Friday, 8 September 2023

భారతదేశంలో4.3%Brahmins వున్నారు అంతే. వీరిపైన ఇంత ద్వేషమా.



అసలు సమసమాజ నిర్మాణంలో స్వతంత్ర పోరాటంలో ఎక్కువ త్యాగాలు చేసి ఆస్తులు కోల్పోయి ఇప్పటికీ ఇన్ని తరాలైనా తేరుకోలేని కుటుంబాలన్నీ బ్రాహ్మణులవి.
మనువాదంలోనే స్త్రీల పట్ల అణగదొక్కాలి అన్న భావనలు ఉండటం కాదు అన్ని మతాలు స్త్రీల పట్ల ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి.
వాదనలోనైనా అది తప్పితే వేరేది చూపించలేకపోతున్నారు. అసలు సనాతన ధర్మాన్ని ఆచరించి చెప్పాలన్న రాజకీయ నాయకుల్లో బ్రాహ్మణులు లేరు. ఉన్నత పదవులలో లేరు. ఇండస్ట్రియల్ అధినేతలగా, మాఫియాలో లేరు, అత్యధిక ఆస్తులు కూడ పెట్టుకున్న ప్రతి 100 మందిలో ఒకరు లేరు, బడా బడా విద్యాసంస్థలు నడుపుతున్న వారిలో వీరు లేరు పెద్దపెద్ద ఆసుపత్రులు ఇంజనీరింగ్ కళాశాలలు మెడికల్ కళాశాలలు, అత్యంత విలాసమైన హోటల్ నిర్మాణాలలో వీరు లేరు. వీరు భూస్వాములు కారు, దేవుని మాన్యంలో ఒక బియ్యం బస్తా కోసం ఆశపడే వారు మాత్రమే *సినిమా రంగంలో ఆత్మహత్యలు చేసుకునే వారి లిస్టులో మాత్రం ఉంటారు* ఫార్మాసిటికల్ కంపెనీస్ నడుపుతున్న వారిలో లేరు. పెద్దపెద్ద స్టూడియోలు కట్టుకున్న వారి లిస్ట్ లో లేరు స్విస్ బ్యాంకులో అకౌంట్ లో ఉన్నవారు వీరిలో లేరు.
మరి ఎక్కడున్నారు? పూజారులుగా ఉపాధ్యాయులుగా, డాక్టర్లుగా ఇంజనీర్లుగా వివిధ రకాల వృత్తులలో సమాజ అభివృద్ధిలో భాగంగా ఉన్నారు. సంగీత సాహిత్య నాటక రంగాలలో ఉంటే ఉండండి వచ్చు
సనాతన ధర్మమనేది 4.3% వాళ్ళ ఆచరించేది కనుక అయితె దీని గురించి చర్చ ఎందుకు! మిగతా 85.7% ఇతర వర్గాలు ఆచరించకుండా ఉంటే సరిపోతుంది కదా దేశం ఎన్నో సమస్యలతో అట్టుడికి పోతుంటే ఇప్పుడు ఈ సమస్యను లేవనెత్తుకొని దానికి మళ్ళీ ఒక అగ్రవర్ణం అంటూ ప్రత్యక్షంగా బలి చేస్తూ ఉండటం ఎంతవరకు సమంజసం?
మామూలుగా ఉన్న వారిని గొప్ప గొప్ప నాయకులుగా మేధావులుగా తీర్చిదిద్దినది వారి వెనకాల ఉన్న బ్రాహ్మణ ఉపాధ్యాయులు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ‌ఒక వర్గం మీద ఇంత ద్వేషం పనికిరాదు. ఎవరి మీద ఉండకూడదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సమన్వయంగా ఆలోచించి యువతకు సన్మార్గాన్ని చూపించవలసినటువంటి నేతలే కక్షకట్టుకున్నట్టు ఉంటే దేశ భవిష్యత్తు ఎటువైపు వెళుతుంది

No comments:

Post a Comment

show image

  Sep 12 , 2025 " The Great Indian Warriors " Saragarhi Day September Twenty Sixth Trib...