Monday 1 May 2023

 ఆయుర్వేదము

భారత దేశంలో,  భారతీయులకు, ఆయుర్వేదని ఎలా దూరం చేశారో తెలుసుకుందాము: 

భారతదేశాన్ని కబళించడానికి వచ్చిన విదేశీయులు క్రౌర్యం, క్రూరత్వంతో దేశాన్ని ఆక్రమించారు కానీ ప్రజల్ని గెలవలేకపోయారు. భారతీయుల దృఢత్వానికి ప్రధానమైంది మతం కనుక మతమార్పిడి ద్వారా హిందూ మతభ్రష్టులను చేయాలని చూశారు. ఇస్లాం మతం పాలకులు హిందువులను మార్చలేకపోయిన సంగతి గ్రహించి అది పద్ధతి కాదని ఆంగ్లేయులు గ్రహించారు. కొత్తపద్ధతుల్లో హిందువులను గెలవాలనుకొన్నారు. దీంతో వైద్యాన్ని ఒక పావుగా చేసుకొని క్రైస్తవాన్ని వ్యాప్తిచేసి ఇస్లాం మతం కన్నా లోతుగా ప్రజల్లోకి వెళ్లాలని పథకరచన చేశారు. తొలి రోజుల్లో వారి ఎత్తులు పారలేదు.భారతీయ వైద్యరంగంలో ఆయుర్వేదం తమ అల్లోపతి కన్నా ఎంతో విశిష్ఠమైందని గ్రహించి తలపట్టుకొని కూర్చున్నారు.

అంతేకాదు, భారతీయ జీవనవిధానంలో మతాన్ని ఏ విధంగా పెనవేసి తమ జాతిని రక్షించుకుంటున్నారో చూసి ఆశ్చర్యపోయారు. మహావృక్షాలు దాదాపు 50, మొక్కలు 50, మూలికా జాతులు 50 భారతీయుల్లో నిత్యం పరిరక్షించుకొని దేవతల్లా పూజించేవాటిని చూసి ఖంగుతిన్నారు. తమ వద్ద లేని వైద్యాలు భారతీయుల దగ్గర ఉండడం చూసి నోరు వెళ్లబెట్టారు. తమకు తెలియని ఆట్లమ్మ,మసూచి, అమ్మోరు వాటి చికిత్సకు వేప అత్యుత్తమ మందుగా జానపదులు కూడా తెలుసుకొనడం చూసి సిగ్గుపడ్డారు. నిజానికి ఈ ఆట్లమ్మ వంటి వ్యాథులతోనే అమెరికాను రెడ్ ఇండియన్ల నుంచీ ఇంగ్లండు నుంచీ వెలివేసిన దొంగలు, హంతకులు ఆక్రమించారు.

క్రైస్తవ మిషనరీల వేషాల్లో అమెరికాలో ప్రవేశించి ఆట్లమ్మ, అమ్మోరు వ్యాథులు కలిగించే వైరస్ ను బట్టలకు, దుప్పట్లకు, ఆహార పదార్థాలకు పూసి రెడ్ ఇండియన్లకు పంచారు. ఇది తెలియని అమాయక రెడ్ ఇండియన్లు ఆ వస్తువులు వాడి ఆట్లమ్మ వ్యాథులు పొంది చికిత్స తెలియక లక్షల్లో చనిపోయారు. దీంతో ఆంగ్లేయులు అమెరికాను ఆక్రమించారు.

అదే విధమైన పద్థతులు ఇక్కడ కూడా అవలంబించాలని చూశారు. అయితే ఆయుర్వేదం వారిని అడ్డుకొంది. దీంతో వారి ఆటలు సాగలేదు. ఈ అంశాలకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఆంగ్లేయులు రాకపూర్వం ప్రపంచంలోనే అత్యద్భుతమైన వైద్యవిధానం ఉందనడానికి ఉదాహరణే ఇప్పుడు చెప్పబోతున్నఉదంతం.

భారతదేశాన్ని అనేక మంది ఆక్రమించాలని చూసినా వారిలో ప్రధానమైన వారు ఆంగ్లేయులు, ఫ్రెంచ్, డచ్ వారు. వీరు కాక ఇతరులు కూడా ఈ కిరాతకజాబితాలో ఉన్నారు. అయితే భారతదేశాన్ని ఆక్రమించాలని వచ్చి దాసోహం అయిన మేధావులు కూడా లేకపోలేదు. అటువంటి వారిలో ప్రథములు పోర్చుగీసు వారితో 16వ శతాబ్దంలో వచ్చిన గార్షియా ద ఓర్టా అనే వైద్యుడు. ఈయన తన పోర్చుగీసు దేశం వారికి వైద్యం చేయడానికి వలస వచ్చి గోవాకు చేరుకొన్నాడు. నిజానికి ఆయన స్పెయిన్ కు చెందిన వాడు. అక్కడ క్రైస్తవంలో చేరమని మారణకాండ జరుగుతుంటే దాన్ని తప్పించుకోవడానికి పోర్చుగల్ వలసవెళ్లాడు. ఈయన క్రైస్తవ వ్యతిరేకి కావడం వలన చరిత్రలో ఆయన పేజీలు వందల సంఖ్యలో చించేశారు. ప్రపంచానికి భారతీయ ఆయుర్వేదం గొప్పతనం చెప్పిన వారిలో ఈయన ఒకరు.

పోర్చుగీసువారికి వైద్యం చేయడానికి వచ్చినా తనకు తెలిసిన వైద్యం తన వారిని రక్షించలేదని చాలా కొద్దికాలంలోనే తెలుసుకొన్నాడు. ఏ యుద్ధం లేకుండానే నిత్యం పోర్చుగీసువారి పీనుగులు బొందలగడ్డకు తీసుకుపోవాల్సి వచ్చింది. దీనికి కారణం విరోచనాలు, మలేరియా, కలరా వంటి అంటువ్యాథులు. ఇవి కాక పాముకాట్లకు కూడా చచ్చిపోతూ మరికొద్ది రోజుల్లో పోర్చుగీసువారు గోవాలో మిగలని పరిస్థితి తలెత్తింది. వైద్యుడుగా ఆయన పని, కాటికాపరి పనికి సమానంగా చేరింది. చచ్చిపోయారని నిర్ధారించి చావుల జాబితా తయారు చేయడానికి మాత్రమే వైద్యుడు అనే స్థాయికి దిగజారింది.

ఈ దశలో ఆయనకు ఒక సందేహం వచ్చింది. ఇంత భయంకరమైన చావుపరంపరలు ఉంటే భారతీయులు ఎలా మిగిలారా అని సందేహం వచ్చింది. ఇంతగా మృత్యువాత పడుతోంది తామేనా లేక భారతీయులు కూడా ఉన్నారా అని విచారణ చేపట్టాడు. అందులో ఆయన ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకొన్నారు. దాని పేరే ఆయుర్వేదం.

ఆయన భారతీయ ఆయుర్వేద పండితులకు దాసోహం అయి ఆయుర్వేదవైద్యాన్ని నేర్చుకొని ‘‘కొల్లోక్వీస్ ఆన్ ది సింపుల్స్ అండ్ డ్రగ్స్ ఆఫ్ ఇండియా‘‘ అనే పుస్తకం రాసి 1563లో ప్రపంచానికి ఆయుర్వేద వైద్యం శక్తిని తెలియచేశాడు. ఇందులో ఆయన భారతీయ వృక్షశాస్త్రం, మందుల తయారీ వివరణాత్మకంగా రాసి ప్రపంచానికి భారతీయుల శక్తి ఏమిటో తెలిపాడు.

ఆయన తన ఆయుర్వేద గురువుల దగ్గర నుంచీ తెలుసుకొన్న ఔషధంతో, పోర్చుగీసు వారిని కాపాడుకున్నాడు.

అయితే ఈయన చేసిన మంచి కన్నా చెడే ఎక్కువగా ఆంగ్లేయుల రూపంలో కలిగింది. ఆంగ్లేయులు ఈయన పరిశోధన వలన జాగ్రత్తపడ్డారు. తాము వైద్యం ద్వారా కూడా భారతీయులను క్రైస్తవులుగా మార్చలేమని గ్రహించారు. భారతీయ జీవనంలో వన సంరక్షణ, వనమూలికల సంరక్షణ అంతర్భాగం అయిపోయింది. కనుక ఆయుర్వేదాన్ని దెబ్బకొడితేనే తమ పథకం పారుతుందని కుట్ర చేశారు. దీనికోసం భయంకరమైన పన్నాగాలు పన్నారు. భారతీయు ఏ ఏ మహౌషథాలు ఉన్న చెట్లు, మొక్కలు దేవతలుగా కొలుస్తున్నారో వాటిని ప్రజల నుంచీ దూరం చేయడం ఇందులో మొదటి ఎత్తుగడ.

దీన్ని చాలా పకడ్బందీగా శతాబ్దాల పాటు ఆంగ్లేయులు అమలు చేశారు. దివ్యమైన వృక్షాలకు నకిలీలు భారతీయులకు దశాబ్దాలపాటు చాపకింద నీరుగా అంటగట్టారు. ఆయుర్వేద వైద్యంలోని లోపాలు ప్రచారం చేసి వైద్యుల మీద ఏవగింపు కలుగ చేసి అల్లోపతిని చొప్పించి, నెమ్మదిగా క్రైస్తవాన్ని ఎక్కించడం ప్రారంభించారు. రోగులను చాలా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నావని దేవుడ్ని ప్రార్థించమని, అలా ప్రార్థించిన వారికే మందులు పనిచేస్తాయని, ప్రార్థించని వారికి మందులు ఇవ్వక చంపేసే వారు. చనిపోయిన వారిని చూపి దేవుడ్ని ప్రార్థించని కారణంగానే చనిపోయాడని చెప్పేవారు.

భారతీయులకు ఏ దేవుడైతే ప్రధానమయ్యాడో ఆ దేవుడు అనే మాటను ఉపయోగించి ఆంగ్లేయులు దెబ్బకొట్టారు. ఎప్పుడైతే ఆయుర్వేదానికి అవసరమైన మొక్కలు, చెట్లు దూరం అయ్యాయో, ఆంగ్లేయుల వైద్యం తప్ప మరో దారిలేక ఆంగ్ల వైద్యం, క్రైస్తవం భారతదేశంలో పాతుకుపోయింది.

ఆంగ్లవైద్యులు భారతీయ వనమూలికలు, రసాయనమందుల తయారీలు, తమ దేశానికి తీసుకొని పోయి వాటిని తమ పద్ధతుల్లో, నొప్పిపుట్టేలా, ఇంజెక్షన్ రూపంలో, మందులు తయారు చేసి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా అవే కొనసాగిస్తూ, ప్రపంచాన్ని వైద్యం పేరుతో విరుచుకు తినడం ప్రారంభించారు. క్రమంగా ఆధునిక వైద్యబకాసులు ప్రపంచాన్ని ఆక్రమించారు.

అయితే ఆంగ్లబకాసురవ్యూహాన్ని మొదటిసారిగా ఆధునిక కాలంలో అరకొరగా అక్కడక్కడ కేరళలో, తమిళనాడులో ఆంధ్రాలో మిగిలిన ఆయుర్వేద వైద్యులు గ్రహించారు. కోట్ల రూపాయల్లో వసూలు చేస్తున్న ఆంగ్ల మందులకు ధీటుగా వీరు ఆయుర్వేద మందులు తయారు చేశారు. ఇది ఆంగ్ల మందుల తయారీదార్లకు కోపం తెప్పించింది. అమెరికా వంటి దేశాల్లో పగపట్టి మరీ ఆయుర్వేదం ఉపయోగించే భారతీయ వైద్యులను కేసులు పెట్టి జైళ్ళపాలు చేస్తూ వచ్చారు. నేటికీ అనేక మంది భారతీయ వైద్యులు అమెరికా జైళ్ళలో మగ్గుతున్నారు.

ఒక్కో పేషంటుకూ రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే మందుకు ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద ఔషధాన్ని ఇచ్చేస్తే వారి దోపిడీ ఎలా సాగుతుంది? కనుక నేటికీ వారి పైశాచిక వైద్య దమన నీతి కొనసాగుతూనే ఉంది.

దీనికి అత్యుత్తమ ఉదాహరణే కేరళకు చెందిన డాక్టర్ ఎస్ పి త్యాగరాజన్ జీవిత చరిత్ర. ఈయన దాదాపు 40 ఏళ్ల క్రితం హెపటైటిస్ బి అనే భయంకరమైన వ్యాథికి ఆయుర్వేద మందు తయారు చేశారు. చేసిన ముందును మెచ్చుకొని నోబెల్ బహుమతి ఇస్తారనుకొన్నాయానపై ఆంగ్లేయుల దమన నీతి 1979 నుంచీ ప్రారంభం అయింది.

ఆయన తయారు చేసిన మందును కనీసం ప్రత్యామ్నాయ మందుగా కూడా గుర్తించలేదు. ఇక్కడ కిరాకతమైన అంశం ఏమిటంటే ఆ మందుకు భారతదేశంలో కూడా ప్రాచుర్యం రాకుండా చేయడం. కేరళ మందును అణగదొక్కి ఆంగ్లేయులు తాము తయారు చేసిన అర్థరూపాయి మందును కోటి రూపాయలకు ప్రపంచవ్యాప్తంగా 40 ఏళ్ల నుంచీ అమ్ముకొని సొమ్ముచేసుకొన్నారు.

ఈ విధంగా నేటికీ ఆయుర్వేద మందులను అణగదొక్కి ఆంగ్లవైద్యతెల్లకోటు గూండాలు పట్టపగటి దోపిడీ చేస్తున్నారు. వీరి వెనుక ఉన్న మాఫియా సామ్రాజ్యం పేరే ఫార్మారంగం. ఇది ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైన నెట్ వర్క్. కేన్సర్ వంటి వ్యాథులకు కూడా ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నా వాటిని బయటకు రానివ్వకుండా చేస్తున్న లైసెన్స్డ్ వైద్య గూండాలు.

కనుకనే వీరితో సుదీర్ఘమైన యుద్ధం చేసిన త్యాగరాజన్ ఈ విధంగా అంటున్నారు.

‘‘ఈ 21 వ శతాబ్దంలో మళ్ళీ సంప్రదాయ వైద్యాలు పరిఢవిల్లుతాయి. మనం చేయాల్సిందల్లా మన పూర్వీకులు సంస్కృతంలో ఇచ్చిన ఆయుర్వేద గ్రంధాలను శోధించి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పేటెంట్లు పొందాలి.‘‘ ఆయన చెప్పిన దాని బట్టీ చూస్తే ఈ ఉద్యమంలో ప్రతీ నిమిషం ఆలస్యం భారతీయులు కోలుకోలేని, తీవ్రమైన నష్టం పొందబోతున్నారు. దీనికి త్యాగరాజన్ జీవితమే ఉదాహరణ.

ఈ దేశంలో ఆయుర్వేద వైద్యం, విష్ణుమూర్తి స్వరూపమైన భగవాన్ ధన్వంతరి ద్వారా లభించింది. కాబట్టి ఈ దేశం నుంచి ఆయుర్వేదాన్ని వేరు చేయడం ఎవరు చేయలేరు. ప్రజల్లో ఆయుర్వేద మీద అవగాహన లేక దూరమయ్యారు తప్ప, ఆయుర్వేదం  భవిష్య ప్రధాన వైద్యవిధానంగా మారుతుంది. హెల్-ల్లోపతి లోపాలను గురించి ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారు.

Ayurvedic Doctor



No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...