Saturday, 16 August 2025

 దేశం కోసం పంచ పరివర్తన 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

స్వాతంత్ర్య దినోత్సవం రోజు వీరులకు వందనం చెప్పి వదిలేయడం కాకుండా..

దేశం మళ్ళీ బానిసత్వంలోకి వెళ్లకుండా చేయడానికి ప్రతి రోజు  వీరుడిలా అనగా దేశభక్తుడిలా దేశం కోసం పని చేయాలి..


దాని కోసం పంచపరివర్తన అనగా 5 విషయాల్లో మార్పు తీసుకొని రావాలి..

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

1) కుటుంబం :-

మన పూర్వీకులు.. ఎందరో ముస్లిం దురక్రమణ దారులు వేసిన జిజియా పన్నును భరించి మరీ మనకు సనాతన ధర్మంను  అందించారు..

ముస్లిం దురక్రమణ దారులు  ఎన్ని కష్టాలు పెట్టినా కూడా మతం మారకుండా హిందువుగా నిలబడ్డ మన పూర్వీకుల గొప్పదనం తెలుసుకొని..

 హిందూ సంప్రదాయాలను, వేశధారణను, భాషను కుటుంబంలో పాటించాలి..


మన ఇంట్లో ప్రతి ఆడపిల్ల.. భారత మాతకు ప్రతి రూపం అయితే.. 

 లవ్ జిహాద్ రూపంలో భరతమాతను కబలించబోతున్న.. ద్రోహుల బారి నుండి భారత మాతను అనగా మన ఇంటి ఆడపిల్లను కాపాడుకోవడమే కుటుంబపరంగా దేశం కోసం రావాల్సిన మొదటి పరివర్తన

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

2. సమరసత :-

మన దేశ సంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించే సమాజం నిర్మాణం కోసం కృషి చేసి.. అలాంటి వారి మధ్య ఐకమత్యం తీసుకొని రావాలి..

 2025 లో కూడా మన మధ్య కుల చిచ్చు పెట్టే దుర్మార్గులు ఉన్నారంటే.. దానికి కారణం కేవలం మనలో సమరసత లేకపోవడమే ..

కాబట్టి కుల ప్రస్తావన లేని స్వయం సేవకులుగా దేశం కోసం పని చేయడానికి సిద్ధంగా ఉండే సమాజ సమరసత కోసం ప్రతి రోజు కృషి చేయడం రెండవ పరివర్తన 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

3) స్వదేశీ :-

బ్రిటిష్ బానిసత్వం నుండి మన దేశంకు స్వాతంత్య్రం తేవడానికి ఎందరో వీరులు ప్రాణత్యాగం చేశారు.. బ్రిటిష్ వారిని వెళ్లగొట్టడానికి 1905 లోనే వందేమాతరం అంటూ స్వదేశీ వస్తువులు వాడాలని దేశ నాయకులు పిలుపునిస్తే..

 2025 లో కూడా మనం విదేశీ వ్యామోహంలో విదేశీ వస్తువులే వాడితే .. అంత కన్నా దేశ ద్రోహం ఏముంటుంది?

 ఉదయం వాడే కోల్గేట్ టూత్ పేస్ట్ నుండి డైరీ మిల్క్, బ్రిటనియా అంటూ తినే చాక్లెట్, బిస్కెట్ ల వరకు విదేశీ వస్తువులు వాడడం దేశానికి చేసే పెద్ద ద్రోహం..


 1945 లో రెండు అణుబాంబు దెబ్బలు తిన్న జపాన్ మళ్ళీ అభివృద్ధి చెందడానికి కారణం స్వదేశీ వస్తువులే వాడాలనే దృఢమైన దేశభక్తి కల్గిన పౌరులే..

మన దేశ పౌరుల్లో స్వదేశీ వస్తువులు వాడే దేశ భక్తి రావడం మూడవ పరివర్తన 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

4) పర్యావరణం:- 

ప్రకృతిని ఆరాధించడం మన సనాతన ధర్మం..

 తులసి చెట్టు, ఉసిరి చెట్టు,రావి చెట్టు,నేరేడు చెట్టు అంటూ చెట్లకు పూజ చేయడం మన సంప్రదాయం..

 21 రకాల ఆయుర్వేద పత్రాలతో, పుష్పాలతో మట్టి గణపతిని పూజించి నీటిలో నిమజ్జనం చేయడం మన పండుగ...

మన సంప్రదాయాలు, పండుగలు.. చెట్లను పెంచమని, నీటిని కలుషితం చేయవద్దని చెప్తుంటే. .

ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణంను పాడు చేయడం మంచిది కాదు..

అలాగే వాయు కాలుష్యంను తగ్గించి, వర్షంను కురిపించే యజ్ఞలను చేయమని భగవద్గీత చెప్తుంటే.. ఆ యజ్ఞం కొరకు కావాల్సిన నెయ్యిని ఇచ్చే గోవులను చంపుకు తినే వారిని వదిలేయడం పెద్ద దేశద్రోహం ..


పర్యావరణం అంటే మన దేశంలో భాగమే కాబట్టి.. పర్యావరణం కోసం చెట్లను పెంచడం.. గోవులను కాపాడడం.. రావాల్సిన నాల్గవ పరివర్తన 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

5) పౌర విధులు:- 

మన దేశ రాజ్యాంగం ప్రకారం మనకు ఇచ్చిన హక్కులను అనుభవిస్తున్న మనం.. మన విధులు కూడా సక్రమంగా నిర్వహించాలి..

 జాతీయ గీతం ఆలపిస్తునపుడు ఆగి నిలబడడం ..

 దేశంకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి మాటలను ఖండించడం ..

 దేశం నాకు ఏమి ఇచ్చింది అనే భావన వదిలి.. దేశం కోసం నేను ఏమి చేయగలను అనే సంకల్పంతో పౌర విధులు నిర్వహించడం రావాల్సిన ఐదవ పరివర్తన 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఎందరో వీరుల త్యాగ ఫలం.. మన నేటి స్వేచ్చకు మూలబలం..


ఆ వీరుల త్యాగాలను వృధా కానివ్వొద్దు అంటే.. 

 మనమంతా ఈ పంచపరివర్తన తీసుకొని.. నిత్యం దేశభక్తితో ఉండాలని కోరుకుంటూ ..

79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు





No comments:

Post a Comment

show image

 Sardar Patel He had come out of the mosque and attacked Sardar Patel. We were taught that Mahatma Gandhi was assassinated by Nathuram Godse...