Thursday, 2 February 2023

 పెరిగిపోతున్న క్రైస్తవ మతస్తుల విపరీత పోకడలు బాధిస్తుంటే...  

ఇంకో పక్క ఆరెస్సెస్ ఇలాంటి గొడవల్లో తలదూర్చదు...!

క్రైస్తవులు అయినా, ముస్లింలు అయినా హిందూ సమాజం లో భాగమే...

మెల్లగా నచ్చ జెప్పాలి అంటూ.. 

పెద్దలు  మనకు సుద్దులు చెబుతూ... సముదాయిస్తూ ఉంటే 

కొంచెం ఏమిటి చాలా అసహనంగా ఉంటుంది!

ఎందుకలా.....??????

Nsk Chakravarthy గారి  సౌజన్యంతో  !! 

నేను పూర్తి సమయం ఆరెస్సెస్ లో పనిచేస్తున్న రోజులు...

భీమవరం నగరం లో జరిగిన ఒక కార్యక్రమానికి అఖిల భారత సర్  సంఘ చాలక్  గా ఉన్న  శ్రీ  మోహన్ జి  భగవత్ వచ్చారు... 

కార్యక్రమం తరువాత వారికి వీడ్కోలు చెప్పడానికి నేను మరో కార్యకర్త భీమవరం టౌన్ స్టేషన్ కి వెళ్ళాము...

ట్రైన్ ఆలస్యం కావడంతో వారితో కొంచెం సేపు మాట్లాడే అవకాశం దక్కింది..

అప్పటికే భీమవరం  నగరం లోనే సంఘ శాఖలు ఇరవై పైగా ఉండడం, వారు వచ్చింది  నగర స్థాయి కార్యక్రమానికే కావడంతో... లోపల్లోపల జోష్ మాకు ఎక్కువగానే ఉంది...!

దానికి తోడు అంతకు కొన్ని రోజుల ముందే ఒక యాదవ బస్తీలో కృష్ణుడి ఆలయాన్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్న క్రైస్తవ మూకల విషయంలో స్థానికులకు ధైర్యం చెప్పడం...ఉద్యమం చేసి ఎదిరించి ఉండడం...

అదే సమయంలో రిపబ్లిక్ డే వేడుకలకు ముందు...బహుజన సమాజ్ పార్టీ, మరికొందరు, క్రైస్తవ సంఘాలు కలిసి DNR కాలేజీ దగ్గర జాతీయ పతాకానికి అవమానం చేశారని తెలిసి...చాలా అగ్రెసివ్ గా ర్యాలీగా వస్తున్న మూకల్ని ఎదుర్కుని ధైర్యంగా అడ్డుకోవడం....

ఇలా చాలా చాలా ఉధృతంగా ఉన్నాము...!

సరే...ఇవ్వన్నీ మనసులో ఉంచుకుని...

పెరిగిపోతున్న క్రైస్తవ మతస్తుల విపరీత పోకడలు బాధిస్తుంటే...  

ఇంకో పక్క ఆరెస్సెస్ ఇలాంటి గొడవల్లో తలదూర్చదు...!

క్రైస్తవులు అయినా, ముస్లింలు అయినా హిందూ సమాజం లో భాగమే...

మెల్లగా నచ్చ జెప్పాలి అంటూ.. పెద్దలు  మాకు సుద్దులు చెబుతూ... సముదాయిస్తూ ఉంటే కొంచెం అసహనంగా ఉండేది!

మోహన్ జీ తో మాట్లాడి...ఎలాగైనా వారి దృష్టికి తీసుకు వెళ్లి... మన స్టాండ్ సరైనదే...అని ఓదార్పు పొందుదాం అనుకున్నాము..! 

వారికి జరిగిన విషయాలు చెప్పి... మేమెంత రగిలి పోతున్నామో...వివరించాం...అంతా విని...వారు క్లుప్తంగా ఈ కథ చెప్పారు...మనసు మీద ముద్ర పడిపోయింది..ఆ తరువాత కూడా ఈ కథను వారు వివిధ సందర్భాల్లో సమయానుకూలంగా చెబుతూ వచ్చారు....

కృష్ణుడు, సాత్యకి, బలరాముడు...ఆంగుష్టి రాక్షసుడు..

ఒక పౌర్ణమి రోజున కృష్ణుడు, బలరాముడు,సాత్యకి అడవి దాటి వెళ్ళవలసి వచ్చింది.. అడవి దాటడం ఆలస్యం అవడంతో...వారు రాత్రి అడవిలోనే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

 ప్రమాదకరమైన అడవి కావడంతో కృష్ణుడు..

"బలదేవ, సాత్యకి..ఈ రాత్రి వంతుల వారీగా మనం నిఘా ఉంచుకోవడం మంచిది... అర్ధరాత్రి వరకు మీరిద్దరూ నిఘా ఉంచండి, అర్ధరాత్రి నుండి ఉదయం వరకు నేను నిఘా ఉంచుతాను" అని సూచించాడు.

వారిద్దరూ అంగీకరించారు... కృష్ణ బలరాములు నిద్రపోయారు. 

కొన్ని గంటలు గడిచాయి....

మెలకువగా ఉన్న సాత్యకి కొన్ని కేకలు విన్నాడు... అతను శబ్దం వైపు కొంచెం ముందుకు నడిచాడు. 

ఇప్పుడు సాత్యకి ఒక రెండు అంగుళాలు మాత్రమే ఉన్న చిన్ని రాక్షసుడు తన దగ్గరికి రావడాన్ని గమనించాడు.

రాక్షసుడు మళ్ళీ కేకలు వేశాడు..సాత్యకి కి కోపం వచ్చి... 

బొటన వ్రేలంత లేవు..ఇప్పుడే నీ సంగతి చూస్తానని...అరిచాడు..

ఆశ్చర్యంగా అంగుష్టం మాత్రం ఉన్న రాక్షసుడు...కొంచెం పెరిగాడు...

సాత్యకి మరింత క్రోధంతో... తిట్టడం మొదలు పెట్టాడు...కొంచెం కొంచెం ఆ రాక్షసుడు పెరగడం ప్రారంభించాడు...

గట్టిగా రెండు మూడు దెబ్బలు వేసి, అరిచాడు సాత్యకి...మరింతగా పెరిగాడు ఆ అంగుష్టి...

అలసిపోయిన సాత్యకి, బలరాముడు లేవడంతో...విశ్రాంతికి వెళ్ళిపోయాడు..

బలరాముడు ఆగ్రహంగా దూకి...అప్పటికే తనలో సగం ఉన్న ఆ రాక్షసుడిని తిడుతూ, తన్నుతూ అరుస్తూ గట్టిగా తన స్థాయి చెబుతూ పోరాడటం మొదలు పెట్టాడు...

అంతే...అంతకంతకూ పెరిగిపోయిన బ్రహ్మ రాక్షసుడు బలరాముడిని ఇంచుమించు.. ఓడించేంత పని చేశాడు..బలరాముడు అలసిపోయాడు..

అప్పటికే వృక్షం అంత అయిన అంగుష్టిని చూసి  భయపడ్డాడు, భయంతో వణికిపోయాడు. తిట్టి, అరిచిన ప్రతిసారీ రాక్షసుడు రెట్టింపు పరిమాణంలో పెరిగాడు.

 రాక్షసుడి శబ్దం, పరిమాణం మరియు భయంకరమైన వాసన చూసి భయపడిన బలరాముడు "కృష్ణా! కృష్ణా!" అని అరిచాడు. 

అరుపుతో మేల్కొన్న కృష్ణుడు ఆ శబ్దాన్ని అనుసరించి , 'ఇది ఇప్పుడు నా వంతు అయి ఉండాలి' అని అనుకున్నాడు.

బలరాముడు అలసి స్పృహ తప్పడంతో.. కృష్ణుడు సమీపంలో నిలబడి ఉన్న రాక్షసుడిని గుర్తించాడు.

వాడ్ని చూసిన కృష్ణుడు చిన్నగా చిరునవ్వు నవ్వాడు..

కృష్ణుడి వద్ద రాక్షసుడు కేకలు వేశాడు. 

" ఏమీ...నీ సంగతి చూస్తా... నువ్వొక్కడివా...మళ్లీ" అంటూ అరిచాడు.. రాక్షసుడు.

 "నీకు ఏమి కావాలి?" కృష్ణుడు భయపడకుండా, మెత్తగా అడిగాడు. 

ఆశ్చర్యంగా రాక్షసుడి పరిమాణం తగ్గింది...

" ఏయ్...నీ సంగతి చూస్తా...నీ బలమూ చూస్తా...నిన్ను అందరూ...గొప్ప వాడు అనుకుంటున్నారేమో..అదీ చూస్తా..." అంటూ కృష్ణుడి వెంట బడ్డాడు వాడు...

దాన్ని పట్టించు కోకుండా కృష్ణుడు సరదా చేస్తూ...అటూ ఇటూ...చెట్టు చుట్టూ పరిగెట్టించాడు..

ఆశ్చర్యంగా  రాక్షసుడి పరిమాణంలో సగానికి తగ్గిపోయింది.

ఇంకా క్రోధంతో రగిలిన రాక్షసుడు మరింతగా కృష్ణుణ్ణి అనడం మొదలు పెట్టాడు.... రాక్షసుడు మళ్ళీ కుంచించుకుపోయాడు.

కృష్ణుడు ప్రశాంతంగా  ఆట పట్టిస్తూనే ఉన్నాడు..ప్రతిసారీ రాక్షసుడు తగ్గిపోతూనే ఉన్నాడు. 

ఇప్పుడు రాక్షసుడు కేవలం 2 అంగుళాల పొడవుకి వదిగిపోయాడు. 

కృష్ణుడు వాణ్ణి చేతిలో తీసుకొని నడుము చుట్టూ ఉన్న ఉత్తరీయంలో ఉంచాడు. 

రాత్రి గడిచిపోయింది...

సాత్యకి బలరాముడు ఉదయం లేచారు.

బలరాముడు కృష్ణుడిని చూసి ఆనందంగా.. 

"కృష్ణా...కృష్ణా! మీరు నిద్రలో ఉన్నప్పుడు ఏమి జరిగిందో మీకు తెలియదు. మా ఇద్దరినీ చంపడానికి భారీ రాక్షసుడు ఉన్నాడు. మేము ఎలా బయటపడ్డామో నాకు తెలియదు, చివరిగా నాకు గుర్తుంది నేను మూర్ఛపోయాను." 

నిన్న రాత్రి జరిగిన సంఘటనలను గుర్తుచేసుకునేందుకు ప్రయత్నిస్తూ బలరాముడు చెప్పాడు. 

కృష్ణుడు తన జేబులోంచి ఉన్న చిన్న రాక్షసుడిని బయటకు తీసి, "ఇదే రాక్షసుడా?" అన్నాడు... 

"అవును, కానీ అది చాలా పెద్దది! ఇది ఎలా కుంచించుకుపోయింది?" అడిగాడు బలరాముడు.

ఇంతటితో ఆపిన మోహన్ జీ...

మనం పదే పదే వ్యతిరేకుల గురించి ఆలోచిస్తూ... ఏదో వొకటి అంటూ...క్రోధంగా ఉన్నంత సేపూ...  రాక్షసుడు ఎలా పెరిగాడో...అలాగే వారి బలమూ పెరిగి పోతుంది...

మనం మన హిందుత్వం గురించి ఆలోచన చేస్తూ... కృష్ణుడి లాగా భయం లేకుండా...ప్రశాంతంగా..మనం మన పని చేసుకుంటూ, రాక్షసుణ్ణి విస్మరిస్తూనే, అలసిపోయేలా చెయ్యాలి...

దానికి మనం మన విషయాల పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి.. ముఖ్యంగా శాఖా కార్యక్రమాల పైన.... వ్యతిరేకుల కార్యక్రమాల మీద క్రోధం పెంచుకుంటూ కాదు...అంటూ ముగించారు.....

ఒకరు గుర్తు చేస్తే..మళ్లీ🙏

శ్రీహరి మంగళంపల్లి..

😀😀😀🙏🚩

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...