Tuesday, 29 August 2023

 /*నాణెం పై తెలుగు భాష.*


*ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు భాషకు పట్టం కట్టారు.*


*ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.* 


*ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ” ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య ” ను సభ దృష్టికి తీసుకువచ్చారు.*


 *పట్టాభీ ! నువ్వు ‘ ఆంధ్ర రాష్ట్రం,,, ఆంధ్ర రాష్ట్రం,,, ‘ అని ఎప్పుడూ అంటూ ఉంటావు… అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ? … మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గారు,గాంధీ గారు మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఎగతాళిగా మాట్లాడారు



*అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి అణా కాసును తీసి ” సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ … జాతీయ భాష అయిన హిందీలోనూ … దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ… ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం.* 


*(అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు)… మరి ఈ నాణెం పై మా ‘ తెలుగు భాష ఉంది… కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే ???* 


*అంటూ చురక వేశారు. పటేల్ గారు, గాంధీ గారు మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఆశ్చర్యపోయారు.*


*భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే… తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించి, వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచం లో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాష లను ప్రవేశ పెట్టి, మన తెలుగు చరిత్ర గొప్పదనం అందరికి తెలియపర్చారు.*



*తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు*


      *🚩హనుమాన్ దళ్*🚩

              *ఆంధ్రప్రదేశ్*

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...