Sunday, 1 October 2023

 లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి_ అక్టోబరు 2....._*

 


*_భరతజాతి జాతిమరువలేని మహాత్ముడు లాల్ లాల్దర్    

*_భారతదేశపు నిరాడంబర ప్రధానులలో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్ లోని మొఘల్ సరాయ్ గ్రామంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు ఎంతో దేశభక్తిగల ఆయన 1921లో సహాయ నిరాకరణోద్యమంలో అడుగుపెట్టారు. స్వాతంత్ర్య పోరాటంలో మొత్తం 9 సంవత్సరాలపాటు జైలులోనే గడిపారు. స్వాతంత్ర్యం అనంతరం ఉత్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా పనిచేసి ఆ తరువాత 1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితు లయ్యారు._*

*_కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తూ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత రవాణా మంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. 1964లో జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మిక మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిగారు ప్రధానమంత్రి అయ్యారు._*

*_దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉంటే గ్రీన్ రివల్యూషన్ కు బాటలు వేశారు. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కోసం రష్యా చేరిన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందంపైన 1966 జనవరి 10న సంతకాలు చేశారు. ఆ మర్నాడు 1966 జనవరి 11న గుండెపోటుతో తాష్కెంట్ లోనే ఆయన మరణించారు. 'జై జవాన్... జై కిసాన్ ' అన్న నినాదం ఆయనను సజీవంగా నిలిపింది._*

*_మరణానంతరం 1966లో భారత ప్రభుత్వం ఆయనకు 'భారతరత్న' ఇచ్చి గౌరవించుకుంది._*
🌺💐🌺 🪷🙏🪷 🌺💐🌺


No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...