Monday, 19 September 2022

 8 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ‌ పాలనని విమర్శ చేసే కనీస అర్హత 

54 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రేసుకి ఉందా ??? 

ఒక సాధారణ పౌరుడి వినమృపూర్వక లేఖ మరియూ విన్నపం 

1947 తరువాత దాదాపు 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెసు పార్టీ , ఆ సమయంలో మనకంటే అధమస్తితిలో ఉన్న దేశాలు సైతం ఎప్పుడో అభివృద్ధిలోకి అడుగేసి భారతదేశాన్ని దాటేస్తే మరి అన్ని రోజులు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఏమి చేసినట్టు ?  గుడ్డి గుర్రాలకు పండ్లు తోమిర్రా ! 8 సంవత్సరాలు కూడా నిండని బిజేపీ అధికారాన్ని ప్రశ్నించే మీరు 54 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం జాబితాలో ఎందుకుంది అని ప్రశ్నించుకోరేం ?

మత రాజకీయాలకు పునాదులు వేసిన మీరు 

తమ సొంత వారి హిందూ అస్తిత్వాల కోసం పోరాడే బిజేపీని మతతత్వ పార్టీ అనడం హాస్యస్పదంగా లేదా ?

అంబానీ అదానీలు ఈ ఎనిమిది సంవత్సరాలలోనే ఎదిగారా ?  వారు అత్యధికంగా అభివృద్ధి చెందుతానికి భీజం వేసింది , విజయ్ మాల్యా లాంటి బ్యాంక్రప్ట్స్ కి అప్పులిచ్చింది కాంగ్రెసు ప్రభుత్వంలోనే కదా , రేచీకటి వ్యాధి ఎమైనా ఉందా , లేక అధికారం కోసం ఒక అబద్దాన్ని పదే పదే చెప్తూ దేశప్రజలని మోసం చేస్తున్నారా

బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్  లేకుండా దేశం నడిబొడ్డున జెండా ఎగరెయ్యలేని భయానక పరీస్తితి నుండి  సగర్వంగా ధైర్యంగా మన దేశంలో జెండా ఎగరేసే స్థాయికి వచ్చింది మీరు చూడ్డం లేదా ? అర్దం అవ్వడం లేదా ,ఒప్పుకోలేక పోతున్నార ?

మీ హాయంలలో జరిగిన ఉగ్రవాద దాడులు 

దేశ ప్రజలు ఎదుర్కున్న కల్లోల పరీస్తితులు తెలియవా ,

మర్చిపోయారా , 1980 లో జరిగిన మండై ఊచకోతల మొదలు 2013 హైదరాబాదు లో జరిగిన లుంబిని గోకుల్ చాట్ దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్టుల దాక ఆ తర్వాత జరిగిన

బెంగుళూరు బాంబు దాడి ,బోధ్ గయా ,పాట్నా జలపైగురి బ్లాస్ట్స్ వరకు ఎంత రక్తపాతం అయ్యి దేశం అల్లకల్లోలం అయ్యి ఉందో మీకు తెల్సిందే కదా  ?

భయంకరమైన హిందూ వ్యతిరేక ఆర్టికల్స్ తీసుకొచ్చింది మీరు కాదా ?

/ఈ దేశపు విధ్యా వ్యవస్థలో మొత్తం మనల్ని కొల్లగొట్టిన వారి చరిత్రలే చదివించింది మీరు కాదా , విధ్యా వ్యవస్థ నిర్విర్యం చేసి స్కిల్డ్ మరియూ ఉత్సాహం కలిగిన యువకులని దేశం విడిచేలా చేసింది మీరు కాదా

👉 మీ వల్ల ఈ దేశానికి ఏ చెడు జరగలేదో చెప్పండి !

👉 అత్యంత ఎక్కువ కాలం పాలించింది ఆ కుటుంబమే

అత్యధిక బాంబు దాడులు మీ హాయంలోనే

👉 అత్యధిక నల్లడబ్బు దేశాలు దాటింది మీ హాయంలోనే 

అత్యధిక స్కాములు జరిగింది మీ హాయంలోనే

👉 అత్యంత అవినీతి జరిగినది మీ హాయంలోనే

👉 అత్యధిక అశాంతిగా ఉన్నది మీ హాయంలోనే

👉 అత్యంత వెనుకబడిన తనంగా ఉంది మీ హాయంలోనే

అత్యంత పేదరికాన్ని పెంచింది మీ హాయంలోనే 

👉 అత్యంత అక్షరాస్యత తక్కువ మీ హాయంలోనే

అత్యంత క్రైం రేట్ మీ హాయంలోనే 

👉 అత్యంత ఇంధన ధరలు పెరిగింది మీ హాయంలోనే

👉 అత్యంత అప్పుల్లో కూరుకుపోయింది మీ హాయంలోనే 

👉 అత్యంత హిందువులపై దాడులు జరిగినది మీ హాయంలోనే

👉 అత్యంత ఎక్కువ రాజకీయ నాయకులు సంపాదించుకుంది మీ హాయంలోనే

ఇవ్వన్ని గణాంకాలతో నెట్టింట్లో ఉన్నవి 

ఇదే 54 సంవత్సరాలలో  అత్యంత దుర్బంగా ఉన్న జపాన్ 

(1946–1954), the high increase (1955–1972), the steady increase (1972–1992) అంటూ దేశాన్ని  అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పుడు ప్రఖ్యాత దేశాల సరసన సగర్వంగా ఉంది 

మీరు పాలన మొదలెట్టిన కొత్తలోనే ఇజ్రాయెల్ దేశం చుట్టూ యమకింకరులతో సహవాసం చేస్తూ కూడా , సంవత్సరానికి ఒక సారి యుద్దం చేస్తూ కూడా అభివృద్ధి చెందిన జాబితాలో ఉండి శక్తివంతమైన దేశంగా పెర్కొనబడుతుంది 

1965 లో పుట్టిన సింగపూర్ కూడా అభివృద్ధి చెందిన దేశమే

ఇంకెన్నో దేశాలు కానీ ఇన్ని సంవత్సరాలు పాలించిన మీరు దేశాన్ని ఇంకా" అభివృద్ధి చెందుతున్న " దేశంగానే ఉంచి 8 సంవత్సరాల పాలనని హేళన చేస్తూ , విమర్శలు చేస్తుంటే మీ అంతరాత్మ ఎలా ప్రాణాలతో బ్రతికుంటుంది ?

నిన్నా మొన్న కూడా మేము అధికారంలోకి వస్తే  ఆర్టికల్ 370తీసేస్తాం అన్నాడు ఒక కాంగ్రెసు నాయకుడు !

అసలు ఆర్టికల్ 370 ఎంటోకూడా తెల్సినట్టులేదు సదరు పెద్దమనిషికి , ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఎంట్రా చదువుకున్నావా లేదా అని అడిగేవాడు లేకే కదా ఆ అహంకారపు మాటలు ,అదే విధంగా ఆర్టికల్ 35 A కూడా వాటివలన ఎవరికి ఏ నష్టం లేదు దేశమంతటా ఒకే రాజ్యాంగం ఇదే గౌ శ్రీ అంబేడ్కర్ గారు కోరుకున్నది కూడా ! ఇంకా ఎన్ని రోజులు మీ స్వార్ద ప్రయోజనాల కోసం దేశాన్ని వాడుకుంటారు , ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉండాల 

దేశ సంపదని సర్వనాశనం చేసినమీ చెత్తని 8 సంవత్సరాలలో శుద్ధి చెయ్యాలంటే ఎంత కష్టం ?  దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్న రోజుల్లో మీ సంతోషాల కోసం విమానాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసిన విషయాలు ఇప్పుడు

 నెట్టింట్లో తిరుగుతూనే ఉన్నాయి కదా , మీ పుట్టిన రోజు వేడుకలకి యుద్ద నౌకలని వాడుకున్న ఘనమైన చరిత్ర లేదా మహాప్రభోదయచేసి మమ్మల్ని మా దేశాన్ని దయచేసి అభివృద్ధి చెందనివ్వండి , మళ్లీ మీ కుటుంబ పాల‌న రక్కసి కోరల్లో చిక్కుకోవాలని లేదు , ఆ ఉగ్రవాద దాడుల భయంతో బ్రతకాలని లేదు 

మీరు ఈ దేశానికి చేసే అతిపెద్ద గొప్ప సేవ ఇదొక్కట్టే

దయచేసి మమ్మల్ని వదిలేయ్యండ10:00భివృద్ధి చెందుతాము ,మమ్మల్ని అభివృద్ధి చెందనివ్వండి

జైహింద్  జై భారత్ భారత్ మాతాకీ జై

మీ

సగటు భారతీయ పౌరుడు

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...