Monday 7 June 2021


ఎవరీ ముల్లర్..?? కయ్లా ముల్లర్ అమెరికన్ యువతి.


అల్ బగ్దాదీ నాల్గవ భార్య (కయ్లా ముల్లర్ మతం స్వీకరించలేదు, బగ్దాదీ కి ఉన్న సెక్స్ బానిసల్లో ఇష్టమయినది)
బగ్దాదీ కి ముగ్గురు భార్యలు, ముగ్గురు మగ పిల్లలు.
వీళ్ళు కాకుండా ముగ్గురి భార్యలకి వేరే వాళ్ళ వల్ల కలిగిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. బాగ్దాదీ కి నమ్మకస్తుడు అయిన బాడీగార్డ్ 'మూసా' ఈ మూసా బాగ్దాదీ అల్లుడు కూడా.
2013 ISIS చాల పీక్ స్టేజ్ లో వున్నప్పుడు, అటు ఇరాక్ ఇటు సిరియా టర్కీ సరిహద్దు ప్రాంతాలని తన గుప్పిట్లో పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
ISIS అధీనంలోకి వచ్చిన ప్రాంతం మొత్తం గ్రేట్ బ్రిటన్ భూ భాగంతో సమానం. ఈ క్రమంలోనే అప్పట్లో సిరియన్ సివిల్ వార్ లో భాగంగా నష్టపోయిన వారి సహాయార్ధం యూరోపు, అమెరికా నుండి కొన్ని NGO, డాక్టర్స్, నర్స్ లు కొంతమంది పేయిడ్ వర్కర్స్ సిరియాలో స్వచ్చందంగా పనిచేస్తున్నారు.
వీళ్ళలో కొంతమంది తమ స్వంత డబ్బుతో సహాయం చేయడానికి వచ్చారు. వీళ్ళలో కొంతమందిని ISIS కిడ్నాప్ చేసింది. డబ్బు డిమాండ్ చేసి మిలియన్ల కొద్దీ వసూలు చేసి విడిచిపెట్టింది. డబ్బు ఇవ్వని వారిని క్రూరంగా హింసించి చంపింది. వీళ్ళలో ఆడవాళ్ళు ఉంటె వారిని సెక్స్ బానిసలుగా మార్చింది. వీళ్ళ కిడ్నాప్ చెరలో పడి మరణించిన వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. టర్కీ కి పర్యాటకులుగా వచ్చిన వారిని కూడా ISIS కిడ్నాప్ చేసింది. ISIS డబ్బు ఇవ్వని , మతం మారని వారిని బహిరంగంగా గొంతు కోసి చంపింది. (అచ్చు ఈ మధ్యే హత్య చేయబడ్డ తివారి లాగన్నమాట).
పైగా ఆ దృశ్యాలని వీడియో తీసి న్యూస్ చానెల్స్ కి ఇచ్చేది. ముఖ్యంగా అల్ జజీరా కి ఈ దృశ్యాలని పంపెది.
ముల్లర్ చిన్నప్పటినుండి సేవాభావం కలిగినది. తనకి చేతనయిన సహాయం చేసేది ఆపదలో ఉన్నవారికి. (మన నోబెల్ మలాలా లా, హౌ డేర్ యు గ్లూటెన్ లా నటించడం రాదు ఈమెకు.)
ముల్లర్ తన గ్రాడ్యుయేషన్ తరువాత భారత్ వచ్చి బృందావన్ లో సహాయుకురాలిగా పనిచేసింది అలాగే పాలస్తీనా, ఇజ్రాయెల్ లలో కూడా. 2012 లో అంతర్యుద్ధం కారణంగా సిరియా నుండి ప్రజలు పక్క దేశాలకి వలస వెళ్ళడం ఉధృతం గా ఉన్న సందర్భంలో అక్కడ డాక్టర్లకి సహాయకరంగా ఉండడానికి ముల్లర్ సిరియా వెళ్ళింది.
అది సిరియానా, టర్కీ నా అని సరిహద్దులు చూసేది కాదు. ఎక్కడ అవసరం ఉంటె అక్కడికి వెళ్లి సేవ చేసేది. 2013 లో సిరియాలోని అలెప్పో పట్టణానికి వెళ్ళింది తన ఫ్రెండ్ ఒమర్ ఖలీఫ్ (ఒమర్ ఖలీఫ్ ఒక కంట్రాక్టర్) తో కలిసి. ఒమర్ ఖలీఫ్ అలెప్పో లోని ఓ హాస్పిటల్ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. అయితే అది ఒక అనధికారిక కాంట్రాక్ట్ అవడంతో హాస్పిటల్ యాజమాన్యం ఇక్కడ ఉండడం క్షేమకరం కాదని (అప్పటికే అలెప్పో ISIS అధీనంలో ఉంది) అర్ధరాత్రి ఒక కారు ఇచ్చి అందులో వెనక్కి పంపేసింది.
అయితే ముల్లర్, ఒమర్ ప్రయాణిస్తున్న కారు అలెప్పో బోర్డర్ దగ్గర ISIS తీవ్రవాదులు ఆపేశారు. ఒమర్ ఖలీఫ్ ముల్లర్ తన భార్య అని అబద్ధం చెప్పాడు తప్పించుకోవడానికి కానీ తీవ్రవాదులు ఊరుకోకుండా ముల్లర్ ని అడిగారు నువ్వు ఒమర్ భార్యవేనా అని. ముల్లర్ నిజం చెప్పింది తానూ ఒమర్ భార్యని కాదు అనీ అతను తన స్నేహితుడు మాత్రమె అని.
ఇదే ముల్లర్ ని నరకానికి తీసుకెళ్ళింది.
ISIS ముల్లర్ ని తీసుకెళ్ళి బానిసలు అమ్మే మార్కెట్ లో అమ్మకానికి పెట్టింది. ISIS లోని ఒక కమాండర్ ముల్లర్ ని కొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక రోజు ఈ కమాండర్ బాస్ ఇంటికి వచ్చి ముల్లర్ ని చూసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు (ముల్లర్ ఇష్టం లేకుండా). ఇంటికి తీసుకెళ్ళి రేప్ చేశాడు. తను తప్పించుకోవాలని చూస్తె వాళ్ళలాగే నిన్నూ ఇలాగే చంపేస్తాను అంటూ, బందీలని గొంతు కోసి చంపడం వాటిని వీడియో తీసి ముల్లర్ కి చూపేవాడు.
ముల్లర్ కి హిజబ్ వేసి మత బోధనలు చేయడానికి బాగ్దాదీ దగ్గరికి తీసుకెళ్ళాడు. బాగ్దాదీ తెల్లగా బొద్దుగా ఉన్న ముల్లర్ ని చూసి ఇష్టపడ్డాడు, ఇక ఇష్ట పడితే బలవంతపు పెళ్లి, ఆమెకు బలవంతపు నరకం. ఇక స్వర్గానికి వెళ్ళాలంటే మతం మారమని ఒత్తిడి చేశాడు కానీ ముల్లర్ ఒప్పుకోలేదు. హింసించాడు బాగా, గోళ్ళు బలవంతంగా పీకేసాడు, కర్రతో బాగా కొట్టాడు ఎముకలు విరిగిపోయెంతగా. ముల్లర్ ఒప్పుకోలేదు.
బాగ్దాదీ ముగ్గురు భార్యలు చాల చాల హింస ప్రవృత్తి కలవారు కావడంతో బాగ్దాదీ ముల్లర్ ని తన నమ్మకస్తుడు అయిన కమాండర్ అబూ సయఫ్ఫ్ అతని భార్య ఉమ్మా సయ్ఫఫ్ దగ్గర ఉంచాడు. సయ్యద్ సయఫ్ఫ్ యాజ్డీ తెగకి చెందిన 10 నుండి 12 ఏళ్ళ బాలికలను, బాగ్దాదీ సెక్స్ కోసం తెచ్చేవాడు. వాళ్ళని తన ఇంట్లోనే బందీలుగా ఉంచి భోజనం పెట్టకుండా హింసించి నీరసపడేట్లు చేసి బాగ్దాదీ కి అప్పచేప్పేవాడు.
ఓ సారి అబూ సయ్యాఫ్ 15 మంది యజ్డీ బాలికలని తీసుకొచ్చాడు తన ఇంటికి. అక్కడే ఉన్న ముల్లర్ వాళ్ళతో స్నేహం చేసి ధైర్యం చెప్పేది. ముల్లర్ కి అరబిక్ భాష వచ్చు. రెండు సార్లు తప్పించుకొనే అవకాశం వచ్చినా తను అక్కడే ఉండిపోయి యజ్డీ బాలికలని తప్పించింది. ఎందుకంటే తను కనపడకపోతే బాగ్దాదీ తన కోసం తీవ్రవాదులని వెదకడానికి పంపిస్తాడని ఆ క్రమంలో యజ్డీ బాలికలని చంపెస్తారనీ కాబట్టి నా ప్రాణం పోయినా ఫరవాలేదు మీరు సురక్షితంగా ఉండండి అని ఎందరో అమాయక యజ్డీ బాలికలకి చెప్పి తప్పించేది ముల్లర్.
తరువాతి కాలంలో తప్పించుకున్న యాజ్డీ బాలికలు మీడియా ముందు ఈ విషయాలు బయటపెట్టారు. తరువాత అమెరికన్ దళాలు అబూ సయఫ్ఫ్ ని పట్టుకొని ఇంటరాగేట్ చేసి చంపేశారు. అబూ భార్య ఉమ్మా ఇంకా అమెరికా కస్టడీ లోనే ఉంది. ఉమ్మా సయఫ్ఫ్ యాజ్డీ బాలికలు ఇచ్చిన సమాచారం నిజమే అని ఒప్పుకున్నది. కానీ ముల్లర్ ని మాత్రం కాపాడలేక పోయారు.
ముల్లర్ తల్లి తండ్రులు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ని కలిసి ISIS తో సంప్రదింపులు జరిపి తమ కుమార్తె ని విడిపించమని వేడుకున్నారు. ఒబామా ISIS తో మాట్లాడడానికి ఒప్పుకోలేదు సరికదా రెస్క్యూ టీం ని పంపి ముల్లర్ ని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. ముల్లర్ పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి అనుమతి కోరగా ఒబామా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ముల్లర్ తల్లి తండ్రులు బాధపడ్డారు.
రెండు సంవత్సరాలు ISIS చెరలో బందీగా ఉండి నరకయాతన అనుభవించిన ముల్లర్ ని కాపడానికి ఎవరూ ప్రయతించలేదు. 2015 లో ISIS ఒక ప్రతిపాదన చేసింది. దాని సారాంశం ఏమిటంటే అమరికా జైలులో ఉన్న తమ సహచరి Aafia Siddiqui ని వదిలిపెడితే బదులుగా ముల్లర్ ని వదిలిపెదతాము అని. Aafia Siddiqui ఒక న్యూరో సర్జన్. FBI మీద బాంబు దాడి చేయబోయి పట్టుబడి 86 ఏళ్ళ శిక్ష పడి అమెరికాలోని జైలులో ఉన్నది. చాలా క్రూర స్వభావం కలది. అయితే బరాక్ ఒబామా ఇందుకు ఒప్పుకోలేదు కాగా ముల్లర్ కూడా ఒక తీవ్రవాదిని తనకోసం విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు.
ఫలితం.? ISIS ముల్లర్ ని కిరాతకంగా చంపేసింది.
ఇప్పుడు ముల్లర్ తల్లి తండ్రులు సంతోషంగా ఉన్నారు తమ కూతురిని చంపిన బాగ్దాదీ ముక్కలు ముక్కలుగా చావడం. ఇంకా ముల్లర్ తల్లి తండ్రులు ఏమన్నారు అంటే ట్రంఫ్ లాగా దృఢమయిన నిర్ణయం ఒబామా కనుక తీసుకొని ఉంటె తమ కూతురు బతికి ఉండేది అని. ఇప్పటికైనా అర్ధం అయ్యిందా కొంతమంది ట్రంప్ ను ఎందుకు ఇష్ట పడరో అనేది..??
The Pentagon named its mission to kill ISIS leader Abu Bakr al-Baghdadi for one of his American victims #

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...