Saturday 25 February 2023

 స్వామినాథన్ అయ్యర్ ఒక ఆర్థికవేత్త మరియూ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సోదరుడు. వామపక్ష భావజాలం గల వ్యక్తి. అమెరికా ఆర్ధిక విషయాలపై రిసెర్చ్ చేసి ప్రపంచ బ్యాంకు కు అప్పుడప్పుడు సలహాదారుగా వ్యవరించారు.  ఫైనాన్సిల్ మేగజైన్స్ కి ఆర్ధిక విషయాలపై వ్యాసాలు రాస్తూ వుంటారు. ప్రస్తుతం ఎకనామిక్స్ టైమ్స్ నౌ కి కన్సల్టింగ్ ఎడిటర్ గా వున్నాడు. మోడీ విధానాలను నిశితంగా విమర్శిస్తూ తరుచుగా వ్యాసాలు రాస్తూ వుంటారు.


నిన్న ఎకనామిక్ టైమ్స్ పేపర్ లో #అదాని గురించి అన్ని విశ్లేషిస్తూ ఒక పెద్ద వ్యాసం రాశారు.


ఆ ఆర్టికల్ అందరికి చేరాలి అని దానిని తెలుగులో క్రింద ఇస్తున్నాను. ఇంగ్లీష్ లో చదువుదాం అనేవారికి లింక్ కామెంట్స్ సెక్షన్ లో ఇస్తున్నాను.


"హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆదానికి రహస్యంగా వచ్చిన ఒక ఆశీర్వాదంగా భావించవచ్చు"


2006లో, నేను కాటో ఇన్‌స్టిట్యూట్ కోసం గుజరాత్ కొత్త పోర్ట్-బేస్డ్ డెవలప్‌మెంట్ వ్యూహంపై పరిశోధన చేసి ఒక పేపర్ రాశాను.  ఈ వ్యూహం 1990ల ప్రారంభంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ చే ప్రారంభించబడింది. ఆ తరువాత  బిజెపి వారు ఆ వ్యూహాన్ని విస్తరించారు. 


నేను గౌతమ్ అదానీ యొక్క కొత్త ముంద్రా పోర్ట్‌ని సందర్శించాను. దాని అధిక ఆటోమేషన్ మరియు వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాను. షెడ్యూల్‌ టైం లోగా లోనికి అనుమతించబడని మరియు అన్‌లోడ్ చేయని ఏదైనా ఓడకు ఇది ఆర్థికంగా నష్టపరిహారం ఇస్తుందని విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. 1990లో ముంబైలో పని చేస్తున్నప్పుడు, ఓడరేవు ప్రవేశం కోసం ఓడలు 20 రోజులు వేచి ఉండటాన్ని చూశాను. కాబట్టి, ముంద్రా పోర్ట్ వేరే గ్రహంలో ఉన్నట్లు అనిపించింది.


హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అదానీ కంపెనీలలో భారీ ధరల రిగ్గింగ్ మరియు మోసాన్ని ఆరోపించింది. ఆ ఆరోపణలు తీవ్రమైనవి. గ్లోబల్ ఇన్వెస్టర్లు అదానీ షేర్లను తొలగించారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి.


నేను దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక సమస్యను లేవనెత్తాను. అదానీ యొక్క విమర్శకులు అతను నైపుణ్యాల ద్వారా కాకుండా తారుమారు మరియు రాజకీయ అనుకూలతలతో ధనవంతుడు అయ్యాడని, హాయిగా గుత్తాధిపత్యంలో డబ్బు సంపాదించాడని చెపుతున్నారు.  ఇది నెను ఒప్పుకొను. అసాధారణమైన వ్యాపార నైపుణ్యాలు లేకుండా రెండు దశాబ్దాలలో నిరాడంబరమైన మూలాల నుండి ప్రపంచ నంబర్ 3కి వెళ్లడం అసాధ్యం.


ఓడరేవులు, గనుల నుంచి విమానాశ్రయాలు, ట్రాన్స్‌మిషన్ లైన్ల వరకు అదానీకి విలువైన ఆస్తులను బీజేపీ 'ఇస్తోందని' విమర్శకులు ఆరోపిస్తున్నారు. కాదు.. కచ్ ఎడారిలో రైలు కనెక్షన్ కూడా లేకుండా మైనర్ పోర్టును నిర్వహించే హక్కును ప్రభుత్వం మొదట్లో అదానీకి ఇచ్చింది. ఈ ఎడారి ప్రాంతాన్ని భారతదేశపు అతిపెద్ద ఓడరేవుగా మార్చడం ఒక అద్భుతం.


మార్స్క్ మరియు డుగ -భాయి వంటి ప్రపంచ నెంబర్ వన్ ఇన్ఫ్రా దిగ్గజాలను ప్రపంచ  వేలం పోటీలో ఎదుర్కొని అదానీ గ్రూప్ డజను ఇతర ప్రదేశాలలో పోర్టులు,  జెట్టీలను కూడా కొనుగోలు చేసింది. అతను సాటిలేని భారతదేశపు అగ్రశ్రేణి పోర్ట్ ఆపరేటర్, ఇప్పుడు మొత్తం భారతీయ సరుకు రవాణాలో పావు భాగాన్ని నిర్వహిస్తున్నాడు. దీనివల్లే అతను జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు.


అందుకే, శ్రీలంక మరియు ఇజ్రాయెల్‌లో వ్యూహాత్మక జెట్టీలు మరియు ఓడరేవులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అతనికి మద్దతు ఇస్తున్నాది. విమర్శకులు దీన్ని అతనికి ప్రభుత్వం సాయం చేస్తున్నట్లు గా పేర్కొంటున్నారు? ఇది నిజమేనా? శ్రీలంక టెర్మినల్ $750 మిలియన్ మరియు హైఫా పోర్ట్ $1.18 బిలియన్లు ఖర్చు అవుతుంది. ఏ భారతీయ ప్రత్యర్థి కూడా పళ్ళెంలో పెట్టి ఫ్రీ గా ఇచ్చినా అంతగా రిస్క్ చేయడానికి సాహసించడు. అదానీ నైపుణ్యాలు అతన్ని వ్యాపారవేత్తగా కాకుండా వ్యూహాత్మక ఆటగాడిగా మార్చాయి. ఓడరేవు అనుకూలమైన గుత్తాధిపత్యం కాదు. అప్పటికే ఈ వ్యాపారం లో పాతుకుపోయిన ప్రత్యర్థుల నుండి నౌకలను ఆకర్షించడానికి కొత్త కంపనీ లాజిస్టిక్స్ మరియు ధరలలో పోటీపడాలి. ముంద్రా యొక్క లాజిస్టిక్స్ వేల కోట్ల వ్యాపార పెట్టుబడులను ఆకర్షించింది, ఎడారిలో పారిశ్రామిక కేంద్రాన్ని సృష్టించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమేటెడ్ బొగ్గు-నిర్వహణ సౌకర్యాన్ని కలిగి ఉంది. 2017 మోర్గాన్ స్టాన్లీ నివేదిక  అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ)ని గ్లోబల్ పోర్ట్ కంపెనీలలో టాప్ 25%లో ఉంచింది.


విమర్శకులు అదానీకి ప్రభుత్వ అనుకూలతపై దృష్టి పెడుతున్నారు. భారతదేశంలో, వ్యాపార విజయానికి ఫ్యాక్టరీలు నడపడం మాత్రమే కాకుండా రాజకీయాల నిర్వహణ కూడా అవసరం. వ్యాపారవేత్తలందరూ రాజకీయ నాయకులకు దగ్గరగా ఉండవచ్చు.  ఇది కొన్ని తలుపులు తెరుస్తుంది, కొన్ని నియమాలను అధిగమించేలాగా చేస్తుంది, కానీ  ఇది విజయానికి హామీ ఇవ్వదు. ఉదాహరణకు   రక్షణ వ్యవహారాల్లో అనిల్ అంబానీ ₹30,000 కోట్ల రూపాయలను పొందారని రాహుల్ గాంధీ తరుచూ ఆరోపిస్తున్నారు. అయితే అనిల్ వ్యాపార పరంగా ఫ్లాప్‌ అయ్యాడు.


ఒకసారి, ధీరూభాయ్ అంబానీ కూడా రాజకీయ అవకతవకలు మరియు బూటకపు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రతి ఇతర వ్యాపారవేత్త చేయని పని నేను ఏమి చేసాను? అని ప్రశ్నిస్తే సమాధానం రాలేదు. వ్యాపారం లో బలంగా ఉన్న చాలా మంది ఇతర వ్యాపారవేత్తలు

రాజకీయ నాయకులు నుండి చారిత్రాత్మక ప్రయోజనాలు పొందారు మరియు లెక్కల పుస్తకాలను కూడా మార్చారు. ధీరూభాయ్ వంటి కొత్త ఆటగాడు పాత దిగ్గజాలను వారి స్వంత ఆటలో ఓడించడం అతని అపారమైన ప్రతిభను సూచిస్తుంది. 


అదానీ గురించి కూడా ఇదే చెప్పాలి. 


హమీష్ మెక్‌డొనాల్డ్ యొక్క 1998 పుస్తకం," ది పాలిస్టర్ ప్రిన్స్‌" లో దీరూభాయి చర్యలు గురించి వివరంగా ఉన్నాయి. కానీ విమర్శకులు అతను కేవలం ఒక విజయవంతమైన మానిప్యులేటర్ అని భావించడం తప్పు. లైసెన్స్-పర్మిట్ రాజ్ సమయంలో, తారుమారు చేయడం అనేది తప్పించుకోలేనిది. కానీ, ఒకసారి ఆర్థిక వ్యవస్థ సరళీకృతం అయిన తర్వాత, అతను ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతి ఆధారిత, ప్రఖ్యాత సింగపూర్ రిఫైనరీలు కంటే కూడా అధిక ఆపరేటింగ్ మార్జిన్లు గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించాడు, తనది ప్రపంచ స్థాయి అని తాను నిరూపించుకున్నాడు.

 

అతను (అంబానీ) టెలికామ్‌లో అవకాశాలు పొందాడు, కానీ ప్రపంచంలోనే చౌకైన టెలిఫోన్ నెట్‌వర్క్‌ను సృష్టించాడు. అతని మానిప్యులేషన్‌పై మాత్రమే దృష్టి సారించే వారు అతనిని చారిత్రాత్మక టైటాన్‌గా మార్చిన అసాధారణ నైపుణ్యాలను గుడ్డిగా పట్టించుకోరు. 


ఇప్పుడు అదానీ ఇదే మార్గంలో నడుస్తున్నారు.  అదాని ప్రధానంగా మౌలిక సదుపాయాలలో (ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలలో) వ్యవహరిస్తారని,  ఇక్కడ నిజమైన నైపుణ్యాల కంటే ప్రభుత్వానికి దగ్గరగా ఉండటమే వ్యాపార విజయానికి కారణం అని విమర్శకులు అంటున్నారు. 


బలమైన ప్రాంతీయ రాజకీయ పలుకుబడితో డజన్ల కొద్దీ కొత్త వ్యాపారవేత్తలు 2003-08లో  ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం లో చేరారు. కానీ రాజకీయ గాడ్‌ఫాదర్‌లు ఉన్నప్పటికీ, చాలా మంది ఇబ్బందుల్లో కూరుకుపోయి, బ్యాంకులకు అపారమైన అప్పులు మిగిల్చారు. మౌలిక సదుపాయాలలో విజయానికి ఒక్క రాజకీయ మిత్రులే కాకుండా నైపుణ్యం కూడా అవసరం.


పాఠకులు నేను గొప్ప ఆదాని అభిమాని అని అనుకోవచ్చు, కానీ అధిక ధరలు మరియు అధిక రిస్క్ కారణంగా నేను ఏ ఆదాని కంపెనీ షేర్లను కలిగి లేను. 


అప్పు తెచ్చుకున్న డబ్బును ఉపయోగించి  వేలం కొనుగోళ్లలో పాల్గొంటూ చాలా ఎక్కువ ధరలకు ఆస్తులు కొంటూ వైవిధ్యభరితంగా ఆడాని గ్రూప్ విస్తరిస్తోంది. ఈ పద్ధతి వేగవంతమైన విస్తరణను సులభతరం చేస్తుంది, కానీ గొప్ప ప్రమాదాలను కూడా కలిగి ఉంటుంది. పెద్ద వ్యాపార సముదాయాలను సృష్టించేందుకు  ఇలా చేసిన విభిన్నమైన వ్యాపార ప్రముఖుల ఉదాహరణలు చరిత్రలో పుష్కలంగా ఉన్నాయి..అవి ప్రశంసల మధ్య కొన్ని దశాబ్దాలు విజయం సాధించాయి, కానీ చివరికి దివాలా(జాక్ వెల్చ్ కింద జనరల్ ఎలక్ట్రిక్ వంటిది) తీసాయి.


కాబట్టి, హిండెన్‌బర్గ్ నివేదిక నిజానికి అదానీకి జరిగిన ఒక అత్యుత్తమమైన విషయం అని నేను భావిస్తున్నాను. ఇది అతని విస్తరణ మరియు వైవిధ్యం యొక్క వేగాన్ని తగ్గిస్తుంది మరియు భవిష్యత్తులో అతని ఋణ దాతలను శ్రద్ధగా మరియు జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. ఇది అదానీకి తన స్వంత ప్రయోజనం కోసం  కావాల్సిన అత్యంత ఆర్థిక క్రమశిక్షణను నేర్పిస్తుంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆదానికి రహస్యంగా వచ్చిన ఒక ఆశీర్వాదంగా భావించవచ్చు. (Blessing in disguise)


ఒక రోజు నేను నిజంగా అదానీ షేర్లను కొనుగోలు చేయవచ్చు.

....స్వామినాథన్ అయ్యర్...


తెలుగు అనువాదం : 

....చాడా శాస్త్రి..

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...