స్మారక నాణాలు
BANDLA GANESH.
నాణాలలో రెండు రకాలు ఉంటాయి. స్మారకం, మారకం. స్మారకం అంటే జ్ఞాపకార్థం వేసే నాణాలు, మారకం అంటే ప్రజల్లో చెలామణీలో ఉండే నాణాలు. మొన్న వేసినది స్మారక నాణాలు. కేంద్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్ట్రీ అజమాయిషీలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, మింట్ అని రెండు వర్గాలు ఉంటాయి. నాసిక్ లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్సులో రూపాయిల నోట్లు, ప్రామిసరీ నోట్లు, స్టాంపు పేపర్లు ముద్రిస్తారు. ముంబాయి, కోల్కటా, హైదరాబాదుల్లో ఉన్న మింట్ లో మారకం అయ్యే నాణాలు (రూపాయి బిళ్ళలు) తయారుచేస్తారు. ఇవే గాక, మనం ఏ వ్యక్తి పేరుమీదైనా మాకిన్ని నాణాలు కావాలని ఏదైనా కుటుంబం నిర్ణీతమైన మొత్తాన్ని వారికి కడితే, వారు కోరినన్ని నాణాలను ముద్రించి యిస్తారు. అయితే అవి ఎక్కువ మొత్త్గంలో ఉంటేనే అంగీకరిస్తారు. మొన్న విడుదలైన రామారావు గారి బొమ్మతో ఉన్న నాణెం అలాంటిదే! పురందేశ్వరి గారు అలా అర్డరిచ్చి 14 వేల నాణాలను ముంద్రింపించారుట! అవి సాధారణంగా నాణాలను సేకరించి దాచుకొనేవాళ్ళు కొంటారు. ఈవిడ డబ్బులు కట్టి వాటిని ముద్రింపించి, రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేయమని ఆమెను అడిగితే, ముర్ము గారు ఒప్పుకొన్నారు. ఇటీవలే పి.వి.నరసింహారావు గారి శత జయంతి జరిగింది. మరి ప్రభుత్వం ఆయన నాణాన్ని ఎందుకు విడుదల చేయలేదు? ఆయన కుటుంబం ఆ పని చేయలేదు. రామారావు గారి కుటుంబం దానికి పూనుకొంది. ఎన్నికల సమయం కావటంతో కొంత రాజకీయం కూడా ఉంటుంది. లక్ష్మీపార్వతి గారు కూడ ఎన్నికల సమయం కాబట్టి గొడవ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు గనుక ఆమెను పిలవలేదు. కుటుంబసభ్యులుగా భావించిన వారిని మాత్రమే వాళ్ళు పిలుచుకొన్నారు. ఈమె వివాహం అయ్యాక, కన్నతండ్రినే ఆ కుటుంబం బయటపెట్టింది. ఇంక ఈమెను తమ కుటుంబ కార్యక్రమానికి ఎందుకు పిలుస్తారు? రామారావు గారి నాణాలు హైదరాబాదు మింట్ లో తయారయ్యాయి. నాణాలు కావలసిన వాళ్ళు నాణానికి మూడు వేలు కడితే, యిస్తామని మింట్ డైరెక్టర్ మొన్ననే ప్రకటించారు. నేను సర్వీసు చివరలో మింట్ లో పనిచేసాను గనుక యిదంతా తెలిసింది. అవి ఎక్కువగా తెలుగుదేశం నాయకులు, బంధుబలగాలు కొని దాచుకోవటానికే తప్ప, మార్కెట్టులో చెల్లుబాటు అయ్యే నాణాలు కావు. చెల్లుబాటు కాని నాణెం కోసం రచ్చ చేసుకోవటం అనవసరం. ఎవరికైనా సరదా ఉంటే, ఒక నాణానికి మూడు వేలు చెల్లించి తెచ్చుకొని, పూజగదిలో పెట్టుకోవచ్చు.
No comments:
Post a Comment