రాబర్ట్ డి నోబిలి .
వీడు ఐరోపా నుండి క్రైస్తవ మత ప్రచారానికి భారతదేశానికి వచ్చాడు . అప్పటికి మహోన్నత విజయ నగర సామ్రాజ్యం విచ్చిన్నం అయింది . అంతా చిన్న చిన్న సామ్రాజ్యాలు అయ్యాయి. ఎక్కడ చూసినా భారతీయ సనాతన ధర్మపరులలో భయాందోళనలు నిర్లిప్తత . విజయ నగర సామ్రాజ్య కాలములో మొత్తం దక్షిణ భారత దేశం అంతా తెలుగు వారి పాలనలో మన కనుసన్నల్లోనే ఉండేది. విజయ నగర సామ్రాజ్యం విచ్చిన్నముతో నాయకరాజులు తమిళనాడులోని మధుర మరియు తంజావూరు ప్రాంతాలను స్వతంత్ర రాజులుగా యేలసాగారు. వీరందరూ ధర్మ రంజకులైన ప్రభువులు. విజయనగరం సామ్రాజ్యం ఉన్నపుడే పోర్చుగీసు వారు మన దేశములో అడుగుపెట్టారని గోవా ప్రాంతములో అని అందరికీ తెలిసిన విషయమే. వీరు మన కృష్ణ రాయలకు మందీ మార్బలం అశ్వాలు సమకూర్చారు కూడా. అప్పుడు వీరి వ్యాపకం అంతా వ్యాపారమే. తరువాత తమ మత ప్రచారం చేయడానికి పూనుకున్నారు.
విజయనగర సామ్రాజ్య విచ్చిత్తితో ఏర్పడిన అనిశ్చితి కాలములో కొన్నాళ్ళయ్యాకా నాయక రాజుల పాలనా కాలములో మధుర సామ్రాజ్యానికి తిరుమల నాయకుడు రాజయ్యాడు . ఇతను ధర్మ రంజకుడు . అందరినీ సమాదరించాడు . . ఆ సమయములోనే వీరు ఆయన్ని ఆశ్రయించి వర్తకం పేరిట కొన్ని స్థావరాలు ఏర్పరచుకున్నారు. మెల్లగా వారంతా మత ప్రచారం చేయడానికి ఆరంభించారు. నేరుగా మత ప్రచారం చేయడం వల్ల వారి భాషా అవీ తెలియక పోవడం వల్ల మన వారు పెద్దగా వారిని పట్టించుకోలేదు. పైగా వీరంతా విచ్చలవిడిగా మన దేశపు స్త్రీలను ఆశలు పెట్టి వివాహాలు ఆడి పిల్లలను కన్నారు. వీరి ఆచార వ్యవహారాలు, విపరీతాలు చూసి అధికులు వీరికి దూరంగా ఉండేవారు. వారికి కావలసింది మత ప్రచారమే కాబట్టి డబ్బాశ చూపెట్టి లోబరచుకునేవారు అధికులను . గొంజాలెజ్ ఫెర్నాండేజ్ అనేవాడు కృష్ణప్ప నాయకుడు అనుమతితో మధురలో గుడిలాగా ఉండే ప్రార్థన మందిరం కట్టుకున్నాడు . మత ప్రచారం చేసేవారు . అయినా ఎవరూ ఈ మతములో పెద్దగా చేరేవారు కాదు .
ఇలా 1604లో రోబర్టో డీ నోబిలి అనే ఇటలీకి చెందిన మత ప్రచారకుడు మధుర ప్రాంతానికి వచ్చాడు . అతను నేరుగా మత ప్రచారానికి పూనుకున్నాడు . మన దేశపు ఆచారాలను గూర్చి, విగ్రహారాధనను గూర్చి తక్కువ చేసి మతాన్ని కించపరచడం మొదలు పెట్టారు. ప్రజలు ప్రతిఘటించారు. కొన్ని చోట్ల దేహ శుద్ధి కూడా చేయబడింది. ఇంక ఇలా అయితే కుదరదు అని వేషం మార్చాడు. సన్యాసి వేషం వేసి తెలుగు తమిళ సంస్కృతాలు నేర్చాడు. బ్రాహ్మణులతో సహవాసం చేసి ఒక బ్రాహ్మణుడిని వంట చేసేదానికి పెట్టుకున్నాడు. వారి వద్ధ చాలా అబద్ధాలు చెప్పేవాడు . వారు అదంతా నిజమని నమ్మేసేవారు . అలా కొందరు బ్రాహ్మణులను మిత్రులను చేసుకున్నారు.
ప్రశ్నించిన ప్రజలకు తాను పోర్చుగీస్ వాడిని కాననీ, సన్యసించి వచ్చిన ఇటాలియన్ రాజసంతతి వాడిననీ చెప్పుకుని పూరిపాకలో నివసిస్తూ, కాషాయ బట్టలు కట్టుకొని, పావుకోళ్ళు తొడుక్కొని, జంధ్యం వేసుకొని , దండం, కమండలం చేతబట్టి సన్యాసిలాగా జీవిస్తూ, తమిళం, సంస్కృతం, తెలుగు నేర్చుకొని నగర ప్రముఖులతో ధార్మిక చర్చలు చేస్తూ, తత్వ బోధనంద స్వామి అనే పేరుతో మత ప్రచారం చేయసాగాడు. మన హైందవ మతములోని విషయాలు కూడా చెబుతున్నట్టే చెబుతూ క్రైస్తవం , యేసు గూర్చి బోధలు చేసేవాడు. అనేకమంది బ్రాహ్మణులను కూడా తన గుంపులో చేర్చుకున్నారు. ఈ మధుర సామ్రాజ్యములో అప్పటిలో అత్యధికులు మన తెలుగువారే . వీరు తమిళుల కంటే వేరే వాళ్లతో సులువుగా కలసిపోయేవారు . అది అదనుగా తీసుకుని ఈతడు మెల్లగా వారితో మిత్రత్వం నెరిపాడు. మన ఆచార వ్యవహారాలతోబాటు .. ఇక్కడి అలవాట్లు అన్నీ ఒంట బట్టించుకుని వాటితో కలిపిన క్రైస్తవాన్ని బోధించ సాగాడు. వీరు గొడ్డు మాంసం తింటూ విచ్చల విడిగా తాగుతూ స్త్రీలతో సంభోగిస్తూ ఉండేవారు కాబట్టి అత్యధికులు వీరి దూరంగా ఉంచేవారు. వీరినివీరి సంతతిని ఫరంగీలు అనేవారు.. అనగా సంకర జాతివారు . ఇలా వారికి పుట్టిన సంతతి తాము కూడా కాస్త వారి అలవాట్లు నేర్చుకుని తాము కూడా ఆజాతి వారమే అనే ఊహతో వారి అలవాట్లు మతం అలవాటు చేసుకున్నారు.
ఇలా కొన్నాళ్ళకు రాబర్ట్ డి నోబిలీ స్వామిగా మన పుస్తకాలూ , శ్రుతులు, ఇతిహాసాలు అన్నీ చదివారు. బ్రాహ్మణులను కొందరిని లోబరుచుకుని వారి ఆచార వ్యవహారాలను వంట బట్టించుకుని వారిలాగే మెలగసాగాడు . అస్పృశ్యత బోధించాడు .. సన్యాసిలాగా మాంసాహారము అన్నీ వదలి జీవించాడు . తక్కువ జాతి వారు అంటూ కొందరికి దర్శనం ఇచ్చేవాడు కాదు . అలా అగ్రవర్ణస్తులు కొందరు ఈతని మాటలు వినసాగారు. కొత్తమతం అన్నట్టు మరి కొందరిని ఆకర్షించాడు. ధార్మిక చర్చలు అంటూ తన కొత్తమతాన్ని ప్రచారం చేయ సాగాడు. ఇంక నమ్మిక కుదిరాక మెల్లగా ఇంత వరకు తక్కువ జాతి వారంటూ అతను దూరంగా పెట్టిన భారతీయులతో సంపర్కం మొదలు పెట్టాడు. దళిత వాడలకు వెళ్లి వారికి సేవలు అంటూ మెల్లగా మన తీరుగానే రక్ష రేఖలు విబూది అంటూ నయం చేసినట్టు చేసి వారిని మతములో కలిపేవాడు.
నోబిలీ మన దేశానికి రాకముందు ఉన్న మత ప్రచారకులు అనేక సంవత్సరాలు కష్టపడితే ఓ పదిమందిని తప్పితే తప్ప ఇంకెవర్నీ క్రైస్తవులుగా మార్చలేకపోయారు . ఈ నోబిలీ మన హిందూ మతగ్రంథాలలోని విషయాలని కలుపుకుని మాట్లాడుతూ క్రైస్తవమతానికి చాలామందిని మార్చటంలో కృతకృత్యుడయ్యాడు. కొన్నాళ్ళకు మేలుకొన్న స్థానికులు ఆయన యత్నాలను ప్రతిఘటించటం మొదలుపెట్టారు. ఓ రోజు మధుర వీధుల్లో ఇతను మత ప్రచారం సాగిస్తున్నాడు.మన హైందవ ధర్మాలను వక్రీకరించుతూ సాగుతున్న వాటికీ ప్రజలు ఎదురు తిరిగారు . ఇంక కుదరదని తాను చెప్పదలచుకున్న వాటికి మన సంస్కృత శ్లోకాలను వల్లె వేస్తూ క్రీస్తు సిలువ, రక్ష రేఖ , విబూది చల్లుతూ తనకు మంత్రం శక్తులున్నాయని నమ్మించాడు. అనేకులు అతని మతములో చేరారు. చివరకు రాజోద్యోగులు కూడా ఆ మతములో చేరారు.
ప్రజలు గుడులకు వెళ్లడం మానేరు. ఎంత సేపు ఇతనితో గడపడం ఎక్కువయింది . విపరీత ఆచారాలు మొదలయ్యాయి . కొందరు హైందవ గురువులను ఓడించి తన మతములో కలుపుకున్నాడు. సామ్రాజ్యములో గగ్గోలు పుట్టించాడు . ఆ సమయములో మధుర మీనాక్షి ఆలయ ప్రధాన పూజారి ఈతనిని తన వాదనలతో బెంబేలెత్తించాడు. పైగా అతను ఉంటున్న స్థలం .. ఆ క్రైస్తవ గుడి స్థలం తనవేయని రాజాస్థానములో అతను చేస్తున్న వాటిని పిర్యాదు చేసారు. దానితో అతను భయపడి మధురలో మత ప్రచారం మానుకున్నాడు .తరువాత మధుర బయట ఉన్న ప్రాంతాలలో ఆటవికులు, దళిత వాడలు తిరిగి మత ప్రచారం చేయసాగాడు . అతడి కుయుక్తులను కనిపెట్టిన ప్రజలు పెద్ద పెట్టున ఎదురు తిరిగారు.
మధుర సామ్రాజ్య అధిపతి తిరుమల నాయకుని సైన్యాధిపతి అయిన సేతుపతి భార్య అంబ సముద్రానికి చెందిన యువరాణి . ఆమె పేరు ఏకవీర . అతి లోక సౌందర్యవతి . విజ్ఞాన తత్పరురాలు . శాస్త్ర ధర్మ విషయ విశేషాలు తెలిసిన వారు. ఒకనాడు అతన్ని మధుర వీధుల్లో చూసి అక్కడ జరుగుతున్న కలకలం విని అతనిని తనతో వాదనకు రమ్మని ఆహ్వానిస్తుంది. ఆ వాదనలో అతడిని ఓడగొట్టి అతని కాపట్యం బయటపెడుతుంది . అతను సన్యాసి వేషం ధరించరాదని దేశం నుండి వెడలగొట్టిస్తుంది . అలా కొన్నాళ్ళు అతను శ్రీలంకకు వెళ్ళిపోయాడు . అక్కడ కూడా మత ప్రచారం చేసి చివరకు మద్రాస్ లోని మైలాపూరులో చేరుకొని అక్కడ పోయాడు.
ఇదీ మొదటి రోజుల్లో క్రైస్తవ ప్రచారం మొదలు పెట్టిన జగద్గురు తత్వబోధానంద స్వామి అని పేరు బడసిన రాబర్ట్ డి నోబిలీ కథ,.
No comments:
Post a Comment