*🙏దేవుడు ఉన్నాడా? లేడా🙏?*
*_ఇలాంటి డైలమా స్థితి మనిషిని ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది. స్థిరత్వమివ్వదు._*
*_1. ఆకాశం ఏ ఆదరముతో నిలిచింది... ?_*
*_2.నింగిలో చుక్కలు ఏ ఆదరముతో నిలుస్తున్నాయి... ?_*
*_3.సూర్య, చంద్రాదులు ప్రామాణికంగా ఎలా ప్రకాశించగల్గుతున్నాయి... ?_*
*_4. అందమైన పుష్పములో మకరందాన్ని ఎవరు నింపారు...?_*
*_5. ఒక చిన్న కణం పిండముగా మారి... బారి కాయముగా ఎలా ఎదగ గల్గుతుంది... ? శరీరంలో ఉన్నా అవయవాలు ఎవరు తాయారు చేసారు...?_*
*_6.మనం భుజించే ఆహారపదార్థాలు నల్లటివి తిన్న, తెల్లటివి తిన్న... ఏ రంగు పదార్థాన్ని తిన్నాను రక్తం ఎర్రగా తాయారు తయారౌతుంది. అసలు రక్తము ఎవరు తాయారు చేస్తున్నారు...?_*
*_7.గాలి, నీరు ఆహారం ఎవరు తాయారు చేసారు...?_*
*_కేవలం భూమిలో ఒక విత్తనాన్ని నాటితే వందల విత్తనాలు ఎలా వస్తున్నాయి... ? వాటిని ఎవరు తాయారు చేసారు...?_*
*_8. మనం నిదురపోతాము మనకు తెలియకుండానే శ్వాశ తగురీతిలో నిరంతరం నడుస్తుంది. శ్వాసను నిరంతరం తగురీతిలో ఎవరు నడిపిస్తున్నారు...?_*
*_9.నిద్రనుండి మనము ఉదయం మన ప్రమేయము లేకుండానే వెంటనే రెండు కళ్ళు తెరుచుకుంటాయి. మనకు స్మృతిని ఎవరు కలిగిస్తున్నారు...?_*
*_10.ఒక కారు నడవాలంటే ఇందనము, డ్రైవర్ కావాలి కదా.. మరీ మనము ఇందనమనే ఆహారాన్ని తీసుకుంటున్నాము ఆహారాన్ని జీర్ణింపచేసి శక్తిని నింపి శరీరములోనీ అవయవాలు నిరంతరం పనిచేస్తున్నాయి. వాటిని ఎవరు నడిపిస్తున్నారు...?_*
*_మానవ శరీరమనే కారుకు డ్రైవర్ ఎవరు...? ఎవరు నడిపిస్తున్నారు...?_*
*_11.మన చేతులను, పళ్లు, శరీరాన్ని రోజు రాపిడి చేస్తూ రుద్దుతూ ఉంటాము... ఒక ఇనుప వస్తువుపైనా రోజు మూత్రవిసర్జన చేస్తే కొన్నాళ్ళకు కనుమరుగై పోతుంది మరీ మనం చేతులను సబ్బుతో, పళ్ళను బ్రెస్సుతో రోజు రుద్దుతుంటాము కదా మరీ అవి ఎందుకు కరుగుతలేవు...?_*
*_12.మానవుడు ఉన్నతుడు శక్తీ శాలుడు అనుకున్నప్పుడు మనిషికి మరణం ఎందుకు వస్తుంది...?_*
*_మరణించిన వ్యక్తి ఎక్కడి వెళ్తున్నాడు... ? శరీరము మనముందే ఉంటుంది. అలాంటప్పుడు కదలిక ఎందుకు ఆగిపోయింది...?_*
*_శరీరమే మనముందు ఉంటుంది చనిపోయాడు అంటున్నాము ఇంతకు పోయింది ఏంటి...?_*
*_13.సుందరమైన ప్రకృతిని, సృష్టిని ఎవరు సృష్టించారు...?_*
*_14.నీరు ఆవిరిగా మారి మేఘావృతమై మదించి తెలియాడుతున్నాయి ఎలా...? ఆయా రుతువుల లో (కాలంలో ) వర్షాన్ని ఏ శక్తీ కురిపిస్తుంది...పృద్విని చల్ల బరిచి భూగర్భములో నీటి నిల్వ ఎలా సాధ్యం... ?_*
*_15.సృష్టిలోని జీవుల పోషణ ఎలా జరుగుతుంది... ? ఉదాహరణకు -బండ రాతి మధ్యన ఉన్నా కప్పకు పోషణ ఎలా జరుగుతుంది... ?_*
*_ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా...ఆలోచింపజేసే ఆశ్చర్యకరమైన, వింతగొలిపే ఎన్నెన్నో దృశ్యాలు మన కళ్ళముందే కదలాడు తున్నాయి..._*
*_దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే... వీటన్నిటిని నడిపించే ఒక అద్భుత శక్తీ ఉన్నదని మనం గ్రహించవచ్చు... ఆ శక్తినే మనం "దేవుడు " లేదా..."పరమాత్మా" అంటున్నాము. "పర "అనగా బిన్నంగా ఉండేవాడు అని అర్థం._*
*"దేవున్నీ " చాలామట్టుకు చూసారు,ప్రసన్నం చేసుకున్నారు అనడానికి ఎన్నో నిదర్శనాలు, ఆనవాళ్ళు ఇప్పటికి చూడవచ్చు.*
*_త్రేతాయుగములో పురాణపురుషుడు - శ్రీ రామచంద్రుడు._*
*_ద్వాపరయుగములో -శ్రీకృష్ణపరమాత్మా ._*
*_ఈ ఇరువురు అవతారపురుషులు ఆయ యుగములో ఉన్నారు అనడానికి "రామాయణం" "మహాభారతం" ప్రామాణికాలు...అంటే ఆ యుగములో నీ ప్రజలు ప్రత్యక్షంగా దేవుని అవతారాలను చూసారు అనవచ్చు._*
*_మహాభక్తుడు అన్నమయ్య కలియుగ దైవముగా కొలువబడుతున్న తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామినీ ప్రసన్నం చేసుకున్నారు చూసారు అనడానికి ఏడుకొండల తిరుపతి క్షేత్రంమే సాక్షిభూతం._*
*_"గోపన్న " శ్రీ రామదాసుగా పేరొందిన మహాభక్తుడు. శ్రీరాముని ప్రత్యక్షము గావించుకున్నాడు, చూసాడు అనడానికి భద్రాచలంలోనీ శ్రీరాముని దివ్యక్షేత్రం నిదర్శనం._*
*_తల్లితండ్రి సేవలో నిమఘ్నమైన మహాభక్తుడు పుండరీకుడు సాక్షత్తు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా పిలిస్తే నేను నా తల్లితండ్రి సేవలో ఉన్నా ఇదిగో ఈ ఇటుకపై నిలిచుండు మంటు ఇటుకను విసరగా ఆ ఇటుకపై శిలగా మారి "పాండురంగడుగా" విఠలేశ్వరుడిగా పూజలందుకుంటున్న క్షేత్రం మహారాష్ట్రలోని పుండరీక క్షేత్రం ఇప్పటికి సాక్షిభూతము.*
*_ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే... ఇలా ఎందరో మహాభక్తులు, ఋషులు, మునులు భగవంతుణ్ణి తనివితీరా చూసారు, ప్రసన్నం చేసుకున్నారు పరమాత్మలో నీలమైనారు.🙏*
No comments:
Post a Comment