Sunday, 12 February 2023

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారిని 

ఇందిరా గాంధీ పంపిన కిరాయి హంతకులు దారుణంగా హత్యచేసి ట్రాక్‌పై పడేసిపోయారు..

ఇది జరిగింది 11-02-1968 రోజున..



మొఘల్‌సరాయ్ జంక్షన్ సమీపంలోని పిల్లర్ నంబర్ 673/1276 దగ్గర..

ఈ పిల్లర్ దీన్‌దయాళ్ గారి దారుణ హత్యకు ప్రత్యక్ష సాక్ష్యంగా నేటికీ అలాగే ఉంది....!!

ఒక గొప్ప మేధావిని కోల్పోయాము.

బతికి ఉంటే 45 ఏళ్ల క్రితమే అగ్రరాజ్యాల ను అధిగ మిoచేవారం..దేశ ప్రగతి మనకు గర్వ కారణము అయ్యేది.

వేర్పాటు,మత,విచ్ఛిన్న కర, దేశద్రోహుల ,ఇజాలు పేర నిజాలు దాచే కంపునిష్టు ల ఆగడాలకు గురి అయ్యి పోయాం ,బతుకులు నాయకుల చేతుల్లో బలి అయిపోయాయి.

ఆయన వర్థంతి రోజైన ఫిబ్రవరి 11ను మోదీ ప్రభుత్వం #సమర్పణ్‌దివస్ గా జరుపుతున్నది....!!

 ఆశ్చర్యపోయిన విదేశీ జర్నలిస్టులు: 1968వ సం. దీనదయాల్ ఉపాధ్యాయ గారి మరణానంతరం వారి రచనలు మరియు జీవితం అధ్యయనం చేయడానికి వచ్చిన విదేశీ జర్నలిస్టులు వారు నివసించిన ప్రాంతాలలో విషయ సేకరణలో భాగంగా ఢిల్లీలోని అప్పటి వారి గదిలోకి వెళ్లి వారు ఉపయోగించిన వస్తువులు, కళ్లద్దాలు, రిస్ట్ వాచ్, బట్టలు మొదలైనవి పరిశీలిస్తూ..., వారి బీరువా అందులో మిగతా బట్టలు ఏవి అని..,  ముఖ్యంగా వారు ధరించే 'కోటు' ఏది అని అడిగారు...?  అంతేకాకుండా వారు నిద్రించే మంచం ఏది అని కూడా అడిగారు....,

   ఆ సమయంలో అక్కడే ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు సమాధానం ఇస్తూ దీనదయాల్ గారికి సంఘ గణవేష తో పాటు ఉన్న మూడు జతల బట్టలు (శరీరంపై ఒకటి , ఉతికి ఆరవేసినది రెండవది, రేపటి కోసం మడత పెట్టి ఉంచిన జత మూడవది.) తనతో పాటు తీసుకెళ్లారనీ చెప్పి వారు చనిపోయిన సమయంలో వారి చేతి బ్రీఫ్ కేసులో ఇవన్నీ ఉన్నాయని వివరించారు..., ఇక వారి కోటు అంటారా... ఈ గదిలో ఉండే ముగ్గురు అఖిల భారతీయ అధికారులలో ఎవరు ఉపన్యాసానికి వెళితే వారే ధరించి వెళ్లడం చేస్తుంటారని ఇప్పుడు అదే జరిగింది మరొక అఖిల భారతీయ అధికారి ధర్మవీర్ గారు ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తూ ధరించి వెళ్లారని చెప్పారు. 

  ముగ్గురు ఉన్న ఆ గదిలో రెండు బల్లలు / చెక్కతో చేసిన పడక టేబుల్స్ ఉండడాన్ని వాళ్లు ఆశ్చర్యంగా చూస్తుండగా ఈ రెండింటి పై ఎవరు ముందుగా గదికి చేరుకుంటే వాళ్లు నిద్రిస్తారని, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అదిగో ఆ మూలనున్న చాప వేసుకుని పడుకుంటారని చెప్పడంతోని విని.., అవాక్కయ్యారు.

   అప్పటికే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉండీ మరికొన్ని రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షంగా,  కేంద్రంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీ యొక్క అధ్యక్షుడు కార్యదర్శి ఆ రకంగా సాధారణ జీవితాన్ని గడపడం చూసి ఆశ్చర్యపోవడం విలేకరుల వంతయ్యింది.

    ఆ గదిలో చాయ్ చేసుకోవడానికి తప్ప భోజనానికై వంటచేసు కోవడానికి వస్తువులు లేని విషయాన్ని కూడా వాళ్ళు గమనించారు.

(కార్యకర్తల ఇళ్లలోనే భోజనం చేసే అలవాటున్న వారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారకులు అనే విషయం ఆలస్యంగా అర్థమైంది.)

"ఏకాత్మ మానవతా దర్శనం" ప్రవక్త, (మానవులందరిలో ఒకే ఆత్మను దర్శించిన వారు) భారతీయ జనసంఘ్ అధ్యక్షులు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారకులూ అయిన శ్రీదీనదయాల్ ఉపాధ్యాయ గారు పరమపదించినదీరోజు. వారి దివ్యాత్మకు అంజలి ఘటిస్తున్నాను.

(తమ దుష్ట పరిపాలనకు అడ్డు తగులుతున్నారని  రైలులో ప్రయాణం చేస్తున్న శ్రీ దీనదయాల్ ఉపాధ్యాయ గారిని ఉత్తరప్రదేశ్లోని ,మొగల్ సరాయ్ అనే చోటున దారుణంగా హత్య చేశారు.)

- Keshavaraju Aakarapu ji post...

నిన్నదీనదయాళ్ జీ పుణ్యతిథి

No comments:

Post a Comment

show image

 Sardar Patel He had come out of the mosque and attacked Sardar Patel. We were taught that Mahatma Gandhi was assassinated by Nathuram Godse...