మోడీ జీ...విదేశాలు సేఫే...అంతర్గత శత్రువులు ఎంతకైనా తెగిస్తారు....
బిపిన్ రావత్ మరణం యాధృచ్చికం కావచ్చు...మాకు తెలియదు...
ఒడిశా రైలు ప్రమాదం యాధృచ్చికం కావచ్చు...తెలిసీ తెలియనట్టు తెలుస్తోంది కారకులు ఎవరో...
మణిపూర్ మంటలకు నిప్పు ఎప్పటిదో అయి ఉండచ్చు...కానీ అవి ఇప్పుడే నింగికెగుస్తున్నాయి...
వ్యవసాయ చట్టాల ఉపసంహరణ కోసం...రోజులు తరబడి హైవే లు ఒక రెండు రాష్ట్రాల దళారులే నిర్బంధించారు..
అదీ మామూలే అనుకున్నాం...ఎక్కడో శంక ఉంది మాకు...
సీ ఏ ఏ వ్యతిరేకులు ఢిల్లీ దారి మూసేస్తే...ఇంత సులభమా రాజధాని ముట్టడి అనిపించినా...దారికి తెచ్చారులే అని సరిపెట్టుకున్నాం...
ఎర్రకోట పై ఖలిస్తాన్ జెండా...ఏదో ఉద్వేగం అనుకున్నాం...
కాదని తెలుస్తున్నా...
దేశమంతా కిరోసిన్ జల్లి ఉంది అని అతగాడు అంటే...ప్రతి పక్షపు వాచాలత అనుకున్నాం... ఏదో మతలబు ఉంది అని తెలుస్తున్నా...
హిడెన్ బర్గ్ లాంటి ఫేక్ రిపోర్టుల తో... లక్షకోట్ల భారత వ్యాపారాన్ని కుదిపెయ్యగలిగారంటే...వాణిజ్య స్పర్థ అని సరి పెట్టుకున్నా...ఏదో అలజడి...
జార్జ్ సోరోస్ లు.. ఒబామా లు ఫండింగ్ చేస్తున్నారంటే...
అది అల్లాటప్పా విషయం అయి ఉండదు...
మిమ్మల్ని అవమాన పరుస్తూ.. డీ ఫేం చేయడానికి మాత్రమే ఆ ఫండ్స్ ఖర్చు పెడుతున్నారని నమ్మలేక పోతున్నాం...
ఎందుకంటే...ఇక్కడ అంతర్గత శత్రవులకి ఆ డబ్బు అందుతోంది అంటే...
దాన్ని కేవలం ప్రజాస్వామ్య పద్ధతుల్లో మిమ్మల్ని దించడానికి..ఓపిగ్గా ఎదురు చూసేందుకు కాదేమో అనిపిస్తోంది...
ముఖ్యంగా... బైడేన్ తో సహా...అందరూ మీరు ప్రపంచ నాయకుడు..భారత్ లేకుంటే...మేము లేము అని కీర్తిస్తూ ఉంటే....
ఉక్రెయిన్ రష్యాలు కూడా మీ మాటకి విలువ ఇస్తూ ఉంటే...
తట్టుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉండే సహనం ఈ అంతః శత్రువులకు ఉంది అనిపించడం లేదు...
ప్రపంచం అంతా కుదేలు అయిపోయి... మాంద్యం అతలాకుతలం అయినా...భారత్ రేటింగులు పెరుగుతూ ఉంటే...
తట్టుకోగలిగే...నైతిక విలువలు ఉన్న వ్యక్తులు లా కనబడటం లేదు ఈ అంతః శత్రువులు...
అంతర్గత శత్రువుల దాడులతో....రష్యా అధ్యక్షుడు కూడా పరిగెడుతున్నాడంటే...ఆలోచించాలి కదా మోడీజీ...
మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళను గమనిస్తూ వస్తున్నాం...
కారణం లేని అతి కోపం వాళ్ళలో కనపడుతోంది...
తెలియని క్రోధం కసీ వాళ్ల వ్రాతల్లో మాటల్లో అర్థం అవుతోంది...
అది దేశం మీద శతృత్వం అని తెలుస్తోంది...
దానికి మిమ్మల్ని .....మిమ్మల్ని....
ఇంక మాటల్లో చెప్పలేము మోడీ జీ....
ఎడారి మతపు మామూలు మనిషి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటే...
ఒక సాధారణ పత్రికా విలేఖరి...ఒక చిన్న సోషల్ మీడియా యూట్యూబరూ...
ఒక చిన్న పార్టీ అధ్యక్షుడు కూడా మిమ్మల్ని అదిలిస్తూ ఉంటే...
ఇంకా మీరు నియంత అనీ..వాళ్ళని నిర్బంధించారనీ..వాక్ స్వేచ్ఛ లేదనీ అంటున్నారంటే...
ఏమో సార్...కర్ణాటక చూపించారు...మేమంతా ఒక్కటైతే...అంటూ...
రేపు దేశం అంతటా చూపిస్తారట...
కిరోసిన్ జల్లిన వాళ్లకి నిప్పు పెట్టడం ఎంత తేలికో తలచుకుంటే....భయం కలుగుతోంది...
ఏమో మోడీ జీ... మిమ్మల్ని కాపాడుకోవడానికి...అంటే దేశాన్ని రక్షించు కోవడానికి...
కేవలం ఓటు మాత్రమే కాకుండా...ఇంకా ఏం చెయ్యాలో చెప్పండి...
కాస్త మనసు కుదుట బడుతుంది...!
No comments:
Post a Comment