వేద మంత్రాలను దర్శించిన మహిళా మంత్ర ద్రష్ట లు వీరిని ఆ కాలంలో ఋషికలు అని పిలిచేవారు
గార్గి, రోమష,
ఘోషా, విశ్వవర,
ఆత్రేయి, లోపాముద్ర,
అపాల, శ్రద్ధ,
వైవశ్వతి, యామి,
పౌలమి, సూర్య,
శ్వాస్తి, శిఖండిని,
ఊర్వశి, సచి,
దేవరాణి, ఇంద్రమాత,
గోద, జుహు,
మైత్రేయి.
వీళ్ళంతా వేదాలలో ఉదాహరించిన స్త్రీ మూర్తులు. వేదాలను స్త్రీలు పఠించరాదు, శూద్రులు నేర్చుకోరాదు అని మనుస్మ్రతి లో చెప్పారని చేస్తున్న వితండ వాదాన్ని తప్పని నిరూపించేలా ఆధారాలతో సహా ఇస్తున్నాం. వేదాలను నేర్చుకొని వేదాలలోని పలు మంత్ర సూక్తాలు దర్శించి, వ్యాఖ్యానించిన మేధావంతులైన మహిళలు వీరంతా
మహిళాయోగులు, స్త్రీబుుషులు, యోగిణిలు, స్త్రీ మునులనే మాటలను మనం వినివుంటాం.కాని అలాపిలవటం సరికాదు వీరిని బుుషికలు లేదా బ్రహ్మవాదినులని పిలవాలి.
బుుగ్వేదంలో 23 మంది బుుషికలు సూక్తాలు దర్శించారు. అపాల దర్శించిన సూక్తానికి ఆమె పేరు మీదనే అపాలసూక్తమని పిలుస్తారు.
విశ్వవర ఐదవ మండలంలోని 28 వ సూక్తాన్ని లోపాముద్ర 19వ సూక్తాన్ని దర్శించారు. బుుగ్వేదంలో 125 సూక్తాన్ని జుహు దర్శించింది.
గార్గి శుక్ల యజుర్వేద దర్శన ద్రష్ట యజ్ఞవల్కునితో వేదాంత చర్చ చేసింది...! బ్రహ్మ పుత్రి
పరిపాలన విషయంలో స్త్రీలు:-
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - అధర్వణవేదం 7.38.4
దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి- ఋగ్వేదం 10.85.46
ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు.
కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.
ఆస్తిహక్కు:-
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- ఋగ్వేదం 3.31.1
కుటుంబం:-
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- అధర్వణవేదం 14.1.20
No comments:
Post a Comment