Wednesday, 8 November 2023

బౌద్ధారామాలు వైదిక ఆలయాలు అయ్యాయా?

-------------‌---------

సనాతనంపై దాడి చేసే ప్రయత్నంలో భాగంగా

"బౌద్ధారామాలు వైదిక ఆలయాలు అయ్యాయి" అంటూ కొందరు విద్వేషవాదులు, మూర్ఖులు ధూర్తులు, వికృత పేలాపన చేస్తున్నారు.

'నేరస్థులు ఎక్కడో తప్పు చేసి దొరికిపోతారు' అన్నట్టుగా  'ఆలయం అంటే ఏమిటి?', 'ఏది ఆలయం అవుతుంది' అన్న జ్ఞానం లేకపోవడంవల్ల బౌద్ధారామాలు వైదిక ఆలయాలు అయ్యాయి" అని రచ్చ చేస్తున్నవాళ్లు దోషులుగా దొరికిపోతున్నారు.

వైదిక ఆలయాల నిర్మాణం, నిర్వహణ ఆగమ విధులకు అనుగుణంగా ఉంటాయి. ఆగమాలు తంత్రంలో భాగం. ఈ ఆగమాల్లో శైవ, శాక్త, వైష్ణవ ఆగమాలు అని ఉంటాయి. వాటిల్లోనూ విభాగాలుంటాయి. ఆలయాల విధులు, విధానాలు ఆ యా దేవతలను బట్టి ఆగమశాస్త్రాను గుణంగా వేర్వేరుగా ఉంటాయి. 

వైదిక ఆలయాలు ఏదో ఒక చిత్రాన్నో, బొమ్మనో పెట్టి పైకప్పు, నాలుగు గోడలు, తలుపులతో కట్టే మామూలు నిర్మాణాలు కావు. వైదిక ఆలయాలు prayer halls మాత్రమే కావు.

ఒక దేవతాలయంలో ఆ దేవతకు మాత్రమే వర్తించే ప్రత్యేకమైన ప్రతిష్ఠ, యంత్రం, మంత్రం, పూజా విధానాలు ఉంటాయి.  దేవతా విగ్రహం దగ్గర నుంచి ఆగమ విధానం అమలులో ఉంటుంది. ఆగమ శాస్త్రం ప్రకారం ఏ బౌద్ధారామాన్నో ఆలయం చెయ్యడం కుదరదు. ఉన్న బుద్ధ విగ్రహాన్ని తొలగించి ఆ ప్రదేశంలో మరో దేవతా విగ్రహాన్ని పెట్టి ఆలయం చేసేయ్యడమో, బుద్ధుడి విగ్రహాన్ని సూర్యుడు, విష్ణువు వంటి దేవతా విగ్రహాలుగా పరిగణించడమో, వాటికి అర్చన, కైంకర్యాలు చెయ్యడమో ఆగమ విధానం అవదు. ఆగమబద్ధం కానిది ఆలయం అవదు.

CE 1,2 శతాబ్దుల్లో బుద్ధుడికి విగ్రహం రూపొందింది. బౌద్ధ సాహిత్యం కూడా అప్పుడే రూపొందింది. అంతకు ముందే వైదిక ఆలయాలు ఉన్నాయి (క్రితం వ్యాసాల్లో ఈ సత్యాన్ని సోదాహరణంగా, సాధికారికంగా తెలియజేశాను). బుద్దుడు, బౌద్ధానికి ముందే  పరిగణననీయమైన, ప్రశస్తమైన ఆలయాలు ఉన్నాయి అంటే అప్పటికే ఆగమ విధానం ఉంది అని తెలుసుకోవచ్చు.  ఆగమాలు సామాన్య శకం 6వ శతాబ్దివి అని కొందరు అనడం బౌద్ధ ఆగమాల విషయం అని గ్రహించాల్సి ఉంటుంది. 

బుద్ధుడు BCE 5వ శతాబ్దిలో మరణించడం జరిగితే అప్పటి బుద్ధుణ్ణి చూసినవాళ్లు CE 1,2 శతాబ్దుల వరకూ బతికి ఉండరు. CE 1,2 శతాబ్దుల్లో జరిగిన బుద్ధుడి విగ్రహ రూపకల్పన ఊహా జనితమే. తొలి బుద్ధుడి విగ్రహం అంతకు ముందే దేవతా విగ్రహం ఆధారంగా ఉండి ఉంటుంది. అప్పటి వైదిక దేవతలు విష్ణువు, సూర్యుడి విగ్రహాల ఆధారంగా బుద్ధుడి విగ్రహం రూపొంది ఉండచ్చు. విష్ణువు శయన భంగిమలో ఉన్న విగ్రహాలు BCE 300కే ఉన్నాయి.(ఇంతకు ముందు ఆధారాలతో ఈ విషయాన్ని తెలియజేశాను) అవే బుద్ధుడు శయన స్థితిలో ఉన్న విగ్రహాలకు ఆధారం. బుద్ధుడికి ప్రచారం రావడం కోసం ప్రజలకు పరిచయమైన అప్పటి విష్ణువు, సూర్యుడి శిల్పాలను పోలి ఉండే బుద్ధ శిల్పాల్ని రూపొందించి ప్రజల ముందుకు తెచ్చారని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

బౌద్ధ స్థూపాల ప్రదేశాల్లో ఆలయాలు నిర్మించబడ్డాయని కొందరు పిచ్చి పేలాపన చేస్తున్నారు. బుద్దుడి అవశేషాలపై నిర్మితమైన కట్టడాలు బౌద్ధ స్థూపాలు. అవశేషాలకు మైల ఉంటుంది వైదికంలో. అలాంటి అవశేషాలపై ఆలయ నిర్మాణం వైదిక ప్రమాణాల ప్రకారం సరైంది కాదు కాబట్టి బౌద్ధ స్థూపాల్ని కూల్చడం, ఆపై ఆలయం కట్టడం అనేది ఉండదు.

"బౌద్ధారామాలు వైదిక ఆలయాలు అయ్యాయి" అని అరుస్తూ ఆగం చెయ్యడం పొట్టకూటి కోసమూ, రక్తపు కూటి కోసమూ చేసే నికృష్టపు ప్రయత్నమే. 

క్షేత్ర వాస్తవాల అధ్యయనం లేకుండా, కావలసిన చదువు లేకుండా, ఇంగితం లేకుండా విద్వేషంతో, లోపాయకారీ కారణాలతో వైదికతపై, సమాజంపై, దేశంపై కాటు వేసేందుకు బుద్ధుడు, బౌద్ధం పేరు మీద విష నాగులు ప్రయత్నిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త.


రోచిష్మాన్

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...