Friday, 3 February 2023

 భారత్ కి స్వాతంత్రం వచ్చిన తరువాత ఒకే ఒకసారి దేశంలో మత ఘర్షణలు జరిగినట్లు, అవి కూడా 2002 గుజరాత్ లో మోడీ ముఖ్యమంత్రి గా ఉండగా మాత్రమే జరిగినట్లు రాజకీయ అవసరాల కోసం ప్రచారం కల్పించారు. ఆ సంఘటన జరిగి 20 సం. లు అయిపోయినా ఆ వార్తని ఇప్పటికి తాజాగా ఉంచేలా మోడీ వ్యతిరేకులు దేశ విదేశాల్లో తమ మీడియా ద్వారా ప్రయత్నిస్తూనే వున్నారు. ఇటువంటి వార్తను పదే పదే లేవనెత్తడం మత రాజకీయాలు కావు సెక్యూలర్ హిందువుల దృష్టిలో.

 గుజరాత్ గురించి మాట్లాడిన ప్రతీసారి ఇకపై సెక్యూలర్ ప్రభుత్వాల హయాంలో జరిగిన పాత ఘటనలు తవ్వి తీసి ప్రచారం కల్పించే విధంగా రెండో వైపు వారిని ప్రోత్సహిస్తున్నారు సో కార్డ్ సెక్యూలర్ వాదులు..

****

ఇప్పుడు ఈ పాత ఘటన గురించి తెలుసుకోండి:

డ్యూటీలో ఉన్న తన పై అధికారిని హత్య చేసి 25 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన హైదరాబాద్ పోలీస్ కానిస్టేబుల్ సయ్యద్ అబ్దుల్ ఖదీర్ అనే ఆయన 2017 సెప్టెంబర్ లో మరణించాడు. 

ఈ అబ్దుల్ ఖదీర్ డిసెంబర్ 8, 1990న హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అంటే ACPఎన్. సత్తయ్యను కాల్చిచంపడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో అత్యంత ఘోరమైన మత అల్లర్ల సమయంలో జరిగింది. ఆ ఘర్షణల్లో రెండు వందల మంది చనిపోయారు. 

ఎసిపి సత్తెయ్య ని కాల్చిచంపిన తర్వాత లొంగిపోయిన అబ్దుల్ ఖదీర్, హింసాకాండను ఎదుర్కోవడంలో తన పై అధికారి ఒక నిర్దిష్ట వర్గాన్ని సెలెక్టివ్‌గా టార్గెట్ చేస్తున్నారని భావించాను, 'ఇది భరించలేక అతడిని కాల్చిచంపాను' అని విచారణాధికారులకు తెలిపాడు.

అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. 14 సంవత్సరాలు జైలులో గడిపిన తరువాత కూడా అతని శిక్షను మార్చడానికి మరియు విడుదల చేయడానికి తరువాతి ప్రభుత్వాలు నిరాకరించాయి. 

అతను అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నందున MIM శాసనసభ్యుల సిఫార్సులు తో అనేకసార్లు పెరోల్‌పై విడుదలయ్యాడు.

చివరకు 2016 మార్చిలో 25 ఏళ్ల మూడు నెలల జైలు జీవితం పూర్తి చేసుకున్న ఆయనను టీఆర్‌ఎస్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది.

ఈ వార్త మీడియా పూర్తిగా కప్పట్టేసింది.

....చాడా శాస్త్రి....

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...