కాశీ యాత్ర ఎలా చేయాలి...? కాశీలోని వింతలు, విశేషాలు ఏంటి ..?
కాశి లేదా వారాణసి
కాశిలో దిగుతూనే చేయవలసినవి చూడవలసినవి
కాశీ లో ప్రవేశించగానే ముందుగా కాశీ విశ్వేశ్వరుని తలచుకుని,
1.నమస్కరించుకుని కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి....!! తరువాత బస చేరుకున్న తరువాత ముందుగా
2.గంగా దర్శనం గంగా స్నానం...
3.కాలభైరవుని దర్శనం... కాలభైరవుని గుడి వెనకాల
4.దండపాణి గుడి దర్శనం...
5.డుంఠి గణపతి దర్శనం...
6.కాశీ విశ్వేశ్వరుని దర్శనం (ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.)కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది]...
7.అన్నపూర్ణ దర్శనం.. భాస్కరాచార్య ప్రతిష్ఠిత
8.శ్రీచక్ర లింగ దర్శనం... (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది)
.9.కాశీ విశాలాక్షి దర్శనం...
10.వారాహి మాత గుడి (ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది... లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు. లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు).
11.మణికర్ణికా ఘట్టంలో స్నానం.(వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి)
12.గంగా హారతి - దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు)...
13.కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం..
.14.చింతామణి గణపతి దర్శనం...
15.అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ లోలార్కఈశ్వరుని దర్శనం...
16.దుర్గా మందిరము...
17.గవ్వలమ్మ గుడి...
18.తులసీ మానస మందిరము...
19.సంకట మోచన హనుమాన్ మందిరం....
20.తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం....
21.తిలాభాండేశ్వర దర్శనం వీలైతే
22.సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం - ఇది కొంత దూరంగా ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.
23.గంగా నదీ ఘట్టాల దర్శనం... - అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు...
24.ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి. ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు. గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి.... లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు....
25.బిందు మాధవుని గుడి - ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది....
26.ఓంకాళేశ్వర దర్శనం - మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా Left side రోడ్ లో వెళ్ళాలి. రిక్షా అయితే మంచిది. ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు మకారేశ్వరుడు చిన్నగా ఉంటాయి కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు.
27.కృత్తివాసేశ్వర లింగం - ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలాల లోను చల్లగా ఉంటుంది. స్వయంభూ లింగం. కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే
28.మహా మృత్యుమ్జయ లింగం దర్షించుకోవాలి...
29.బనారస్ హిందూ విశ్వవిద్యాలయం + అక్కడి నూతన
30.విశ్వనాథ, దుర్గా లక్ష్మి నారాయణ గుడి సముదాయం
వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు
31.విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున...
32.దశాశ్వమేధ ఘాట్ వద్ద మo గళేశ్వరుడు -..
33.శంక్తా ఘాట్ ఆత్మ విశ్వేశ్వరుడు -
34.శంక్తా ఘాట్ కుక్కుటేశ్వరుడు -
35.దుర్గా కుండ్ త్రి పరమేశ్వరుడు -
36.దుర్గా కుండ్ కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
37.ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
38. అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
39.ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
40.ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
41.పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
42.హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
43.వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
44.కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
45.నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
46.ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
47.కాశేశ్వరుడు - త్రిలోచన్ శ్రీ మహా మృత్యుంజయుడు -
48.మైదాగిన్ శుక్రేశ్వరుడు - కాళికా గలీ
వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.
ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు. స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది. ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు
ముల్లోకాలు నాకు నివాసమే. అందులో కాశీ క్షేత్రం నా మందిరం
వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు
48. విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
కాశీ లో ఉన్న..ఈ తిలభాండేశ్వరుడు ఒక సజీవ లింగం. ప్రతిరోజూ ఒక తిల (నువ్వు గింజ) పరిమాణం పెరుగుతూ ఉంటాడట. అందుకే ఈ లింగం చాలా పెద్దగా ఉంటుంది.
49.మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
50.ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్ కుక్కుటేశ్వరుడు-
51.దుర్గా కుండ్ త్రి పరమేశ్వరుడు -
52.దుర్గా కుండ్ కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
53.ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
54.అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
55.ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
56.ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
57.పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
58.హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
59.వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
60.కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
61.నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
62.ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
63.కాశేశ్వరుడు - త్రిలోచన్
64.శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
65.శుక్రేశ్వరుడు - కాళికా గలీ
వారాహీ దేవి
వారాహీ దేవి ఆలయం వుంది. ఈవిడిని చూడలంటే ఉదయం 7 గం. లోపే వెళ్ళాలి. ఈవిడ విగ్రహం భూగృహం (సెల్లార్) లో వుంటుంది. నేలపై వున్న గ్రిల్ లోనుంచి చూడాల్సిందే. ఈవిడ గ్రామదేవత. ఉగ్రదేవత. ఎప్పుడూ చాలా వేడిగా వుంటుంది. అందుకే దర్శనం ఉదయం 7 గం. లలోపే.
భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రం చాలా పెద్దది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ భూగృహంలో ప్రవేశం లేదు. ఉదయం 7 గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్ళనీరు. పై భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం. అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలం.
వారాహిదేవి ఉగ్రదేవతే కానీ, గ్రామ దేవత కాదు. అష్టమాతృకా దేవతలలో ఒకటి.
వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిద కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక (దాదాపు 23,000) ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం మరియు దుర్గా మందిరం ( ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది).
అన్నపూర్ణామందిరం
కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం.
66.శాంక్తా మందిరం
సింధియా ఘాట్ వద్ద శాంక్త మందిరం ఉంది. శాంక్తామందిరంలో పెద్ద సింహంశిల ఉంది. అలాగే ఈ ఆలయంలో 67.నగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి.
దుర్గా మందిరం
వారణాశిలో రెండు దుర్గామందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గామందిరం ఒకటి. 68. రెండవది "కోతుల గుడి" గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత " నాగర"శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు
సంకట మోచన్ హనుమాన్ మందిరం, తులసీ మానస మందిరం, 69.భారతమాత ఆలయం, 70.బిర్లా మందిరం , 71.కాలభైరవ మందిరం, 72.కవళీ మాత మందిరం తప్పక దర్శించవాల్సినవి .
గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.
గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.
కాశీ ఈ పేరు పలికితే చాలు శరీరం లో మనకు తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతతా , ఆధ్యాత్మిక భావం కలుగుతుంది . ఆ ముక్కంటి దర్శనం మానసికంగా చేస్తాము . అన్ని బంధాలను వదలి ఈశ్వర నివే దిక్కు , పుట్టినప్పటి నుంచి పెరిగి ఇంతటి వాడినైతి రోజురోజుకి ఏవేవో కోరికలు సంసార పరమైన బాధ్యతలు .. ఒకటి తీరితే మరోకటి ఆపైన ఇంకోటి అవసరాలు పుడుతూనే ఉన్నాయ్ . ఎక్కడని ఆపాను , నా తరమా స్వామి నీవే దిక్కు ఈ శరీరం కట్టిలో కాల్చబడి మట్టిలో కలిసిపోక ముందే, మనసారా.. నా కళ్ళార నీ దర్శన భాగ్యం ప్రసాదించవయ్య ఈశ్వర , నా తండ్రి శివ వస్తున్నాను నీ పైనే భారం వేసి బయలుదేరుతున్నా తండ్రి తండ్రి అనుకుంటూ పూర్వపు రోజుల్లో కాశీ యాత్ర చేసేవారు .
ఆ రోజుల్లో కాశి యాత్ర అంటే కాటికి వెళ్ళడమే . రవాణ సౌకర్యాలు ఏమి లేని ఆ రోజుల్లో భగవంతునిపై భారం వేసి వెళ్ళేవారు .
కాశీ పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం . సాక్షాత్తు కైలాసవాసి స్వయంగా వారణాశి లో కోలువై యున్నాడు . వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం కలదు. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" అని మనవాళ్ళు నమ్ముతారు . మరణించిన వార్కి పరమశివుడే తారక మంత్రం చెప్తున్నాడు అని శ్రీ రామకృష్ణ పరమహంస ధ్యానం లోంచి చూసి మరీ చెప్పారు .
కాశీ క్షేత్రం లో ఉన్న విశ్వేశ్వర లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి . కాశీ లో గంగ స్నానం కాశీ యాత్ర లో ముఖ్యమైనది . శివుని తలను తాకిన శివగంగ ఇక్కడ ఉత్తరముఖంగా పయనిస్తుంది . కాశీ క్షేత్రం ఎప్పుడు భక్తులతో కిటకిట లాడుతూ నిత్యం శివః నమః తో మరోమోగుతుంది .
గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి
వారణాశిలోని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో షుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి.
ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పనచగంగ ఘట్టం మరియు ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి.
అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.
అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం
"కాశి, కాంచి, మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి" లు సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.
కాశి, ఆయోధ్య మరియు మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి.
ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.
మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది.
ఆవంతిక (ఉజ్జయిని) మోక్షపురి మధ్య ఫ్రదేశ్ రాష్ట్రం లో ఉంది.
కాంచి మోక్షపురి తమిళనాడు రాష్ట్రం లో ఉంది.
కాశి,మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి మోక్షపురులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.
కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది.
దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం.
వారణాసి కాశీ వైభవం.!
కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు.
సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:
కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం.
ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది.
కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి,
సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని.
ప్రపంచ సాంస్కృతిక నగరం.స్వయంగా శివుడు నివాసముండె నగరం.
ప్రళయ కాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.
కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి,
కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.
పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.
కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు.
కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.
కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....
డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు
విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...
కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి
దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.
కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.
కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.
అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.
మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.
గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది
ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.
శివుని కాశీలోని కొన్ని వింతలు.
కాశీలో గ్రద్దలు ఎగరవు,
గోవులు పొడవవు,
బల్లులు అరవవు,
శవాలు వాసన పట్టవు,
కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.
కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.
కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని
విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ
పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.
అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీ లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.
అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?
అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు
అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.
కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు .
కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి
పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.
కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది;
పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.
విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.
ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి
నివాస స్థలం కాశి.
ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన
అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.
కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.
పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.
కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.
విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో
అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.
నేటికీ విశ్వనాథ మందిరంలో నంది,
మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది.
అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.
ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు.
కాశీ స్మరణం మోక్షకారకం..కాశీ..కాశీ..కాశీ..కాశీ..కాశీ...!!
స్వస్తి..!!💐
ఓం నమః శివాయ..!!🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!!🙏
సర్వే జనా సుఖినోభవంతు..!శుభమస్తు.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment