Wednesday, 11 January 2023

  దేశవ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరోసారి రుజువు అయ్యింది !

రాహుల్ భారత్ జోడో యాత్ర భాగంగా వివిధ రంగాలకి చెందిన వాళ్ళు కలుస్తూ వస్తున్నారు రాహుల్ తో పాటు నడుస్తూ ! రఘు రామ్ రాజన్ ని కాంగ్రెస్ ఎందుకు ఏరికొరి అమెరికా నుండి తెచ్చి రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పెట్టుకుందో మనందరికీ తెలుసు. బిజేపి ప్రభుత్వం ఏర్పడగానే ఎందుకు రఘు రామ్ రాజన్ తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడో అప్పట్లో ఎవరికీ తెలియదు కానీ రక రకాలా ఊహాగానాలు చేశారు. కానీ వారం క్రితం రఘు రామ్ రాజన్ భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి తన విశ్వాసాన్ని చాటాడు. 

కానీ మాజీ RAW చీఫ్ రాహుల్ ని కలవడం రాహుల్ తో కలిసి కొద్దిసేపు నడుస్తూ ఫోటోలకి బహిరంగంగానే ఫోజులు ఇవ్వడం దేనికి సంకేతం ?

************************************************************************

మాజీ RAW చీఫ్ AS దౌలత్ రాహుల్ తో కలిసి నడవడం మాత్రం పాత గాయాల్ని మళ్ళీ గుర్తుచేసినట్లయింది !

ఎవరీ AS దౌలత్ ?

అమర్ జిత్ సింగ్ దౌలత్ అలియాస్ AS దౌలత్ రాజస్థాన్ కేడర్ IPS అధికారి ! 1965 లో IPS గా సెలెక్ట్ అయ్యి 1969 లో ఇంటెలిజెన్స్ బ్యూరో లో జాయిన్ అయ్యాడు. అంటే సర్వీస్ లో జాయిన్ ఏయిన 4 ఏళ్లకే ఇంటెలిజెన్స్ బ్యూరో కి బదిలీ అయ్యాడు అంటే అయితే మంచి పనితీరు కనపరచి ఉండాలి లేదా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండి ఉండాలి లేకపోతే 4 ఏళ్లకే కీలకమయిన ఇంటెలిజెన్స్ బ్యూరో కి ఎలా వెళ్లగలుగుతాడు?

వివాదాస్పద మరియు అనుమానాస్పద దేశ ద్రోహి AS దౌలత్ !

కాశ్మీరీ హిందువుల ఊచకోత మరియు వలసలు జరిగింది 1988 నుండి 1990 వరకు అని మనకి తెలిసిందే ! 1988 నుండి 1990 వరకు AS దౌలత్ జమ్మూ కాశ్మీర్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇదే సమయంలో కాశ్మీర్ లోయలోని తీవ్రవాదులకి డబ్బు సరఫరా చేశాడానే ఆరోపణలు వచ్చాయి. 

ఒక ఇంటెలిజెన్స్ జాయింట్ డైరెక్టర్ కి తీవ్రవాదులకి సరఫరా చేయడానికి డబ్బు ఎక్కడినుండి వచ్చింది ? ఇంటెలిజెన్స్ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నవాళ్ళకి సమాచార సేకరణ నిమిత్తం ప్రభుత్వం నిధులు ఇస్తుంది వీటికి లెక్కలు ఉండవు. జమ్మూ కాశ్మీర్ ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరక్టర్ గా ఉన్నాడు కాబట్టి ఆ రాష్ట్రానికి గ్రాంట్ గా ఇచ్చిన డబ్బు ని రిలీజ్ చేసే అధికారం AS దౌలత్ చేతుల్లో ఉంటుంది. తనకి ఇచ్చిన డబ్బులకి లెక్క చెప్పాల్సిన అవసరం ఉండదు. దీని మీద ఎలాంటి ఆడిటింగ్ జరగదు. ఆనాటి కాశ్మీర్ మారణ హోమం గురుంచి దౌలత్ కి ముందే తెలుసు. కానీ తన అధీనంలో ఉన్న డబ్బుని కాశ్మీర్ వేర్పాటు వాదులకి పంచుకుంటూ పోయాడు. కాశ్మీర్ లోయలో ఉన్న అన్ని తీవ్రవాద గ్రూపు నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దౌలత్ కి.  

ముఖ్యంగా కాశ్మీర్ లో అప్పట్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడం పార్టీ [JKDFP] అధ్యక్షుడు షబీర్ అహ్మెద్ షా అలియాస్ షబీర్ షా అలియాస్ బిగ్ డాడీ తో సన్నిహిత సంబంధాలు నెరపాడు దౌలత్. షబీర్ షా ని బిగ్ డాడీ అని కూడా పిలిచేవారు అప్పట్లో ఎందుకంటే కాశ్మీర్ లోయలో ఉన్న అన్ని ఉగ్ర గూపులకి పెద్ద దిక్కుగా ఉండేవాడు కానీ JKDFP అనే రాజకీయ పార్టీ మూసుగుతో ఉండేవాడు కాబట్టి రాజకీయ నాయకుడిగా చెలామణీ అయ్యాడు బిగ్ డాడీ. 

*******************************************************************

1988-90 కాశ్మీరీ మారణహోమం విజయవంతం అయినందుకు కానుకగా ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ గా ప్రమోషన్ లభించింది తరువాతి కాలంలో. నిజానికి ఇంటెలిజెన్స్ విఫలం అయ్యింది కనుక దౌలత్ ని లూప్ లైన్ కి పంపించాలి కానీ అలా జరగలేదు సరి కదా స్పెషల్ డైరెక్టర్ గా ప్రమోషన్ లభించింది !

********************************************************************

1999 నుండి 2000 వరకు రీసర్చ్ & అనాలసిస్ వింగ్ [RAW] డైరెక్టర్ గా నియమితుడు అయ్యాడు AS దౌలత్. 

కార్గిల్ యుద్ధం జరిగింది : 3 May నుండి 26 July 1999!

RAW చీఫ్ గా ఉన్నప్పుడు పాకిస్థాన్ వైపు నుండి ఎలాంటి ముప్పు రావచ్చో పసిగట్టాల్సింది కానీ అలా జరగలేదు. తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా మిన్నకుండి పోయాడు ఎందుకంటే అప్పుడు వాజపెయీ ప్రధాన మంత్రిగా ఉన్నాడు కాబట్టి !

అప్పటి ప్రధాని వాజపెయీ గారు AS దౌలత్ ఎలాంటి వాడో పసిగట్టలేకపోయారు. ఇక్కడ ప్రధాని ప్రస్తావన ఎందుకంటే RAW అనేది ప్రధాని పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి !

కాంగ్రెస్ ఉప్పు తిన్నందుకు బిజేపి ప్రధానికి వ్యతిరేకంగా పనిచేశాడు దౌలత్ !

కార్గిల్ చొరబాట్ల గురుంచి చూచాయగా ముందే ఇజ్రాయేలీ గూఢచార సంస్థ ‘మొస్సాద్ ‘ హెచ్చరించింది RAW ని !

1999 డిసెంబర్ నెలలో ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన IC-814 విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కి తీసుకెళ్లిన ఘటనలో AS దౌలత్ పాత్రని అనుమానించాడు దౌలత్ సహచర RAW అధికారి అయిన NK సూద్ ! ఇదే NK సూద్ హమీద్ అన్సారీ ఇరాన్ లో రాయబారిగా ఉన్న సమయంలో RAW అధికారులని ఇరాన్ కి పట్టిచ్చిన సంఘటలని ప్రధాని మోడీజీ కి ఫిర్యాదు చేసి విచారణ చేయమని అడిగాడు. 

AS దౌలత్ పాకిస్థాన్ ISI చీఫ్ అయిన అసద్ దుర్రానీ ని పొగుడుతాడు. ఒక పుస్తకం కూడా వ్రాశాడు వెధవ పాకిస్థాన్ ఐఎస్ఐ దుర్రానీ పొగుడుతూ ! AS దౌలత్ కి ఇప్పటికీ పాకిస్థాన్ ISI లో పనిచేసేవాళ్ళలో చాలమంది తో కాంటాక్ట్ లో ఉన్నాడు. 

ఇదే AS దౌలత్ కాశ్మీర్ వేర్పాటు వాది యాసీన్ మాలిక్ కి మద్దతుగా ఉండేవాడు. కాశ్మీరీ హిందువుల ఊచకోతలో యాసీన్ మాలిక్ పాత్ర లేదని వాదించేవాడు !

కాశ్మీరీ ఫైల్స్ సినిమా ని తీవ్రంగా విమర్శించాడు ఎందుకంటే పరోక్షంగా తన పాత్రని అందులో చూపించారు కదా !

2000 లో రిటైర్ అవ్వగానే జమ్మూ కాశ్మీర్ కి సలహాదారుగా పెట్టుకున్నారు వాజపెయీ గారు తన ఆఫీసులో 2004 వరకు. 

*********************************************************


కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నినాదం : ‘ జాగృతమ్ – అహర్నిశమ్ ‘ . కానీ చాలా జాగ్రత్తగా తమ బాస్ కాంగ్రెస్ చెప్పినట్లు నడుచుకున్నాడు, ఫలితంగా స్వతంత్ర్య భారత దేశ చరిత్రలో కాశ్మీర్ మారణహోమానికి తన వంతు సమిధలని పే ర్చాడు దౌలత్. 

RAW యొక్క నినాదం : ‘ అనుసంధానం – విశ్లేషణ ‘ . కానీ పాకిస్థాన్ తో అనుసంధానం అయిపోయి కాంగ్రెస్ కి విశ్లేషణ చేశాడు దౌలత్. 

ఇప్పుడు తన విశ్వాసాన్ని తెలియచేయడానికి రాహుల్ తో కలిసి నడిచాడు 82 ఏళ్ల AS దౌలత్ !

కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంటే చాలా విభాగాలు ఉన్నాయి. మనకి తెలిసింది,తెలుస్తున్నది కొన్ని మాత్రమే ! 2024 లో కాంగ్రెస్ గెలవకపోతే దాని ఎకో సిస్టమ్ దాదాపుగా అంతరించి పోతుంది !

జైహింద్ !

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...