Thursday, 16 November 2023


వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అయ్యల సోమయాజుల సూర్య గణపతిశాస్త్రి

 "'నేను, నే' ననునది యెచ్చటనుండి వచ్చుచున్నదో విచారించినయెడల, అది ఉదయించు స్థలమందే లీనమగును. అదియే తపస్సు.

జపము చేయునప్పుడు మంత్రనాద మెచ్చటనుండి యుదయించు చున్నదని పరికించినచొ, అది యుధ్భవించు స్థలమందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము." అని మితాక్షరములతో ఉపదేశవాణిని ఇచ్చిన రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు, వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడైన,

దాస్య వృత్తిని వదలి అరుణాచలం వెళ్ళి, అక్కడ అచంచల తపోదీక్షతో చిరకాలం ఉండి మునిగా రమణ మహర్షిని దర్శించి తపస్సు గురించి అతనికి అనుభవ పూర్వక వాక్యాలు ఉపదేశించి వేంకటరామన్ అను నామమమును 'రమణ' అని మార్చి, 'భగవాన్ శ్రీ రమణ మహర్షి' అను పూర్ణ నామమును సమకూర్చి, 'శ్రీ రమణపంచక' మను శ్లోక రత్నములను కూర్చి రమణుని హస్తమందుంచి 'మీరిది స్వీకరించి నన్ను ఆశీర్వదించెదరు' అని పలికిన, కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభలో స్త్రీల హక్కుల కోసం ఏర్పాటు చేసిన సభలో… పురుషులతో బాటు స్త్రీలకు సమానహక్కు ఉందని వేదశాస్త్ర ప్రమాణాలతో నిరూపించిన అయ్యల సోమయాజుల సూర్య గణపతిశాస్త్రి గారి జయంతి నేడు 💐
తల్లిదండ్రులు వీరు గర్భంలో ఉండగానే కలిగిన కొన్ని దివ్య నిదర్శనాల వలన గణపతి దైవాంశ సంభూతునిగా భావించి వీరికి గణపతి అని నామకరణం చేశారు. తండ్రి నుండి పంచాక్షరితో సహా పన్నెండు మహా మంత్రాల ఉపదేశం పొందారు. పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి సకల శాస్త్రపారంగతుడై తాను కూడా ఋషులలాగ తపస్సు చేసి శక్తులను పొంది లోకోద్దరణ చేద్దామని ఆనేక ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు.పదేళ్ళ వయసులోనే మూడు కావ్యాలు రచించి కవిత్వం చెప్పి జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సంపాదించి పంచాంగ గణనలో ఒక నూతన పథకాన్ని కూడా రచించి గురువును మించిన శిష్యుడు అని పేరుపొందారు. కుటుంబ జీవితాన్ని గడుపుతూ, బాధ్యతలను నిర్వర్తిస్తూ తపస్సు చేసుకోవడం ద్వారా మోక్షప్రాప్తి సాధించవచ్చని ఋషులు చెప్పిన దానిని గట్టిగా విశ్వసించి భార్య అనుమతితో సంవత్సరంలో ఆరునెలల కాలం దేశంలోని వివిధ ఆలయాలలో ఏకాంత ప్రదేశంలో తపస్సు చేస్తుండేవారు.

No comments:

Post a Comment

show image

  A TRIBUTE TO A GREAT SON OF MOTHER INDIA FIELD MARSHAL SAM HORMUSJI FRAMJI JAMSHEDJI MANEKSHAW MC ON HIS 17TH DEATH ANNIVERSARY TODAY. Sam...