జెలెన్స్కీ తో కలిసి నాటో దేశాలు చేసిన వ్యూహ రచన బాక్ ఫైర్ అయింద
అమెరికా,యూరోప్ మరియు ఉక్రెయిన్ !
ఉక్రెయిన్ లో రష్యాకి వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ప్రాక్సీ వార్ సత్ఫలితాలని ఇవ్వటంలేదా ?
అమెరికా,యూరోపులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వాలోదిమిర్ జెలెన్స్కీ పట్ల అసంతృప్తి తో ఉన్నారా?
అక్కడ తప్పు ఎవరు చేస్తున్నారు ?
ఈ విషయాలని తెలుసుకోవాలి అంటే ముందు గత నాలుగు రోజులుగా జరిగిన,ఇప్పుడు జరుగుతున్న పరిణామానా లని జాగ్రత్తగా పరిశీలిస్తే జెలెన్స్కీ తో కలిసి నాటో దేశాలు చేసిన వ్యూహ రచన బాక్ ఫైర్ అయిందనే చెప్పుకోవాలి!
మూడు రోజుల క్రితం రష్యా పోలాండ్ లోని గ్రామం మీద మిసైళ్ళ తో దాడి చేసిందని పోలాండ్ తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే పోలాండ్ గ్రామం అయిన ప్రేజ్వడొవ్ లో మిసైల్ పడ్డ చోట శిధిలాలని తనిఖీ చేస్తే అవి ఉక్రెయిన్ ప్రవయోగించిన మిసైళ్లు అని ఆధారాలు బయటపడ్డాయి. రష్యా కావొచ్చు లేదా ఉక్రెయిన్ కావొచ్చు ప్రతీ రాకెట్ లేదా మిస్సైల్ మీద బాచ్ నంబర్ తో పాటు వాటిని తయారుచేసిన దేశం పేరుని ముద్రిస్తారు. దొరికిన మిసైళ్ళ ఆవశేషాల మీద ఉక్రెయిన్ పేరు స్పష్టంగా కనిపించింది. ఎప్పుడో సోవియట్ కాలం నాటి S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తాలూకు మిసైళ్లు అవి. సోవియట్ విచ్ఛిన్నం అయిన తరువాత ఆయుధాలని వివిధ మాజీ సోవియట్ రిపబ్లిక్కు లకి పంచింది రష్యా 1992 లో. అలా పంచబడ్డ ఆయుధాల లో S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది ఉక్రెయిన్ దగ్గర.
ఇవాళ రేపు మిసైళ్లు అనేవి ఫింగర్ ప్రింట్ లాంటివి. అలాగే శాటిలైట్ ద్వారా మిస్సైల్ ఎక్కడి నుండి ఎక్కడిదాక ప్రయాణించిందో కనుక్కోవచ్చు. అలాంటిది పోలాండ్ గ్రామంలో పడ్డ మిసైల్ తమది కాదని జెలెన్స్కీ మొండిగా వాదిస్తున్నాడు సాక్ష్యాధారాలు ఎదురుగా కనపడుతున్నా సరే ! నిజానికి ఉక్రెయిన్ మీద ఎలెక్ట్రిక్ స్టేషన్స్ ని లక్ష్యంగా చేసుకొని రష్యా అదే పనిగా క్రూయిజ్ మిసైళ్ళని ప్రయోగిస్తున్నసమయంలో వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి గాను ఉక్రెయిన్ తన S-300 ఎయిర్ డిఫెన్స్ ద్వారా మిసైళ్ళ ని ప్రయోగిస్తున్నది. సోవియట్ కాలం నాటివి కావడం వలన వాటిలో రెండు మిస్సైళ్ళు దారి తప్పి నేరుగా పోలాండ్ లో లాండ్ అయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా నైనా అమెరికా తో పాటు నాటో దేశాలు కూడా నిర్ధారించాయి. ఏదో ఒక వంకతో నాటో ని రష్యాతో యుద్ధం లోకి దించడానికి తాపత్రయపడుతున్నాడు జెలెన్స్కీ ! రష్యా మాత్రం ఉక్రెయిన్ ప్రయోగించిన మిసైళ్ళ ట్రాజెక్టరీ ని రీ క్రియేట్ చేసి 100 మీటర్ల దూరంలో పడ్డట్లుగా చూపించింది అసలు పడ్డ చోటు నుండి. అంటే జెలెన్స్కీ ఉద్దేశ్యపూర్వకంగా కావాలనే పోలాండ్ మీద ప్రయోగించాడు.
నాటో ఉక్రెయిన్ కి ఆయుధాల సప్లై తగ్గించడం వెనుక కారణం ఏమిటి ?
గత ఏప్రిల్ నెలలో ఉక్రెయిన్ సైన్యానికి అమెరికా,బ్రిటన్లు అధునాతన స్టింగర్ లు మరియు ఎన్ లా పోర్టబుల్ మిసైల్ లాంచర్ లు ఇచ్చాయి. కానీ వాటిని బాక్సులలో నుండి తీయనివి కనీసం 300 దాకా రష్యన్ సైన్యానికి చిక్కాయి. వాటిని రివర్స్ ఇంజినీరింగ్ చేసి తయారుచేయగల సత్తా రష్యాకి ఉంది. ఒక పక్క ఉక్రెయిన్ తో తలపడుతూనే రష్యా మరోవైపు స్టింగర్,ఎన్ లా పోర్టబుల్ మిసైల్ లని రివర్స్ ఇంజినీరింగ్ చేసి కొత్త వాటిని తయారుచేసేపనిలో బిజీ గా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అమెరికా దగ్గర ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయం ఇటు అమెరికాకి అటు బ్రిటన్ లకి. ఎందుకంటే అధునాతన ఏవియానిక్స్ లతో తయారుచేసిన వాటిని అమెరికా,బ్రిటన్ లకంటే తక్కువ ధరలో తయారు చేసి ఇతర దేశాలకి అమ్మగల సత్తా రష్యాకి ఉంది. పుతిన్ ఈ విషయం లో చాలా పట్టుదలగా ఉన్నాడు.
మరోవైపు అమెరికన్ మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ అయిన హిమార్స్ కూడా ట్రక్కుతో సహా రష్యన్ మిలటరీ కి చిక్కాయి. పుతిన్ himars mbrl ని కూడా రివర్స్ ఇంజినీరింగ్ చేసేపనిలో ఉన్నాడు యుద్ధ ప్రాతిపదికన! దాంతో ఎలాంటి ఆధునిక ఆయుధాలని ఇవ్వకూడదని అమెరికా తో పాటు మిగతా నాటో దేశాలు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. జెలెన్స్కీ ఆందోళనకి కారణం ఇదే !
అయితే ముందుగా మాట ఇచ్చిన జర్మనీ ఉక్రెయిన్ కి IRIS-T ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని డెలివరీ చేసింది ఈ నెల 15న. ఇది వాగ్దానం చేసిన నాలుగు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో మొదటిది. మిగతా మూడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వచ్చే సంవత్సరం లో డెలివరీ చేస్తుంది జర్మనీ. IRIS-T system పరిధి 40 కిలోమీటర్ల దూరం మరియు 20 km ఎత్తు వరకు వచ్చే మిసైళ్ళ ని అడ్డుకోగలదు. కానీ వీటిని రష్యా చాలా తేలికగా నాశనం చేయగలదు తన దగ్గర ఉన్న యాంటీ రేడియేషన్ మిస్సయిళ్ల తో. బహుశా వచ్చే సంవత్సరం మిగతా మూడు సిస్టమ్స్ ని జర్మనీ డెలివరీ చేసే లోపు మొదటి దానిని నాశనం చేసి పుతిన్ సవాలు విసిరే అవకాశం ఉంది.
రష్యా ఇటీవలే తన ఫైటర్ బాంబర్ అయిన Su-34s లతో ఉక్రెయిన్ మీద దాడులు చేస్తున్నది అవి మంచి ఫలితాలని ఇస్తున్నాయి. మొదటి సారిగా Su-34s ని ఏవియానిక్స్ తో పాటు,కౌంటర్ మెజర్స్ సిస్టమ్స్ ని ఆధునీకరించి ఉపయోగిస్తున్నది రష్యా. Su-34s లని ప్రయోగించి జర్మన్ IRIS-T system లని నాశనం చేయగలదు రష్యా. ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్ మొదలయిన తరువాత Su-34s లు ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి కానీ ఇప్పుడు వాటిని ఆధునీకరించిన తరువాత మాత్రం స్వేచ్ఛగా ఉక్రెయిన్ గగనతలం మీద దాడులు చేస్తున్నాయి. Su-34s లు ఎక్కువ ఎత్తులో వేగంగా ఎగురుతూ భూమి మీద ఉండే లక్ష్యాలని నాశనం చేయగలదు మరియు గగన తలంలో తనకి ఎదురయ్యే శత్రు దేశపు ఫైటర్ జెట్ లని కూల్చివేగలదు. ఉక్రెయిన్ యుద్ధం వలన రష్యా కి చెందిన Su-34s లు మళ్ళీ వార్తలలోకి ఎక్కుతున్నాయి. ఇది మంచి పరిణామం. ప్రస్తుతం పుతిన్ తన Mig-31 లతో కాంబినేషన్ గా Su-34s లని ఉపయోగిస్తున్నాడు ఉక్రెయిన్ మీద. అయితే వీటిని ఎదుర్కోవడాని జెలెన్స్కీ అమెరికన్ F-15 స్ట్రైక్ ఈగిల్ లని ఇవ్వాలని కోరుతున్నాడు కానీ అమెరికా తిరస్కరించింది.
ఉక్రెయిన్ తో యుద్ధం మొదలుపెట్టిన తరువాత రష్యా బాగానే నష్టపోయింది కానీ ఇప్పటి వరకు పేలవమయిన ప్రదర్శన చూపించిన రష్యన్ సుఖోయ్ ఫైటర్ జెట్స్ గత పది రోజులుగా ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ ని తప్పించుకొని దాడులు చేయడం మొదలుపెట్టడంతో మళ్ళీ వార్తలలోకి ఎక్కుతున్నాయి. ఇప్పటి వరక రష్యాకి యుద్ధ అనుభవం లేదు పైగా నాటో దేశాలతో ప్రాక్సీ వార్ చేయడం వలన తన ఫైటర్ జెట్స్ లోని లోపాలని ఒక్కో దానిని సవరించుకుంటూ తమ ఆయుధాలని మరింత మెరుగుపరుచుకోవడానికి అవకాశం దక్కింది. ఇదే అమెరికా తో పాటు నాటో దేశాలని కలవరపరుస్తున్నది.
ఎనిమిది నెలల యుద్ధ అనుభవంతో రష్యా క్రమంగా బలపడుతున్నది ఇప్పుడు. నాటో దేశాలని ఆలోచనలో పడవేస్తున్నది రష్యా ఒక వేళ ఉక్రెయిన్ కి అధునాతన ఆయుధాలని ఇచ్చినా వాటిని ఏమాత్రం రష్యా నాశనం చేసినా అమెరికన్,యూరోపియన్ ఆయుధాల రెప్యూటేషన్ దెబ్బతినవచ్చు అనే భయం ఇప్పటికే మొదలయ్యింది.
ఇప్పటికే జో బిడెన్ జెలెన్స్కీ తో మాట్లాడుతూ పుతిన్ తో సంధి చేసుకొమ్మని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు!అంటే యుద్ధానికి విరామం దొరకబోతున్నట్లే !
రష్యా మీద ఉక్రెన్ నీ ఉపయోగించుకొని అమెరికా యుద్ధం చేస్తుంది అని అందరికి తెలిసిన సత్యం కానీ 🤔🕵️♂️ఇంకో లోగుట్టు రష్యాకి సహకారం అందిస్తూ అమెరికా మీద భారత్ కూడా యుద్ధం చేస్తుంది మన టార్గెట్ డాలర్ ఆధిపత్యం తగ్గించి మన రూపాయి విలువ పెంచుకోవడమే 🤔🕵️♂️ ఇట్స్ క్లియర్.....
No comments:
Post a Comment