Monday 21 November 2022

 *🇮🇳భగత్ సింగ్, నేతాజీ, సావర్కర్🇮🇳* 

*ఈ ముగ్గురు మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకోవడం మన విధి.. అయితే మన స్వతంత్ర్య భారత దేశంలో సావర్కర్ గారి చరిత్రను ప్రజలకు తెలియకుండా ఉండేందుకు నెహ్రూ నేత్రుత్వం లోని కాంగ్రేస్ పార్టీ ఆనాడు విశ్వ ప్రయత్నం చేసింది.. అలా వారి పై ఇన్నేళ్లుగా ప్రజల్లో విషం నింపే ప్రయత్నం జరిగింది.. కానీ* *ఇప్పుడు కాంగ్రేస్ నిజ స్వరూపం బయటపడడం తో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీర సావర్కర్ పట్ల దేశ ప్రజల్లో గౌరవ భావం పెరగడం తో కొన్ని విషయాలు పంచుకోవాలని అనిపించింది..* 

*బ్రిటీషు పై యుద్ధానికి మొట్టమొదలు సావర్కర్ గారే 1905వ సంవత్సరం లోనే అది కూడా ఇంగ్లాండు దేశం లో కొన్ని రహస్య తిరుగుబాటు గ్రూప్ లను ఏర్పాటు చేశాడు. అందుకు ఆ దేశంలో ఉన్న వివిధ భారతీయ విద్యార్ధి* *సంఘటనలను ఒక్క తాటి పైకి తెచ్చి స్వాతంత్ర్యం కోసం కలిసికట్టుగా పోరాడేందుకు ప్రోత్సహించాడు.*

*బ్రిటీషు బానిస సంకెళ్ల నుండి మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికి భారతీయులను పోరాడేవిధంగా తయారుచేయాలని జాతీయవాద సాహిత్యాన్ని స్వయంగా రాశాడు. భారతీయ మొదటి స్వాతంత్ర్య యుద్ధం పై వీర సావర్కర్ రాసిన పుస్తకం ఎంతోమంది భారతీయుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించింది. ఇలా స్వాతంత్ర్య సంగ్రామంలో స్వచ్ఛందంగా* *విద్యార్ధులు సైతం పాల్గొనేలా చేశాడు.*

*1910 లో బ్రిటీషు ప్రభుత్వం పై తిరుగుబాటు చేసేందుకు సావర్కర్* *పన్నాగం పన్నుతున్నాడని కనిపెట్టి వారిని భారత్ తీస్కొచ్చి అండామాన్ దీవుల్లోని జైలులో అత్యంత కఠినమైన శిక్షను విధించారు.* *భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో అత్యధిక కాలం జైళ్లో మగ్గిన వీరుడు సావర్కర్.. మనిషి నిలబడేందుకు కూడా సౌకర్యవంతమైన స్థలం లేనటువంటి రూమ్ లో భంధించి చిత్రహింసలకు గురిచేశారు.* 

*సావర్కర్ పై పెట్టిన కేసు మామూలుది కాదు.. ఏకంగా బ్రటీషు రాజ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటానికి రహస్య సైన్యన్ని ఏర్పాటు చేస్తున్నాడనే విషయాన్ని కనిపెట్టి వారికి ఆ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.* *మరో కేసులో బ్రటీషు అధికారి ని హత్య చేసేందుకు సహకరించాడనే మరో యావజ్జీవ కారాగాక శిక్ష విధించారు. రెండు కేసులు కలిపి 50 సంవత్సరాల శిక్ష విధించారు.* 

*1923 లో వీర సావర్కర్ శిక్షను తగ్గించాలని కాంగ్రేస్ సైతం బ్రీటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది.* 

*ఇవ్వన్నీ మనకు తెలియకూడదని కాంగ్రేస్ రాసిన పాఠ్య పుస్తకాల్లోని చరిత్ర లో సావర్కర్ విషయాలను పొందుపర్చలేదు.*

*ఇకపోతే, కుల వివక్ష పై పోరాడిన మొట్టమొదటి సంఘ సంస్కర్త సావర్కర్ గారు. సాక్షాత్తు గాంధీ గారే 1927 లో రత్నగిరి జిల్లాలో సావర్కర్ చేస్తున్న క్రుషిని కొనియాడారు. దేశంలో కుల వివిక్షను ప్రాలద్రోలడం తన అంతిమ లక్ష్యంగా వివిధ రత్నగిరి జిల్లాలో వివిధ గ్రామాలకు వెళ్లి గ్రామస్థులను చైతన్యపరిచాడు.*

*స్వతహాగా నాస్థికుడు అయిన సావర్కర్ భరత భూమిలో ఉండే ఏ మతాన్ని పాటించే వ్యక్తి అయినా సరే ఈ భూమి పట్ల సదా గౌరవం కలిగి ఉండి దేశ నిర్మాణం లో పాలుపంచుకోవాలి అని దేశ ప్రజల్లో తన సాహిత్యం ద్వారా సందేశాన్ని ఇచ్చారు.*

*గాంధీ హత్య కేసులో సావర్కర్ గారి పై అన్యాయంగా కేసు బనాయించారు అని అప్పటి న్యాయ శాఖా మంత్రి అంబేద్కర్ గారు కూడా నెహ్రూ నిర్ణయాలను తప్పుబట్టారు. అంబేద్కర్ గారు చెప్పినట్లే సావర్కర్ గారికి గాంధీ* *హత్యతో ఎటువంటి సంభంధం లేదని చివరికి కోర్టు తీర్పు రావడం జరిగింది*

*ఇలా స్వాతంత్ర్యం కోసం పోరాడిన* *వీరుల్లో ప్రధముడు అయిన సావర్కర్ గారికి దక్కాల్సిన గౌరవం కనీసం 75* *సంవత్సరాల తరువాత కూడా ఇవ్వకపోతే మనం పొందిన స్వాతంత్ర్యానికి మనం విలువ ఇవ్వనట్లే లెక్క.😭*

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...