Saturday 25 November 2023

 🙏🚩RSS  ఈ దేశానికి, సమాజానికి ఎం చేసింది, ఎం చేస్తుంది అని విమర్శించే వారికి  నేను చెప్పే జవాబు ఇదే...

దేశ విభజన సమయంలో హిందువుల పై జరిగిన దాడుల్లో నుండి,, ఈ దేశం పై 1962 లో చైనా దాడి చేసిన సమయంలో, యుద్ధంలో గాయ పడ్డ సైనికులకు కావాల్సిన  రక్తం ఇవ్వడం నుండి  మొదలుకొని, ఈ దేశంలో జరిగే ప్రకృతి విపత్తు ల నుండి మొన్నటి  కరోనా సమయం లో  స్వయం సేవకులు చేసిన సేవలు ఎన్నో....


 అందులో,, నేను పాల్గొన్న అతి ముఖ్యమైన సేవా కార్యక్రమం 👍🚩


అది దివిసీమ ఉప్పెన,,,1977 నవంబర్ 3 వ వారంలో  భారత్ తూర్పు  కోస్తా మొత్తం  ఉప్పెన (సునామీ) వచ్చింది.


వేంటనే  ( సంఘం ) Rss సేవ కార్యక్రమాలు ప్రారంభించారు,, నల్లగొండ సంఘ్ పెద్దల సూచనతో, ఒక  లారీ నిండా సరుకులు తీసుకోని  నాతో   పాటు నల్గొండ పట్టణం నుండి , నేను పుట్టా పురుషోత్తం రెడ్డి,, జలగం సుదర్శన్ రావు, మిర్యాల సత్యనారాయణ  ఇలా ఓ 10 మందిమీ స్వయంసేవకులం వెళ్లి   అవనిగడ్డ తాలుకా  నాగాయలంక సమీపంలోని  హంసలదీవి ప్రాంతం లో చేసిన పనులు....


రోజు 100 పైగా   మనుషుల శవాల్ని       జంతువుల  శవాల్ని దహనం చేస్తు గ్రామాలు  శుభ్రం చేస్తూ, ఇలా ఓ పదిహేను రోజుల దాకా సాగింది ,


మాకు నాయకులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, మేం  ఏదో అత్యవసర  సరుకులు ఇచ్చి వద్దాం అని వెళ్ళాము , కానీ అక్కడ పరిస్థితి చూసాక రాలేక పోయాము ,


 కొంతమంది ఒక నెల రోజుల్లో వెళ్లి పోయారు, నేను మూడు నెలలు ఉన్నాను, పురుషోత్తం రెడ్డి, జలగం  సుదర్శన్ రావు  ఒక సంవత్సరం ఉండి వచ్చారు..


తర్వాత  దీన్ దయాళ్ పురం అనే పేరుతో 100 పైగా  గృహలతో     అన్ని మౌలిక వసతులు    గుడి    బడి   చెరువు  నిర్మాణం చేసినారు ...


మేము ఉన్న సమయం లో  శ్రీ నానాజి దేశ్ ముఖ్ గారు  ఆ ప్రాంతాని వచ్చి శంకుస్థాపన చేశారు.


RSS గురించి తెలియకుండా నే, తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండానే సంఘ్ నీ విమర్శించే వారికి ఇది  అంకితం.


భారత్ మాతాకీ జై 🙏🚩

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...