26/11 : అంజలి కుల్తే : 20 మంది పిల్లల తల్లి!!
నేటికి 14 ఏళ్ల క్రితం.. 26/11/2008 రాత్రి హంతక ఉగ్రవాది 'అజ్మల్ కసబ్' తన సహచరుడితో కలిసి 'కామా హాస్పిటల్' ఆవరణలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.. వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు.. మరికొద్ది సేపటికి ఒక నర్సు కూడా కాల్పులలో గాయపడి పడిపోయింది.. కసబ్ మరియు అతని సహచరుడు వరండా దాటి మెట్లు ఎక్కుతూఉన్నారు.
'అంజలి కుల్తే' అనే 50 ఏళ్ల నర్సు మొదటి అంతస్తు నుంచి ఈ భయానక దృశ్యాన్ని చూస్తోంది... 26/11న 'నైట్ షిఫ్ట్'లో ఉంది.. ఆమె 'ప్రసూతి వార్డు ఇన్‌చార్జి'..నిండుచూలాలులైన 20 మంది ఉన్నారు ఆమె వార్డులో..
చేతుల్లో తుపాకీలు పట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులు మెట్ల మీద నుంచి తన వార్డు వైపుకు రావడం చూసిన అంజలి తన ప్రాణాలను లెక్క చేయకుండా ముందుకు దూసుకెళ్లి.. తన వార్డులోని రెండు మందపాటి తలుపులను మూసేసింది. ఆమె మొత్తం 20 మంది మహిళలను ఆ అంతస్తు చివరిలో ఉన్న చిన్న 'పాంట్రీ'కి తరలించింది.
అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఇరవై మంది గర్భిణీ స్త్రీలను మార్చడం ఎంతో సున్నితమైన మరియు ప్రమాదకరమైనది. కసబ్ మరియు అతని సహచరుడు ఆసుపత్రి టెర్రస్‌పైకి వెళ్లి అక్కడ నుండి కింద గుమిగూడిన పోలీసులపై కాల్పులు జరుపుతూ.. గ్రెనేడ్లు విసురుతూఉన్నారు..ఆ
అదను చూసి, అంజలి, బయటికి వచ్చి, 'గాయపడిన నర్సు'ని క్యాజువాలిటీకి తీసుకెళ్లి, ఆమెకు సరైన చికిత్స ప్రారంభించింది.
ఇంతలో ఇరవై మందిలో ఒకరికి ప్రసవవేదన మొదలయ్యింది .
అంజలి చేయి పట్టుకుని.... గోడ ఆధారంగా నడుస్తూ ప్రసవ గదికి అతి కష్టం మీద చేరుకుంది. అక్కడి డాక్టర్ సహాయంతో ప్రసవం సాఫీగా జరిగింది!
దాడి ఉత్కంఠ ముగిసిన తర్వాత, అంజలి చాలా రోజులు నిద్రలో భయపడి మేల్కొంటుండేది. కళ్ళు మూసినా తెరిచినా అవే భయంకర దృశ్యాలు కదలాడేవి.
నెల రోజుల తర్వాత ఆమెను పోలీసులు కసబ్ గుర్తింపును నిర్ధారించేందుకు...పిలిచారు... తర్వాత అతనిని విచారణ చేసే సమయంలో ఆమెను సాక్షిగా పిలిచారు..అప్పుడు ఆమె కోర్టుకు ఒక అభ్యర్థన చేసింది... "నా 'యూనిఫాం' ధరించడానికి అనుమతించమని! "..
'ఎందుకంటే, ఆ భయంకరమైన రాత్రి, నేను ఈ యూనిఫామ్‌పై ఉన్న బాధ్యతను గ్రహించాను... యూనిఫామ్ యొక్క విలువను గ్రహించాను కాబట్టి అంత ధైర్యంగా వ్యవహరించగలిగాను ఈరోజు కూడా నేను యూనిఫాంలో రావడానికి కోర్టు అనుమతిస్తే నాకు స్ఫూర్తినిచ్చిన ధైర్యాన్ని ఇచ్చిన యూనిఫామ్ ఈరోజు కూడా నేను నిర్వహించాల్సిన కర్తవ్యం నిర్వహణ లో ధైర్యాన్ని ఇస్తుంది ఆమె అభ్యర్థించింది కోర్టు కూడా ఆమె అభ్యర్థనను మన్నించింది.........
అంజలి కుల్తే ఆ రాత్రి ఇరవై మంది మహిళల ప్రాణాలను మాత్రమే కాకుండా, ఈ ప్రపంచాన్ని చూడకముందే మృత్యువు కోరలకు బలి కాబోతున్న ఇరవై మంది పిల్లలను కూడా రక్షించింది.
ఈరోజు ఆ పిల్లలకు పద్నాలుగేళ్లు నిండుతాయి... వారికి 'ఇద్దరు జన్మనిచ్చిన తల్లులు' ఉన్నారని కూడా వారికి తెలియకపోవచ్చు... నిజానికి తొమ్మిది నెలలకు వారికి జన్మనిచ్చిన ఒక తల్లి వారి కన్నతల్లి కాగా.... అంజలి కుల్తే.. ప్రాణం పోసిన మరో తల్లి. పుట్టకముందే!
మీ సాటిలేని ధైర్యానికి, సమర్ధతకు అంజలి కుల్తే గారూ...... వందనాలు!
(Kify hospital సౌజన్యంతో)
జయచంద్రారెడ్డి కూరపాటిగారి పోష్టు.
No comments:
Post a Comment