ముఖ్యమైన వార్త
మీరు విన్నారా ఈ ముఖ్యమైన వార్త?
భారత కరెన్సీ పాత నోట్లలో సెక్యూరిటీ కోసం నోటు మీద పడే వెలుతురు బట్టి రంగులు మారే ఒక గీత ఉండేది. దీనినే ఎక్స్‌క్లూజివ్ కలర్ షిఫ్ట్ సెక్యూరిటీ థ్రెడ్ అంటారు. దీనిని సరఫరా చేయడంలో సందేహాస్పద పద్ధతులను అనుసరించారు అనే ఆరోపణలు పై మాజీ ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ మరియు యూకే కి చెందిన కంపెనీ ”డి లా రూ” పై సీబీఐ మొన్న ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తర్వాత అరవింద్ ఇంటిపై జరిపిన దాడుల్లో సిబిఐ కొన్ని ముఖ్య పత్రాలను స్వాధీనం చేసుకుంది.
అసలు ఈ కరెన్సీ నోట్ల స్కామ్ ఏంటో తెలుసుకోండి. ముందు వెనుక చూడకుండా మోడీ హడావిడిగా నోట్ల రద్దు అసలు ఎందుకు చేసి ఉంటాడో ఇది పూర్తిగా చదివిన తరువాత అర్ధం చేసుకుందుకి ప్రయత్నించండి.
2004లో వాజపేయి ఓడిపోయి, UPA ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కరెన్సీ నోట్ల కోసం సెక్యూరిటీ థ్రెడ్‌లను సరఫరా చేయడానికి బ్రిటిష్ కంపెనీ
డి లా రూ కాంట్రాక్ట్‌ను పొందింది.
ఈ ఒప్పందాన్ని అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆమోదించారు. 2010 వరకు అంతా సజావుగానే సాగింది.
అయితే, ఈ డి లా రూ కంపెనీ పాకిస్తాన్‌కు కూడా ఇదే కరెన్సీ ప్రింటింగ్ పేపర్లు & ఇతర సామగ్రిని సరఫరా చేస్తున్నట్లు, పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI వీటితో భారత్ నకిలీ కరెన్సీలను పెద్దమొత్తంలో ముద్రించడానికి ఉపయోగిస్తోందని భారత్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 2010లో కనుగొన్నాయి.
అదృష్టవశాత్తూ ఆ టైం లో కాస్త నిజాయితీ పరుడైన ప్రణబ్ దా ఆర్ధిక మంత్రిగా ఉండటంతో
బ్రిటిష్ కంపనీ తో ఈ కాంట్రాక్టు రద్దు చేసి, హోమ్ మినిస్ట్రీ కి చెప్పి ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అప్పుడు హోమ్ మినిస్టర్ చిదంబరం.
ఈ చిదంబరం జులై 2012లో ఆర్ధిక మంత్రి అయ్యాడు. ఇక్కడ నుండి మళ్ళీ కధ మలుపు తిరిగింది.
మొన్న సీబీఐ పట్టుకున్న ఆర్ధిక శాఖ కార్యదర్శి ఈ అరవింద్ మయరం అప్పుడు ఎకనామిక్ ఎఫైర్స్ సెక్రెటరీ గా వున్నాడు. ఈయన రాసిన ఉత్తరం ఆధారంగా ఆ "డి లా రూ".కంపనీ పై నిషేధం ఎత్తివేసారు. వెంటనే ఈ అరవింద్ ఆర్ధిక శాఖ కార్యదర్శి గా బాధ్యత స్వీకరించి, 2015 వరకు మళ్ళీ 3సం. లకు మురిగిపోయిన కాంట్రాక్టు పునరుద్ధరించాడు. ఆర్ధిక మంత్రి అనుమతి లేదు. అంతే కాదు కాంట్రాక్టు ఇచ్చే ముందు హోమ్ శాఖ నుండి ముందస్తు అనుమతి పొందాలి. అదీ తీసుకోలేదు. ఈ సెక్రెటరీ 2015 వరకు అదే సీట్లో వున్నాడు.
ఒక సారి చూడండి. 2004లో ఆర్ధిక మంత్రి గా ఉన్న చిదంబరం ఈ కంపెనీకు కాంట్రాక్టు ఇస్తే, 2010లో అప్పటి ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సిఫారసు తో అప్పటి హోమ్ మంత్రి చిదంబరం ఈ కంపెనీని బ్లాక్ లిస్టులో పెడితే, ఒక సాధారణ ఆర్ధిక శాఖ కార్యదర్శి ఆ కంపెనీపై నిషేధం ఎత్తేయ్యండి అని సిఫార్సు చేస్తే 2012లో మళ్ళీ చిదంబరం ఆర్ధిక మంత్రిగా ఉండగా నిషేధం ఎత్తేశారు.
అసలు ఇంకో సంగతి తెలుసా? ఈ కంపనీ 2004లొనే తప్పుడు సమాచారం ఇచ్చి కాంట్రాక్ట్ పొందింది. ఎలా అంటే ఈ కంపనీ 2004లో ప్రత్యేకంగా భారత్ కోసం గ్రీన్ టు బ్లూ కలర్ షిఫ్ట్ క్లియర్ టెక్స్ట్ MRT మెషిన్-రీడబుల్ సెక్యూరిటీ థ్రెడ్‌ను భారత్ బ్యాంక్‌నోట్ పేపర్‌లో సెక్యూరిటీ ఫీచర్‌గా ఉపయోగించడం కోసం అభివృద్ధి చేసిందని, ఇది ప్రత్యేకమైన తయారీ హక్కులను కలిగి ఉందని అంటే పేటెంట్ ఉంది అని ప్రత్యేకంగా పేర్కొని కాంట్రాక్టు సంపాదించింది.
అయితే, సీబీఐ కనుక్కున్నది ఏమిటంటే 2004లో కాంట్రాక్టు పొందేసరికి ఈ కంపెనీకు అసలు పేటెంట్ లేదు అని, 2004లో అప్లై చేస్తే 2011లో పేటెంట్ వచ్చింది అని, కానీ ఆర్ధిక శాఖ గాని ఆర్ధిక మంత్రి చిదంబరం కానీ పేటెంట్ నిజంగా ఉందా లేదా అని కాంట్రాక్టు ఇచ్చేముందు 2004లో క్రాస్ చెక్ చేయలేదు.
ఇంకా సీబీఐ కనుక్కునది ఏమిటంటే ఈ డిలరూ కంపనీ తరుపున అగ్రిమెంట్ లో సంతకం చేసిన అనిల్ రఘుబీర్ కి జీతం కాకుండా ఎదో ఆఫ్ షోర్ ఫారెన్ కంపనీ నుండి 2011లో ₹8.20కోట్లు నగదు ముట్టింది. ఎవరివి ఈ ఆఫ్ షోర్ కంపెనీలు? పాక్ ISI వి? ఏమో?
2004 నుండి 2014 వరకు మధ్యలో 2 సం. లు.మినహా ఒకే కంపనీ మనకు పాకిస్తాన్ కు కూడ కరెన్సీ పేపర్ మరియు సెక్యూరిటీ థ్రెడ్ సప్లై చేసింది బహుశా చిదంబరం సహాయ సహకారాలతో?
పాక్ ISI కి మన దేశ కరెన్సీ దొంగ నోట్లు ప్రింట్ కొట్టి దేశంలో కి వదలడం, ఇస్లామిక్ టెర్రరిస్టుల కు, నక్సల్స్ కి, ఖాలిస్తాన్ ఉగ్రవాదులకు పంపిణీ చెయడం ఎంత సులువో ఆలోచించండి. దేశంలో ఏవి అసలు నోట్లు ఏవి దొంగ నోట్లు తెలియనంత పక్కాగా దొంగనోట్ల ప్రింటింగ్ జరిగేది.
2009లో వచ్చిన ఇండియా టుడే రిపోర్టు ప్రకారం ₹90,000 కోట్ల విలువ గల ఫేక్ కరెన్సీ దేశంలో ISI ద్వారా చలామణిలో వుండేదట.
నోట్ల రద్దు తరువాత దేశం.లో టెర్రర్ దాడులు తగ్గి పాక్ ఆర్ధిక వ్యవస్థ ఎందుకు చిన్నాభిన్నం అయిందో ఆలోచించండి. భారత్ లో ఇంటి దొంగలే పాక్ బలం.
....చాడా శాస్త్రి.....
కొస మెరుపు: రాహుల్ గాంధీ మొన్న తన భారత్-థోడో యాత్రలో ఈ మాజీ ఆర్ధిక సెక్రెటరీ అరవింద్ మయారాం తో కలిసి నడిచారు. గతంలోనఒక పోస్ట్ రాసా కదా..వీరు అంతా ఢిల్లీ దోపిడీ ముఠా సభ్యులే.
No comments:
Post a Comment