Wednesday 21 December 2022

 ఎప్పుడైనా ఆలోచించారా?

1. "క్విట్ ఇండియా" ఉద్యమం 1942లో మొదలై, 1942లోనే ఆగి పోతే, స్వాతంత్ర్యం 1947లో ఎలా వచ్చింది?

2. భారత్ కే కాకుండా ఇంకో 50 దేశాలకు కూడా బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఎందుకిచ్చారు? అక్కడేమీ కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమాలు లేవే?

3. కాంగ్రెస్! బ్రిటీష్ వారికి వ్యతిరేకం అయితే, వెళ్ళేటప్పుడు దేశాన్ని కాంగ్రెస్ కు ఎందుకు అప్పగించి వెళ్లారు? సుభాష్ చంద్రబోస్ ను అప్పగించాలని ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?

4. బ్రిటిష్ వారిని వెనక్కి పంపిన ఆ శక్తి ఏమిటి?

మొదట అర్థం చేసుకో వలసింది బ్రిటిష్ వారు ప్రపంచాన్ని ఎలా పాలించారు? అనే విషయం.

*రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పోరాడిన 35 లక్షల మందిలో 25 లక్షల మంది భారతీయులు.*

అర్థం అయిందా బ్రిటన్ ఎవరి బలంతో ప్రపంచాన్ని పాలించిందో? 25 లక్షల మంది భారతీయ సైనికుల దన్నుతో.

ఆ 25 లక్షల మంది ఇక తమ కోసం చావడానికి సిద్ధంగా లేరని, అందులో సగం మంది స్వతంత్ర భారతం కోసం తమను చంపటానికి కూడా సిద్ధం అయ్యారనీ తెలిశాక ఇక వెళ్ళక తప్పని పరిస్థితి.

వాళ్ళలో ఆ విప్లవ జ్వాల రగిలించింది ఎవరు? 

భగత్ సింగా? చంద్ర శేఖర్ ఆజాదా? 

ఉహూ, వాళ్ళు కేవలం వీరులు. తమ త్యాగంతో లక్షల మందిని ఇన్స్పైర్ అయితే చెయ్యి గలిగారు. కానీ సైన్యంలో తిరుగుబాటు తేగలిగిన స్థాయి కాదు.

గాంధీనా? నెహ్రూనా?

ఉహూ, వాళ్లు బ్రిటీష్ ప్రభుత్వంలో ఆల్రెడీ పార్ట్నర్లు. (దేశంలోని ఆనాటి 16-18 ప్రావిన్సుల్లో కాంగ్రెస్, ముస్లింలీగ్ లే కదా రిప్రజెంటేటివ్ లు.

బొంబాయి నేవల్ మ్యూటినీ గురించి విన్నారా?

కరాచీ నేవల్ మ్యూటినీ గురించి విన్నారా?

జర్మనీలో భారత స్వాతంత్ర్యం కోసం 15,000 మందితో ఒక సైన్యం

తయారయ్యింది అనీ.,

సింగపూర్లో 43,000 మందితో ఇంకొక సైన్యం తయారయ్యింది అనీ., 

ఆ సైన్యం జర్మన్ & జపనీస్ సైన్యాలతో కలిసి బర్మా, అండమాన్, మణిపూర్, నాగాలాండ్ లను బ్రిటిష్ పాలన నుండి విముక్తం చేసిందనీ విన్నారా?

స్వతంత్ర భారత ప్రభుత్వం (ప్రవాసంలో) 1943లోనే ఏర్పడిందని విన్నారా?

1943 నుంచి బ్రిటీష్ భారత సైన్యంలో ఏ ఇద్దరి మధ్యనైనా జరిగిన ప్రతి సంభాషణా ఈ "ఆజాద్ హింద్ ఫౌజ్" ఎక్కడి వరకు చేరుకుందనే విషయం గురించేననీ..

43,000 మందితో "ఆజాద్ హింద్ ఫౌజ్" బర్మా & ఈశాన్య భారతాన్ని విముక్తం చేయగలిగితే ప్రపంచాన్ని గెలిచిన తాము ఇంకెంత చెయ్యి గలమో కదా అని ప్రతి బ్యారక్ లో ప్రతి రోజూ చర్చలు జరిగేవనీ...

ఫలితంగా "బొంబాయి నేవీ హెడ్ క్వార్టర్స్"లో తిరుగుబాటు జరిగిందనీ...

వెను వెంటనే కరాచీలోనూ తిరుగుబాటు జరిగిందనీ...

భారత్ లో ఇంకొన్ని నెలలు ఉంటే ఉన్న తెల్ల వారందరి ఉాచకోత తప్పదని వందలాది మెసేజెస్ లండన్ కు వెళ్ళాయనీ...

ఫలితంగానే 2 లక్షలకు పైగా భారత్ లో ఉన్న తెల్ల వారిని వెంటనే వెనక్కు రప్పించాలనే నిర్ణయం జరిగిందనీ...

ఎలాగూ అధికారంలో భాగస్వాములైన కాంగ్రెస్, ముస్లింలీగ్ లకు భారత పగ్గాలు అప్పగించి బ్రిటన్ తన దారి తాను చూసుకుందనీ...

మన చరిత్ర పుస్తకాలు మనకు ఎందుకు చెప్పవో ఇంకొక వ్యాసంలో!🙏

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...