు గుడిలోకి వెళ్ళడానికి వారు అర్హులు కాదు అంటూ అసహనం వెలిబుచ్చడం శాస్తి గారు సమాజనికి ఎటువంటి మెస్సేజ్ ఇస్తున్నారో వారికే తెలీడం లేదు.

మీ అసహనాన్ని పూర్తి గా అర్దం చేసుకున్నాం... మేము కూడా అదే అనుకుంటున్నాం పూర్తిగా దేశంలోని హిందువులంతా స్వదేశీ సంకెళ్ళకి బానిసలగా బ్రతకాలని కోరుకుంటున్నారా, హిందువుల్లో చీలికలు తేవాలనుకుంటున్నారా? 

నేనయితే శాస్త్రి గారిని ఒకటే కోరుతున్నాను ఈ మూడు వీడియో లు డిలీట్ చేసి రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారితో వ్యక్తి గతంతా మీరు మాట్లాడుకోవాలని ఏవైనా మీకు తప్పుగా అనిపిస్తే సరిదిద్దాలని కోరుకుంటున్నాను... అసలు రాముడి గుడి ప్రతిష్టలో ఏమి జరుగుతుందో తెలీకుండా ఈ మాటలు మాట్లాడినందుకు నేను నాలా నొచ్చుకున్నాను... శాస్తి గారు కూడా సహృదయంతో ఆలోచించి రాబోయే వీడియోల్లో వైభవాన్ని తెలుపాలని కోరుకుంటున్నాని.... -రాజశేఖర్ నన్నపనేని.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...