వేదాలు.... వర్ణ వ్యవస్థ
ఇప్పుడు చాలామంది ఈ దేశంలో " వేద ప్రతిపాదిత (కుల) వర్ణ వ్యవస్థ గురించి విమర్శిస్తూ.... "వేదం" బ్రాహ్మణులేమో విరాట్పురుషుని ముఖం నుండి, శూద్రులేమో ఆయన పాదాలనుండి పుట్టారని ఎందుకు చెప్పింది....?
బ్రాహ్మణులకు ఎందుకు అంత గొప్పతనం ఇచ్చి, శూద్రులకు పాదాల స్థానం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి...?
అంటూ ప్రశ్నించడం రివాజుగా మారింది,
మిత్రులారా!
అసలు ఈ ఆరోపణే శుద్ధ తప్పు... సకల జగత్తుకు జీవన నాదం అయినట్టి నా వేదాలను విమర్శించడం అంటేనే ఆకాశం మీద ఉమ్మివేయటం అని నా ఉద్దేశ్యం, అలాంటి అత్యున్నతమైన వేదాలను కొందరు కుక్కమూతి పిందెల్లాంటి కుహనా లౌకికవాదులు, నాస్తిక నక్కలు, విమర్షిస్తుంటే వారి అజ్ఞానానికి జాలివేస్తుంది, మనువాదం అంటూ మరికొంతమంది గుంటనక్కలు వేదాల చెప్పిన అర్థాలను మార్చి, కుల కుంపట్లు రాజేస్తూ, వారి పరాయి దేశాల ప్రాచ్యపు మతాన్ని ఎరగా వేస్తూ నా సనాతన ధర్మాన్ని గాలాలతో గుచ్చి గాయపరుస్తుంటే
తట్టుకోలేక విజ్ఞులైన పెద్దలద్వారా తెలుసుకున్న విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నమిది...
వేదం శూద్రులు భగవంతుని పాదాలనుంచి పుట్టారని, బ్రాహ్మణులు ముఖంనుంచి పుట్టారని చెప్పలేదు. కానీ, ఎలాగో ఈ విషయం అందరిచేతా అంగీకరించబడీ, ఆమోదం పొందింది.
నిజానికి మన దేశంలో, జన్మ ఆధారిత కుల వ్యవస్థలేదు. అంటే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడు బ్రాహ్మణుడే అవ్వాలని, శూద్రకుటుంబం లో పుట్టిన వాడు శూద్రుడే అవ్వాలని నియమం లేదు. ఎంతోమంది బ్రాహ్మణులు, క్షత్రియులు గా మారి రాజ్యాలు చేసారు. ఎంతోమంది క్షత్రియులు బ్రాహ్మలు అయ్యారు. వైశ్యులు కూడా క్షత్రియులుగా మారి రాజ్యాలు చేసారు. అలాగే ఎందరో శూద్రులు బ్రాహ్మణులుగా,క్షత్రియులుగా మారారు.
విశ్వామిత్రుడు,చంద్రగుప్తుడు,కృష్ణదేవరాయలు,ఆళ్వారులు, వంటివారు దానికి ఉదాహరణ. ఛాందోగ్యోపనిషత్తులో జాబాలి, నిజం పలికినందున అతని తండ్రి ఎవరో తెలియకపోయినా,బ్రాహ్మణుడు గా పరిగణనలోకి తీసుకున్నారు గురువులు.
శూద్రో బ్రాహ్మణతా మేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతామ్|
క్షత్రియా ఙ్ఞాతమేచంతు విద్యాద్వైశ్యాత్తధైవచ ||..
(మనుస్మృతి 10-65.)
గుణకర్మల వలన శూద్రకులంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు అగును,బ్రాహ్మణుడు శూద్రుడగును. అలాగే క్షత్రియులు, వైశ్యుల పరిస్థితి కూడా అంతే... అని చెబుతుంది మనుస్మృతి.
అలాగే,
స్వాధ్యాయేన జపైర్హోమై స్త్రై విద్యేనేజ్యయా సుతైః|
మహా యఙ్ఞైశ్చ యఙ్ఞైశ్చ బ్రహ్మీయం క్రియతే తనుః||
(మనుస్మృతి 2-28)
స్వాధ్యాయం, జపం, హోమానుష్ఠానం,
వేదాధ్యయనం, ధర్మపూర్వక జీవన విధానం, యఙ్ఞాచరణ చేయుట వలన శరీరం బ్రాహ్మణత్వం పొందుతుంది. అని చెబుతుంది.
పై ఉదాహరణలు మన దేశంలో పుట్టుకతో కులవ్యవస్థ లేదని చెబుతున్నాయి. అయితే,
బ్రాహ్మణో౮స్య ముఖమాసీద్బాహూ రాజన్యః కృతః|
ఊరూ తదస్య యద్ వైశ్యః పద్భ్యాం శూద్రో౮జాయతః || (యజుర్వేదం31-11)
అన్న మంత్రాన్ని చూపి పలువురు, "సాక్ష్యాత్తు భగవంతుడే శూద్రులు తనపాదాలనుంచి పుట్టారని చెప్పి, వారిని అవమానించడం చాలా బాధాకరం" అని చెబుతుంటారు. నిజానికి ఇక్కడ అలాంటి ప్రకటన ఏమీలేదు. ఈ మంత్రానికి ముందు మంత్రం ఇలా ఉంటుంది.
యత్ పురుషం వ్యదధుః కతిథా వ్యకల్పయన్?
ముఖం కిమాసీత్? కిం బాహూ? కిమూరూ?
పాదా ఉచ్యతే ||
(యజుర్వేదం 31-10.)
ఋషులు ఒక విరాట్పురుషుని కల్పించి,
ఆయన గురించి వర్ణిస్తున్నపుడు,ఏ పురుషుని వర్ణించితిరో అతనినెన్నివిధములుగా కల్పించిరి? అతని ముఖమేమి? బాహువులేమి?ఊరువులు, పాదములేవని చెప్పబడును? అని అడుగగా,(31-11 లో)
బ్రాహ్మణులు ముఖం "లాంటి"వారు,
క్షత్రియులు భుజాల "లాంటి "వారు,
వైశ్యులు తొడల"వంటి "వారు, శూద్రులు
పాదముల "వంటి "వారు అని మాత్రమే
చెప్పబడింది.
ముఖం,భుజాలు,తొడలు,పాదాలు జననేంద్రియాలు కావు కాబట్టే,వాటిద్వారా పుట్టే అవకాశంలేదు..
కాకపోతే మనిషి జ్ఞానం అనేది తల అనబడే బుర్రలోనే వుంటుంది కావున జ్ఞాన వంతులు అనగా విద్య తెలిసిన వారిని,బ్రాహ్మణులతో "తల"తో పోల్చారు...
పాదం నుండి సూద్రులు అనగా ... శ్రమ చేసి / కష్టపడడం తప్ప విద్య,వీరత్వం,శరీర దృఢత్వం,వ్యాపార తెలివితేటలు... లేనివారు ఎవ్వరైనా సూద్రులు...నిజానికి ఈ భూమిపై "సమాజానికి కావలసిన మూలాధారం గా ఉండేవారే శూద్రులు".
అందుకే వారు ఈ సమాజం అనబడే విరాట్పురుషుని శరీరం నిలబడటానికి ఆధారమైన ""పాదాలతో పోల్చబడ్డారు. ప్రాముఖ్యత నిచ్చారు.
పాదాలు హీనమైనవని, వాటితో పోల్చి వారిని అవమానిస్తున్నారు అని పలకడం అవివేకం.
అలా పలికేవారు ఒక వారంరోజులు పాదాలు వాడకుండా నడిచి, పాదాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి.
పాదాలు లేని వాడు ఎంత గొప్ప మేధావి ఐనా వాడి జీవితం రుచి రహితంగా ఉంటుంది. ఇది అంతరార్థం.ఇక వేదాలలో ఎక్కడా "అంటరానితనం గురించి లేదు. మధ్యలో వచ్చింది - (అది మన ఖర్మం.)
శూద్రులు భగవంతుని పాదములు నుండి పుట్టారని అనుకుందాం! ఎంతటి వారైనా భగవంతుని పాదాలకే కదా నమస్కారం చేస్తారు.మ్రొక్కుతారు. అంటే శూద్రులకు పొద్దున లేవగానే నమస్కారం చేస్తున్నట్టే కదా!
శరీరం నిలవడానికి ఆధారం పాదాలు.సమాజం నిలవడానికి ఉత్పత్తి వర్గం ఐన శూద్రులు ప్రధానం.
వారికి రక్షణ ఇవ్వడం ముఖ్యం అని చెప్పడానికే,
ఆనాడు శ్రీరాముడుకూడా భరతునికి తన పాదుకలు /పాదరక్షలు ఇచ్చాడు.వాటిని చూసినప్పుడు భరతునికి ఆ ప్రజలు గుర్తుకు రావాలి!
మనిషి తో సహా జీవులన్నీ భగవంతుడు నుంచి ఉత్పత్తి అయ్యి భాగవంతునిలో లీనమైపోతున్నాయి..
పురుష సూక్తంలో కవి అలంకార ప్రాయంగా అలా వర్ణించాడు.. అది కేవలం కవితాత్మక వర్ణన.. అదే నిజం అయితే మానవుని ఉత్పత్తి తెలియచేసే ప్రతి గ్రంథంలో ఉండాలి కదా..అన్ని చోట్లా జీవుడు దేవుడి నుంచి ఉత్పత్తి అవుతున్నాడనే చెప్పాయి కానీ వివిధ అంగాల నుంచి కాదు.. అన్నమయ్య కూడా ఇలానే రాసాడు
"యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నేదేవుదేహమున నిన్నియును నణగె మరి!!"
ఒక అత్యంత అందమైన,విశాలమైన బహుళ అంతస్తులు గల పెద్ద భవనం అయినా కూడా దానికి ఆధార భూతమైన పునాది (కాళ్ళు) పైనేకదా నిలబడేది
బ్రాహ్మణ, వైశ్య,క్షత్రియులకు ఆధారం,బ్రతుకునిచ్చేది,
సాయం చేసేది, ఈ సంఘంలో తల ఎత్తుకొని నిలబెట్టేది. శూద్రులే...
కానీ బ్రిటీష్ వాడు వచ్చాక, కుల వ్యవస్థ వారసత్వం అయింది. దీనిని అర్థం చేసుకోలేక మన శాస్త్రాలను మనమే నిందించుకుంటూ బ్రతుకుతున్నాము.
ఇప్పుడు మేల్కోవాలి మనం
అందుకే భగవద్గీత లో జన్మతః అందరూ సూద్రులు గుణములు బట్టి వారిని నిర్ణయిస్తారు..
చతుర్వర్ణమ్ మయా సృష్టం..గుణకర్మ విభజనే !!
జన్మనా నజాయతే బ్రాహ్మణః..జన్మనా నజాయతే శూద్రః !!
ఎవరి జన్మల చేత బ్రాహ్మణులు కాదు , అలాగనీ శూద్రులునూ కాదు. ఏవరైతే బ్రహ్మజ్ఞాన సాధన ద్వారా బ్రహ్మా జ్ఞానంలొ పరిపూర్ణులు అగుదురో వారే సద్ బ్రాహ్మణులు....బ్రాహ్మణ అనగా గుణ వాచకమే కానీ జాతి వాచకం కాదు. ఏ తల్లి గర్భమున జన్మించినా ఆ జన్మ వలన అతడు బ్రాహ్మణుడు కాదు అలగే శూద్రుడును కాదు.
ఈ శ్లోకాన్ని వక్రీకరిస్తు పైన ఉన్న ఒక సూక్తిని పట్టుకుని వెర్రి వాదోపవాదాలు చేస్తున్నారు.
ఎక్కువగా విశ్లేషించుకోకుండా నిగూఢమైన భావాన్ని గ్రహించకుండా వేదాలకు తప్పుడు వివరణలు ఆపాదిస్తూ తర్కించటమే ఈ విషయంలో కరెక్ట్ అనుకొనే ప్రభుద్దులారా,సమస్త మానవాళికి దిక్సూచిగా ఉండే అత్యున్నతమైన సనాతన ధర్మాన్ని, ఘనమైన వేద వాఙ్మయాన్ని అవమాన పరిచే వ్యాఖ్యానాలు చేసి మీ అవివేకాన్ని ప్రదర్శించకండి నా ఉద్దేశ్యంతో మీ అంగీకార తిరస్కారాలు మీ విచక్షణకే వదిలేస్తున్నాను.
నేను పెద్దల ద్వారా తెలుసుకున్న దాన్ని మీకు విన్నవించాను,సమాజహితానికి ఉపయోగపడుతుందనుకుంటే గనుక అందరికీ తెలియజేయండి. మన భారతీయ సనాతన ధర్మాన్ని సమస్త విశ్వవ్యాప్తం చేయండి...🕉️🙏
No comments:
Post a Comment