ఛత్రపతి శివాజి మహారాజ్ జయంతి శుభాకాంక్షలు
మాతృభూమి పరాయిపాలకుల చేతిలో బంధీ అయింది..
ఆకాశాన్ని చీల్చిన ఆత్మవిశ్వాసం....
స్వయంపాలనకోసం భారతగడ్డకోసం
నినాదించిన తొలిగొంతు శివాజి ...
ఆత్మగౌరవంకోసం బిగుసుకున్న తొలిపిడికిలి శివాజి...
స్వయం పాలనకోసం సమరశంఖం పూరించి...
విజయమో వీర స్వర్గమో అని 16 ఏల్ల వయస్సులొ కత్తిపట్టి యుద్దం చేసిన వీరుడు...గెలిచిన మహాధీరుడు...
శివాజి తల్లి జిజియాబాయి...తండ్రి షాహాజి.....
తుకాంరాంలను శివాజి గురువులుగా భావించాడు...వాల్లు నేర్పిన విలువలతోనే జీవితాన్ని మలుచుకున్నాడు...
సుల్తాన్ పాలనలొ మరాఠ ప్రజలు అస్తిత్వాన్ని కోల్పొయారు...మరాఠ్ వాడా పౌరుషాన్ని ప్రపంచానికి చూపించడానికి 16 ఏల్లకే కత్తి పట్టి...యుద్దరంగంలొ గెలిచి తిరుగులేని మరాఠ సామ్రాజ్యాన్ని సాధించాడు
మరాఠ ఆత్మ గౌరవ పథాకాన్ని రెపరెపలాడించాడు
చరిత్రలో చత్రపతిశివాజి గా నిలిచాడు...
ఓటమి తప్పదు అని ఆలోచనవస్తే
యుద్దంలో నుండి తప్పుకోవాలి
అనువైన సమయంలొ దాడిచేసి గెలవాలి
ఇదే శివాజి రణతంత్రం...
దీనినే గెరిల్లా యుధ్దం అంటారు...
గెరిల్లా పోరాటాన్ని పరిచయం చేసిన
మొదటి వ్యక్తి చత్రపతిశివాజి..
తనరాజ్యంలో ప్రజలకు కష్టాలు రాకుండా మహిళల క్షేమంకోరే మహానుభావుడు...
ప్రత్యేకంగా మహిళలకు చర్యలు తీసుకున్నాడు...
ఆడవారందరి దగ్గర అన్నా పిలిపించుకున్నాడు...
సతీసహగమనాన్ని నిషేధించాడు...
జమీందారి వ్యవస్తను రద్దుచేశాడు...
వ్యవసాయం మెరుగుపడేలా చేశాడు...
శివాజి మతద్వేషి కాదు అన్ని మతాలవారిని ప్రేమించేవాడు...
స్వరాజ్యం పేరుతో స్వదేశి రాజ్యాన్ని స్తాపించడానికి ప్రయత్నించాడు అన్నిమతాలను ఆదరించాడు....
తన యుధ్దాన్ని మరాఠ అస్తిత్వ
పోరాటంగానే చూశాడుకాని
హిందు ముస్లిం పోరాటంగా శివాజి చూడలేదు
మొగలులకు మూడుచెరువుల నీల్లు తాగించాడు...
ఎత్తుకు పై ఎత్తువెయడంలొ ధీరుడు...
అపజయాల మెట్లనుండి గెలుపుశికరాన్ని అందుకున్నాడు..
రాయగడను రాజదానిలా విశాలమైన
మరాఠి సామ్రాజ్యాన్ని నిర్మించాడు....
చరిత్రలో నిలిచిన చత్రపతిశివాజి ....
ప్రజల క్షేమం కోరి...ప్రజల గుండెల్లో నిలిచిన
చత్రపతిశివాజి జయంతి నేడు....
" చత్రపతిశివాజి గారికి హృదయపూర్వకంగా
జయంతి నివాళి"....
No comments:
Post a Comment