Saturday 8 April 2023

మంగల్ పాండే


 ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండేగారి వర్థంతి సందర్భంగా

#భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన #ఘనత మంగళ్ #పాండేదే!
సుమారు మూడు శతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు #మంగళ్ పాండే. ఇతడు
ఒక భారతీయ సైనికుడు , 1857 లో భారత తిరుగుబాటు చెలరేగడానికి ముందు జరిగిన సంఘటనలలో కీలక పాత్ర పోషించాడు . అతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34 వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ (బిఎన్‌ఐ) రెజిమెంట్‌లో సిపాయి.
#సైన్యంలో చేరడం:
మంగల్ పాండే ఎగువ బల్లియా జిల్లా , సెడెడ్ మరియు కాంక్వెర్డ్ ప్రావిన్సెస్ (ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో ) నాగ్వా అనే గ్రామంలో19 జూలై 1827 నజన్మించాడు.

పాండే తండ్రి దినకర్ పాండే. ఆయన మొదట్లో ఫైజాబాద్ జిల్లా ... దుగ్వాన్-రహీమ్‌పూర్‌లో ఉండేవారు. అక్కడి నుంచి సురహర్పూర్ వలస వచ్చాడు. మంగళ్‌పాండే తల్లి అభయ్‌రాణి.
1849 లో బెంగాల్ సైన్యంలో చేరారు . మార్చి 1857 లో, 34 వ బెంగాల్ స్థానిక పదాతిదళానికి చెందిన 5 వ కంపెనీలో అతను ఒక
సైనికుడు (సిపాయి).
1857 #సిపాయిల తిరుగుబాటు:
#కలకత్తా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857,మధ్యాహ్నం సైనికాధికారి లెప్టినెంట్ బాగ్‌ని మంగళ పాండే కాల్చి చంపేశాడు.
ఇందుకు కారణం బ్రిటిషు ( కిరస్తానీ )వారు సిపాయిలకు ఆవు కొవ్వు మరియు పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు . సుమారు మూడు శతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ ( కిరస్తానీ )వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే. . అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే.
#పాండే ఒక #జ్వాల:
ఉత్తర భారతదేశంలోని మీరట్, ఢిల్లీ, లక్నో, కల్పి, కాన్పూర్, బెనారస్, రాణీగంజ్, కలకత్తాల మీదుగా దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలకు వ్యాపించిన తిరుగు బాటు జ్వాల. మన ప్రప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి మీసాన్ని మెలితిప్పి వత్తిగా వెలిగించినవాడే మంగళ్ పాండే! పాండే ధిక్కారం తర్వాత తొలిసారి మీరట్ (ఉత్తర ప్రదేశ్)లో భారతీయ సిపాయిలు బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు. అక్కడ ఇద్దరు బ్రిటిష్ అధికారులను హతమార్చి, ఢిల్లీ వైపు కదిలారు. ఝాన్సీ (ఉ.ప్ర.) నుంచి లక్ష్మీబాయి, మరాఠా పీష్వా నానా సాహెబ్, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా తిరుగుబాటు సంగ్రామంలో పాల్గొన్నారు. అంతిమంగా బ్రిటిష్ వాళ్లదే పైచేయి అయింది.
ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే ఆ పోరాటంలో మరణించారు. బహదూర్ షాను తీసుకెళ్లి బర్మా జైల్లో పడేసింది బ్రిటిష్ ఆర్మీ. హైదరాబాద్ నిజాం, గ్వాలియర్ సింధియాలు విదేశీ పాలకులకు అనుకూలంగా ఉండిపోయారు. అక్కడి తో పాండే వెలిగించిన మహాజ్వాల కొడిగట్టింది.
#ఉరి తీయడం:
ఆవుకొవ్వు, పంది కొవ్వు ఉపయోగించి తయారుచేసిన తూటాలను కొరికి ప్రయోగించడానికి నిరాకరించిన మంగళ్ పాండే ఆ కోపంలో తన పై అధికారిని హతమార్చాడు. షేక్ పల్టూ అనే సహ సిపాయి పాండేను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న జనరల్ జాన్‌హెర్పే... పాండేను పట్టుకోమని జమేదార్ ఈశ్వరీ ప్రసాద్‌ను అదేశించాడు.
ఈలోపు పాండే తన తుపాకితో తనే కాల్చుకుని ఆంగ్లేయుల చేతిలో కాక, ఆత్మాభిమానంతో చచ్చిపోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. బ్రిటిష్ సైనికులు వెంటనే అతడిని నిర్బంధించి హత్యానేరం మోపారు. సైనిక న్యాయస్థానం పాండేను ఏప్రిల్ 18న ఉరి తియ్యాలని తీర్పు చెప్పింది. అయితే పది రోజుల ముందుగానే మంగళ్ పాండే ను సైనిక న్యాయస్థానం ఏప్రిల్ 8న ఉరితీసింది.
#స్థానిక తలారులు మంగళ్ పాండేను ఉరి తీయడానికి #ఒప్పుకోకపోవడంతో, #కోల్‌కతా నుంచి నలుగురు తలారులను పిలిపించి ఆయనను ఉరి తీశారు.
అతడిని పట్టుకునేందుకు నిరాకరించిన ఈశ్వరీ ప్రసాద్‌ను కూడా రెండు వారాల తర్వాత ఏప్రిల్ 22న ఉరి తీశారు.
#మహా ఉద్యాన్ పార్కు:
బ్రిటీష్ అధికారులపై పాండే దాడి చేసిన #ప్రదేశాన్ని జ్ఞాపకార్థం బరాక్‌పూర్‌లో షాహీద్ మంగల్ పాండే మహా ఉద్యాన్ అనే పార్కును ఏర్పాటు చేశారు. బరక్‌పూర్‌లో 2005లో స్థానిక పాలక మండలి పాండే #విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆ ఊరిలో ఆర్మీ బ్యారక్‌ల మధ్య పాండే ఒక్కడే ఒంటరి యోధుడిలా కనిపిస్తాడు. ఛాతీ వరకు ఉన్న ఆ స్మారక విగ్రహం కింద ‘మంగళ్‌పాండే, సిపాయి నెంబరు 1446, 34వ రెజిమెంట్. 1857 మార్చి 29న పట్టపగలు బ్రిటిష్ అధికారులపై ఇతడు తుపాకీ పేల్చాడు’ అని రాసి ఉంటుంది.
#తపాలా స్టాంపు:
భారత ప్రభుత్వం అక్టోబర్ 5, 1984 న పాండే స్మారక తపాలా స్టాంపును జారీ చేసింది.
#సినిమా:
కేతన్ మెహతా దర్శకత్వం వహించిన మంగల్ పాండే: ది రైజింగ్ , భారతీయ నటుడు, అమీర్ ఖాన్ నటించిన రాణి ముఖర్జీ , అమిషా పటేల్ మరియు టోబి స్టీఫెన్స్ లతో కలిసి జరిగిన తిరుగుబాటుకు దారితీసిన సంఘటనల ఆధారంగా ఒక చిత్రం 2005 ఆగస్టు 12 న విడుదలైంది.
#రంగస్థల నాటకం:
పాండే జీవితం సుప్రియా కరుణకరన్ రచన మరియు దర్శకత్వం వహించిన ది రోటీ తిరుగుబాటు అనే రంగస్థల నాటకం . నాటకం స్పర్ష్, ఒక థియేటర్ గ్రూప్ ద్వారా నిర్వహించబడింది, మరియు ఆంధ్ర సరస్వత్ పరిషత్ వద్ద మూవింగ్ థియేటర్ వద్ద జూన్ 2005 లో ప్రదర్శించబడింది.
#భారతీయుల్లో బానిసత్వ భావాన్ని పారద్రోలుతూ.. స్వాతంత్య్ర కాంక్షని ఉవ్వెత్తున రగిలించిన మంగళ్ పాండే చిరస్మరణీయుడు.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...